Don't Miss! All Telugu Movies Releasing in 2025 – Dates & Details Inside
Upcoming Telugu movies in 2025 with their release dates. Stay updated with the latest Tollywood releases.

ఈ ఏడాది ఇప్పటికే సంక్రాంతి కానుకగా పలు మూవీస్ ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి విజయం అందుకున్నాయి. విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి తీసిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam) ఎంతో పెద్ద విజయం సొంతం చేసుకుని హీరోగా వెంకీ కెరీర్ లో అలానే అనిల్ రావిపూడి కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
అయితే అదే సమయంలో రిలీజ్ అయిన రామ్ చరణ్ (Ram Charan) గేమ్ ఛేంజర్ (Game Changer) అంతగా ఆకట్టుకోలేదు. వాటితో పాటు రిలీజ్ అయిన బాలకృష్ణ డాకు మహారాజ్ (Daaku Maharaaj) కూడా విజయవంతం అయింది. అయితే ఈ సీజన్ అనంతరం కూడా ఇప్పటికే పలు సినిమాలు ఆడియన్స్ ముందుకి వచ్చాయి. వాటిలో మ్యాడ్ స్క్వేర్ మూవీ అద్భుత విజయం అందుకుంది.
2025లో విడుదలయ్యే తెలుగు సినిమాల జాబితా
ఈ మూవీ ఓవరాల్ గా పెద్ద విజయం అందుకోవడంతో టీమ్ ఆనందం వ్యక్తం చేసింది. దానితో పాటు చిన్న సినిమాగా ఆడియన్స్ ముందుకి వచ్చి పెద్ద విజయం అందుకున్న మూవీ కోర్ట్. ఈ మూవీని నాని నిర్మించారు. అలానే తాజాగా రిలీజ్ నాని హిట్ 3 (Hit 3 The Third Case) కూడా ప్రస్తుతం హిట్ టాక్ తో ఆడియన్స్ ని అలరిస్తూ థియేటర్స్ లో కొనసాగుతోంది.
అయితే ఈ ఏడాది ఇంకా పలు సినిమాలు ఆడియన్స్ ముందుకి వచ్చేందుకు సిద్ధం అవుతున్నాయి. వాటిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ కలిసి తెరకెక్కిస్తున్న మూవీ హరి హర వీర మల్లు (Hari Hara Veera Mallu) వాస్తవానికి ఈపాటికే రిలీజ్ కావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎంగా ఎంతో బిజీ గా ఉన్న పవన్ త్వరలోనే తన పార్ట్ యొక్క బ్యాలెన్స్ షూట్ ని పూర్తి చేయనున్నారు.
కాగా హరి హర వీర మల్లు మూవీ జూన్ రెండవ వారంలో ఆడియన్స్ ముందుకి వస్తుందని అంటున్నారు. ఇక రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ కింగ్డమ్ (Kingdom). ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే (Bhagyasri Borse) హీరోయిన్ గా నటిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ దీనిని నిర్మిస్తోంది.
2025 తెలుగు మూవీ విడుదల తేదీలు మరియు వివరాలు
ఈ మూవీ ఈ మే 30న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది. అలానే జూన్ మూడవ వారంలో కింగ్ అక్కినేని నాగార్జున, వెర్సటైల్ యాక్టర్ ధనుష్ ల కుబేరా (Kubera) కూడా రిలీజ్ కానుంది. ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్ గా నటిస్తుండగా శేఖర్ కమ్ముల ఈ మూవీని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.
అలానే వీటితో పాటు ఆగష్టు 14న యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ హీరోలుగా అయాన్ ముఖర్జీ తీస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ వార్ 2 (War 2) గ్రాండ్ గా రిలీజ్ కానుంది. దానితో పాటు అదేరోజున సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా యువ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తీస్తున్న కూలి మూవీ కూడా ఆడియన్స్ ముందుకి రానుంది.
వీటి అనంతరం సెప్టెంబర్ లో ప్రభాస్ హీరోగా మారుతీ తెరకెక్కిస్తున్న హర్రర్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ది రాజా సాబ్ (The Rajasaab) రిలీజ్ అయ్యే అవకాశము ఉందనేది లేటెస్ట్ టాలీవుడ్ బజ్. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ మూవీ యొక్క అఫీషియల్ రిలీజ్ డేట్ త్వరలో అనౌన్స్ కానుంది.
ప్రతి నెలలో వచ్చే ముఖ్యమైన చిత్రాలు
ఇక నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ అఖండ 2 (Akhanda 2). ఇటీవల రిలీజ్ అయిన అఖండ మూవీ పెద్ద విజయం అందుకోవడంతో దీని పై అందరిలో విశేషమైన అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీ సెప్టెంబర్ 25న ఆడియన్స్ ముందుకి రానుంది.
అలానే మెగాస్టార్ చిరంజీవి హీరోగా యువ డైరెక్టర్ మల్లిడి వశిష్ట తీస్తున్న లేటెస్ట్ సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్ మూవీ విశ్వంభర (Vishwambhara) కూడా ఈ ఏడాది ఆడియన్స్ ముందుకి రానుంది. వాస్తవానికి ఈ ఏడాది జనవరి నుండి వరుసగా వాయిదా పడుతూ వస్తున్న ఈ మూవీ యొక్క షూటింగ్ తో పాటు విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ కూడా వేగంగా జరుగుతోంది. కాగా ఈ మూవీ ఆగష్టు లేదా అక్టోబర్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు.
What's Your Reaction?






