Telugu Movie OTT Release Date 2025 – Full List & Platforms
Check the latest 2025 Telugu movie OTT release date. Full list of films streaming on Netflix, Amazon Prime, Aha, and more

తెలుగు సినిమా (Telugu Cinema) పరిశ్రమలో ఈ ఏడాది ఇప్పటికే గడచిన నాలుగున్నర నెలల్లో పలు సినిమాలు ఆడియన్స్ ముందుకి వచ్చాయి. వాటిలో అనేక సినిమాలు పర్వాలేదనిపించగా కొన్ని పరాజయం పాలయ్యాయి. అయితే అతికొద్ది సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం అందుకుని నిర్మాతలు, బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లకు కాసులని కురిపించాయి.
ఇక థియేటర్స్ లో రిలీజ్ అనంతరం పలు సినిమాలు ఆపైన ఓటిటి అలానే టెలివిజన్ ప్రీమియర్స్ గా ప్రదర్శితం అయి ఆడియన్స్, ఫ్యాన్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ ని అందించాయి. అయితే అందులో కొన్ని డైరెక్ట్ గా ఓటిటిలోనే రిలీజ్ అయి మంచి ఆదరణ ఆడుకున్నవి కూడా ఉన్నాయి. ఆ విధంగా ఇటీవల థియేటర్స్ లో రిలీజ్ అయి అనంతరం ఓటిటిలో రిలీజ్ అయిన సినిమాల యొక్క జాబితా చూద్దాం.
అనగనగా : (Anaganaga)
సుమంత్ (Sumanth) కథానాయకుడిగా కాజల్ చౌదరి (Kajal Chaudhary) కథానాయికగా నూతన దర్శకుడు సన్నీ సంజయ్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ అనగనగా. కాగా ఇటీవల మళ్ళి రావా వంటి హృద్యమైనా మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి విజయం అందుకున్నారు సమంత. అలానే తాజాగా డైరెక్ట్ గా ఓటిటిలో రిలీజ్ అయిన అనగనగా మూవీ కూడా అందరి ఆదరణ అందుకుంటూ బాగా వ్యూస్ రివ్యూస్ రేటింగ్స్ తో కొనసాగుతోంది. వ్యాస్ అనే ఉపాధ్యాయుడి కథగా రూపొందిన ఈ మూవీలో సుమంత్ నటనతో పాటు ఆద్యంతం ఆకట్టుకునే కథ, కథనాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మరి వీలైతే మీరు కూడా ఈటివి విన్ (ETV Win) లో ఈ మూవీ చూసేయండి.
2025లో రిలీజ్ అయ్యే తెలుగు మూవీ OTT డేట్స్ లిస్ట్
అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి : (Arjun Son of Vyjayanthi)
ఈ మూవీలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించగా సీనియర్ నటి విజయశాంతి (Vijaya Shanthi) కీలక పాత్ర చేసారు. ప్రదీప్ చిలుకూరి తెరకెక్కించిన ఈ మూవీలో సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటించారు. యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈమూవీ థియేటర్స్ లో బాగానే ఆకట్టుకుంది. అజనీష్ లోకనాథ్ సంగీతం అందించిన ఈ మూవీ తాజాగా ప్రముఖ ఓటిటి మాధ్యమం అమెజాన్ ప్రైమ్ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చింది. అయితే తాజాగా ఇది యుకె ఆడియన్సు కి మాత్రమే అందుబాటులో ఉంది, త్వరలో ఇండియన్ ఆడియన్సు కి కూడా అందుబాటులోకి రానుంది.
మరణమాస్ : (Maranamass)
మలయాళ నటుడు బాసిల్ జోసెఫ్ (Basil Joseph) ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ బ్లాక్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ మరణ మాస్. ఈ మూవీని శివ ప్రసాద్ తెరకెక్కించగా టోవినో థామస్, టింగ్స్టన్ థామస్, రాఫెల్ పోహోలిపారంబిల్, తంజీర్ సలాం గ్రాండ్ గా నిర్మించారు. జేకే సంగీతం అందించిన ఈ మూవ్ ఇటీవల థియేటర్స్ లో ఆడియన్సు ముందుకి వచ్చి అందరి నుండి బాగా రెస్పాన్స్ సొంతం చేసుకుని మంచి కలెక్షన్ కూడా రాబట్టింది. ఇక తాజాగా ఈ మూవీ మలయాళం, తెలుగు సహా పలు భాషల్లో ప్రముఖ ఓటిటి మాధ్యమం సోనీ లివ్ లో అందుబాటులోకి వచ్చింది. మరి థియేటర్స్ లో ఆకట్టుకున్న మరణ మాస్ ఎంతమేర ఓటిటి లో అలరిస్తుందో చూడాలి.
Netflix, Prime, Aha వంటి OTTలు ఎప్పటినుంచి స్ట్రీమ్ చేస్తున్నాయో తెలుసుకోండి
ఓదెల 2 : (Odela 2)
తమన్నా భాటియా (Tamannah Bhatia) ప్రధాన పాత్రలో వశిష్ట మరొక కీలక పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ సూపర్ నాచురల్ ఎంటర్టైనర్ మూవీ ఓదెల 2. ఈ మూవీని అశోక్ తేజ తెరకెక్కించగా గ్రాండ్ లెవెల్లో సంపంత్ నంది నిర్మించారు. ఒక ఓదెల 2 లో అఘోరి గా తమన్నా నటన అందరినీ ఆకట్టుకుంది. ఇక థియేటర్స్ లో బాగానే ఆకట్టుకున్న ఓదెల 2 మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటిటి మాధ్యమం అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. మే 8న ఓటిటిలోకి వచ్చిన ఈ మూవీ బాగానే రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది.
రాబిన్ హుడ్ : (Robinhood)
నితిన్ హీరోగా శ్రీలీల (Sreeleela) హీరోయిన్ గా రూపొందిన లేటెస్ట్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ రాబిన్ హుడ్. వెంకీ కుడుముల తీసిన ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ గ్రాండ్ గా నిర్మించగా జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఐతే థియేటర్స్ లో యావరేజ్ రెస్పాన్స్ సొంతం చేసుకున్న ఈమూవీ ఇటీవల ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ జీ 5 లో పలు భాషల ఆడియన్స్ ముందుకి వచ్చింది. అయితే ఇందులో నితిన్, శ్రీలీల యాక్టింగ్ బాగుంది. మరి ఓవరాల్ గా రాబిన్ హుడ్ మూవీ ఏ స్థాయిలో ఓటిటి ఆడియన్స్ ని మెప్పిస్తుందో చూద్దాం.
జాక్ : (Jack)
డీజే టిల్లు (DJ Tillu) మూవీ ద్వారా టాలీవుడ్ నటుడిగా తనకంటూ ఆడియన్స్ లో మంచి క్రేజ్ సంపాదించిన సిద్దు జొన్నలగడ్డ హీరోగా ఆ తరువాత వచ్చిన టిల్లు స్క్వేర్ (Tillu Square) కూడా పెద్ద విజయం అందుకుంది. ఇక ఇటీవల బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సిద్దు హీరోగా వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) హీరోయిన్ గా రూపొందిన యక్షన్ స్పై మూవీ జాక్ (Jack). ఈ మూవీ ఇటీవల థియేటర్స్ లో రిలీజ్ అయి ఆశించిన స్థాయి రెస్పాన్స్ అయితే అందుకోలేకపోయింది. అనంతరం నెట్ ఫ్లిక్స్ ఓటిటి లో ఇది ఆడియన్స్ ముందుకి వచ్చి బాగానే ప్రస్తతం రెస్పాన్స్ తో కొనసాగుతోంది.
జాలి ఓ జింఖానా : (Jolly O Gymkhana)
ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చిన బ్లాక్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ జాలి ఓ జింఖానా. ఈ మూవీలో ప్రభుదేవా, మడోన్నా సెబాస్టియన్ (Madonna Sebastian) కీలక పాత్రలు చేయగా శక్తి చిదంబరం దీనిని తెరకెక్కించారు. అశ్విన్ వినాయగమూర్తి సంగీతం అందించిన ఈ మూవీని రాజేంద్ర ఎం రాజన్, పునీత రాజన్ గ్రాండ్ గా నిర్మించారు. ఇక థియేటర్స్ లో బాగానే రెస్పాన్స్ అందుకున్న ఈమూవీ తాజాగా ప్రముఖ తెలుగు ఓటిటి ప్లాట్ ఫామ్ ఆహాలో అందుబాటులోకి వచ్చింది. కాగా ప్రస్తుతం ఈ కామెడీ మూవీకి ఓటిటి ఆడియన్స్ నుండి బాగానే రెస్పాన్స్ లభిస్తుండడంతో మూవీ టీమ్ ఆనందం వ్యక్తం చేస్తోంది.
ఏ ప్లాట్‌ఫారమ్‌లో ఏ మూవీ ఎప్పుడో చూడండి
గుడ్ బ్యాడ్ అగ్లీ : (Good Bad Ugly)
కోలీవుడ్ స్టార్ యాక్టర్ అజిత్ కుమార్ (Ajith Kumar) హీరోగా త్రిష (Trisha Krishnan) హీరోయిన్ గా యువ దర్శకుడు అధిక రవిచంద్రన్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ గ్రాండ్ గా నిర్మించిన గ్యాంగ్ స్టర్ డ్రామా యాక్షన్ మూవి గుడ్ బ్యాడ్ అగ్లీ. ఈ మూవీ థియేటర్స్ లో బాగా కలెక్షన్ రాబట్టింది. ముఖ్యంగా మూవీలోని ఎలివేషన్ సీన్స్ అజిత్ ఫ్యాన్స్ ని ఎంతో ఆకట్టుకున్నాయి. ఇక ఇటీవల ప్రముఖ ఓటిటి మాధ్యమం నెట్ ఫ్లిక్స్ ద్వారా గుడ్ బ్యాడ్ అగ్లీ ఓటిటి ఆడియన్స్ ముందుకి వచ్చి బాగానే రెస్పాన్స్ సొంతం చేసుకుని ప్రస్తుతం కొనసాగుతోంది. అజిత్ మాస్ స్టైల్ యాక్టింగ్ కూడా ఈ మూవీకి పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి.
అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి : (Akkada Ammayi Ikkada Abbayi)
యువ నటుడు, యాంకర్ ప్రదీప్ మాచిరాజు (Pradeep Machiraju) హీరోగా దీపికా పిల్లి (Deepika Pilli) హీరోయిన్ గా నితిన్ భరత్ తెరకెక్కించిన లేటెస్ట్ కామెడీ లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ మూవీ టైటిల్ తో వచ్చిన ఈ మూవీ పర్వాలేదనిపించే విజయం అందుకుంది. మాంక్స్ అండ్ మంకీస్ సంస్థ పై గ్రాండ్ గా నిర్మితం అయిన ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ వారు డిస్ట్రిబ్యూట్ చేసారు. అయితే థియేటర్స్ రిలీజ్ అనంతరం ఇటీవల ప్రముఖ తెలుగు ఓటిటి సంస్థ ఈటివి విన్ ద్వారా ఆడియన్సు ముందుకి వచ్చి బాగానే రెస్పాన్ అందుకుంటూ కొనసాగుతోంది.
What's Your Reaction?






