Interesting Facts About Rashmika Mandanna You Probably Didn't Know

Explore lesser-known yet fascinating facts about Rashmika Mandanna’s career, journey, and personal life that fans will love

Interesting Facts About Rashmika Mandanna You Probably Didn't Know

నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) ప్రస్తుతం తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో హీరోయిన్ గా దేశవ్యాప్తంగా గొప్ప క్రేజ్ తో భారీ విజయాలతో కెరీర్ పరంగా దూసుకెళ్తున్నారు. తొలిసారిగా కన్నడ చిత్రం కిరిక్ పార్టీ ద్వారా సినిమా రంగ ప్రవేశం చేసారు రష్మిక మందన్న. ఆ మూవీలో రక్షిత్ శెట్టి హీరోగా నటించారు. 


అప్పట్లో మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఆ మూవీ కన్నడలో విజయవంతం కాగా దానిని తెలుగు నటుడు నిఖిల్ హీరోగా రీమేక్ చేయగా అది కూడా విజయవంతం అయింది. అనంతరం తెలుగులో తొలిసారిగా ఛలో సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చారు రష్మిక. ఆ మూవీని యువ దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కించగా యువ నటుడు నాగ శౌర్య హీరోగా యాక్ట్ చేసారు. 

Rashmika Mandanna Unknown Facts


ఛలో మూవీ సక్సెస్ అవడంతో పాటు ఫస్ట్ మూవీతోనే హీరోయిన్ గా రష్మిక కు బాగా పేరు తీసుకువచ్చింది. ఆ తరువాత తెలుగు యువ నటుడు రౌడీ హీరో విజయ్ దేవరకొండతో పరశురామ్ పెట్ల తీసిన గీత గోవిందం సినిమాలో నటించి దాని ద్వారా అతిపెద్ద విజయం తన ఖాతాలో వేసుకున్నారు రష్మిక మందన్న. 


ఆ మూవీతో పాటు అందులోని సాంగ్స్ యువతని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆ తరువాత కొన్ని సినిమాలు చేసిన రష్మిక, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి తీసిన సరిలేరు నీకెవ్వరు తో మరొక విజయాన్ని అందుకున్నారు. ఆ సినిమా కూడా భారీగా సక్సెస్ కావడంతో టాలీవుడ్ స్టార్ నటి గా గొప్ప పేరు సొంతం చేసుకున్నారు ఆమె. ఆపైన తమిళ్ లో తొలిసారిగా కార్తీతో ఆమె చేసిన మూవీ సుల్తాన్ కూడా బాగానే విజయవంతం అయింది. 

రష్మిక మందన్న గురించి తెలియని విషయాలు


అదే సమయంలో సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో రష్మిక చేసిన మూవీ పుష్ప ది రైజ్. ఆ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ 2021 చివర్లో రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం అందుకోవడంతో పాటు అందులోని ఆమె పోషించిన శ్రీవల్లి పాత్రకు బాగా పేరు తీసుకువచ్చింది. ఆ విధంగా పాన్ ఇండియన్ రేంజ్ లో బాగా పేరు సొంతం చేసుకున్నారు రష్మిక. 


తరువాత దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ ల కలయికలో హను రాఘవపూడి తీసిన సీతారామం మూవీలో కీలక పాత్ర చేసిన రష్మిక ఆ పాన్ ఇండియన్ మూవీతో మరొక విజయం తన ఖాతాలో వేసుకున్నారు. అలానే తొలిసారిగా గుడ్ బై మూవీ ద్వారా హిందీ చిత్రరంగ ప్రవేశం చేసి ఏకంగా బిగ్ బిగ్ అమితాబ్ బచ్చన్ తో కలిసి నటించే అవకాశం సొంతం చేసుకున్నారు. అయితే పర్వాలేదనిపించే విజయం అందుకున్న ఆ మూవీ హిందీలో కూడా రష్మిక కు బాగానే పేరు తీసుకువచ్చింది. 

Rashmika Mandanna Movies List


అనంతరం తమిళ స్టార్ నటుడు ఇలయదళపతి విజయ్ సరసన రష్మిక చేసిన మూవీ వరిసు. ఈ మూవీని వంశీ పైడిపల్లి తెరకెక్కించగా ఇది కూడా సక్సెస్ అయింది. ఆ విధంగా అన్ని భాషల సినిమాలతో కూడా మంచి సక్సెస్ రేట్ తో బాగా క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకెళ్లారు రష్మిక మందన్న. ఆపైన హిందీలో మిషన్ మజ్ను, రణబీర్ కపూర్ తో సందీప్ రెడ్డి వంగా తీసిన ఆనిమల్ సినిమాలు చేసారు. 


ఇక వాటిలో యానిమల్ మూవీ పాన్ ఇండియన్ రేంజ్ లో రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద సంచలన ప్రభంజనం సృష్టించింది. ఈ మూవీలో రష్మిక పోషించిన గీతాంజలి పాత్ర అందరినీ ఎంతో ఆకట్టుకుంది. ఇక ఇటీవల పుష్ప 1 కి సీక్వెల్ అయిన పుష్ప 2 ద్వారా ఆడియన్సు ముందుకి వచ్చి భారతీయ సినిమా పరిశ్రమలో పెద్ద విజయం సొంతం చేసుకున్నారు రష్మిక. ఆ మూవీలో కూడా అల్లు అర్జున్ తో పాటు అద్భుతంగా యాక్ట్ చేసి అందర్నీ మెప్పించిన రష్మిక స్థాయి దానితో నటిగా ఒక్కాసారిగా మరింత ఎత్తుకు చేరారు.

ఫ్యాన్స్ మిస్ చేసిన రియల్ లైఫ్ డీటైల్స్


దాని తరువాత హిందీలో యువ నటుడు విక్కీ కౌశల్ తో రష్మిక జోడీ కట్టిన మూవీ చావా. ఈమూవీలో ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడిగా ఛత్రపతి శంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ నటించగా ఆయన భార్య యేసుబాయి భోంస్లే పాత్రలో తన ఆకట్టుకునే నటనతో అందరినీ అలరించారు రష్మిక మందన్న. 


ఆ విధంగా సినిమా పరిశ్రమలో నటిగా ఒక్కో సినిమాతో తనకంటూ ప్రత్యేకంగా క్రేజ్ ని పలు సక్సెస్ లను అందుకుంటూ కొనసాగుతున్న రష్మిక మందన్న తరచు తన సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో యాక్టివ్ గా ఉంటారు. అలానే తరచు తన సినిమాలు వ్యక్తిగత విషయాలు వాటి ద్వారా ఫ్యాన్స్, ఆడియన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటారు రష్మిక. ఇక మనం ప్రస్తుతం రష్మిక మందన్న గురించిన కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. 


1. రష్మిక మందన్న అద్భుతమైన నటి మాత్రమే కాదు చదువుల పరంగా కూడా ఆమె ఎంతో దిట్ట. బ్యాచిలర్స్ లో డిగ్రీ చేసిన ఆమె, సైకాలజీ, జర్నలిజం, ఇంగ్లీష్ లిటరేచర్ లలో బెంగళూరులోని ఎంఎస్ రామయ్య కాలేజీలో డిగ్రీ పట్టాలు పుచ్చుకున్నారు. మొదటి నుండి చదువుల పట్ల కూడా రష్మిక ఎంతో శ్రద్ధ కంబరిచేవారని ఆమె తల్లితండ్రులు చెప్తారు. 


2. 2014లో ఒక ఫేస్ వాష్ యాడ్ లో నటించిన రష్మిక దాని ద్వారా అందరినీ ఆకట్టుకున్నారు. అలానే క్లీన్ అండ్ క్లియర్ ఫేస్ అవార్డు కూడా సొంతం చేసుకున్నారు. ఆపైన ఆమె మోడలింగ్ రంగంలో ప్రవేశించి మరికొన్ని యాడ్స్ చేస్తున్న సమయంలో రక్షిత్ శెట్టి, రిషబ్ శెట్టి ఆమెను కిరిక్ పార్టీ మూవీలో హీరోయిన్ గా ఎంపిక చేసారు. 


3. అలానే రష్మిక మందన్న పలు భాషలు మాట్లాడడంలో కూడా మంచి పేరు సంపాదించారు అని చెప్పాలి. స్వతహాగా కర్ణాటకకు చెందిన అమ్మాయి అమ్మాయి అయినప్పటికీ కూడా ప్రస్తుతం ఆమె కన్నడతో పాటు తమిళ్, తెలుగు, ఇంగ్లీష్ భాషలు ఎంతో చక్కగా మాట్లాడగలరు. అలానే కొన్నేళ్ల నుండి దాదాపుగా అన్ని సినిమాలకు ఆమె స్వయంగా డబ్బింగ్ చెప్పడం విశేషంగా చెప్పుకోవాలి. 


4. ఇక తన తొలి చిత్ర హీరో రక్షిత్ శెట్టి తో కొన్నేళ్ల క్రితం రష్మిక మందన్నకు వివాహం నిశ్చయం అయి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. అయితే అనంతరం కొన్ని కారణాల వలన వారిద్దరి వివాహం జరుగలేదు. కారణాలు తెలియరానప్పటికీ అప్పట్లో ఈ న్యూస్ పలు మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అయింది. 

చిత్రాల యొక్క ప్రస్థానం, గేమ్‌చేంజర్ రోల్స్


5. ఇక నటిగా ఓవైపు భారీ స్థాయిలో క్రేజ్ తో పాటు మంచి రెమ్యునరేషన్ కూడా అందుకుంటున్న రష్మిక మందన్న మరోవైపు తనకు వీలైనంతలో పలువురు పేదలకు సహాయం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ విధంగా తన మంచి మనసు, దాతృత్వ గుణాన్ని కూడా నిరూపించుకున్నారు రష్మిక. 


6. తన యాక్టింగ్ కెరీర్ లో మొత్తంగా ఐఫా ఉత్సవంలో బెస్ట్ యాక్ట్రెస్ అవార్డుతో అపాటు సైమా నుండి కూడా ఉత్తమ నటిగా అవార్డు కూడా అందుకున్నారు. వీటితో పాటు ఇటీవల మరికొన్ని అవార్డులు కూడా ఆమె లిస్ట్ లో ఉన్నాయి.

 


7. కెరీర్ పరంగా నటిగా ఒక్కో సినిమాత్ తన సహా నటీనటుల నుండి అలానే ఇతర సాంకేతిక నిపుణుల నుండి తాను నిత్యం ఎంతో నేర్చుకుంటున్నానని, అందుకే తాను నేడు ఈ స్థాయిలో ఉన్నానని ఎంత ఎదిగినప్పటికీ కూడా ఎంతో చక్కగా ఒదిగి ఉంటూ మాట్లాడుతారు రష్మిక. 

Lesser Known Facts about Rashmika Mandanna 


8. బెంగళూరులోని బెల్లందురు నీటి కాలువ వద్ద ఒక ఫోటోషూట్ చేసిన రష్మిక మందన్న అక్కడి ప్రజల్లో నీటి కాలుష్యం పై అవగాహన అందించే దిశగా ఫోటోలని తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసారు. ఆ ఫోటోలు అప్పట్లో ఎంతో వైరల్ అయ్యాయి. 


9. ఎక్కువగా సినిమాలు, షూటింగ్స్ లేని సమయంలో తన ఫ్యామిలీ తో పాటు పెట్స్ తో గడిపేందుకు ఇష్టపడే రష్మిక మందన్నకు పింక్ కలర్ అంటే ఎంతో ఇష్టం. అలానే తనకు ఇష్టమైన వెకేషన్ స్పాట్ లండన్ అని ఆమె పలు సందర్భాల్లో చెప్పారు. ఎప్పుడైనా ఎక్కువ ఖాళీ ఉంటె ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిసి అక్కడికి వెళ్లి చక్కగా గడపాలని ఉంటుందని ఆమె అంటారు. 


10. ఇక చివరిగా తనకు ఇంత గొప్ప లైఫ్ అందించిన తన తల్లితండ్రులు మదన్ మందన్న, సుమన్ మందన్న లకు తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని, అలానే ముఖ్యంగా తనని ఫస్ట్ మూవీ నుండి ఆదరిస్తున్న ప్రేక్షకులకు అభిమానులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తారు ఆమె. 

మరి నటిగా రష్మిక మందన్న రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు ఆదుకోవాలని, అలానే కెరీర్ పరంగా ఆమె ఇంకెన్నో ఉన్నత శిఖరాలు చేరుకోవాలని మా తెలుగు మూవీ మీడియా టీమ్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆమెకు ప్రతేకంగా శుభాభినందనలు తెలియచేస్తోంది. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow