Peddi: Ram Charan’s Latest News and Shooting Details
Ram Charan’s Peddi movie latest shooting schedule and update details. Buchi Babu's Sports Action drama Release buzz.

ఇటీవల దిగ్గజ దర్శకుడు శంకర్ తీసిన ప్రతిష్టాత్మక పాన్ ఇండియన్ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గేమ్ చేంజర్ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు మెగాస్టార్ కుమారుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.
అయితే ఈ మూవీ మాత్రం ఆడియన్స్ ని నిరాశపరిచింది. ఈ మూవీలో రాజీవ్ కనకాల, ఎస్ జె సూర్య, అంజలి, సముద్రఖని, శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రలు చేయగా రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేసారు. ముఖ్యంగా ఈ మూవీలో రామ్ చరణ్ పోషించిన అప్పన్న పాత్రలో ఆయన యాక్టింగ్ కి అందరి నుండి మంచి ప్రసంశలు కురిసాయి.
కాగా అవుట్ డేటెడ్ కథ, కథనాలు, ఏమాత్రం ఆకట్టుకోని పలు సీన్స్ వంటివి ఈ మూవీకి మైనస్ గా మారాయి. అయితే ఆ మూవీ అనంతరం ఉప్పెనతో మంచి విజయం సొంతం చేసుకున్న బుచ్చి బాబు సనతో తన నెక్స్ట్ మూవీ పెద్దిని స్టార్ట్ చేసారు రామ్ చరణ్.
పెద్ది తాజా షూటింగ్ అప్డేట్
ఈ మూవీలో బాలీవుడ్ అందాల నటి జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా ఆస్కార్ సంగీత దర్శకుడు ఏ ఆర్ రహమాన్ దీనికి సంగీతం అందించనున్నారు. వెంకట సతీష్ కిలారు నిర్మాతగా ఈ మూవీని వ్రిద్ది సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు ఎంతో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.
ఇటీవల పెద్ది నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ గ్లింప్స్ టీజర్ అందరినీ ఆకట్టుకుని విశేషమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఈ మూవీ యొక్క గ్లింప్స్ లో రామ్ చరణ్ పవర్ఫుల్ సీన్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం పెద్ది యొక్క షూటింగ్ నిరాటంకంగా శరవేగంగా జరుగుతోంది.
అందుతున్న సమాచారం ప్రకారం త్వరలోనే పెద్ది నుండి ఒక్కొక్కటిగా అప్ డేట్స్ అందించేందుకు టీమ్ సిద్ధం అవుతోందట. ఇక పెద్ది మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా మార్చి 27న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.
పెద్ది సినిమాలో పాత్ర మరియు కథాంశం
రామ్ చరణ్ ఇందులో ఒక మాస్ పాత్ర చేస్తుండగా దీనిని స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సాగే యాక్షన్ ఎంటర్టైనర్ గా దర్శకుడు బుచ్చి బాబు తెరకెక్కిస్తున్నారట. మొదటి నుండి అందరిలో మంచి క్రేజ్ ఏర్పరిచిన ఈ మూవీ తప్పకుండా అందరినీ ఆకట్టుకోవడం ఖాయం అని అలానే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఈ మూవీతో ఎంతో ఆనందించడం తథ్యం అని అంటున్నారు.
ఆ విధంగా ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా స్క్రిప్ట్ ని అద్భుతంగా రాసుకుని బుచ్చి బాబు తీస్తున్నట్లు చెప్తున్నారు. పెద్దిలో హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్ర కూడా ఎంతో ఆకట్టుకుంటుందని టాక్. ఈ మూవీలో కన్నడ స్టార్ యాక్టర్ శివరాజ్ కుమార్ ఒక కీలక పాత్ర చేస్తున్నారు. ఇటీవల క్యాన్సర్ వ్యాధి బారిన పది డాక్టర్ల నుండి చికిత్స తీసుకుని పూర్తిగా కోలుకున్న శివ రాజ్ కుమార్ ప్రస్తుతం పెద్దిలో తన పార్ట్ షూటింగ్ లో పాల్గొంటున్నారు.
పెద్ది లో రామ్ చరణ్ పాత్ర విశేషాలు
ఈ మూవీలో తన పాత్ర ఎంతో అద్భుతంగా ఉంటుందని, చరణ్ తో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ ఎంతో బాగుందని ఆయన ఇటీవల ఒక మీడియా కార్యరామంలో భాగంగా మాట్లాడుతూ చెప్పారు. తప్పకుండా పెద్ది పెద్ద విజయం అందుకుంటుందనే ఆశాభావాన్ని శివరాజ్ కుమార్ వ్యక్తం చేసారు. మరి రిలీజ్ అనంతరం పెద్ది ఎంతమేర విజయం అందుకుంటుందో చూడాలి.
What's Your Reaction?






