Samantha Ruth Prabhu Movies List: Top Hits, Upcoming Films & OTT Releases
Samantha Ruth Prabhu Movies తెలుగు సినిమా ఇండస్ట్రీలోని దిగ్గజ పేరెన్నికగన్న ప్రస్తుత స్టార్ నటీమణుల్లో సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu) కూడా ఒకరు. తొలిసారిగా ఏ మాయ చేసావే చిత్రం ద్వారా టాలీవుడ్ చిత్రరంగ ప్రవేశం

తెలుగు సినిమా ఇండస్ట్రీలోని దిగ్గజ పేరెన్నికగన్న ప్రస్తుత స్టార్ నటీమణుల్లో సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu) కూడా ఒకరు. తొలిసారిగా ఏ మాయ చేసావే చిత్రం ద్వారా టాలీవుడ్ చిత్రరంగ ప్రవేశం చేసిన సమంత, అక్కడి నుండి ఒక్కొక్కటిగా అనేక విజయాలు సొంతం చేసుకుంటూ నటిగా మంచి క్రేజ్ తో ఆడియన్స్ యొక్క ఆదరణతో 15 ఏళ్లుగా దిగ్విజయంగా కొనసాగుతున్నారు. ఇక మనం ఇప్పుడు సమంత గారి సినిమాల లిస్ట్ చూద్దాం.
Samantha Ruth Prabhu Movies – Complete List of Hits & Upcoming Releases
ఏ మాయ చేసావే (Ye Maaya Chesave) :-
యువ నటుడు అక్కినేని నాగ చైతన్య హీరోగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ తెరకెక్కించిన ఏ మాయ చేసావే మూవీ ద్వారా హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయం అయ్యారు సమంత. ఈ మూవీలో ఆమె పోషించిన జెస్సి పాత్ర అందరికీ ఎంతో కనెక్ట్ అవ్వడంతో పాటు అప్పటి యువత హృదయాలు ఆమె కొల్లగొట్టారు. ఏ ఆర్ రహమాన్ సంగీతం సమకూర్చిన ఈ మూవీని ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై గ్రాండ్ గా నిర్మాత మంజుల ఘట్టమనేని నిర్మించారు. రిలీజ్ అనంతరం ఈ మూవీ అతి పెద్ద విజయం సొంతం చేసుకుని హీరోయిన్ గా సమంత కు ఎంతో పేరు తీసుకువచ్చింది.
బృందావనం (Brindavanam) :-
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఫ్యామిలీ యాక్షన్ లవ్ ఎంటర్టైనర్ మూవీ బృందావనం. ఈ మూవీ మంచి అంచనాలతో రిలీజ్ అయి మంచి విజయం సొంతం చేసుకుంది. ఏమాయ చేసావే భారీ విజయంతో ఆమెకు ఈ మూవీ అవకాశం రావడం జరిగింది. ఇందులో కాజల్ అగర్వాల్ *Kajal Aggarwal) కూడా మరొక పాత్ర చేసారు. మొత్తంగా రిలీజ్ తరువాత పెద్ద హిట్ కొట్టిన బృందావనంతో సమంత క్రేజ్ మరింత పెరిగింది.
Samantha’s Top Blockbuster Movies – Must-Watch Films
దూకుడు (Dhookudu) :-
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీను వైట్ల తీసిన దూకుడులో ఆ వెంటనే అవకాశం అందుకున్న సమంత ఈ మూవీ భారీ విజయంతో మరింత పేరు సొంతం చేసుకున్నారు. ఎస్ థమన్ సంగీతం సమకూర్చిన ఈ మూవీలో సూపర్ స్టార్ మహేష్ బాబుకు చక్కటి జోడీగా కుదిరిన సమంత, ఈ మూవీలో తన ఆకట్టుకునే అందం, అభినయంతో మెప్పించారు. రిలీజ్ అనంతరం దూకుడు అతి పెద్ద ఇండస్ట్రీ హిట్ గా నిలిచి మహేష్ బాబు ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరినీ అలరించింది.
ఈగ (Eega) :-
ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నాని హీరోగా రూపొందిన ఈ మూవీలో కన్నడ నటుడు కిచ్చ సుదీప్ విలన్ గా కనిపించారు. ఆకట్టుకునే థ్రిల్లింగ్ కథ, కథనాలతో రాజమౌళి తెరకెక్కించిన ఈగ మూవీ ఒకింత ప్రయోగాత్మక చిత్రం అని చెప్పాలి. అయితే రిలీజ్ అనంతరం ఈగ మూవీ పెద్ద విజయం సొంతం చేసుకుని హీరోయిన్ గా సమంత క్రేజ్, మార్కెట్ ని మరింతగా పెంచాయి.
Samantha’s Latest Movies & Upcoming Releases in 2024-2025
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (Seethamma Vakitlo Sirimalle Chettu) :-
సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ ల కలయికలో టాలీవుడ్ లో దాదాపుగా 25 ఏళ్ళ అనంతరం రూపొందిన ఈ భారీ క్రేజీ ఫ్యామిలీ మల్టీస్టారర్ మూవీలో వెంకటేష్ కి జోడీగా అంజలి, మహేష్ కి జోడీగా సమంత నటించారు. 2013లో రిలీజ్ అయిన ఈ మూవీ అప్పట్లో మంచి విజయం సొంతం చేసుకుని సమంత ఖాతాలో మరొక విజయం అందించింది. ఈ మూవీలో సమంత మరొక్కసారి తన పెర్ఫార్మన్స్ తో ఫ్యాన్స్ ని ఆడియన్స్ ని అలరించారు.
అత్తారింటికి దారేది (Attarintiki Daredi) :-
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తొలిసారిగా సమంత నటించిన ఈ మూవీని త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ ఈ మూవీని గ్రాండ్ గా నిర్మించింది. అప్పట్లో అతి పెద్ద విజయం సొంతంక్ చేసుకున్న ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించగా కీలక పాత్రల్లో బ్రహ్మానందం, కోట శ్రీనివాస రావు, నదియా, బోమన్ ఇరానీ నటించారు. అందరిలో మంచి అంచనాలు అందుకుని సక్సెస్ అయిన ఈ మూవీ తరువాత హీరోయిన్ గా సమంత రేంజ్, మార్కెట్ విపరీతంగా పెరిగింది.
మనం (Manam) :-
అక్కినేని ఫ్యామిలి లోని మూడు తరాల నటులైన అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన మనం మూవీని విక్రమ్ కె కుమార్ తెరకెక్కించగా శ్రీయా శరణ్, సమంత హీరోయిన్స్ గా నటించారు. అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ రిలీజ్ అనంతరం పెద్ద విజయం సొంతం చేసుకుంది. ఈ మూవీలో సమంత పాత్రకు మంచి పేరు లభించింది. మొత్తంగా ఈ మూవీ విజయం కూడా సమంత కెరీర్ కి మరింత ప్లస్ అయింది.
సన్ ఆఫ్ సత్యమూర్తి (S/O Satyamurthy) :-
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ ల కలయికలో రెండవ సారి తెరకెక్కిన ఈ మూవీలో హీరోయిన్ గా సమంత నటించగా మరొక కీలక పాత్రలో నిత్యా మీనన్ కూడా నటించారు. కన్నడ నటుడు ఉపేంద్ర మరొక ముఖ్య పాత్ర పోషించిన ఈ మూవీలో స్నేహ, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు ఇతర పాత్రలు చేసారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీ విజయం కూడా సమంత కు బాగా పేరు తీసుకువచ్చింది.
అ ఆ (A Aa) :-
యువ నటుడు నితిన్ హీరోగా త్రివిక్రమ్ తీసిన అ ఆ మూవీలో అనసూయ రామలింగం పాత్రలో సమంత రూత్ ప్రభు నటించారు. సీనియర్ నరేష్, నదియా, ఈశ్వరి రావు తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ రిలీజ్ అనంతరం పెద్ద విజయం సొంతం చేసుకుని నటిగా సమంత కు మరింత పేరు తెచ్చిపెట్టింది.
జనతా గ్యారేజ్ (Janatha Garage) :-
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా సమంత హీరోయిన్ గా రూపొందిన జనతా గ్యారేజ్ మూవీని కొరటాల శివ తెరకెక్కించగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. నిత్యా మీనన్ కీలక పాత్రలో నటించిన ఈ మూవీలో మలయాళ స్టార్ యాక్టర్ మోహన్ లాల్ కీలక పాత్ర పోషించారు. ఆకట్టుకునే కథ, కథనాలతో రూపొందిన ఈ మాస్ యాక్షన్ లవ్ ఎంటర్టైనర్ మూవీ రిలీజ్ అనంతరం పెద్ద సక్సెస్ సాధించింది. ఈ మూవీలో సమంత మరొక్కసారి తన ఆకట్టుకునే అందం, అభినయంతో అందరినీ మెప్పించారు.
Samantha Ruth Prabhu’s Best Performances & Award-Winning Films
రంగస్థలం (Rangasthalam) :-
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సమంత నటించిన రంగస్థలం మూవీని క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించగా కీలక పాత్రల్లో ఆది పినిశెట్టి, జగపతి బాబు, సీనియర్ నరేష్, మహేష్, ప్రకాష్ రాజ్ తదితరులు నటించారు. ఆకట్టుకునే మాస్ యాక్షన్ తో కూడిన కథ కథనాలతో రూపొందిన రంగస్థలం మూవీ అతి పెద్ద విజయం హీరోయిన్ గా సమంత కెరీర్ కు మరింత పేరు తీసుకువచ్చింది.
యూ టర్న్ (U Turn) :-
సమంత నటించితిన్ లేడీ ఓరియెంటెడ్ మూవీ యూ టర్న్. ఈ మూవీలో ఆదిపినిశెట్టి కీలక పాత్రలో నటించగా రాహుల్ రవీంద్రన్, భూమిక చావ్లా ఇతర ముఖ్య పాత్రలు చేశారు. పవన్ కుమార్ తెరకెక్కించిన ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కి రిలీజ్ అనంతరం బాగానే సక్సెస్ సొంతం చేసుకుంది. ఈ మూవీలో రచన పాత్రలో సమంత నటనకు అందరి నుండి మంచి ప్రసంశలు లభించాయి.
ఓ బేబీ (Oh Baby) :-
లేడీ డైరెక్టర్ బివి నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేడీ ఓరియెంటెడ్ మూవీ ఓ బేబీ. ఈ మూవీలో సీనియర్ నటి లక్ష్మి మరొక ముఖ్య పాత్రలో కనిపించగా రాజేంద్ర ప్రసాద్, తేజ సజ్జ, రావు రమేష్ ఇతర పాత్రలు చేసారు. మిస్ గ్రానీ అనే సౌత్ కొరియన్ మూవీకి రీమేక్ గా రూపొందిన ఈ మూవీలో సమంత నటనకు అందరి నుండి మార్కులు పడ్డాయి.
యశోద (Yashoda) :-
యువ దర్శక ద్వయం హరి హరీష్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో రూపొందిన మూవీ యశోద. పాన్ ఇండియన్ రేంజ్ లో తెరకెక్కిన ఈ మూవీలో టైటిల్ రోల్ లో తన ఆకట్టుకునే అందం, అభినయంతో అందరినీ మెప్పించి అలరించారు సమంత. వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో నటించిన ఈ మూవీ మంచి విజయం అందుకుంది. దీనితో మరింత క్రేజ్ సొంతం చేసుకున్నారు సమంత.
ఖుషి (kushi) :-
విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్ గా యువ దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన లవ్, ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఖుషి. ఈ మూవీకి హేషం అబ్దుల్ వాహబ్ సంగీతం సమకూర్చగా మైత్రి మూవీ మేకర్స్ వారు దీనిని నిర్మించారు. మంచి అంచనాలతో రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద విజయం సొంతం చేసుకుంది ఖుషి మూవీ.
ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 (The Family Man Season 2) :-
యక్షన్ ఎంటర్టైన్మెంట్ అంశాలతో రూపొందిన ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ యొక్క సీజన్ 2 లో రాజీ అనే పాత్రలో కనిపించారు సమంత. మనోజ్ బాజ్ పాయి, ప్రియమణి ప్రధాన పాత్రలని పోషించిన ఈ సిరీస్ లో సమంత తన రాజీ పాత్రలో కనబరిచిన నటనకు గాను అందరి ఆడియన్స్ నుండి మంచి పేరు సొంతం చేసుకున్నారు. నేషనల్ వైడ్ గా ఈ క్యారెక్టర్ ద్వారా ఆమెకు మరింత క్రేజ్ లభించింది. ఈ సిరీస్ ని ప్రముఖ ఓటిటి మాధ్యమం అమెజాన్ ప్రైమ్ వారు ప్రసారం చేసారు.
Where to Watch Samantha’s Movies Online? OTT Streaming Guide
సిటాడెల్ హనీ బన్నీ (Citadel Honey Bunny) :-
దర్శక ద్వయం రాజ్ డీకే దర్శకత్వంలో అమెరికన్ టివి సిరీస్ సిటాడెల్ కి ఇండియన్ వర్షన్ రీమేక్ గా రూపొందిన సిటాడెల్ హనీ బన్నీ సిరీస్ లో వరుణ్ ధావన్ తో కలిసి తొలిసారిగా నటించారు సమంత. ప్రముఖ ఓటిటి మాధ్యమం అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన ఈ సిరీస్ లో హనీ మందాకిని పాత్రలో సమంత నటన అందరినీ అలరించింది. మంచి విజయం అందుకున్న ఈ సిరీస్ అనంతరం త్వరలో మరికొన్ని సినిమాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు సమంత.
అయితే సమంత గారి కెరీర్ లోని మూవీస్ లిస్ట్ లో ఇక్కడ ఎక్కువగా సక్సెస్ఫుల్ సినిమాల లిస్ట్ ని అందించాము. అలానే ఆమె నటించిన తమిళ్ మరియు ఇతర భాషల సినిమాల డీటెయిల్స్ అందించలేదు. అయితే తమిళ్ లో కూడా సమంత తేరి, తుపాకి, 24 వంటి బ్లాక్ బస్టర్స్ లో నటించి ఆకట్టుకున్నారు. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం మన తెలుగు ఫిల్మీ డాట్ కామ్ సైట్ ని ఎప్పటికప్పుడు చూస్తూ ఉండండి.
What's Your Reaction?






