Samantha Ruth Prabhu’s Earrings Collection: Stunning Fashion Picks
Explore Samantha Ruth Prabhu's trendy earrings collection, style inspirations, and her favorite fashion picks.

టాలీవుడ్ స్టార్ నటి సమంత అక్కినేని ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం అనే మూవీ లో ప్రధాన పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ మూవీ ఇండస్ట్రీకి అక్కినేని వారసుడు యువనటుడు నాగచైతన్య హీరోగా ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై గౌతమ్ వాసుదేవ్ మీనన్ తీసిన ఏ మాయ చేసావే మూవీ ద్వారా హీరోయిన్ గా రంగప్రవేశం చేసారు సమంత.
రిలీజ్ అనంతరం ఆ సినిమాతో పెద్ద సక్సెస్ సొంతం చేసుకుని నటిగా ఫస్ట్ మూవీతోనే తన గ్లామర్ తో పాటు యాక్టింగ్ తో ప్రేక్షకాభిమానుల యొక్క ప్రేమాభిమానాలు చూరగొన్నారు సమంత రూత్ ప్రభు. అప్పట్లో గౌతమ్ మీనన్ ఎంతో అద్భుతంగా తీసిన ఈ సినిమాని కేవలం సమంతని చూడడం కోసమే ఎందరో యువత థియేటర్ కి వెళ్లేవారంటే, ఆమెకు ఆ మూవీతో ఎంత క్రేజ్ వచ్చిందో గ్రహించవచ్చు.
సమంత ఇయరింగ్స్ కలెక్షన్ గురించి పూర్తి సమాచారం
ఇక ఆ తరువాత టాలీవుడ్ స్టార్ హీరోలైన సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల సరసన బృందావనం, దూకుడు సినిమాల్లో హీరోయిన్ గా నటించి వాటి ద్వారా రెండు సూపర్ హిట్స్ తన సొంతం చేసుకున్న సమంత, ఆపై రాజమౌళి తీసిన బ్లాక్ బస్టర్ మూవీ ఈగ లో కూడా నటించి మరొక విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.
ఆ విధంగా ప్రతి ఒక్క సినిమాతో సూపర్ హిట్ ని తన సొంతం చేసుకుని ఆపై మరిన్ని అవకాశాలతో దూసుకెళ్లిన సమంత, అనంతరం తెలుగు తో పాటు తమిళ, మలయాళ సినిమాల్లో కూడా పలు సినిమాలు చేసారు. ఇటీవల ప్రముఖ ఓటిటి మాధ్యమంలో ప్రసారమైన సిటాడెల్ హానీ బన్నీ సిరీస్ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు.
ఇందులో బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ హీరోగా నటించారు. ఇందులో హానీ పాత్రలో సమంత ఆకట్టుకునే పెరఫార్మన్స్ కనబరిచారు. ఇక కెరీర్ పరంగా చేసిన సినిమాలతో పలు సక్సెస్ లు అందుకున్న సమంత టాలీవుడ్ లో గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా మంచి పేరు గడించారు.
సమంత ఫేవరెట్ ఇయరింగ్స్ డిజైన్స్
అయితే హీరోయిన్ గా తనకు సంపాదిస్తున్న డబ్బులో కొంత మొత్తాన్ని సమాజ సేవకు వినియోగించాలని భావించి కొన్నాళ్ల క్రితం ప్రత్యూష ఫౌండేషన్ పేరుతో ఒక సేవా సంస్థను ఏర్పాటు చేసి అప్పటి నుండి పలువురికి తనకు వీలైనంతలో సాయం చేస్తున్నారు సమంత. తన తొలి సినిమా హీరో నాగ చైతన్య ని ప్రేమించి వివాహమాడి అక్కినేని వారి కోడలైన సమంత కొన్నాళ్ల క్రితం ఆయన నుండి ఇటీవలఅధికారికంగా విడిపోయారు.
ఇక ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి విడిగా జీవిస్తున్న సమంత కెరీర్ పరంగా ఎంతో జాగ్రత్తగా సినిమాలు ఎంచుకుంటూ కొనసాగుతున్నారు. ఇక సోషల్ మీడియా లో సమంతకు ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు, అంతలా ఆమెకు పెద్ద ఫాలోయింగ్ ఉంది.
ఆమె పెట్టె ఒక్కో పోస్ట్ కు ప్రేక్షకాభిమానుల నుండి విపరీతమైన రెస్పాన్స్ వస్తూ ఉంటుంది. అసలు మ్యాటర్ ఏమిటంటే, ఎప్పటికప్పుడు రకరకాల ట్రెండీ దుస్తులు, డిజైనర్ యాక్సెసెరీస్, ఆభరణాలు వంటివి ధరిస్తూ ఫోటో షూట్స్ లో పాల్గొనే సమంత, వాటి ద్వారా అందరిలో మంచి స్టైల్ ఐకాన్ గా పేరు దక్కించుకున్నారు. ఆమె ధరించే స్టైల్ కి ఫ్యాషన్స్, జ్యువెలరీకి యువతలో మంచి క్రేజ్ ఉందనేది తెలిసిందే.
ఇక మరీ ముఖ్యంగా సందర్భాన్ని అలానే ధరించిన దుస్తులను బట్టి ఆమె ధరించే ఇయర్ రింగ్స్ కి అమ్మాయిల్లో మంచి క్రేజ్ ఉంది, అలానే వాటి ఖరీదు లక్షల్లో ఉంటాయని సమాచారం. మధ్యలో కొన్ని డిజైన్స్ కి సంబంధిని ఆమె పలు వజ్రాలు, రత్నాల తో కూడిన ఇయర్ రింగ్స్ ధరిస్తారని అంటున్నారు.
సమంత స్టైల్ ఇన్‌స్పిరేషన్ ఇయరింగ్స్
రకరకాల డిజైన్లలో ఆమె ధరించే ఇయర్ రింగ్స్ కోసం పలువురు అమ్మాయిలు షాపులు చుట్టూ తిరిగి మరీ కొనుగోలు చేస్తుంటారు. ఆ విధంగా తన ప్రతి ఒక్క స్టైల్ తో కూడా అందరినీ ఆకట్టుకునే సమంత ఎప్పటికప్పుడు ట్రెండ్ కి తగ్గట్లు స్టైల్ కూడా మారుస్తూ ఉంటారు. ఇక ప్రస్తుతం శాకుంతలం లో శకుంతలగా నటించిన సమంత కోసం ప్రత్యేకంగా పలువురు డిజైనర్లను పిలిపించి మరీ దర్శకనిర్మాతలు దుస్తులు, ఆభరణాలు డిజైన్ చేయించిన విషయం తెలిసిందే.
కాగా సమంత ధరించిన వస్త్రాభరణాలకు కూడా మంచి క్రేజ్ ఉంటుందని, ఎందుకంటే అటువంటి స్టార్ నటీమణుల నగలు, వస్త్రాలకు బయట ఎంతో క్రేజ్ ఉంటుందనేది తెలిసిందే. ఆ విధంగా భారతీయ చిత్ర పరిశ్రమలో మంచి పేరు, క్రేజ్ తో కొనసాగుతున్న సమంత రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని కోరుకుందాం.
What's Your Reaction?






