Top 10 Cinematographers in Tollywood 2025: Visual Magicians of Telugu Cinema
Explore the top 10 cinematographers in Tollywood for 2025 who are redefining the visual style of Telugu films with brilliance.

తెలుగు సినిమా పరిశ్రమలో ఇప్పటివరకు అనేకమంది సినిమాటోగ్రాఫర్స్ వచ్చారు. అయితే అప్పట్లో మార్కస్ బార్ట్లే, వి ఎస్ ఆర్ స్వామి వంటి వారు ఎందరో పలు గొప్ప సినిమాలకు పని చేసి తమ అద్భుత విజువల్స్ తో ప్రేక్షకాభిమానులను ఆకట్టుకుని మంచి పేరు దక్కించుకున్నారు. అయితే రాను రాను టెక్నాలజీ పెరిగిన తరువాత మరింత మంది ఈ ఇండస్ట్రీ కి వస్తున్నారు. అయితే వారిలో ప్రస్తుతం టాప్ 10 టాలీవుడ్ సినిమాటోగ్రాఫర్స్ గా ఎవరున్నారో ఇప్పుడు చూద్దాం.
1. రత్నవేలు : (R. Rathnavelu)
1997లో అరవిందన్ అనే తమిళ్ మూవీ ద్వారా ఫస్ట్ టైం సినిమాటోగ్రాఫర్ గా పరిచయం అయిన రత్నవేలు, ఆ తరువాత తమిళ్ లో సేతు, నందా, భగవతి, జయం, ఆర్య, తిరుమలై, చమేలీ వంటి సినిమాలు కెరీర్ మొదట్లో చేసారు. ఇక వాటితో మంచి సక్సెస్ లు తన ఖాతాలో వేసుకున్న రత్నవేలు, తెలుగులో తొలిసారిగా అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తీసిన ఆర్య సినిమా ద్వారా రంగప్రవేశం చేసారు. ఆ సినిమా సూపర్ హిట్ కొట్టి రత్నవేలుకి టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తరువాత రామ్ తో జగడం, మహేష్ బాబు నటించిన వన్ నేనొక్కడినే, కుమారి 21ఎఫ్, ఖైదీ నెంబర్ 150, వంటి సినిమాల సక్సెస్ లతో మరింత మంచి పేరు అందుకున్నారు. ఇక ఇటీవల మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలం, అలానే సూపర్ స్టార్ మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలు బ్లాక్ బస్టర్ సక్సెస్ లు కొట్టి ఆయనకు విశేషంగా పాపులారిటీ తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ప్రముఖ నటుడు కమల్ హాసన్ తో శంకర్ తీస్తున్న ఇండియన్ 2 కి కెమెరా మ్యాన్ గా వర్క్ చేస్తున్నారు రత్నవేలు.
2. మనోజ్ పరమహంస : (Manoj Paramahamsa)
తొలిసారిగా 2009లో తమిళ్ లో తెరకెక్కిన ఈరమ్ సినిమా ద్వారా సినిమాటోగ్రాఫర్ గా పరిచయం అయిన మనోజ్ పరమహంస ఆ సినిమాతో పలు అవార్డులు సైతం అందుకున్నారు. ఆ తరువాత అదే సంవత్సరం తెలుగులో సమంత, నాగచైతన్య లతో గౌతమ్ మీనన్ తీసిన ఏ మాయ చేసావే మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ తో టాలీవుడ్ ప్రేక్షకుల నుండి కూడా మంచి పేరు సొంతం చేసుకున్నారు. అనంతరం అటు తమిళ్, మలయాళం లలో పలు సినిమాలు చేస్తూ కొనసాగిన మనోజ్ పరమహంస, ఆపైన అల్లు అర్జున్ హీరోగా సురేందర్ రెడ్డి తీసిన సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ రేసు గుర్రం కి సినిమాటోగ్రాఫర్ గా పని చేసి పెద్ద సక్సెస్ కొట్టారు. ఆ తరువాత కిక్ 2, బ్రూస్ లీ వంటి సినిమాలకు పని చేసిన మనోజ్ పరమహంస, ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ తీస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా రాధేశ్యామ్ కి పని చేస్తున్నారు. ఇటీవల షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.
2025లో టాప్ 10 టాలీవుడ్ సినిమాటోగ్రాఫర్లు
3. కె కె సెంథిల్ కుమార్ : (K K Senthil Kumar)
2003లో తెలుగులో తెరకెక్కిన ఐతే మూవీ ద్వారా టాలీవుడ్ కి సినిమాటోగ్రాఫర్ గా పరిచయం అయిన కె కె సెంథిల్ కుమార్ ఆ మూవీ తో మంచి సక్సెస్ సొంతం చేసుకున్నారు. ఆపైన రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన రగ్బి స్పోర్ట్ బ్యాక్ డ్రాప్ మూవీ సై కి పని చేసిన సెంథిల్ కుమార్ దానితో కూడా సక్సెస్ కొట్టారు. ఆ తరువాత ఎన్టీఆర్ తో సురేందర్ రెడ్డి తీసిన అశోక్, ఆపై రాజమౌళి ఎన్టీఆర్ తో తీసిన సింహాద్రి వంటి సినిమాలకు పని చేసారు. కాగా వీటిలో అప్పట్లో సింహాద్రి మూవీ సంచలన విజయం దక్కించుకుని సెంథిల్ కు మరింత మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక అక్కడి నుండి దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తీస్తున్న ప్రతి ఒక్క సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తూ ఒక్కో సినిమాతో ఒక్కో భారీ విజయం సొంతం చేసుకుంటున్న సెంథిల్ కుమార్ ఇటీవల రెబల్ స్టార్ ప్రభాస్ తో రాజమౌళి తీసిన బాహుబలి రెండు సినిమాలతో కెరీర్ లోనే అతి పెద్ద సక్సెస్ లు దక్కించుకున్నారు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో రాజమౌళి తీస్తున్న ప్రతిష్టాత్మక సినిమా ఆర్ఆర్ఆర్ కి కూడా కె కె సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నారు.
4. తిరు : (Tirru)
కెరీర్ లో తొలిసారిగా 1991లో మగలీర్ మట్టుమ్ అనే తమిళ్ మూవీ ద్వారా సినిమాటోగ్రాఫర్ గా పరిచయం అయిన తిరు, ఆ సినిమా ద్వారా మంచి పేరు అందుకున్నారు. ఆ తరువాత తమిళ్ లోనే శక్తి, కాతల కాతల, మలయాళం లో మంజీరధ్వని, అలానే హిందీ లో ఛాంపియన్, సినిమాలు చేసి వాటితో బాగా పేరు దక్కించుకున్నారు. ఆపైన హిందీలో గరం మసాలా, హంగామా, చుప్ చుపు కె, క్యోన్ కీ, భూల్ బులయ్య, అజాబ్ ప్రేమ్ కి గజాబ్ కహాని, ఆక్రోష్, తేజ్, క్రిష్ 3 ఇలా అనేక బ్లాక్ బస్టర్స్ సొంతం చేస్కుని తిరుగులేని సినిమాటోగ్రాఫర్ గా అక్కడ క్రేజ్ దక్కించుకున్న తిరు, తమిళ్ లో సూర్య తో 24 మూవీ చేసి అక్కడ కూడా పాపులర్ అయ్యారు. ఆపైన 2016లో తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తీసిన బ్లాక్ బస్టర్ సక్సెస్ఫుల్ మూవీ జనతా గ్యారేజ్ కి వర్క్ చేసి సూపర్ హిట్ కొట్టిన తిరు, అనంతరం 2018లో సూపర్ స్టార్ మహేష్ హీరోగా శివ కొరటాల తీసిన భరత్ అనే నేను మూవీ అతిపెద్ద సెన్సేషనల్ సక్సెస్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో కొరటాల తీస్తున్న ఆచార్య సినిమా చేస్తున్నారు తిరు.
5. పిఎస్ వినోద్ : ( P S Vinod)
2000వ సంవత్సరంలో తమిళ్ లో అర్జున్ హీరోగా తెరకెక్కిన రిథమ్ మూవీ తో సినిమాటోగ్రాఫర్ గా ఇంట్రొడ్యూస్ అయిన పిఎస్ వినోద్, ఆ తరువాత తమిళ్ లో అప్పు సినిమాతో పేరు దక్కించుకున్నారు. అనంతరం హిందీ లో ప్యార్ ఇష్క్ ఆర్ మొహబ్బత్, ముసాఫిర్, నీల్ ఔర్ నిక్కీ, మై వైఫ్స్ మర్డర్, తీస్మార్ ఖాన్, రక్త చరిత్ర, బులెట్ రాజా వంటి సినిమాలకు వర్క్ చేసి వాటితో మంచి సక్సెస్ లు సొంతం చేసుకున్నారు. ఆ తరువాత 2011లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన పంజా సినిమా ద్వారా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చారు. ఆపై మనం, సోగ్గాడే చిన్ని నాయన, ఊపిరి, ధ్రువ, హలో వంటి సినిమాలకు వర్క్ చేసారు. ఇక మూడేళ్ళ క్రితం ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ తీసిన అరవింద సమేత, అలానే లాస్ట్ ఇయర్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ తెరకెక్కించిన పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అలవైకుంఠపురములో మూవీ కి కూడా వర్క్ చేసి వాటితో భారీ విజయాలు తన ఖాతాలో వేసుకున్నారు. ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీ వకీల్ సాబ్ కి కూడా సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేసారు పిఎస్ వినోద్.
6. ప్రసాద్ మురెళ్ళ : (Prasad Murella)
అజగన నాట్కళ్ అనే తమిళ్ మూవీ ద్వారా ఫస్ట్ టైం సినిమాటోగ్రాఫర్ గా ఎంట్రీ ఇచ్చిన ప్రసాద్ మురెళ్ళ, ఆ తరువాత తెలుగులో శ్రీను వైట్ల దర్శకత్వంలో మాస్ మహారాజ రవితేజ హీరోగా తెరకెక్కిన వెంకీ మూవీ ద్వారా టాలీవుడ్ కి పరిచయం అయ్యారు. ఆ మూవీ అద్భుత విజయం ఆయనకు ఇక్కడ మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తరువాత మధ్యలో పలు తమిళ్ సినిమాలకు వర్క్ చేసిన ప్రసాద్ మురెళ్ళ అక్కడి నుండి ఎక్కువగా తెలుగు సినిమాలకే వర్క్ చేయడం జరిగింది. ఆపైన శ్రీను వైట్ల వరుసగా తీసిన ఢీ, రెడీ, కింగ్, నమో వెంకటేశ, దూకుడు వంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు పని చేసి ఎంతో గొప్ప పేరు అందుకున్నారు. ఆ తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన అత్తారింటికి దారేది సినిమాకి వర్క్ చేసిన ప్రసాద్ మురెళ్ళ, దానితో అతి పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇక ఇటీవల ఎమ్యెల్యే, పంతం, వెంకీ మామ సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పని చేసి వాటితో కూడా మంచి సక్సెస్ లు అందుకున్న ప్రసాద్, ప్రస్తుతం నాని హీరోగా శివ నిర్వాణ తీస్తున్న టక్ జగదీశ్ మూవీ కి వర్క్ చేస్తున్నారు.
విజువల్ మ్యాజిక్ సృష్టించిన తెలుగు సినిమాటోగ్రాఫర్లు
7. చోటా కె నాయుడు : (Chota K Naidu)
1991లో అమ్మరాజీనామా మూవీ ద్వారా టాలీవుడ్ కి సినిమాటోగ్రాఫర్ గా పరిచయమిన చోటా కె నాయుడు, ఆ సినిమాతో సక్సెస్ అందుకున్నారు. ఆ తరువాత సూరిగాడు, వారసుడు, అల్లరి ప్రేమికుడు, తాజ్ మహల్ వంటి సినిమాల విజయాలు చోట కె నాయుడు కి మంచి పేరు తెచ్చిపెట్టాయి. అనంతరం మెగాస్టార్ చిరంజీవి హీరోగా గుణశేఖర్ తీసిన చూడాలని ఉంది సినిమా భారీ విజయం చోట కు మరింతగా క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆపైన మెగాస్టార్ తో అన్నయ్య, ఠాగూర్ వంటి మరొక రెండు బ్లాక్ బస్టర్ సక్సెస్ఫుల్ సినిమాలకు పని చేసిన చోటా, రవితేజ తో వివి వినాయక్ తీసిన కృష్ణ, శ్రీకాంత్ అడ్డాల తీసిన కొత్త బంగారు లోకం సినిమాలు మరింతగా పేరు తెచ్చిపెట్టాయి. తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో అదుర్స్, బృందావనం సినిమాలు చేసి వాటితో కూడా సక్సెస్ లు అందుకున్నారు. ఇక ఇటీవల చోటా కె నాయుడు పని చేసిన జై లవకుశ, రాజు గారి గది సినిమాలు కూడా సక్సెస్ కొట్టాయి. ఇక లేటెస్ట్ గా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో ఆయన చేసిన సినిమా అల్లుడు అదుర్స్. ఆ విధంగా తన కెరీర్ లో దాదాపుగా అనేకమంది స్టార్ నటులు, యువ నటులతో వర్క్ చేసిన చోటా కె నాయుడు ప్రేక్షకాభిమానుల నుండి సినిమాటోగ్రాఫర్ గా ప్రత్యేకమైన పేరు అందుకున్నారు అని చెప్పాలి.
8. రవి కె చంద్రన్ : ( Ravi K Chandran)
1992 లో కిలుక్కమ్ పెట్టి సినిమా ద్వారా ఫస్ట్ టైం మలయాళ చిత్ర పరిశ్రమకి సినిమాటోగ్రాఫర్ గా అడుగుపెట్టిన రవి కె చంద్రన్, ఆ తరువాత తలస్థానం, మంత్రికాచెప్పు, ప్రియపెట్ట కుక్కు ఇలా వరుసగా పలు మలయాళ సినిమాలు చేస్తూ వాటితో సక్సెస్ లు అందుకుంటూ కొనసాగారు. ఆ తరువాత తమిళ్ లో తొలిసారిగా హానెస్ట్ రాజ్ మూవీ తో అక్కడ కూడా పరిచయం అయిన రవి కె చంద్రన్ అనంతరం మిన్సారా కనువు, కండు కొండాయిన్ కండు కొండాయిన్ అనే సినిమాకి కూడా సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేసి అక్కడి ఆడియన్స్ నుండి కూడా బాగా పేరు అందుకున్నారు. ఆపైన హిందీలో విరాసట్, కభీ నా కభీ, స్నిప్ వంటి మూవీస్ కి వర్క్ చేసారు. ఆ తరువాత దిల్ చాహత హై, కోల్కతా మెయిల్, ఫిరాఖ్, రబ్ నే బనాది జోడి, మై నేమ్ ఈజ్ ఖాన్, అంజానా అంజాని వంటి సినిమాలతో మరికొన్ని సక్సెస్ లు సొంతం చేసుకున్నారు. ఆపైన 2018లో తెలుగులో సూపర్ స్టార్ మహేష్ హీరోగా కొరటాల శివ తీసిన భారత అనే నేను మూవీ ద్వారా తొలిసారిగా ఇక్కడకు ఎంట్రీ ఇచ్చిన రవి కె చంద్రన్ మూవీ తో భారీ హిట్ కొట్టారు. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలిసి నటిస్తున్న లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్ మూవీ కి సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు రవి కె చంద్రన్
9. మది : (R Madhi)
2002వ సంవత్సరంలో పున్నగై దేశం అనే తమిళ్ మూవీతో సినిమాటోగ్రాఫర్ గా పరిచయం అయిన ఆర్ మది, ఆ తరువాత మచ్చి, గురుదేవ, వెయిల్, నేపాలీ, సిలంబట్టం, పైయ్యా, నాన్ మహాన్ అల్లా వంటి సూపర్ హిట్స్ సినిమాలు చేసి సినిమాటోగ్రాఫర్ గా తమిళ్ ఆడియన్స్ నుండి బాగా క్రేజ్ దక్కించుకున్నారు. ఆపైన హిందీలో 2011లో షైతాన్ మూవీతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన మది, దాని అనంతరం తెలుగులోకి రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కొరటాల శివ తీసిన మిర్చి మూవీ తో 2013లో ప్రవేశించారు. ఆ సినిమా అప్పట్లో అతి పెద్ద విజయం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఆపై సుజీత్ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా రూపొందిన రన్ రాజా రన్ మూవీ కి కూడా సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేసిన మది దానితో మరొక సక్సెస్ అందుకున్నారు. ఆ తరువాత సూపర్ స్టార్ మహేష్ తో కొరటాల శివ, మైత్రి మూవీ మేకర్స్ పై తీసిన బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ మూవీ శ్రీమంతుడు కి కూడా పని చేసారు మది. ఇక ఇటీవల అనుష్క నటించిన భాగమతి, అలానే ప్రభాస్ నటించిన భారీ ప్రతిష్టాత్మక మూవీ సాహో సినిమాలకు వర్క్ చేసిన మది, ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ తో పరశురామ్ తీస్తున్న సర్కారు వారి పాట తో పాటు త్వరలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ చేయనున్న తదుపరి సినిమా కి కూడా సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేయనుండడం విశేషం.
ప్రముఖ టాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ల సినిమాలు మరియు విజయాలు
10. రామ్ ప్రసాద్ : (Ram Prasad)
1994లో పచ్చ తోరణం, పోలీస్ అల్లుడు, మెరుపు మూవీస్ తో టాలీవుడ్ కి సినిమాటోగ్రాఫర్ గా ఎంట్రీ ఇచ్చిన రామ్ ప్రసాద్ వాటితో ప్రేక్షకుల్లో మంచి పేరు అందుకున్నారు. ఆ తరువాత రవితేజ తో నీకోసం, సౌందర్య 9 నెలలు, అలానే 2001లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కృష్ణవంశీ తీసిన బ్లాక్ బస్టర్ మూవీ మురారి వంటి సినిమాలకు వర్క్ చేసి తనకంటూ ప్రత్యేకని చాటుకున్నారు రామ్ ప్రసాద్. ఆపైన పెళ్ళాం ఊరెళితే, ఒట్టేసి చెపుతున్నా, పెళ్ళాంతో పనేంటి, శ్రీ ఆంజనేయం వంటి సినిమాలు చేసిన రామ్ ప్రసాద్ ఆపైన కళ్యాణ్ రామ్ తో అతనొక్కడే, ప్రభాస్ తో మున్నా, అలానే రవితేజ తో మిరపకాయ్, సునీల్ రాజమౌళి ల మర్యాద రామన్న, రామ్ చరణ్ ఎవడు, బాలయ్య తో లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేసారు. ఇక ఇటీవల బాలయ్య నటించిన జై సింహా, రూలర్ సినిమాలకు కూడా పని చేసిన రామ్ ప్రసాద్, బాలయ్యతో బోయపాటి తీస్తున్న ప్రతిష్టాత్మక మూవీ అఖండ కి కూడా సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తుండడం విశేషం.
What's Your Reaction?






