Telugu Movie News: Daily Updates, Trailers & More
Breaking news from Telugu cinema world. Get the latest updates on new movies, trailers, star gossip, and box office buzz only on Telugu Movie Media

తెలుగు సినిమా (Telugu Cinema) పరిశ్రమ ఒకప్పటితో పోలిస్తే ప్రతి ఏడాది భారీ సినిమాలతో పలు విజయాలతో ఎంతో కీర్తితో హాలీవుడ్ స్థాయికి దూసుకెళుతోంది. కొన్నేళ్ల క్రితం ప్రభాస్ హీరోగా ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి (Baahubali) సిరీస్ సినిమాలు ఎంతో అద్భుత విజయాల అనంతరం బాలీవుడ్ తో పాటు పలు చిత్రసీమలు మనవైపు చూడసాగాయి.
ఇక అక్కడి నుండి అనేకమంది హీరోలు సైతం పాన్ ఇండియన్ సినిమాల పై గట్టిగా దృష్టి పెట్టి కొనసాగుతున్నారు. ఇక ఇటీవల వచ్చిన భారీ సినిమాలైనా సలార్ (Salaar Part 1 Ceasefire), కల్కి 2898 ఏడి (Kalki 2898 AD), పుష్ప 2 (Pushpa 2 The Rule), దేవర (Devara Part 1) వంటివి మన టాలీవుడ్ యొక్క సత్తాని మరింతగా చాటాయి. అయితే ఈ ఏడాది ఇప్పటికే పలు సినిమాలు ఆడియన్స్ ముందుకి వచ్చి వారికి చక్కటి వినోదాన్ని అందించాయి.
న్యూస్ తెలుగు మూవీ విశేషాలు
కాగా ప్రస్తుతం సెట్స్ మీద ఏ ఏ సినిమాలు ఉన్నాయి, వీటిలో ఏవి ఎప్పుడు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది అనేది మొత్తం కూడా ప్రస్తుతం డిటైల్డ్ గా చూద్దాం. వాస్తవానికి మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న విశ్వంభర (Vishwambhara) మూవీ ఈపాటికే రిలీజ్ కావాల్సి ఉంది.
త్రిష (Trisha Krishnan) హీరోయిన్ గా నటిస్తున్న ఈమూవీని యువి క్రియేషన్స్ సంస్థ గ్రాండ్ గా నిర్మిస్తుండగా బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ విలన్ పాత్ర చేస్తున్నారు. ఈ మూవీ ఈ ఏడాది జనవరిలో రిలీజ్ కావాల్సి ఉంది, అయితే మూవీకి సంబంధించి విజువల్ అఫెక్ట్స్ వర్క్ ని మరింత క్వాలిటీతో అందించేందుకు టీమ్ మరింతగా శ్రమిస్తోంది.
అందుకే ఈమూవీని ఈ ఏడాది ఆగష్టు లో రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. ఇక త్వరలో ముందుగా ఆడియన్సు ముందుకి రానున్న మూవీ థగ్ లైఫ్ (Thug Life). ఈ మూవీలో కమల్ హాసన్ (Kamal Haasan) తో పాటు శింబు కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. చాలా ఏళ్ళ అనంతరం కమల్ హాసన్, మణిరత్నం కలయికలో రూపొందుతున్న ఈ మూవీలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా ఏ ఆర్ రహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు.
సినిమా విశ్లేషణ & బాక్సాఫీస్ టాక్
తాజాగా ఆడియోతో పాటు ట్రైలర్ కూడా రిలీజ్ అయి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన థగ్ లైఫ్ మూవీ జూన్ 5న పలు భాషల ఆడియన్సు ముందుకి రానుంది. అయితే దీని తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్, జ్యోతి కృష్ణ కలిసి తీస్తున్న పాన్ ఇండియన్ మూవీ హరి హర వీర మల్లు (Hari Hara Veera Mallu) మూవీ ఆడియన్సు ముందుకి రానుంది.
ఈ మూవీలో గజదొంగ వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కనిపించనుండగా ఎం ఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. మెగాసూర్య ప్రొడక్షన్స్ సంస్థ పై అత్యంత్య ప్రతిష్టాత్మకంగా ఏ ఎం రత్నం గ్రాండ్ గా నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియన్ మూవీ జూన్ 12న పలు భాషల ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.
ఇప్పటికే హరి హర వీర మల్లు నుండి రిలీజ్ అయిన మూడు గ్లింప్స్ టీజర్స్ తో పాటు మూడు సాంగ్స్ కూడా బాగా రెస్పాన్స్ సొంతం చేసుకుని మూవీ పై మరింతగా అంచనాలు ఎరపరిచాయి. ఇక దీని తరువాత జూన్ 20న కుబేర (Kubera) మూవీ రిలీజ్ కానుంది. ఈ మూవీలో నాగార్జున తో పాటు ధనుష్ (Dhanush) కీలక పాత్ర చేస్తున్నారు.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్ గా నటిస్తున్న ఈమూవీకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు దీనిని గ్రాండ్ గా పాన్ ఇండియన్ రేంజ్ లో నిర్మిస్తున్నారు. శేఖర్ కమ్ముల కుబేర మూవీని తెరకెక్కిస్తున్నారు.
అయితే దీని అనంతరం విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో వస్తున్న మూవీ కింగ్డమ్ (Kingdom). ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే (Bhagyasri Borse) హీరోయిన్ గా నటిస్తుండగా అనిరుద్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ మూవీ పై విజయ్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ఆడియన్సు లో కూడా భారీ స్థాయి అంచనాలు నెలకొని ఉన్నాయి.
ఇటీవల కింగ్డమ్ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ గ్లింప్స్ టీజర్, ఫస్ట్ సాంగ్ విశేషమైన రెస్పాన్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక వీటి తరువాత మాస్ మహారాజా రవితేజ, శ్రీలీల కలయికలో యువ దర్శకుడు భాను భోగవరపు దర్శకత్వంలో రూపొందుతున్న మాస్ జాతర మూవీ రిలీజ్ కానుంది.
వీటితో పాటు ఆగష్టు లో తేజ సజ్జ (Teja Sajja) హీరోగా కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ మూవీ మిరాయ్ (Mirai) కూడా రిలీజ్ కానుంది. దీని నుండి ఫస్ట్ సాంగ్ ఇటీవల రిలీజ్ చేయగా బాగా రెస్పాన్స్ లభించింది. ఇక ఆగష్టు 14న ఏకంగా రెండు బడా సినిమాలు ఆడియన్స్ ముందుకి వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి.
ఫ్యాన్స్ రివ్యూస్ మరియు రేటింగ్స్
అవి ఎన్టీఆర్ (NT Ramaro Jr), హృతిక్ రోషన్ (Hrithik Roshan) ల వార్ 2 (War 2), రజినీకాంత్ (Rajinikanth) కూలీ (Coolie). వీటిలో వార్ 2 మూవీని అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తుండగా కూలీ మూవీని లోకేష్ కనకరాజ్ (Lokesh Kanagaraj) తీస్తున్నారు. వీటిలో వార్ 2 యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతుండగా యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ దీనిని గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తోంది. కియారా అద్వానీ (Kiara Advani) ఇందులో హీరోయిన్ గా నటిస్తున్నారు.
ఇటీవల రిలీజ్ అయిన వార్ 2 టీజర్ సూపర్ రెస్పాన్స్ అందుకుంది. ఇక కూలీ నుండి ఇటీవల రిలీజ్ అయిన గ్లింప్స్ టీజర్ తో పాటు ఫస్ట్ సాంగ్ కూడా బాగా రెస్పాన్స్ అందుకున్నాయి. అమీర్ ఖాన్ (Aamir Khan), నాగార్జున (Nagarjuna), ఉపేంద్ర ఇందులో కీలక పాత్రలు చేస్తున్నారు.
ఇక ఈ సినిమాల తర్వాత బాలకృష్ణ బోయపాటిల అఖండ 2 (Akhanda 2), పవన్ కళ్యాణ్, సుజీత్ ల ఓజి (They Call Him OG), ప్రభాస్ (Prabhas), మారుతీ ల ది రాజా సాబ్ (The Rajasaab) కూడా రిలీజ్ అవ్వనున్నాయి. కాగా వీటిలో ఓజి, అఖండ 2 సెప్టెంబర్ 25న అలానే ది రాజాసాబ్ అయితే రిలీజ్ డేట్ అనౌన్స్ కావాల్సి ఉంది. మరి ఇటువంటి లేటెస్ట్ టాలీవుడ్ మూవీ అప్ డేట్స్ కోసం ఎప్పటికప్పుడు మా Telugu Movie Media సైట్ చెక్ చేస్తూ మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి.
What's Your Reaction?






