Tollywood Movie Review – Shocking Ratings, Verdict & Talk

Latest Tollywood movie reviews with detailed analysis, box office verdict, and critic ratings. Know the public talk first only on Telugu Movie Media

Tollywood Movie Review – Shocking Ratings, Verdict & Talk

​ఈ ఏడాది ఇప్పటికే గడచిన ఐదున్నర నెలల్లో పలు సినిమాలు ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి ఎంటర్టైన్మెంట్ ని అందించాయి. అయితే వాటిలో కొన్ని సక్సెస్ కాగా మరికొన్ని పరాజయం పాలయ్యాయి. మరి వాటిలో ముఖ్యమైన కొన్ని సినిమాల యొక్క రివ్యూస్ ని క్లుప్తంగా చూద్దాం 

Sankranthiki Vasthunam Movie Review - Sankranthiki Vasthunam OTT

ఈ మూవీని అనిల్ రావిపూడి తెరకెక్కించగా కీలక పాత్రల్లో సర్వధమన్ బెనర్జీ, నరేష్, వీటివి గణేష్, సాయికుమార్ నటించారు. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా అంటించిన ఈ మూవీలో విక్టరీ వెంకటేష్ హీరోగా కనిపించారు, గతంలో వెంకటేష్, అనిల్ రావిపూడి కలిసి చేసిన సినిమాలు ఎఫ్ 2, ఎఫ్ 3. 

అయితే వీటిలో ఎఫ్ 2 మూవీ పెద్ద విజయం అందుకోగా ఎఫ్ 3 కూడా బాగానే సక్సెస్ అయింది. ఆ విధంగా సక్సెస్ఫుల్ క్రేజీ కాంబినేషన్ గా పేరున్న వీరిద్దరూ కలిసి మూడవ సారి మూవీ చేస్తుండడంతో సంక్రాంతికి వస్తున్నాం పై అందరిలో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అనుకున్న విధంగానే ఫాస్ట్ గా మూవీ తీసిన అనిల్ రావిపూడి ఈ మూవీని ఈ ఏడాది సంక్రాంతికి ఆడియన్స్ ముందుకి తీసుకొచ్చారు. 

మ్యూజిక్, విజువల్స్ & ఫైనల్ వెర్డిక్ట్

ఇక ఫస్ట్ డే ఫస్ట్ షో నుండే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సొంతం చేసుకుంది. విక్టరీ వెంకటేష్ కామెడీ టైమింగ్, అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ తో పాటు హీరోయిన్స్ ఇద్దరి ఆకట్టుకునే అందం అభినయం, సాంగ్స్, గ్రాండియర్ విజువల్స్ వంటివి ఈ మూవీ యొక్క సక్సెస్ కి కారణంగా నిలిచాయి. 

బాలనటుడు రేవంత్, వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన సీన్స్ కి థియేటర్స్ లో ఆడియన్స్ ఎంతో ఎంజాయ్ చేసారు. ఆద్యంతం కూడా ఆకట్టుకునే కథ, కథనాలతో అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం మూవీని తెరకెక్కించారు. అవతల భార్య, ఇవతల ప్రేమించిన ఒకప్పటి ప్రేయసి నడుమ, మరోవైపు వృత్తిలో భాగంగా వారిద్దరితో ఏవిధంగా మ్యానేజ్ చేసి ముందుకు సాగాడు అనే కథాంశంతో ఇంట్రెస్టింగ్ గా ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా దర్శకుడు అనిల్ ఈ మూవీని తెరకెక్కించారు .

ఇక సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఓవరాల్ గా క్లోజింగ్ లో వరల్డ్ వైడ్ రూ. 300 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ సొంతం చేసుకుని విక్టరీ వెంకటేష్ తో పాటు అనిల్ రావిపూడి కెరీర్ లో కూడా ది బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అయితే అదే సమయంలో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాలు కూడా రిలీజ్ ఐనప్పటికీ అవి ఏమాత్రం ఈ మూవీ యొక్క ప్రభంజజం ముందు నిలవలేకపోయాయి. 

Thandel Movie Review - Thandel OTT  

యువ నటుడు అక్కినేని నాగ చైతన్య హీరోగా అందాల నటి సాయి పల్లవి హీరోయిన్ గా రూపొందిన ఈ మూవీని యువ దర్శకుడు చందూ మొండేటి తీశారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు తెరకెక్కించిన ఈ మూవీ మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచింది. 

ఆడుకాలం నరేన్, దివ్యా పిళ్ళై తో పాటు తమిళ నటుడు కరుణాకరన్ కీలక పాత్రలు చేసిన ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు. అంతకముందు రిలీజ్ అయిన తండేల్ సాంగ్స్ యువత ని విశేషంగా ఆకట్టుకుని మూవీ పై మరింతగా అంచనాలు ఏర్పరిచాయి. 

అనంతరం ఫైనల్ గా థియేటర్స్ లోకి వచ్చిన ఈ లవ్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ మంచి విజయవంతం అయింది. ఇందులో తండేల్ గా అంటే పడవ నడిపే నావికుడిగా నాగచైతన్య పెర్ఫార్మన్స్ కి అందరి నుండి మంచి ప్రసంశలు లభించాయి. అలానే ఆయన ప్రేయసిగా నాచురల్ గా తన పాత్రలో పెర్ఫార్మ్ చేసి ఆకట్టుకుని ఆడియన్స్ తో శభాష్ అనిపించుకున్నారు సాయి పల్లవి. 

దర్శకుడు చందూ మొండేటి ఈ మూవీని చక్కగా అన్నివర్గాల ఆడియన్స్ ని అలరించేలా తెరకెక్కించారు. ముఖ్యంగా సాంగ్స్, లవ్ సీన్స్, విజువల్స్, క్లైమాక్స్, ఎమోషన్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వంటివి తండేల్ మూవీ యొక్క సక్సెస్ లో కీలక పాత్ర పోషించాయి. ఓవరాల్ గా ఈ మూవీ రూ. 100 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ గ్రాస్ ని సొంతం చేసుకుంది. 

Court  Movie Review - Court OTT 

ఇటీవల చిన్న సినిమాగా ఆడియన్స్ ముందుకి వచ్చి పెద్ద విజయం సొంతం చేసుకున్న మూవీ కోర్ట్ . ఈ మూవీలో హర్ష్ రోషన్ తో పాటు యువ నటి శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక ఈ మూవీని వాల్ పోస్టర్ సినిమా సంస్థ పై నాచురల్ స్టార్ నాని నిర్మించారు. 

ప్రియదర్శి తోపాటు శివాజీ, సాయి కుమార్, సీనియర్ నటి రోహిణి, సీనియర్ నటుడు శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా కోర్ట్ డ్రామా ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీని దర్శకుడు రామ్ జగదీశ్ ఎంతో చక్కగా తెరకెక్కించారు.

కథా నేపథ్యం & నటీనటుల ప్రదర్శన 

ఫోక్సో చట్టం అనే అంశం మీద కోర్ట్ లోని ప్రధాన ఇంట్రస్టింగ్ సన్నివేశాలతో ఈ మూవీ సాగుతుంది. యువ నటులు అయినప్పటికీ కూడా రోషన్ తో పాటు శ్రీదేవి ఇద్దరూ కూడా బాగా పెర్ఫార్మ్ చేసారు. అలానే కీలక పాత్రలు పోషించిన శివాజీ, ప్రియదర్శి లకు మంచి పేరు లభించింది. ఓవరాల్ గా కోర్ట్ మూవీ వరల్డ్ వైడ్ గా రూ. 50 కోట్ల మేర గ్రాస్ సొంతం చేసుకుంది. 

Hit 3 TheThird Case  Review - Hit 3 OTT 

నాచురల్ స్టార్ నాని హీరోగా కెజిఫ్ సినిమాల ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా యువ దర్శకుడు డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లింగ్ యాక్షన్ డ్రామా మూవీ హిట్ 3. 

టాలీవుడ్ సినిమా రివ్యూ – విశ్లేషణ

ఈ మూవీలో సూర్య శ్రీనివాస్,అదిల్ పల, సముద్రఖని, కోమలి ప్రసాద్, ప్రతీక్ బబ్బర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అయితే ముఖ్యంగా ఈ మూవీలో అర్జున సర్కార్ పాత్రలో నాని నాచురల్ పెర్ఫార్మన్స్ కి అందరి నుండి మంచి ప్రసంశలు కురిసాయి. నాని పలు యాక్షన్ ఎమోషనల్ సీన్స్ లో అద్భుతంగా నటించి మరొక్కసారి అందరి మెప్పు అందుకున్నారు. 

శైలేష్ కొలను తీసిన ఈ మూవీ పలు హత్యలకు అలానే డార్క్ వెబ్ వాటి అంశాలకు సంబంధించి సాగుతుంది. సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకు హిట్ 3 మూవీ ఆద్యంతం ఆడియన్స్ ని ఆకట్టుకునే తీరున దర్శకడు దీన్ని తెరకెక్కించారు. 

అయితే ఒకింత వయొలెన్స్ అంశాలు ఈ మూవీని ఫ్యామిలీ ఆడియన్స్ కి దూరం చేసాయి. అయినప్పటికీ రిలీజ్ అయిన ఫస్ట్ డే నుండి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ ఓవరాల్ గా వరల్డ్ వైడ్ క్లోజింగ్ లో రూ. 114 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్ సొంతం చేసుకుని హీరో నానికి మరొక విజయం అందించింది.  

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow