Prabhas Heroine Imanvi Esmail Responds to Rumors About Her

Actress Imanvi Esmail gives a strong response to rumors about her being cast opposite Prabhas. Check out what she said officially.

Prabhas Heroine Imanvi Esmail Responds to Rumors About Her

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రస్తుతం మొత్తం రెండు సినెమాలు సెట్స్ మీద ఉన్నాయి. అందులో ఒకటి మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న ది రాజా సాబ్ కాగా మరొకటి సీతారామం దర్శకుడు హను రాఘవపూడి తీస్తున్న మూవీ. కాగా ఈ లవ్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీకి ఫౌజీ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. 

రెండవ ప్రపంచ యుద్ద నేపథ్యంలో గ్రాండ్ గా భారీ స్థాయిలో హై టెక్నీకల్ వాల్యూస్ తో రూపొందుతున్న ఈ మూవీ పై ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. ముఖ్యంగా ఈ మూవీలో ప్రభాస్ ఒక సోల్జర్ గా కనిపించనున్నట్లు టాక్. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు దీనిని గ్రాండ్ లెవెల్లో భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ఇప్పటికే కొంతమేర షూటింగ్ జరుపుకుంది. 

ప్రభాస్ హీరోయిన్ ఇమాన్వి ఎస్మైల్… గాసిప్స్ పై ఆమె స్పందన ఏంటీ?

ఇందులో ప్రభాస్ కి జోడీగా నూతన నటి ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తోంది. అయితే విషయం ఏమిటంటే ఇటీవల కాశ్మీర్ లో భారతీయుల పై పాక్ జరిపిన కాల్పుల నేపథ్యంలో మన దేశవాసులు అందరూ కూడా పాకిస్తాన్ పై ఎంతో ఆగ్రహంగా ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడి సినీ పరిశ్రమలో పాక్ నటుల్ని తీసుకోవద్దని వారు కోరుతున్నారు. 

అయితే ఫౌజీ లో నటిస్తున్న ఇమాన్వి పాకిస్తానీ నటి అని, ఆమె తండ్రి మాజీ పాకిస్థానీ మిలిటరీ మేజర్ అని, అటువంటి వాని కుమార్తెని ప్రభాస్ మూవీ నుండి తొలగించాలని రెండు రోజులుగా పలువురు భారతీయ ప్రజలు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఇమాన్వి పై విమర్శలు ఎక్కుపెట్టారు. దానితో తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా స్పందించారు ఇమాన్వి. 

ఆడియన్స్ లో ఉత్కంఠ రేపిన ఈ వార్తపై ఇమాన్వి ఏమంటోంది?

తనకు భారత దేశం, ఇక్కడి సంప్రదాయాలు, సంస్కృతాలు అంటే ఎంతో ఇష్టం అని అన్నారు. తాను ఒక ఇండో అమెరికన్ ని అని, తన తల్లితండ్రులు అమెరికాలో స్థిరపడ్డాని, తాను కూడా అక్కడే పుట్టి పెరిగినట్లు ఆమె తెలిపారు. 

ముఖ్యంగా కొందరు కావాలనే తనపై పాకిస్థానీ అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని, వాస్తవానికి తనకు తన కుటుంబానికి ఆ దేశంతో సంబంధం లేదని అన్నారు. అలానే ఇటీవల కొన్నేళ్లు గా డ్యాన్స్, నటనలో మంచి ప్రావిణ్యం సంపాదించిన తనకు పలు సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చాయని అన్నారు. 

ప్రభాస్ మూవీ గురించి ఇమాన్వి ఏమి చెప్పుకొచ్చారు

ఆ విధంగానే తాజాగా ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి తీస్తున్న మూవీలో మెయిన్ హీరోయిన్ గా అవకాశం వచ్చిందని, దయచేసి మీడియా వారు కూడా పూర్తి నిజా నిజాలు తెలుసుకోకుండా తన పై విమర్శలు చేయడం తగదని అన్నారు. అలానే తాను కూడా కాశ్మీర్ లో పాక్ జరిపిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని, ఆ కాల్పుల్లో మృతి చెందిన పలువురికి వారి కుటుంబాలకు తన తరపున ప్రత్యేకంగా సానుభూతిని తెల్పుతున్నానని తన పోస్ట్ ద్వారా తెలిపారు ఇమాన్వి.  

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow