Telugu Movie News Today: Latest Updates on Upcoming Films & Celebrities

Telugu Movie News Today సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం SSMB29 మూవీ చేస్తున్నారు. ఈ పాన్ వరల్డ్ మూవీని ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తుండగా శ్రీ దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు

Telugu Movie News Today: Latest Updates on Upcoming Films & Celebrities

Mahesh Babu (SSMB 29) :-

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం SSMB29 మూవీ చేస్తున్నారు. ఈ పాన్ వరల్డ్ మూవీని ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తుండగా శ్రీ దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఒక కీలక పాత్ర చేస్తుండగా మలయాళ నటుడు దర్శకుడైన పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఒక ముఖ్య పాత్ర చేస్తున్నట్లు టాక్. కాగా ఈ మూవీ యొక్క ఫస్ట్ షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్ లో గల అల్యూమినియం ఫ్యాక్టరీలో గోప్యంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. 

Telugu Movie News Today – Fresh Updates from Tollywood

Pawan Kalyan (OG, Hari Hara Veera Mallu, Ustaad Bhagat Singh) :-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మూడు సినిమాలతో కెరీర్ పరంగా బిజీ బిజీగా కొనసాగుతున్నారు. ఓవైపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్న పవన్ మరోవైపు తన సినిమాల యొక్క షూటింగ్స్ కి కూడా మధ్యలో టైం కేటాయిస్తున్నారు. ఆయన చేస్తున్న మూడు సినిమాల్లో మార్చి 28న హరి హర వీర మల్లు ముందుగా రిలీజ్ కానుండగా అనంతరం ఓజి, ఆపైన ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల కానున్నాయి. 

Prabhas (Hanu RaghavaPudi Movie, TheRaja Saab, Spirit) :-

ప్రస్తుతం పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ మొత్తం రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. వాటిలో సీతారామం దర్శకుడు హను రాఘవపూడితో ఒక మూవీ అలానే మారుతీ తో మరొక మూవీ చేస్తున్నారు. కాగా హను తీస్తున్న మూవీ రెండవ ప్రపంచ యుద్ధ నేపథ్యంలో సాగనుండగా మారుతీ తీస్తున్న ది రాజా సాబ్ మూవీ హర్రర్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. వీటిలో ది రాజా సాబ్ మూవీ ఏప్రిల్ 10న అలానే హను మూవీ ఈ ఏడాది చివర్లో రిలీజ్ అయ్యే అవకాశం కనపడుతోంది. అతి త్వరలో సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ మూవీ కూడా మొదలెట్టనున్నారు ప్రభాస్. 

Upcoming Telugu Movie Releases & Latest Announcements

N. T. Rama Rao Jr. (War 2, Ntr Neel) :-

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నారు. వాటిలో బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ తో కలిసి తొలిసారిగా చేస్తున్న బాలీవుడ్ మూవీ వార్ 2 ఆల్మోస్ట్ చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. మరోవైపు ఇటీవల కెజిఎఫ్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఒక భారీ పాన్ ఇండియన్ మాస్ యాక్షన్ మూవీ మొదలెట్టారు ఎన్టీఆర్. వీటిలో వార్ 2 ఈ ఏడాది ఆగష్టు 15న అలానే నీల్ మూవీ 2026 జనవరి 10న విడుదల కానున్నాయి. 

Allu Arjun (AA 22, Atlee Movie, Sandeep Reddy Vanga Movie) :-

ఇటీవల పుష్ప 2 మూవీతో అతి పెద్ద పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అతి త్వరలో త్రివిక్రమ్ తో తన కెరీర్ 22వ మూవీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీనిని గీతా ఆర్ట్స్, హారికా హాసిని క్రియేషన్స్ సంస్థలు నిర్మించనున్నాయి. దీని తరువాత సన్ పిక్చర్స్ బ్యానర్ పై యువ దర్శకుడు అట్లీతో మూవీ చేయనున్నారు. ఆపైన ఆనిమల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో కూడా ఒక మూవీ చేయనున్నారు అల్లు అర్జున్. వీటిలో ముందుగా త్రివిక్రమ్ మూవీ, అనంతరం అట్లీ మూవీ, చివరిగా సందీప్ మూవీ రిలీజ్ కానున్నాయి. 

Tollywood Celebrity News – Gossip, Interviews & More

Ram Charan (RC 16, RC 17) :-

ఇటీవల సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన గేమ్ ఛేంజర్ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం యువ దర్శకుడు బుచ్చిబాబు సన తో తన కెరీర్ 16వ మూవీ చేస్తున్నారు. ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. అనంతరం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తో ఒక మూవీ చేయనున్నారు చరణ్. ఈ రెండు మూవీస్ పై ఆయన ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. కాగా వాటిలో ముందుగా RC 16 మూవీ, ఆ తరువాత RC 17 మూవీ రిలీజ్ కానున్నాయి. 

Nani (Hit 3, The Paradise) :-

ఇటీవల వివేక్ ఆత్రేయ తీసిన సరిపోదా శనివారం మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి పెద్ద విజయం అందుకున్న నాచురల్ స్టార్ నాని, ప్రస్తుతం దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో ఒక మూవీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ది ప్యారడైజ్ అనే టైటిల్ తో రూపొందనున్న ఈ మూవీ యొక్క అనౌన్స్ మెంట్ టీజర్ త్వరలో రానుంది. మరోవైపు హిట్ 3 మూవీ షూట్ లో కూడా పాల్గొంటున్నారు నాని. ఈ మూవీలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. వీటిలో ముందుగా హిట్ 3, అనంతరం ది ప్యారడైజ్ రిలీజ్ కానున్నాయి. 

Box Office Collection Updates – Latest Telugu Movie Earnings

Vijay Deverakonda (Kingdom, Ravi Kiran Kola Movie, Rahul Sankrityan Movie) :-

యువ నటుడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఇటీవల ది ఫ్యామిలీ మ్యాన్ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరితో ఆయన చేస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ కింగ్‌డ‌మ్. దీని అనంతరం యువ దర్శకులు రవికిరణ్ కోలా, అలానే రాహుల్ సంకృత్యాన్ లతో కూడా మూవీస్ చేసేందుకు సిద్ధమయ్యారు విజయ్. అయితే వీటిలో ముందుగా కింగ్‌డ‌మ్ మూవీ మే 30న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది. ఆ తరువాత రవికిరణ్ మూవీ, ఆపై రాహుల్ మూవీ రిలీజ్ కానున్నాయి. 

OTT Releases & Digital Streaming Updates for Telugu Movies

Raviteja (Mass Jathara) :-

ఇటీవల మాస్ కమర్షియల్ సినిమాల దర్శకుడు హరీష్ శంకర్ తో చేసిన మిస్టర్ బచ్చన్ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చిన మాస్ మహారాజా రవితేజ, ప్రస్తుతం యువ దర్శకుడు భాను భోగవరపుతో మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ మాస్ జాతర మూవీ చేస్తున్నారు. ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా త్వరలో ఈమూవీని ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు. దీని అనంతరం మరొక రెండు మూవీస్ చేసేందుకు సిద్ధమవుతున్నారు మాస్ రాజా. వాటికి సంబందించిన పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా వెల్లడి కానున్నాయి.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow