Allu Arjun New Movie Update – Stylish Star’s Next Big Pan-India Project

Check out the latest updates on Allu Arjun’s new movie. Stylish Star is gearing up for another Pan-India blockbuster after Pushpa 2

Allu Arjun New Movie Update – Stylish Star’s Next Big Pan-India Project

ప్రస్తుతం టాలీవుడ్ లోని టాప్ స్టార్స్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఒకరు. తొలిసారిగా గంగోత్రి సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్, వాస్తవానికి అంతకముందు మెగాస్టార్ చిరంజీవి హీరోగా గీత ఆర్ట్స్ సంస్థ పై గ్రాండ్ గా రూపొందిన డాడీ మూవీలో ఒక చిన్న డ్యాన్స్ బిట్ ద్వారా దర్శనమిచ్చారు. అనంతరం కె రాఘవేంద్రరావు తీసిన గంగోత్రి మూవీలో ఆర్తి అగర్వాల్ సోదరి అదితి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. 

Allu Arjun New Project 2025

ఆ మూవీ విజయం అనంతరం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ టాలీవుడ్ దర్శకుడిగా పరిచయం అయిన ఆర్య మూవీతో పెద్ద విజయం తన ఖాతాలో వేసుకున్నారు అల్లు అర్జున్. ఇక అక్కడి నుండి హీరోగా పలు సక్సెస్ఫుల్ సినిమాలతో ఆకట్టుకునే యాక్టింగ్ తో ఎందరో ఫ్యాన్స్ ని ఆడియన్సు ని అలరించారు అల్లు అర్జున్. ఇక ఐదేళ్ల క్రితం త్రివిక్రమ్ తో ముచ్చటగా మూడోసారి అల్లు అర్జున్ చేసిన మూవీ అలవైకుంఠపురములో. 

Allu Arjun New Movie Update

ఈ మూవీని హారికా హాసిని క్రియేషన్స్ సంస్థతో పాటు గీత ఆర్ట్స్ సంస్థ గ్రాండ్ గా నిర్మించాయి. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈమూవీలోని సాంగ్స్ నేషనల్ వైడ్ గా గుర్తింపు సంపాదించడంతో పాటు మూవీ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచి హీరోగా అల్లు అర్జున్ కెరీర్ ని ఒక్కసారిగా ఎంతో ఎత్తుకు తీసుకువెళ్ళింది. అయితే దాని అనంతరం అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తీసిన పాన్ ఇండియన్ మూవీ పుష్ప. 

ఈ మూవీలో పుష్పరాజ్ గా అల్లు అర్జున్ ఆకట్టుకునే సహజ నటన అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద పాన్ ఇండియన్ రేంజ్ లో మంచి సక్సెస్ సొంతం చేసుకున్న ఈమూవీలోని తన నటనకు గాను ఏకంగా బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు సొంతం చేసుకున్నారు అల్లు అర్జున్. ఇక ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ గ్రాండ్ గా నిర్మించింది. 

అల్లు అర్జున్ కొత్త సినిమా – అభిమానుల్లో భారీ అంచనాలు

కాగా దీనికి సీక్వెల్ గా మంచి అంచనాలతో ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చిన మూవీ పుష్ప ది రూల్. రష్మిక హీరోయిన్ గా నటించిన ఈ మూవీని పార్ట్ 1 ని మించేలా దర్శకుడు సుకుమార్ అద్భుతంగా తెరకెక్కించారు. దేవిశ్రీప్రసాద్ అందించిన సాంగ్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరొక్కసారి అల్లు అర్జున్ అద్భుత యాక్టింగ్, రష్మిక మందన్న అలరించే నటన వంటివి దీనిని ఎంతో పెద్ద విజయవంతం చేసాయి. 

Allu Arjun Latest Tollywood News

చాలా ఏరియాల్లో డే 1 నుండి అద్భుత రికార్డ్స్ కొల్లగొట్టిన పుష్ప 2 మూవీ వరల్డ్ వైడ్ గా క్లోజింగ్ రూ. 1850 కోట్లు గ్రాస్ ని కొల్లగొట్టి హీరోగా అల్లు అర్జున్ రేంజ్ ని అలానే ఇమేజ్ ని అమాంతంగా పెంచేసింది. దీనితో హీరోగా అల్లు అర్జున్ నేషనల్ వైడ్ గా ఎంతో పాపులారిటీ సంపాదించారు. అయితే ఈ స్థాయిలో ఆడియన్సు అందరిలో ఆయనకు క్రేజ్, పాపులారిటీ సంపాదించడానికి కారణం అల్లు అర్జున్ నటుడిగా పడ్డ కష్టం, ఎంచుకున్న ప్రాజక్ట్స్ అని చెప్పాలి. 

అయితే ఇంతటి ప్రతిష్టాత్మక విజయం అనంతరం అల్లు అర్జున్ ఎవరితో సినిమా చేస్తారు అనే ఆసక్తి అందరిలో ఎంతో నెలకొంది. కొందరు దర్శకుల నుండి వరుసగా కథలు వింటూ వచ్చారు అల్లు అర్జున్. వాస్తవానికి పుష్ప 2 అనంతరం హారికా హాసిని క్రియేషన్స్, గీత ఆర్ట్స్ సంస్థల పై మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో భారీ మైథలాజికల్ యాక్షన్ ఈమూవీ ఆయన చేయాల్సి ఉంది. దానికి సంబంధించి అంతకముందు అనౌన్స్ మెంట్ పోస్టర్ కూడా వచ్చింది. 

Stylish Star Allu Arjun Upcoming Film

అయితే ప్రత్యేకమైన కారణాలు తెలియనప్పటికీ ఆ ప్రాజక్ట్ ప్లేస్ లో సడన్ గా అట్లీ తో మూవీ చేస్తున్నట్లు ప్రకటించారు అల్లు అర్జున్. ప్రముఖ టామీయుల అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ పై అల్లు అర్జున్ హీరోగా రూపొందనున్న ఈమూవీలో అందాల నటీమణులు దీపికా పదుకొనే, మృణాల్ ఠాకూర్, రష్మిక నటించనున్నట్లు వార్తలు వచ్చాయి. 

అయితే మూవీ యొక్క అఫీషియల్ అనౌన్స్ మెంట్ గ్లింప్స్ అనంతరం దీపికా ని హీరోయిన్ గా తీసుకుంటున్నట్లు కూడా మేకర్స్ మరొక గ్లింప్స్ ద్వారా తెలిపారు. ఇక ప్రస్తుతం శరవేగంగా హాలీవుడ్ రేంజ్ లో గ్రాండ్ లెవెల్లో రూపొందుతోన్న ఈ మూవీ ప్రతిష్టాత్మకంగా దాదాపుగా రూ. 800 కోట్ల వ్యయంతో తెరకెక్కుతున్నట్లు టాలీవుడ్ వర్గాల టాక్.

పుష్ప 2 తరువాత స్టైలిష్ స్టార్ నెక్స్ట్ మూవీ డిటైల్స్

ఇక ఈ మూవీలో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారని కొందరు అంటుంటే, కాదు ఏకంగా తొలిసారిగా అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్ చేయనున్నారు అనే న్యూస్ కూడా కొన్నాళ్లుగా మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ మూవీ కోసం పలువురు హాలీవుడ్ నిప్పులు కూడా పని చేస్తున్నారు. ఎక్కడా కూడా మేకింగ్ వైజ్ కాంప్రమైజ్ కాకుండా దర్శకనిర్మాతలు ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. 

ముఖ్యంగా ఇటీవల బాలీవుడ్ స్టార్ నటుడు కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ తో తీసిన పఠాన్ మూవీతో ఏకంగా కెరీర్ పరంగా రూ. 1000 కోట్ల గ్రాసర్ ని తన ఖాతాలో వేసుకున్న అట్లీ కుమార్, అల్లు అర్జున్ మూవీని మరింత భారీ సక్సెస్ చేసేందుకు మూవీ యొక్క కథ, కథనాలు అద్భుతంగా రాసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. తాను ఏ విషయమై కూడా అట్లీ కంప్రమైజ్ కావడం లేదని వినికిడి. ఇక ఈ క్రేజీ మూవీకి యువ సంగీత తరంగం సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తుండగా దీనిని అన్ని కార్యక్రమాలు ముగించి 2027 ద్వితీయార్ధంలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు చెప్తున్నారు. 

Allu Arjun Next Pan India Movie

ఇక హీరోగా అల్లు అర్జున్ కూడా ఈ మూవీ కోసం రేయింబవళ్లు ఎంతో కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ యొక్క తాజా షెడ్యూల్ ముంబైలో వేసిన ప్రత్యేక ఇన్నర్ సెట్ లో జరుగుతోంది. ఇక హీరోయిన్ గా దీపికా పాత్ర ఎంతో పవర్ఫుల్ గా ఉంటుందని ఆమెకు సంబంధించి రిలీజ్ చేసిన గ్లింప్స్ ద్వారా మనకు అర్ధం అవుతోంది. అలానే ఇతర ఇద్దరు హీరోయిన్స్ యొక్క పాత్రలు కూడా అద్భుతంగా రాసుకున్నారట దర్శకుడు అట్లీ. మరీ ముఖ్యంగా ఈ మూవీలో పవర్ఫుల్ విలన్ ఉంటాడని, అతడి పాత్ర కూడా సూపర్ గా ఉండనై టాక్. 

దర్శకుడు, కథ & రిలీజ్ అంచనాలు

మొత్తంగా దీనిని బట్టి చూస్తే పుష్ప 2 భారీ విజయం అనంతరం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తదుపరి మూవీని దానిని మించేలా గ్లోబల్ గా గ్రాండియర్ గా రిలీజ్ చేసి సక్సెస్ తో మరింతగా తన మార్కెట్ ని క్రేజ్ ని పెంచుకోవాలని చూస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు సూపర్ స్టార్ మహేష్ బాబు, ఎస్ ఎస్ రాజమౌళి ల క్రేజీ ప్రాజక్ట్ SSMB29 మూవీ కూడా గ్లోబల్ గా ఎంతో సెన్సేషన్ క్రియేట్ చేసే రేంజ్ లో తెరకెక్కుతోంది. మొత్తంగా ఇటువంటి భారీ ప్రాజక్ట్స్ తో భారతీయ సినిమా పరిశ్రమతో పాటు ముఖ్యంగా రాబోయే రోజుల్లో తెలుగు సినిమా పరిశ్రమ యొక్క పేరు, కీర్తి ప్రతిష్టలు హాలీవుడ్ స్థాయికి మరింతగా చేరి సంచలనం సృష్టించడం ఖాయం అని తెలుస్తోంది. కాగా రానున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజక్ట్ అంచనాలు అందుకుని భారీ విజయం సొంతం చేసుకోవాలని కోరుకుంటోంది మా Telugu Movie Media టీమ్.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow