Kalki 2898 AD 2 Release Date Locked: All You Need to Know
Kalki 2898 AD 2 release date confirmed! Discover when Prabhas’s epic sequel hits theaters. Stay tuned to Telugu Filmy for more updates

టాలీవుడ్ స్టార్ యాక్టర్ పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రస్తుతం మొత్తం మూడు సినిమాలు తెరకెక్కుతున్నాయి. వాటిలో ఒకటి మారుతి తీస్తున్న హర్రర్ కామెడీ యాక్షన్ మూవీ ది రాజా సాబ్ కాగా మరొకటి హను రాఘవపూడి తీస్తున్న లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ. అలానే త్వరలో సందీప్ రెడ్డి వంగా తీయనున్న స్పిరిట్ మూవీ కూడా సెట్స్ మీదకు వెళ్లనుంది.
ఈ మూడు సినిమాల పై ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఇందులో ముందుగా ఈ ఏడాది ద్వితీయార్ధంలో ది రాజా సాబ్ రానుండగా అనంతరం హను రాఘవపూడి మూవీ, ఆపైన స్పిరిట్ రిలీజ్ కానున్నాయి. ఇవి మూడు కూడా ఒకదానిని మించేలా మరొకటి భారీ వ్యయంతో రూపొందుతున్నాయి.
Kalki 2898 AD 2 మూవీకి సంబంధించి తాజా సమాచారం
అయితే గత ఏడాది కల్కి 2898 ఏడి మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు ప్రభాస్. ఈ భారీ సైన్స్ ఫిక్షన్ జానర్ మూవీని నాగ అశ్విన్ తెరకెక్కించగా వైజయంతి మూవీస్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మించింది. అయితే అందరిలో మంచి క్రేజ్ ఏర్పరిచిన ఈమూవీ రిలీజ్ అనంతరం బాక్సాఫీస్ వద్ద పెద్ద సంచలన విజయం సొంతం చేసుకుని వరల్డ్ వైడ్ రూ. 1200 కోట్లని సొంతం చేసుకుంది.
విషయం ఏమిటంటే, ఈ మూవీ యొక్క సీక్వెల్ కూడా వచ్చే ఏడాది ప్రారంభం అయ్యే ఛాన్స్ ఉంది. వాస్తవానికి ఈ ఏడాది చివర్లో కల్కి 2 మూవీని పట్టాలెక్కిద్దాం అనుకున్నారు, కానీ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా ప్రాజక్ట్స్ తో బిజీ బిజీగా ఉండడంతో ఇది కొంచెం ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది.
H3 Tag: Kalki 2898 AD 2 ప్రారంభం ఎప్పుడు? విడుదల తేదీ అంచనాలు
అయితే కల్కి మాదిరిగా పార్ట్ 2 లో కూడా ప్రభాస్, అమితాబ్ ల పాత్రలు కీలకంగా ఉంటాయని, ముఖ్యంగా ప్రభాస్ పాత్ర మరింత గ్రాండియర్ గా అద్బుతముగా రాసుకున్నారట దర్శకుడు అశ్విన్. ఇక ఈ భాగంలో మైథలాజి అంశాలు కూడా ఎక్కువగానే ఉంటాయని, కర్ణుడి పాత్ర యొక్క సీన్స్ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని టాక్.
అలానే ముఖ్యంగా ఇందులో విలన్ గా సుప్రీం యాస్మిన్ గా నటించిన లోక నాయకుడు కమల్ హాసన్ పాత్ర కూడా అద్భుతంగా ఉంటుందట. స్క్రీన్ ప్లే పరంగా ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే సెకండ్ పార్ట్ లో విజువల్ ఎఫెక్ట్స్ మరింత ఎక్కువగా ఉండడంతో పాటు మరింత రేసిగా మూవీ సాగుతుందని అంటున్నారు.
ఆ విధంగా మరింతగా ఆడియన్స్ ని ప్రభాస్ ఫ్యాన్స్ ని ఆకట్టుకునేలా దర్శకుడు నాగ అశ్విన్ స్క్రిప్ట్ సిద్ధం చేశారట. ఇక ఫస్ట్ పార్ట్ సమయంలోనే కల్కి 2898 పార్ట్ 2 కి సంబంధించి కొంత మేర షూట్ పూర్తి చేసారని, అది ఒక 30 శాతం ఉంటుందని అంటున్నారు. సందీప్ రెడ్డి వంగాతో చేయనున్న స్పిరిట్ అనంతరం కల్కి 2 లో తన పాత్ర కోసం ప్రభాస్ మేకోవర్ పరంగా సిద్ధం కానున్నారట.
Kalki 2898 AD 2 లో ప్రభాస్ పాత్రలో మార్పులు? సీక్రెట్ షెడ్యూల్ వివరాలు
అలానే కల్కి పార్ట్ 1 లో ముఖ్య పాత్ర పోషించిన దీపికా పదుకొనె కూడా సెకండ్ పార్ట్ లో ఎక్కువ సీన్స్ లో కనిపిస్తారని టాక్. మొత్తంగా కల్కి పార్ట్ 2 మూవీ తెరకెక్కి రిలీజ్ అనంతరం మరింత పెద్ద విజయం ఖాయం అని టీమ్ కూడా అభిప్రాయపడుతోంది. మరి పక్కాగా కల్కి 2898 ఏడి 2 మూవీ ఎప్పుడు పట్టాలెక్కుతుందో తెలియాలి అంటే మూవీ టీమ్ టీమ్ నుండి అధికారికంగా ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.
What's Your Reaction?






