Top 10 Telugu Movies 2024 IMDb – Highest Rated Tollywood Films
Top 10 Telugu movies 2024 imdb ప్రతి ఏడాది మాదిరిగా 2024 ఏడాది కూడా పలు తెలుగు సినిమాలు ఆడియన్స్ ముందుకి రాగా వాటిలో కొన్ని అద్భుతం విజయం అందుకున్నాయి, మరికొన్ని ఆశించిన స్థాయి సక్సెస్ కాలేదు. ముఖ్యంగా

Top 10 Telugu Movies 2024 IMDb – Best Rated Films of the Year
- పుష్ప 2 ది రూల్ (Pushpa2: The Rule)
పాన్ ఇండియన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ పుష్ప 2 ఇటీవల డిసెంబర్ 5 న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకు వచ్చి ఫస్ట్ డే ఫస్ట్ షో నుండే సూపర్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ మూవీని సుకుమార్ తెరకెక్కించారు. ఇక ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సొంతం చేసుకుని ఓవరాల్ గా రూ. 1800 కోట్లకు పైగా కలెక్షన్ తో ఇంకా థియేటర్స్ లో కొనసాగుతోంది. ఈ మూవీలో మరోక్కసారి పుష్ప రాజ్ గా తన సూపర్ పెర్ఫార్మన్స్ తో అందరినీ ఆకట్టుకున్నారు అల్లు అర్జున్. ముఖ్యంగా ఈ మూవీలో యాక్షన్ సీన్స్, ఫైట్స్, ఎమోషనల్ సన్నివేశాలు, ఫైట్స్ వంటివి అందరినీ ఎంతో ఆకట్టుకున్నాయి. మొత్తంగా 2024 ఏడాదిలో రిలీజ్ అయిన సినిమాల్లోనే కాక యావత్ భారత దేశంలో భారీ కలెక్షన్ తో అన్ని ఏరియాల్లో కూడా అద్భుత రికార్డ్స్ సొంతం చేసుకుంది పుష్ప 2 ది రూల్ మూవీ
2. కల్కి 2898 ఏడి (Kalki 2898 AD)
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా యువ దర్శకుడు నాగ అశ్విన్ తీసిన ఈ మూవీ పై మొదటి నుండి అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ భారీ సైన్స్ ఫిక్షన్ మైథలాజికల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రల్లో కనిపించగా బాలీవుడ్ నటి దీపికా పదుకొనె హీరోయిన్ గా నటించారు. వైజయంతి మూవీస్ సంస్థ నిర్మించిన ఈ మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. ఇక ఈ ఇది జూన్ లో రిలీజ్ అయిన కల్కి 2898 ఏడి మూవీ బాక్సాఫీస్ వద్ద అతి పెద్ద విజయం అందుకుంది. ముఖ్యంగా ప్రభాస్, అమితాబ్ బచ్చన్ ల కీలక సీన్స్ తో పాటు భారీ విజువల్స్, సెట్టింగ్స్, సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ ఈ విజయంలో కీలక పాత్ర పోషించాయి.
Highest Rated Telugu Movies on IMDb in 2024
3. దేవర పార్ట్ 1 (Devara Part - 1)
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా కొరటాల శివ దర్శకత్వంలో తేయాకెక్కిన లేటెస్ట్ భారీ పాన్ ఇండియా మాస్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ దేవర పార్ట్ 1. ఈ మూవీని యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు గ్రాండ్ లెవెల్లో భారీ వ్యయంతో నిర్మించగా అనిరుద్ సంగీతం అందించారు. ఇక సెప్టెంబర్ 27న గ్రాండ్ గా మంచి అంచనాలతో రిలీజ్ అయిన దేవర పార్ట్ 1 మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సొంతం చేసుకుంది. రెండు పాత్రల్లో ఎన్టీఆర్ పవర్ఫుల్ యాక్టింగ్ తో పాటు దర్శకుడు కొరటాల టేకింగ్, జాన్వీ అందం, అనిరుద్ సాంగ్స్, బీజీఎమ్, యాక్షన్ సీన్స్ ఈ మూవీకి ప్రధాన హైలైట్స్ గా చెప్పుకోవాలి.
4. గుంటూరు కారం (Guntur Kaaram)
Top Grossing Telugu Films 2024 – Box Office & Ratings
5. లక్కీ భాస్కర్ (Lucky Baskhar)
మలయాళ స్టార్ నటుడు దుల్కర్ సల్మాన్ చేసిన తెలుగు మూవీ లక్కీ భాస్కర్. ఈ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా కనిపించగా కీలక పాత్రల్లో టిన్ను ఆనంద్, రాంకీ, సూర్య శ్రీనివాస్, సర్వదమన్ బెనర్జీ తదితరులు నటించారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజ్ఞ్య గ్రాండ్ గా నిర్మించిన ఈ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి జివి ప్రకాష్ సంగీతం సమకూర్చారు. అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ ఇటీవల ఆడియన్స్ మందికి వచ్చి పెద్ద విజయం సొంతం చేసుకుంది. దుల్కర్ యాక్టింగ్ తో పాటు థ్రిల్లింగ్ ట్విస్ట్ లు ఈ మూవీకి ప్రధాన హైలైట్. ప్రస్తుతం ఈ మూవీ ఓటిటి ఆడియన్స్ ని కూడా ఆకట్టుకుంటోంది.
6. హను మాన్ (Hanu-Man)
యువ నటుడు తేజ సజ్జ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ గా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ సంస్థ పై గ్రాండ్ లెవెల్లో నిరంజన్ రెడ్డి నిర్మించిన మైథలాజికల్ యాక్షన్ ఎంటర్టైనర్ హను మాన్ మూవీ ఇటీవల సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందుకి వచ్చి పెద్ద విజయం సొంతం చేసుకుంది. కోలీవుడ్ నటుడు వినయ్ రాయ్ విలన్ గా నటించిన ఈ మూవీలో వరలక్ష్మి శరత్ కుమార్, గెటప్ శ్రీను, వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో కనిపించారు. ఆకట్టుకునే కథ, కథనాలు, హనుమంతుని నేపధ్య సన్నివేశాలు ఈమూవీకి పెద్ద ప్లస్ అయ్యాయి. ముఖ్యంగా సాంగ్స్ తో పాటు యాక్షన్ ఎమోషనల్ సీన్స్ అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి.
7. టిల్లు స్క్వేర్ (Tillu Square)
యువ నటుడు సిద్దు జొన్నలగడ్డ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా తెరకెక్కిన లేటెస్ట్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ టిల్లు స్క్వేర్. ఈ మూవీని మల్లిక్ రామ్ గ్రాండ్ గా తెరకెక్కించగా కీలక పాత్రల్లో నేహా శెట్టి, మురళీధర్ గౌడ్, మురళి శర్మ, ప్రిన్స్, అనీష్ కురువిల్ల నటించారు. రామ్ మిరియాల, అచ్చు రాజమణి సంగీతం అందించిన ఈమూవీ ఇటీవల మంచి అంచనాలతో ఆడియన్స్ ముందుకి వచ్చి సూపర్ సక్సెస్ సొంతం చేసుకుంది. డీజే టిల్లుకి సీక్వెల్ గా రూపొందిన ఈమూవీలో సిద్దు సూపర్ యాక్టింగ్ తో పాటు కామెడీ, థ్రిల్లింగ్ ట్విస్ట్, యాక్షన్ అంశాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
Best Tollywood Movies 2024 – Critics & Audience Reviews
8. కమిటీ కుర్రాళ్ళు (Committee Kurrollu)
యువ దర్శకుడు యదు వంశీ దర్శకత్వంలో మెగాబ్రదర్ నాగబాబు తనయ నిహారిక కొణిదెల నిర్మించిన లేటెస్ట్ కామెడీ యాక్షన్ డ్రామా మూవీ కమిటీ కుర్రోళ్ళు. సందీప్ సరోజ్, సాయి కుమార్, గోపరాజు రమణ, త్రినాధ్ వర్మ, ప్రసాద్ బెహరా, రాధ్య తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీకి అనుదీప్ దేవ్ సంగీతం అందించారు. ముఖ్యంగా ఇటీవల మంచి అంచనాలతో రిలీజ్ అయిన కమిటీ కుర్రోళ్ళు మూవీ అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద విజయవంతం అయింది. ముఖ్యంగా ప్రతి ఒక్క పాత్రధారి నటనతో పాటు ఆకట్టుకునే హృద్యమైన కథ, కథనాలు ఆడియన్స్ ఐ అలరించాయి.
9. ఆయ్ (Aay)
యువ దర్శకుడు అంజి కె తెరకెక్కించిన తాజా రొమాంటిక్ కామెడీ డ్రామా మూవీ ఆయ్. ఈ మూవీని గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా బన్నీ వాసు నిర్మించగా కీలక పాత్రల్లో నార్నె నితిన్, నయన్ సారిక, రాజ్ కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య, వినోద్ కుమార్ తదితరులు నటించారు. రామ్ మిరియాల, అజయ అరాసాడ సంగీతం అందించిన ఈ మూవీ ఆకట్టుకునే కథ, కథనాలతో రూపొంది ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చింది. ఫస్ట్ డే నుండి మంచి టాక్ అందుకున్న ఆయ్ మూవీ బాక్సాఫీస్ వద్ద విజయం సొంతం చేసుకుంది. ప్రతి పాత్రధారి నటనతో పాటు హృద్యమైన సన్నివేశాలు ఈ మూవీలో ప్రధాన బలంగా చెప్పుకోవాలి.
Upcoming Telugu Movies 2024 – Most Anticipated Films
10. క (KA)
యువ నటుడు కిరణ్ అబ్బవరం హీరోగా నయన్ సారిక హీరోయిన్ గా సందీప్ సుజీత్ అనే యువ దర్శకులు తెరకెక్కించిన లేటెస్ట్ థ్రిల్లింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ క. ఈ మూవీని శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్స్, కేఏ ప్రొడక్షన్స్ సంస్థలు ప్రతిష్టాత్మకంగా నిర్మించాయి. సామ్ సి ఎస్ స్నాగీతం అందించిన ఈ మూవీ ఇటీవల దీపావళి కానుకగా ఆడియన్స్ ముందుకి వచ్చి ఫస్ట్ డే మంచి టాక్ ని సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించింది. ముఖ్యంగా హీరో కిరణ్ యాక్టింగ్ తో పాటు ఆకట్టుకునే కథ, కథనాలు, ట్విస్ట్ లు థ్రిల్లింగ్ అంశాలు ఈ మూవీ యొక్క సక్సెస్ కి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.
11. మత్తు వదలరా 2 (Mathu Vadalara 2)
శ్రీసింహా కోడూరి హీరోగా ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా తెరకెక్కిన లేటెస్ట్ క్రైమ్ కామెడీ యాక్షన్ మూవీ మత్తు వదలరా 2. రితేష్ రానా తెరకెక్కించిన ఈ మూవీని క్లాప్ ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్ సంస్థలు గ్రాండ్ గా నిర్మించాయి. సత్య, వెన్నెల కిషోర్, రాజా చేంబోలు, రోహిణి, అజయ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించిన ఈ మూవీ ఇటీవల మంచి అంచనాలతో రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద విజయం సొంతం చేసుకుంది. కామెడీ అంశాలతో ఆటు ఆకట్టుకునే ట్విస్ట్ లు ఈ మూవీకి హైలైట్. ఇక సింహా, సత్య, ఫరియా ల యాక్టింగ్, సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఈ మూవీ సక్సెస్ కు కారణాలుగా చెప్పవచ్చు.
Top 10 Telugu Movies 2024 OTT
What's Your Reaction?






