Mahesh Babu's Stylish Look in Specs Goes Viral
Mahesh Babu’s latest specs look is going viral! Fans love his stylish avatar in glasses. Check out unseen photos and reactions on Telugu Movie Media

టాలీవుడ్ సీనియర్ నటుడు లెజెండరీ సూపర్ స్టార్ ఘట్టమనేని నటశేఖర కృష్ణ నటవారసుడిగా ఆయన చిన్న తనయుడు మహేష్ బాబు (Mahesh Babu) తొలిసారిగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో నీడ సినిమా ద్వారా చిత్ర పరిశ్రమకు బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత నుండి చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు చేసిన మహేష్ బాబు, ఆ వయసులోనే మంచి నటనతో ఆడియన్స్ నుండి బాగా పేరు దక్కించుకున్నారు.
ఇక బాలనటుడిగా ఆయన నటించిన చివరి సినిమా బాలచంద్రుడు. అప్పట్లో మంచి విజయాన్ని అందుకున్న ఆ మూవీ అనంతరం పూర్తిగా మహేష్ బాబు తన చదువులపై దృష్టి పెట్టి సినిమాలకు విరామం పలికారు. అనంతరం 1999లో దిగ్గజ దర్శకుడు దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి అశ్వినీదత్ నిర్మించిన ప్రతిష్టాత్మక సినిమా రాజకుమారుడు (Rajakumarudu) ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ కొట్టారు మహేష్ బాబు.
మహేశ్ బాబు స్పెక్స్ లుక్ – ఫ్యాన్స్ ఫిదా!
ప్రీతీ జింతా (Preity Zinta) హీరోయిన్ గా నటించిన ఈ మూవీ యొక్క సాంగ్స్ కూడా మంచి పేరు దక్కించుకున్నాయి. ఇక అక్కడి నుండి వరుసగా ఒక్కొక్కటిగా హీరోగా ఛాన్స్ లు అందుకుంటూ కొనసాగిన మహేష్ బాబు, ఆపై కెరీర్ పరంగా ఎన్నో బ్లాక్ బస్టర్ లతో పాటు పలు ఇండస్ట్రీ హిట్స్ కూడా అందుకుని టాలీవుడ్ లో తండ్రికి తగ్గ తనయుడిగా కోట్లాదిమంది ప్రేక్షకాభిమానులు అభిమానంతో సూపర్ స్టార్ గా ఎంతో క్రేజ్ దక్కించుకున్నారు.
ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మురారి (Murari) అప్పట్లో యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్సు లో కూడా ఆయనకు మరింత క్రేజ్ తీసుకువచ్చింది. క్లైమాక్స్ తో పాటు అందులో పలు కీలక సీన్స్ లో మహేష్ బాబు నటన అదరహో అని చెప్పాలి. అనంతరం టక్కరి దొంగ (Takkari Donga) వంటి ప్రయోగాత్మక కౌ బోయ్ సినిమా చేసారు సూపర్ స్టార్.
ఆ మూవీని జయంత్ ఫల్క్రామ్ సినర్జీస్ బ్యానర్ పై సొంతంగా గ్రాండ్ గా నిర్మించడంతో పాటు స్వయంగా దర్శకత్వం వహించారు జయంత్. ఆ మూవీ అప్పట్లో అతి భారీ ఓపెనింగ్స్ అనుకున్న మూవీగా సెన్సేషన్ సృష్టించింది. ఆపైన తన కెరీర్ ఏడవ మూవీ ఒక్కడు (Okkadu) ద్వారా కెరీర్ పరంగా అతి పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నారు మహేష్ బాబు. మైండ్ బ్లోయింగ్ ఓపెనింగ్స్ నుండి క్లోజింగ్ రికార్డ్స్ వరకు అన్ని ఏరియాస్ లో సృష్టించిన ప్రభంజనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే
వైరల్ అవుతున్న స్పెక్స్ ఫొటోలు మరియు స్టైలిష్ లుక్
ఆపైన నిజం (Nijam) మూవీలో అమాయకుడైన సీతారాం పాత్రలో కనబరిచిన సహజ నటనకు గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు మహేష్ బాబు. అనంతరం త్రివిక్రమ్ శ్రీనివాస్ తీసిన అతడు (Athadu) తో మరొక సంచలనాన్ని తన ఖాతాలో వేసుకున్న మహేష్ బాబు, అనంతరం పూరి జగన్నాథ్ తీసిన పోకిరి (Pokiri) మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టారు.
ఆ మూవీ ఎంత పెద్ద ఇండస్ట్రీ హిట్ కొట్టింది అంటే, దాదాపుగా ఆ సినిమా ఆడిన సెంటర్స్ లోని థియేటర్స్ లో కూల్ డ్రింక్స్, సమోసాలు, సైకిల్, స్కూటర్ స్టాండ్స్ వారిని సైతం అతి భారీ ధనవంతులని చేసింది. ఆ స్థాయిలో పోకిరి అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇక ఈ మూవీ ఓపెనింగ్స్ కూడా అప్పట్లో పెద్ద సెన్సేషన్.
ఇక మహేష్ కెరీర్ లో ఆ తరువాత ఖలేజా (Khaleja) సినిమా ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద పెర్ఫార్మ్ చేయనప్పటికీ ఓపెనింగ్స్ లో టాలీవుడ్ రికార్డు కొట్టింది. ఆ మూవీతో తనలోని పూర్తి స్థాయి కామెడీ యాంగిల్ ని బయటకు తీసి అందరినీ ఆకట్టుకున్నారు మహేష్ బాబు. ఇక ఆ మూవీ తరువాత వచ్చిన దూకుడు (Dhookudu) మూవీతో మరొక ఇండస్ట్రీ హిట్ కొట్టారు మహేష్.
దాని తరువాత పూరి జగన్నాథ్ తీసిన బిజినెస్ మ్యాన్ మూవీతో మహేష్ ఖాతాలో మరొక బ్లాక్ బస్టర్ నమోదయింది. ఆ పైన సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు (Seethamma Vakitlo Sirimalle Chettu) సినిమా భారీ విజయం ద్వారా అప్పట్లో పాతికేళ్ల అనంతరం మరొక స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ తో కలిసి బిగ్గెస్ట్ మల్టి స్టార్ట్ మూవీ చేసారు మహేష్.
సోషల్ మీడియాలో మహేశ్ బాబు లుక్‌పై స్పందనలు
ఆపైన కొరటాల శివ తీసిన శ్రీమంతుడు (Srimanthudu) మూవీతో సూపర్ స్టార్ మహేష్ బాబు మరొక ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. ఆపైన భరత్ అనే నేను (Bharat Ane Nenu), మహర్షి (Maharshi), సరిలేరు నీకెవ్వరు తో మరొక మూడు విజయాలు కెరీర్ పరంగా సొంతం చేసుకున్నారు సూపర్ స్టార్. అనంతరం సర్కారు వారి పాట తో పాటు గుంటూరు కారం (Guntur Kaaram) సినిమాల కి పూర్తి స్థాయి నెగటివ్ టాక్స్ లభించినప్పటికీ తన పీక్ స్టార్డం క్రేజ్ తో వాటి ద్వారా కూడా రూ. 100 కోట్లకు పైగా షేర్ సొంతం చేసుకుని రికార్డ్స్ కొట్టారు మహేష్.
ప్రస్తుతం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తొలిసారిగా చేస్తున్న గ్లోబ్ ట్రోటింగ్ యాక్షన్ అడ్వెంచర్ సినిమా SSMB29. శ్రీ దుర్గ ఆర్ట్స్ సంస్థ పై కేఎల్ నారాయణ ఈ మూవీని ఎంతో భారీ ఖర్చుతో నిర్మిస్తున్నారు. దీనిలో తన పాత్ర కోసం పూర్తిగా క్రాఫ్, గడ్డం, బల్క్ గా బాడీని కూడా పెంచుతున్నారు మహేష్ బాబు. 2027 వేసవిలో ఈ మూవీ ఆడియన్సు ముందుకి వచ్చే అవకాశం ఉంది.
ఇక అసలు మ్యాటర్ ఏమిటంటే ఎప్పటికప్పుడు తన సినిమాల విషయమై సరికొత్త ట్రెండ్స్ ని ఫాలో అయ్యే మహేష్ బాబు ఆయా సినిమాల కోసం పూర్తిగా తన మేకోవర్ ని చేంజ్ చేస్తూ ఉండడంతో పాటు రకరకాల ట్రెండీ స్టైల్స్ ని కూడా క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇక మరీ ముఖ్యంగా ఎంతో అందగాడైన మహేష్ బాబు వేసుకునే డ్రెస్ లు, అలానే యాక్ససేరీస్ కి యువతలో మంచి క్రేజ్ ఉంటుంది.
ఇక మరీ ముఖ్యంగా ఆయన పలు సినిమాల్లో ధరించే స్పెక్స్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చూడగానే ఎంతో ఆకర్షణీయంగా ఉండే మహేష్ బాబు అందమైన ముఖానికి ఎటువంటి స్పెక్స్ అయినా కూడా ఎంతో బాగుంటాయి అనే చెప్పాలి. ఇక ఆయన సినిమాల్లో ధరించే స్పెక్స్ విలువ కొన్ని వేల రూపాయలు ఉంటుందని, ఆయన యొక్క స్టైలిస్ట్ లు ఎప్పటికప్పుడు వాటిని ఆయా సినిమాల్లోని పాత్రలకు తగ్గట్లుగా వాటిని సెలెక్ట్ చేస్తూ ఉంటారని, అందుకే మహేష్ వాడే స్పెక్స్ కి అంత క్రేజ్ ఉంటుందని అంటున్నారు సినీ విశ్లేషకులు.
మహేష్ బాబు సినిమా వస్తుంది అంటే టాలీవుడ్ అంతటా కూడా పెద్ద పండుగ వాతావరణం నెలకొని ఉంటుంది. ఆ విధంగా వయసుపరంగా 50వ ఏటికి చేరుకుంటున్నప్పటికీ ఎప్పటికప్పుడు లేటెస్ట్ ట్రెండ్స్ ని సెట్ చేస్తూ ట్రెండీ స్టైలిష్ లుక్స్ తో ఇంకా ఎంతో యంగ్ గానే ఉంటూ అందరినీ ఆకట్టుకుంటూ కోట్లాదిమంది ప్రేక్షకాభిమానుల ప్రేమతో కొనసాగుతున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. కాగా నటుడిగా ఆయన మరిన్ని విజయాలు సొంతం చేసుకుని మరింతగా దూసుకెళ్లాలని మా Telugu Movie Media టీమ్ మనస్ఫూర్తిగా కోరుకుంటోంది.
What's Your Reaction?






