10 Unknown Facts About Sai Pallavi – You’ll Be Surprised

Explore 10 inspiring unknown facts about actress Sai Pallavi, from her doctor background to her no-makeup acting style. A star with a unique charm

10 Unknown Facts About Sai Pallavi – You’ll Be Surprised

తెలుగు సినిమా (Telugu Cinema) పరిశ్రమలోని ప్రస్తుతం స్టార్ హీరోయిన్స్ లో సాయి పల్లవి (Sai Pallavi) కూడా ఒకరు. తొలిసారిగా తెలుగు మూవీ ఇండస్ట్రీ లోకి ఆమె ఫిదా సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. ఆ మూవీని శేఖర్ కమ్ముల తెరకెక్కించగా యువ నటుడు వరుణ్ తేజ్ హీరోగా నటించారు. 

అప్పట్లో మంచి అంచనాల నడుమ రిలీజ్ అయిన ఫిదా మూవీ పెద్ద విజయం అందుకోవడంతో పాటు ఆ మూవీలో తన ఆకట్టుకునే యాక్టింగ్, డ్యాన్స్, అందంతో తెలుగు ఆడియన్స్ ని ఎంతో అలరించారు సాయి పల్లవి. ఆ విధంగా ఫస్ట్ మూవీతోనే బెస్ట్ హిట్ కొట్టిన సాయి పల్లవికి అక్కడి నుండి ఒక్కొక్కటిగా అవకాశాలు వచ్చాయి. 

Telugu Heroine Sai Pallavi Unknown Facts

తెలుగులో అనంతరం నాచురల్ స్టార్ నానితో ఆమె చేసిన ఎం సి ఏ, శ్యామ సింగ రాయ్ సినిమాలు రెండూ కూడా మంచి విజయాలు సాధించి నటిగా ఆమెకు ఎంతో మంచి క్రేజ్ తీసుకువచ్చాయి. ఆ తరువాత శర్వానంద్ తో ఆమె చేసిన మూవీ పడి పడి లేచే మనసు. ఆ మూవీకూడా బాగానే సక్సెస్ అవ్వడంతో మూవీలో శర్వానంద్, సాయి పల్లవి పాత్రలకు మంచి పేరు లభించింది. 

దాని తరువాత నాగచైతన్యతో మరొక్కసారి శేఖర్ కమ్ముల తీసిన లవ్ స్టోరీ మూవీలో నటించి విజయం అందుకున్నారు సాయి పల్లవి. అనంతరం తాజాగా మరొక్కసారి నాగ చైతన్యతో ఆమె నటించిన మూవీ తండేల్. దీనిని చందూ మొండేటి తెరకెక్కించారు. ఈ లవ్ యాక్షన్ ఎమోషనల్ మూవీ కూడా విజయవంతం అయింది. 

సాయి పల్లవిని గురించి మీకు తెలియని పది నిజాలు

అయితే తెలుగు కంటే ముందు మలయాళంలో ప్రేమమ్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి, తెలుగు తరువాత తమిళ్ లో కూడా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. అక్కడి స్టార్ నటులు అయిన ధనుష్, సూర్య లతో కూడా సినిమాలు చేసి సక్సెస్ లు అందుకున్న సాయి పల్లవి, గార్గి వంటి యాక్షన్ ఎమోషనల్ మూవీలో తన అద్భుత నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. 

అలానే తాజాగా శివ కార్తికేయన్ తో ఆమె చేసిన అమరన్ మూవీ తెలుగుతో పాటు తమిళ్ లో కూడా భారీ విజయం అందుకుని నటిగా ఆమెకు మరింత పేరు, మార్కెట్ ని తెచ్చిపెట్టింది. ఇక ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ నటుడు రణబీర్ కపూర్ హీరోగా రూపొందుతున్న ఇతిహాస గాథ రామాయణంలో సీత పాత్రలో నటిస్తున్నారు. 

రణబీర్ రాముడిగా నటిస్తున్న ఈ మూవీలో కెజిఎఫ్ మూవీస్ ఫేమ్ యష్ రావణాసురుడిగా కనిపించనున్నారు. మొత్తంగా అందరిలో మంచి క్రేజే ఏర్పరిచిన ఈ భారీ ప్రాజక్ట్ నుండి ఫస్ట్ లుక్ టీజర్ త్వరలో రిలీజ్ కానుంది. ఈ మూవీ రెండు భాగాలుగా రూపొందుతుండడ ఇవి కనుక పెద్ద సక్సెస్ ఐతే నటిగా సియా పల్లవి రేంజ్, క్రేజ్ అమాంతంగా ఆకాశం అంతటి ఎత్తుకు పెరగడం ఖాయం. అయితే ఇప్పుడు మనం సాయి పల్లవి గురించి కొన్ని ప్రత్యేకమైన ఎవరికీ తెలియని ఫ్యాక్ట్స్ ని చెప్పుకుందాం. 

Lesser Known Facts about Sai Pallavi


1. చిన్నప్పటి నుండి డ్యాన్స్ మీద ఎంతో మక్కువ గల సాయి పల్లవి, తెలుగు టెలివిజన్ ఛానల్ ఢీ లో డ్యాన్సర్ గా ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆకట్టుకున్నారు. అయితే ఆమె తన డ్యాన్స్ ని ప్రత్యేకంగా శిక్షకుల వద్ద కాకుండా స్టార్ నటీమణులైన మాధురి దీక్షిత్, ఐశ్వర్య రాయ్ లని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఎంతో శ్రద్ద పట్టుదలతో సొంతంగా నేర్చుకుని బాగా నైపుణ్యత సంపాదించారు. అనేకమంది ఫ్యాన్స్, ఆడియన్స్ ముఖ్యంగా సాయి పల్లవి యాక్టింగ్, అందంతో పాటు ఆమె డ్యాన్స్ కూడా చూసేందుకు థియేటర్స్ కి వస్తారంటే ఆమె క్రేజ్ ఎటువంటిది అనేది మనం అర్ధం చేసుకోవచ్చు. 


2. స్వతహాగా మలయాళీ అయిన సాయి పల్లవి అక్కడి ప్రధాన పండుగ అయిన ఓనం తప్పనిసరిగా కుటుంబంతో ఎంతో గ్రాండ్ గా జరుపుకోవడంతో పాటు మన తెలుగు పండుగలని కూడా జరుపుకుని ఇక్కడి తన అభిమానులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియచేస్తుంటారు. తొలిసారిగా మలయాళ మూవీ ప్రేమమ్ సినిమాలో నటించి అందరినీ తన అందం, యాక్టింగ్, డ్యాన్స్ తో మెప్పించిన సాయి పల్లవి ఆ తరువాత అథిరన్ అనే మలయాళ మూవీలో కూడా నటించి మెప్పించారు. 


3. అటు నటిగానే కాక ఇటు వృత్తి పరంగా సాయి పల్లవి డాక్టర్ విద్యని అభ్యసించారు. జార్జియా దేశంలోని టిబిలిసి నుండి డాక్టర్ గ్రాడ్యుయేషన్ పట్టా పుచ్చుకున్నారు. వృత్తి పరంగా కార్డియాలజిస్ట్ అవ్వాలన్న సాయి పల్లవి అనుకోకుండా సినిమా అవకాశాలతో దానిని ప్రస్తుతానికి ప్రక్కన పెట్టారు. అయితే తాను డాక్టర్ అవ్వాలనేది తన చిన్నప్పటి నుండి కల అని పలు సందర్భాల్లో చెప్తుంటారు సాయి పల్లవి. ఆ విధంగా ఓవైపు నటిగా, మరోవైపు డ్యాన్సర్ గా ఇంకోవైపు డాక్టర్ గా మల్టి టాలెంతో మంచి పేరు సొంతం చేసుకున్నారు సాయి పల్లవి. 

సాయి పల్లవి డ్యాన్స్ ప్రయాణం & ఆసక్తికరమైన ప్రారంభం


4. వాస్తవానికి తన తొలి సినిమా ప్రేమమ్ సమయంలో యాక్టింగ్ చేసేటపుడు ఎంతో సిగ్గు, బిడియంతో ఇబ్బంది పడ్డ సాయి పల్లవి మెల్లగా నటన అలవాటు అవడం, అలానే అందరితో మంచి స్నేహానుబంధం ఏర్పడడంతో వాటిని వదిలేసి ఏమాత్రం భయం లేకుండా నటించడం స్టార్ట్ చేసారు. అయితే కొద్దిగా కష్టం అయినప్పటికీ ఒక పనిని ఇష్టం చేసుకుని చేస్తూ ముందుకు సాగితే తప్పకుండా మెల్లగా అయినా విజయం తప్పకుండా వరిస్తుందని సాయి పల్లవి అంటారు. 


5. ఇక తన కెరీర్ బిగినింగ్ లో ప్రేమమ్ మూవీలో ఏ మాత్రం మేకప్ లేకుండా నటించారు సాయి పల్లవి. అయితే తన ఫేస్ లో యాక్ని కారణంగా కెరీర్ మొదట్లో కొంత ఇబ్బందిపడ్డట్లు చెప్పారు సాయి పల్లవి. వాస్తవానికి జార్జియా వెళ్ళినపుడు అప్పట్లో ఫేస్ లో యాక్ని కారణంగా ఎవరైనా చూస్తే ఏమైనా అనుకుంటారేమో అని ముఖానికి దుపట్టా కప్పుకున్న సందర్భాలు ఉన్నాయని అన్నారు. 

అయితే ప్రేమమ్ మూవీ చేసేటపుడు తన నాచురల్ యాక్టింగ్ చూసిన దర్శకుడు అల్ఫన్సే తనని ఎంతో ఎంకరేజ్ చేసారని, మెల్లగా తాను భయం లేకుండా నాచురల్ గా కనిపిస్తూ నటించడానికి సిద్ధమయినట్లు ఒక ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చారు సాయి పల్లవి. ముఖానికి మేకప్ కంటే తన నటనని చూసి పలువురు ఫ్యాన్స్, ఆడియన్స్ ఇష్టపడం ఎంతో ఆనందంగా ఉందని ఆమె అంటారు. 

Tollywood Actress Sai Pallavi Biography


6. అయితే ఎక్కువగా తన ఫ్యామిలీ, పర్సనల్ విషయాలను గోప్యంగా ఉంచడానికి ఇష్టపడతానని అంటారు సాయి పల్లవి. అవసరం అయిన కొన్ని మాములు విషయాలు ఫ్యాన్స్ తో సోషల్ మీడియా మాధ్యమాల్లో షేర్ చేసుకునే అలవాటు గల ఆమె, పెళ్లి విషయమై ప్రస్తుతానికి ఎటువంటి ఆలోచన లేదంటారు. ఎక్కువగా ప్రస్తుతం కెరీర్ పై దృష్టి పెట్టానని, ప్రేక్షకులు, అభిమానులు ఇష్టపడే మరిన్ని మంచి పాత్రలు చేయాలన్నదే తన ఆలోచన అని చెప్తారు సాయి పల్లవి. కాగా తన తల్లితండ్రులని విడిచి పెట్టాలి చేసుకుని వెళ్లిపోవడం అనే ఆలోచన ప్రస్తుతానికి తనకు లేదని అంటారు ఆమె. దేనికైనా టీం రావాలని, కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవడమే తనకు ముందు ఇంపార్టెంట్ అని కూడా అంటారు. 


7. ఇక తన కెరీర్ మధ్యలో వచ్చిన పలు బడా సినిమాల్లో హీరోయిన్స్ పాత్రలు సాయి పల్లవి వదులుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే అవి ఫలానా స్టార్ హీరో సినిమాలు అనేవి పేర్లతో సహా బయటకు రానప్పటికీ తన పాత్రకు ప్రాధాన్యత లేకపోతే అవతల ఎంత పెద్ద స్టార్ హీరో ఉన్నప్పటికీ కూడా సియా పల్లవి ఆ సినిమా చేయరనేది ఎప్పటినుండో సినిమా పరిశ్రమలో వినిపిస్తున్న గ్యాసిప్. వాస్తవానికి తన నటన పరంగా తాను చేసే పాత్రలు ఆడియన్స్ ని ఆకట్టుకోవాలని అటువంటి పాత్రలకె తన ప్రాధాన్యత అని ఆమె అంటారు. 

వ్యక్తిగత జీవితం, విద్య & వెండితెర వెనక గమనించని విషయాలు


8. మరీ ముఖ్యమైన విషయం ఏమిటంటే, 2019లో సాయి పల్లవికి ఒక ప్రముఖ ఫెయిర్నెస్ క్రీం వారి యాడ్ లో నటించే అవకాశము వచ్చింది. దానికి గాను వీరు ఆమెకు రూ. 2 కోట్ల పారితోషికం అందించడానికి ముందుకి వచ్చారు. అయితే ఆ యాడ్ లో తాను నటించలేను అంటూ సాయి పల్లవి తేల్చి చెప్పేసారు. దానికి ప్రధాన కారణం నేను వారి యొక్క యాడ్ లో నటిస్తాను, నేను చెప్పింది నమ్మి పలువురు ప్రజలు ఆ క్రీం వాడి నా వల్ల ఇబ్బంది పడకూడదు. అయినా ఇది మన రంగు, అంతే కానీ విదేశీయుల మాదిరిగా తెల్లగా అవ్వడానికి క్రీమ్స్ వాడి నా ద్వారా ఇబ్బందులు కొని తెచ్చుకోవడం కరెక్ట్ కాదనిపించిందని అందుకే దానిని సున్నితంగా తిరస్కరించినట్లు చెప్పారు సాయి పల్లవి. 


9. సాయి పల్లవి లైఫ్ లో మరొక అఛీవ్మెంట్ ఏంటంటే, ఫిదా మూవీలో భానుమతి పాత్రతో అందరినీ ఆకట్టుకుని మంచి క్రేజ్ సంపాదించిన సాయి పల్లవి 2021 లో ప్రముఖ సంస్థ ఫోర్బ్స్ వారు రిలీజ్ చేసిన ఏడవ వార్షిక టాప్ 30 మంది 30 ఏళ్ళ వయసు లోపు గల ప్రొఫెషనల్, ఎంటర్ప్రెన్యూవర్స్, ఆర్టిస్ట్స్, పెర్ఫార్మర్స్ లో 27వ స్థానంలో నిలిచారు. కాగా భారతదేశ మూవీ ఇండస్ట్రీ నుండి తన పేరు మాత్రమే అందులో ఉండడంతో సాయి పల్లవి అమితానందం వ్యక్తం చేస్తూ ట్విట్టర్ ద్వారా తన ఆనందాన్ని పంచుకున్నారు. ఆ విధంగా నేషనల్ వైడ్ గా క్రేజ్ ని ఫ్యాన్ బేస్ ని ఆమె సొంతం చేసుకున్నారు. 


10. ముఖ్యంగా నటిగా కెరీర్ మొదట్లో తాను కొంత బిడియంతో ఇబ్బందిపడ్డప్పటికీ కూడా రాను రాను సినిమా కెరీర్ ని అందులోని ఒడిదుడుకులని తట్టుకుని నటిగా ఆడియన్స్ ఫ్యాన్స్ ని మెప్పిస్తూ కొనసాగుతున్న సాయి పల్లవి, ఎప్పుడూ మనం నమ్మకాన్ని విడవకూడదని అంటారు. తన మేకప్ విషయమై ఎక్కువగా తాను నాచురల్ గానే ఆడియన్స్ కి కనపడేందుకు ఇష్టపడతానని అంటారు. తన తొలి చిత్రం నుండి నేడు ప్రతి సినిమా వరకు తనతో పనిచేసిన దర్శకులు, నిర్మాతలు, నటీనటులు అందరి నుండి తాను నిత్యం ఎంతో కొంత మంచి విషయాలు నేర్చుకుంటున్నానని, ముఖ్యంగా తాను ఇంతటి ఉన్నత స్థాయిలో ఉండడానికి కారణం అయిన ఫ్యాన్స్ కి తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని పలు ఇంటర్వ్యూస్ లో తరచు చెప్తూ ఉంటారు అందాల అద్భుత నటి సాయి పల్లవి.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow