Chiranjeevi Anil Ravipudi Movie Update & Latest News

Check out the latest updates on Chiranjeevi and Anil Ravipudi's upcoming movie, including cast, production news, and expected release details.

Chiranjeevi Anil Ravipudi Movie Update & Latest News

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం భారీ ప్రతిష్టాత్మక సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభర చేస్తున్నారు. ఈ మూవీలో అందాల నటి త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా విలన్ గా నటిస్తుండగా బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ విలన్ గా నటిస్తున్నారు. 

ఇతర కీలక పాత్రల్లో ఆషిక రంగనాథ్, సురభి, ఇషా చావ్లా, శుభలేఖ సుధాకర్, రావు రమేష్, రాజీవ్ కనకాల కనిపించనున్నారు. ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీని బింబిసార దర్శకుడు మల్లిడి వశిష్ట తెరకెక్కిస్తుండగా యువి క్రియేషన్స్ సంస్థ గ్రాండ్ గా నిర్మిస్తోంది. 

ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విశ్వంభర మూవీ నుండి ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ గ్లింప్స్ టీజర్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచింది. కాగా వీలైనంత త్వరలో మూవీ యొక్క షూటింగ్ పూర్తి చేసి దీనిని ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. 

ఇక దీని అనంతరం ఇప్పటికే అనిల్ రావిపూడితో ఒక మూవీ అనౌన్స్ చేసారు మెగాస్టార్ చిరంజీవి. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై యువ నిర్మాత సాహు గారపాటి గ్రాండ్ లెవెల్లో నిర్మించనున్న ఈ మూవీ యొక్క అధికారిక పూజా కార్యక్రమాలు కొద్దిరోజుల క్రితం వైభవంగా జరిగాయి. అందుతున్న సమాచారాన్ని బట్టి మూవీలో అదితి రావు హైదరి, భూమిక చావ్లా ప్రధాన పాత్రల్లో నటించే అవకాశం ఉంది. 

Chiranjeevi Anil Ravipudi Movie Announcement

ఇక ఈ మూవీకి భీమ్స్ సిసిలోరియో సంగీతం అందిస్తుండగా ఇందులో రమణ గోగుల ఒక సాంగ్ ని పాడనున్నారట. కాగా ఇటీవల సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం మూవీతో అతి పెద్ద విజయం సొంతం చేసుకున్నారు అనిల్ రావిపూడి. ఈ మూవీతో హీరోగా విక్టరీ వెంకటేష్ ఫుల్ గా ఫామ్ లోకి వచ్చారు. 

ఆకట్టుకునే ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీ వెంకీ ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ఆడియన్సు ని అలరించింది. కాగా ప్రస్తుతం మెగాస్టార్ తో చేయనున్న మూవీని కూడా మెగా ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ అందరినీ అలరించేలా అద్భుతంగా ఒక ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్టైనర్ స్క్రిప్ట్ ని సిద్ధం చేశారట దర్శకుడు అనిల్ రావిపూడి. 

Storyline and Genre Expectations

అందులోను ఫస్ట్ టైం మెగాస్టార్ తో చేస్తుండడంతో మూవీ విషయమై మరింత జాగ్రత్త తీసుకుని తప్పకుండ అందరికీ నాచే విధంగా మంచి సక్సెస్ఫుల్ మూవీగా దీనిని మలుస్తానని ఇటీవల మాట్లాడుతూ చెప్పారు. ఇక ఈ మూవీని మే లో షూటింగ్ ప్రారంభించి, వేగంగా పూర్తి చేసి 2026 సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందుకు తీసుకురావాలనే ప్రణాళిక సిద్ధం చేసారు మూవీ టీమ్. 

మరోవైపు ఇప్పటికే మూవీ కోసం సంగీత దర్శకుడు భీమ్స్ మూడు సాంగ్స్ ని రికార్డు చేసారని, అవి అద్భుతంగా వచ్చాయని టాక్. మెగాస్టార్ పాత్ర ఈ మూవీ సూపర్ గా ఉంటుందని, తన మార్క్ ఎంటర్టైన్మెంట్ తో పాటు మెగాస్టార్ మార్క్ యాక్షన్ తో ఈ పాత్ర సాగనుందని అంటున్నారు. 

Cast, Crew, and Shooting Schedule

మొత్తంగా అయితే మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి ల తొలి కలయికలో రానున్న ఈ మూవీ ఇప్పటినుండి అందరిలో మంచి హైప్ ఏర్పరిచింది. మరి రిలీజ్ అనంతరం ఈ మూవీ ఏ స్థాయిలో సక్సెస్ సొంతం చేసుకుంటుందో చూడాలి. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow