Inside Secrets of Pooja Hegde's Tollywood Stardom

What makes Pooja Hegde a top actress in Telugu cinema? Dive into the secrets behind her success and fame

Inside Secrets of Pooja Hegde's Tollywood Stardom

తెలుగు సినిమా (Telugu Cinema) పరిశ్రమలో ప్రస్తుతం స్టార్ హీరోయిన్స్ గా మంచి పేరు, క్రేజ్ తో కొనసాగుతున్న వారిలో పూజా హెగ్డే (Pooja Hegde) కూడా ఒకరు. కర్ణాటకలోని ఉడిపికి చెందిన ఈ భామ 1990 అక్టోబర్ 13న జన్మించారు. అయితే ఆమె పెరిగింది మొత్తం ముంబై నగరంలోనే. అయితే భాషల పరంగా తుళు తో పాటు హిందీ, కన్నడ, తెలుగు, ఇంగ్లీష్ భాషలు పూజా హెగ్డే మాట్లాడగలరు. 

ఎం ఎం కె కాలేజిలో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన పూజా, ఆ తరువాత భారత నాట్యంలో కూడా శిక్షణ తీసుకున్నారు. అయితే మిస్ ఇండియా 2009 లో కాంపిటీషన్ లో ఆమె పార్టిసిపేట్ చేసి మొదటి రౌండ్ లోనే రిజెక్ట్ అయ్యారు. అయితే అంతటితో ఆగకుండా అనంతరం 2010 మిస్ ఇండియా కాంటెస్ట్ లో పోటీ చేసి రన్నరప్ గా నిలిచారు పూజా హెగ్డే. 

2012లో తమిళ్ లో జీవా హీరోగా రూపొందిన మూగమూడి మూవీ ద్వారా ఆమె సినిమా రంగప్రవేశం చేసారు. ఆ సినిమా మంచి విజయవంతం అవడంతో పాటు అందులో ఆమె పోషించిన శక్తి పాత్రకు మంచి పేరు కూడా లభించింది. అనంతరం 2014 లో తెలుగులో అక్కినేని నాగ చైతన్య హీరోగా విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో తెరకెక్కిన ఒక లైలా కోసం మూవీ ద్వారా ఇక్కడ తెరంగేట్రం చేసారు. 

పూజా హెగ్డే విజయ రహస్యాలు

ఆ మూవీ కూడా బాగానే సక్సెస్ అయి తెలుగులో కూడా పూజా హెగ్డే కి మంచి డబ్యు అందించింది. ఇక అదే ఏడాది మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ డబ్యు హీరోగా శ్రీకాంత్ అడ్డాల తీసిన ముకుంద మూవీలో కూడా ఆమె హీరోయిన్ గా నటించారు. అయితే ఆ మూవీ పర్వాలేదనిపించే విజయం అందుకోగా అందులో పూజా హెగ్డే తన ఆకట్టుకునే అందం, అభినయంతో అందరినీ అలరించి మంచి పేరు సొంతం చేసుకున్నారు. 

2016లో ఏకంగా బాలీవుడ్ గ్రీక్ గాడ్ గా పేరుగాంచిన హృతిక్ రోషన్ తో మోహేన్జె దారో మూవీలో హీరోయిన్ గా నటించే అవకాశం అందుకునాన్రు పూజా హెగ్డే. అయితే ఆ మూవీ ఓవరాల్ గా పర్వాలేదనిపించే విజయం మాత్రమే అందుకుంది. 2017లో తెలుగులో అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ తీసిన దువ్వాడ జగన్నాథం మూవీ చేసారు పూజా హెగ్డే, అది కూడా బాగానే ఆడింది. 

ఇక 2018లో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తీసిన అరవింద సమేత మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ అందుకుని ఆ మూవీ భారీ విజయంతో తెలుగులో కెరీర్ పరంగా పెద్ద బ్రేక్ సొంతం చేసుకున్నారు ఆమె. అనంతరం సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఆమె చేసిన మహర్షి మూవీ కూడా పెద్ద సక్సెస్ అయింది. 

Pooja Hegde Filmography

ఆపైన వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ తీసిన గద్దలకొండ గణేష్ మూవీలో నటించి మరొక విజయం అందుకున్నారు. ఆపైన 2020 సంక్రాంతి కానుకగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా గీతా ఆర్ట్స్, హారికా హాసిని క్రియేషన్స్ సంస్థలు గ్రాండ్ లెవెల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందించిన మూవీ అలవైకుంఠపురములో. ఈ మూవీకి ఎస్ థమన్ సంగీతం అందించారు. అప్పట్లో ఈ మూవీ సాంగ్స్ యూట్యూబ్ లో విశేషంగా పాపులర్ అయి నేషనల్ వైడ్ ఆడియన్స్ ని ఎంతో అలరించాయి. 

అలానే రిలీజ్ అనంతరం మూవీ కూడా ఇండస్ట్రీ హిట్ కొట్టి హీరోయిన్ గా పూజా హెగ్డే కు మరింత పేరు, క్రేజ్, మార్కెట్ ని తీసుకువచ్చింది. ఇక అక్కడి నుండి కెరీర్ పరంగా పూజా హెగ్డే కు అవకాశాలు మరింతగా క్యూ కట్టాయి. ఆపైన పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ తో రాధేశ్యామ్, కోలీవుడ్ స్టార్ యాక్టర్ ఇలయదళపతి విజయ్ తో బీస్ట్ సినిమాలు చేసారు పూజా హెగ్డే. 

అటు హిందీలో కూడా మంచి ఆఫర్స్ అందుకున్న పూజా, అక్కడ సర్కస్, కిసి కా భాయ్ కిసి కి జాన్ సినిమాలు చేశారు హిందీ ఆడియన్స్ నుండి కూడా బాగా పేరు అందుకున్నారు. ఇటీవల హిందీలో షాహిద్ కపూర్ హీరోగా రూపొందిన  దేవా, తమిళ్ లో సూర్య హీరోగా తెరకెక్కిన రెట్రో సినిమాలతో మరొక విజయాలు తన ఖాతాలో వేసుకున్నారు పూజా హెగ్డే. 

సినిమాల్లో ఎదుగుదల వెనుక కారణాలు

ప్రస్తుతం రాఘవ లారెన్స్ తీస్తున్న హారర్ యాక్షన్ మూవీ కాంచన 4 తో పాటు విజయ్ హీరోగా హెచ్ వినోద్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఆయన కెరీర్ ఆఖరి మూవీ జన నాయగన్ లో కూడా హీరోయిన్ గా నటిస్తున్నారు పూజా హెగ్డే. అయితే తనకు ఫ్లాప్ వస్తే అధైర్య పడడం, అలానే హిట్స్ వస్తే విపరీతంగా ఉప్పొంగిపోవడం ఉండదని అంటారు పూజా హెగ్డే. 

ఏమైనా కెరీర్ బిగినింగ్ నుండి ఎంతో కష్టపడి పని చేస్తేనే తనకు నేడు ఈ స్థాయి పేరు ప్రఖ్యాతలు లభించాయని, అందుకే ఎవరైనా కష్టాన్ని నమ్మి ముందుకు నడిస్తే మెల్లగానైనా విజయం తథ్యం అని చెప్తారు పూజా హెగ్డే. ఇక ఆమె గురించి కొన్ని ప్రత్యేకమైన, చాలామంది ఫ్యాన్స్ ఆడియన్స్ కి తెలియని ఫ్యాక్ట్స్ ఇప్పుడు చెప్పుకుందాం.

1. అందరు నటుల మాదిరిగా పూజా హెగ్డే కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో యాక్టివ్ గా ఉంటారు. ముఖ్యంగా తన ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఖాతాల ద్వారా ఎప్పటికప్పుడు తన సినీ, వ్యక్తిగత విషయాలకు సంబందించిన పలు ఫోటోలు, వీడియోలు ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటూ వారితో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. 

2. మిస్ ఇండియా పోటీల్లో 2009లో ఫస్ట్ రౌండ్ లోనే వెనుదిరిగిన పూజా హెగ్డే, అయినప్పటికీ తన ఆత్మవిశ్వనాన్ని, ధైర్యాన్ని ఏమాత్రం కోల్పోలేదు. ముఖ్యంగా ఆ సమయంలో తన కుటుంబం, శ్రేయోభిలాషులు ఎంతో అండగా నిలిచారని, అందుకే అనంతరం 2010లో జరిగిన మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని అందులో రన్నరప్ గా నిలిచానని ఆమె చెప్తారు. 

3. హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, ఇంగ్లీష్, తుళు వంటి భాషలు తనకు బాగా తెలియడం వల్లనే ఆమెకు మల్టిపుల్ భాషల్లో వరుసగా అవకాశాలు రావడం వాటిని ఆమె సద్వినియోగం చేసుకోవడం జరుగుతుందని చెప్తారు సినీ విశ్లేషకులు. ఇక దాదాపుగా తనకు వచ్చిన ప్రతి పాత్రలో పరకాయ ప్రవేశం చేసి సహజ నటనతో ఆకట్టుకుంటారు కాబట్టే నటిగా పూజా హెగ్డే మంచి పేరు, క్రేజ్ తో దూసుకెళ్తున్నారు. 

Lesser Known Facts about Pooja Hegde

4. 2016లో హృతిక్ రోషన్ సరసన ఆమె నటించిన మోహెన్జే దారో మూవీ ఎంతో గ్రాండియర్ లెవెల్లో భారీ వ్యయంతో అప్పట్లో రూపొందింది. అందులో హృతిక్ తో కలిసి నటించడం అలానే ఆ మూవీ టీమ్ తో కలిసి పని చేయడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి అని చెప్తారు పూజా హెగ్డే. అయితే ఆ మూవీ మరింత పెద్ద విజయం సాధించి ఉంటే నటిగా ఆమె క్రేజ్ హిందీలో మరింతగా పెరిగేది. 

5. తన కెరీర్ లో ఓవైపు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సమయంలో మరోవైపు క్లాసికల్ డ్యాన్స్ పట్ల మక్కువతో భరతనాట్యం వంటివి నేర్చుకోవడం వల్లనే సినిమాల్లో డ్యాన్స్ లు పూజా చాలా ఈజీగా చేయగలుగుతారు. ముఖ్యంగా హృతిక్ రోషన్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి డ్యాన్సింగ్ నటులతో కలిసి ఆమె పాటల్లో చక్కగా డ్యాన్స్ చేయడం చూడవచ్చు. ఆ విధంగా పూజా హెగ్డే నేర్చుకున్న డ్యాన్స్ సినిమాల్లో కూడా ఉపయోగపడింది. 

టాప్ హీరోయిన్ గా మారిన ప్రయాణం

6. అలానే మరోవైపు తనకు స్పోర్ట్స్ లో క్రికెట్ అంటే విపరీతమైన ఇష్టం అని చెప్తారు పూజా హెగ్డే, ముఖ్యంగా ఐపీఎల్ తో పాటు దాదాపుగా ఇండియా ఆడే అన్ని మ్యాచ్ లు తన ఫ్రెండ్స్ ఫ్యామిలీ తో కలిసి చూసి ఎంజాయ్ చేస్తానని తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా క్రికెట్ గేమ్ పట్ల తనకున్న ప్రేమని కూడా చూపిస్తూ ఫోటోలని ఆమె పోస్ట్ చేస్తుంటారు. 

7. ముఖ్యంగా మన శరీరం, మనసు నిర్మలంగా ప్రశాంతంగా ఉంటేనే మనం ఏ పని అయినా చేయగలం అని, అందుకే తాను క్రమం తప్పకుండ నిత్యం శారీరక వ్యాయామంతో పాటు యోగా చేస్తానని ఆమె చెప్తారు. అలానే ఫుడ్ విషయంలో కూడా ఎంతో కేర్ తీసుకుని ముందుకు సాగడం వల్లనే తన కెరీర్ పరంగా లైఫ్ స్టైల్ పరంగా అవి ఎంతో హెల్ప్ చేస్తాయని ఆమె చెప్తారు. 

8. ఇక తనకు ట్రావెలింగ్ అంటే కూడా ఇష్టమని, పలు వెకేషన్స్ కి తీరిక దొరికిన సమయంలో వెళ్తుంటానని చెప్తారు పూజా హెగ్డే. అలానే స్కై డైవింగ్, స్కూబా డైవింగ్, ట్రెక్కింగ్ వంటివి కూడా తనకు ఇష్టమని ఆమె చెప్తారు. ఇక తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా తాను ప్రయాణించిన పలు దర్శనీయ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే ఆలయాలు, ప్రదేశాల ఫోటోలు కూడా ఆమె పోస్ట్ చేస్తారు. 

9. అలానే పూజా హెగ్డే మంచి ఫాషన్ ఐకాన్ కూడా. ముఖ్యంగా తరచు ఎప్పటికప్పుడు పలు ట్రెండీ ఫాషన్ స్టైల్ లో తాను దిగిన ఫోటోషూట్ ఫొటోలని తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేస్తుంటారు పూజా. అలానే పలు ఫ్యాషన్ షోస్ కూడా పాల్గొనే పూజా, ట్రెండ్ కి తగ్గట్లుగా మనం కూడా నడుచుకోవాలి కదా అంటారు. అందుకే తన సినిమాల్లో కూడా పాత్రకు తగ్గ విధంగా కాస్ట్యూమ్స్ విషయమై తన టీమ్ తో కలిసి ఎంతో శ్రద్ధ తీసుకుంటానని ఆమె చెప్తారు. 

10. ఇక హీరోయిన్ గా ఒక్కో సినిమాతో తెలుగు, తమిళ్, హిందీ ఇలా పలు భాషల్లో మంచి పేరు, క్రేజ్ తో కొనసాగుతున్న పూజా హెగ్డే తనకు వీలైనంతలో పలువురుకి ఆర్ధికంగా కూడా చేయూత నందిస్తుంటారు. పలువురు పెద్ద విద్యార్థులని ఆదుకోవడంతో పాటు కరోనా సమయంలో కూడా ఆమె తనవంతుగా సహాయ నిధికి విరాళం అందించి తన ఉదారత, మంచి మనసు చాటుకున్నారు పూజా హెగ్డే. 

Pooja Hegde Movies List

ఇకపై నటిగా ఆడియన్స్, ఫ్యాన్స్ మెచ్చే మరిన్ని మంచి పాత్రలు చేయాలనేది తన కోరిక అని చెప్తారు ఆమె. 
కాగా ఇటువంటి మరిన్ని లేటెస్ట్ టాలీవుడ్ మూవీ అప్ డేట్స్, న్యూస్, గాసిప్స్, రివ్యూస్, బాక్సాఫీస్ కలెక్షన్స్ కోసం ఎప్పటికప్పుడు మా తెలుగు మూవీ మీడియా సైట్ ని ఫాలో అవుతూ ఉండండి. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow