Prabhas’s Expensive Specs Price Will Shock You – Check His Stylish Look
The price of the luxury specs Prabhas wears will leave you stunned! Find out how much the Rebel Star’s eyewear actually costs.

టాలీవుడ్ సినిమా పరిశ్రమకు తన పెద్దనాన్న కృష్ణంరాజు యొక్క నటవారసుడిగా ఈశ్వర్ సినిమాతో హీరోగా అడుగుపెట్టిన నటుడు ప్రభాస్. జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సీనియర్ నటి మంజుల చిన్న కుమార్తె శ్రీదేవి హీరోయిన్ గా నటించింది.
ప్రభాస్ ధరించే స్పెక్స్ రేట్ తెలిస్తే షాక్ అవుతారు!
ఇక అప్పట్లో ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దాని అనంతరం రాఘవేంద్ర అనే మూవీ చేసిన ప్రభాస్, ఆపై శోభన్ దర్శకత్వంలో సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన వర్షం మూవీ లో నటించారు.
త్రిష హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో యాక్షన్ హీరో గోపీచంద్ విలన్ గా నటించిన విషయం తెలిసిందే.
అప్పట్లో అతి పెద్ద సెన్సేషనల్ హిట్ కొట్టిన ఈ మూవీ అనంతరం హీరోగా ప్రభాస్ కి భారీ క్రేజ్ లభించింది. ఇక అక్కడి నుండి వరుసగా సినిమాలు చేస్తూ కొనసాగిన ప్రభాస్ తో 2013లో కొరటాల శివ తీసిన సినిమా మిర్చి. మంచి యాక్షన్ తో కూడిన ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా పెద్ద సక్సెస్ అందుకుని కెరీర్ పరంగా ప్రభాస్ కి అతి పెద్ద విజయాన్ని అందించింది.
ప్రభాస్ గ్లాసెస్ ధర ఎంతో తెలుసా? సామాన్యుల వల్ల కాదంతా
ఇక ఆ తరువాత టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సిరీస్ లోని రెండు సినిమాల్లో ప్రభాస్ హీరోగా నటించారు. ఆ మూవీ లో ప్రభాస్ అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి గా రెండు పాత్రల్లో సూపర్ గా యాక్టింగ్ అదరగొట్టి ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి మంచి స్పందన సొంతం చేసుకున్నారు..
ఇక మొదటి భాగాన్ని మించేలా బాహుబలి రెండవ భాగం మరింత గొప్ప విజయాన్ని అందుకుని ప్రభాస్ కి అతి పెద్ద పాన్ ఇండియా స్టార్ గా విపరీతమైన పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది. ఇక దాని తరువాత యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ బ్యానర్ పై ప్రభాస్ నటించిన సినిమా సాహో.
బాలీవుడ్ నటి శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఆరేళ్ళ క్రితం రిలీజ్ అయి మంచి సక్సెస్ కొట్టింది. అనంతరం పలు భారీ పాన్ ఇండియన్ సినిమాలతో హీరోగా భారీ విజయాలు సొంతం చేసుకుని ఇండియా వైడ్ తన పాపులారిటీ, క్రేజ్, మార్కెట్ ని మరింతగా పెంచుకుంటూ కెరీర్ పరంగా ముందుకు దూసుకెళ్తున్నారు ప్రభాస్.
ఇక ప్రస్తుతం మొత్తం రెండు సినిమాలు చేస్తున్న ప్రభాస్ అతి త్వరలో సందీప్ రెడ్డి వంగా తీయనున్న స్పిరిట్ సినిమాలో కూడా నటించనున్నారు. వాటిలో మొదటగా ఈ ఏడాది ద్వితీయార్ధంలో ది రాజా సాబ్ మూవీ ఆడియన్స్ ముందుకి రానుంది. ఈ మూవీని మారుతీ తెరకెక్కిస్తుండగా నిధి అగర్వాల్, రద్దీ కుమార్, మాళవిక మొహనన్ హీరోయిన్స్ గా చేస్తున్నారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీకి ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. అలానే మరోవైపు హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఒక మూవీ కూడా చేస్తున్నారు ప్రభాస్. దీనికి విశాల్ చంద్రశేఖర్ సంగీతమా అందిస్తుండగా ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తోంది.
ప్రభాస్ స్టైల్ కి అసలైన హైలైట్ – లగ్జరీ బ్రాండ్ స్పెక్స్
అయితే ఆరడుగుల పైగా ఎత్తు మంచి ఫిజిక్, అందం కలిగిన ప్రభాస్ ప్రతి ఒక్క సినిమాలో కూడా అదిరిపోయే కాస్ట్యూమ్స్ తో పాటు ఆకట్టుకునే విధంగా ఉండే స్పెక్ట్స్ ని కూడా ధరిస్తూ ఉంటారు. ఇక ఇటీవల కల్కి 2898, అలానే సలార్ మూవీస్ లో ప్రభాస్ వాడిన స్పెక్ట్స్ అయితే యువతని మరింతగా ఆకట్టుకున్నాయి.
ఇక వాటి ధర కొన్ని వేల రూపాయల ఉంటాయని, ఎప్పటికప్పుడు తన కాస్ట్యూమ్స్ తో పాటు లేటెస్ట్ ట్రెండీ స్పెక్ట్స్ వంటి వాటి విషయమై ప్రభాస్, ఆయన డిజైనర్స్ టీమ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని తెలుస్తోంది. ముఖ్యంగా భారత దేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో ఒకరైన ప్రభాస్, ఎప్పటికప్పుడు ట్రెండీ స్టైల్స్ పై బాగానే దృష్టి పెడుతూ తన పాత్రలతో ఆకట్టుకుంటుంటారు. ఇక ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల్లో ప్రభాస్ మరింత స్టైల్ గా అందంగా లేటెస్ట్ కాస్ట్యూమ్స్, ట్రెండీ యాక్సెసరీస్ తో కనిపించనున్నారని అంటున్నారు.....!!
What's Your Reaction?






