Samantha Ruth Prabhu Instagram Official Profile: Recent Posts & Stories
Check out Samantha Ruth Prabhu's official Instagram profile. Get the latest on her posts, reels, and stories.

తెలుగు చలన చిత్ర పరిశ్రమ స్టార్ నటీమణుల్లో సమంత రూత్ ప్రభు కూడా ఒకరు. తొలిసారిగా గౌతమ్ మీనన్ తీసిన ఏ మాయ చేసావే సినిమా ద్వారా తెలుగు సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె ఫస్ట్ మూవీతోనే అతిపెద్ద విజయం తన ఖాతాలో వేసుకున్నారు. అక్కడి నుండి ఆమెకు అవకాశాలు క్యూ కట్టాయి.
ముఖ్యంగా ఏ మాయ చేసావే మూవీలో జెస్సి పాత్రలో సమంత అందం, అభినయం యువతని ఎంతో ఆకట్టుకుంది. ఆ తరువాత సూపర్ స్టార్ మహేష్ తో దూకుడు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో బృందావనం, నాచురల్ స్టార్ నానితో ఈగ సినిమాలు చేసారు సమంత.
సమంత రూత్ ప్రభు అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్
కాగా ఆ సినిమాలు అన్ని కూడా ఒకదానిని మించేలా మరొకటి అద్భుతంగా విజయాలు సొంతం చేసుకుని నటిగా సమంత రూత్ ప్రభు క్రేజ్ ని విపరీతంగా పెంచాయి. అక్కడి నుండి తెలుగులో పలువురు ఇతర స్టార్స్ సరసన కూడా అవకాశాలు అందుకున్న సమంత, ఆపైన అటు తమిళ్ లో కూడా స్టార్స్ సరసన ఛాన్స్ లు అందుకున్నారు.
అక్కడ కూడా ఆమెకు పలు విజయాలు లభించాయి. ఇక ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం అయిన ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 లో సమంత పోషించిన రాజీ పాత్రకి మంచి పేరు లభించింది. తాజాగా వరుణ్ ధావన్ తో కలిసి ఆమె చేసిన వెబ్ సిరీస్ సిటాడెల్ హానీ బన్నీ. అయితే సమంతకు మొదటి నుండి యువతలో మంచి పేరు ఉండడంతో అనంతరం ఆమె పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఖాతాలు తెరిచారు.
సమంత తాజా పోస్ట్‌లు మరియు స్టోరీలు
ముఖ్యంగా సమంత ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్ బుక్ మాధ్యమాల్లో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటూ ఉంటారు. ఇటీవల తన భర్త నాగ చైతన్య నుండి అధికారికంగా విడిపోయిన న్యూస్ దగ్గరి నుండి తనకు మాయోసైటిస్ వ్యాధి సోకినా విషయం కూడా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నారు సమంత.
అలానే తన సినిమాలతో పాటు పలు ఇతర వ్యక్తిగత, సరదా విషయాలు కూడా ఆమె పంచుకుంటూ ఉంటారు. సమంత కు ఇన్స్టాగ్రామ్ లో దాదాపుగా 38 మిలియన్స్ వరకు ఫాలోవర్స్ ఉన్నారు. అటు ట్విట్టర్ లో కూడా సమంత కు ఎంతో క్రేజ్ ఉంది. సినిమాలు, సిరీస్ లతో పాటు పలు సినీ వేడుకలకు, కార్యక్రమాలకు కూడా హాజరవుతుంటారు సమంత.
తనకు లభించే ఆదాయంలో కొంతమేర సామాజిక సేవాకార్యక్రమాలకు కూడా వినియోగిస్తూ ప్రత్యూష సంస్థని స్థాపించి పలువురు చిన్నారులకు గుండె ఆపరేషన్స్ తో పాటు మరికొందరికి ఉచిత విద్య కూడా అందిస్తున్నారు. ఆ విధంగా మంచి మనసు, గొప్ప దాతృత్వం చాటుకుంటున్న సమంత తాజాగా శుభం అనే సినిమా ద్వారా నిర్మాతగా కూడా మారారు.
సమంతను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయ్యే విధానం
అటు సోషల్ మీడియాలో సమంతకు ఎప్పటికప్పుడు ఫాలోవర్స్ కూడా పెరుగుతుండడం ఆమె యొక్క అద్భుత క్రేజ్ కు నిదర్శనం అని చెప్పాలి. అటు హిందీలో కూడా సమంతకు బాగా పేరుంది. నేషనల్ వైడ్ గా జరిగే పలు పోల్స్ లో సమంతనే కొన్నాళ్లుగా టాప్ లో ఉంటూ వస్తున్నారు. మొత్తంగా నటిగా సమంత మరింత మంచి సక్సెస్ లతో రాబోయే రోజుల్లో దూసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.
What's Your Reaction?






