Akhanda 2 Follows Vishwambhara & The Rajasaab Path

Balakrishna's Akhanda 2 set to follow the epic path of Chiranjeevi’s Vishwambhara and Prabhas’ The Rajasaab

Akhanda 2 Follows Vishwambhara & The Rajasaab Path

ప్రస్తుతం మన తెలుగు (Telugu Heroes) హీరోలు అందరూ కూడా రీజినల్ ని మించేలా పాన్ ఇండియన్ మూవీస్ చేయడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చేస్తున్న మూడు సినిమాలు కూడా అదే కోవకి చెందగా మరోవైపు బాలకృష్ణ కూడా అఖండ వంటి పాన్ ఇండియన్ మూవీ చేస్తున్నారు. 

అటు ప్రభాస్, ఇటు సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), రామ్ చరణ్ (Ram Charan), అల్లు అర్జున్ (Allu Arjun), జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కూడా ఈ తరహా సినిమాలని ఎక్కువగా చేస్తున్నారు. అయితే వీటిలో ప్రస్తుతం ప్రభాస్ (Prabhas) చేస్తున్న సినిమాల్లో పాన్ ఇండియన్ హర్రర్ యాక్షన్ డ్రామా మూవీ ది రాజాసాబ్ (The Rajasaab). ఈ మూవీని మారుతీ తెరకెక్కిస్తుండగా మాళవిక మోహనన్ (Malavika Mohanan), నిధి అగర్వాల్ (Nidhhi Agerwal), రిద్ది కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. 

అఖండ 2 – విశ్వంభర, ది రాజాసాబ్ దారి పట్టిందా?

ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ది రాజాసాబ్ మూవీ యొక్క ఫస్ట్ లుక్ టీజర్ జూన్ 16న విడుదల కానుంది. వాస్తవానికి ఏప్రిల్ లో రిలీజ్ కావాల్సిన ఈ మూవీ జులై కి వాయిదా పడ్డట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే తమ మూవీని డిసెంబర్ 5న గ్రాండ్ గా అత్యధిక థియేటర్స్ లో పలు భాషల ఆడియన్సు ముందుకి తీసుకురానున్నట్లు ఆ మూవీ యొక్క మేకర్స్ ప్రకటించారు. 

అయితే అందుకు ప్రధాన కారణం ది రాజాసాబ్ మూవీ యొక్క విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ విషయమై టీమ్ మరింత గట్టిగా శ్రద్ధ తీసుకుంటోందని, అందుకే మూవీ రిలీజ్ ఆలస్యం అయిందని సమాచారం. మరోవైపు హీరో ప్రభాస్ కూడా ది రాజాసాబ్ మూవీ యొక్క అవుట్పుట్ పై బాగా దృష్టి పెట్టారట. ఇక మరోవైపు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్ మూవీ విశ్వంభర (Vishwambhara)

ఈ మూవీని యువి క్రియేషన్స్ సంస్థ గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తుండగా త్రిష (Trisha Krishnan) హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రారంభం నాటి నుండి అందరిలో మంచి అంచనాలు కలిగిన విశ్వంభర మూవీ ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీని మాస్ యాక్షన్ తో పాటు కమర్షియల్ హంగులు కూడా యాడ్ చేసి దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్నారట. 

బాలకృష్ణ నెక్ట్స్ మూవీపై భారీ అంచనాలు

ఇటీవల ఈ మూవీ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ గ్లింప్స్ టీజర్ అందరినీ ఆకట్టుకుని మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. అయితే అందులోని విజువల్ ఎఫెక్ట్స్ పై కొందరు సోషల్ మీడియాలో విమర్శలు చేయడంతో సినిమాకి సంబంధించి పూర్తి విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్, సిజి పై టీమ్ మొత్తం ఎంతో బాగా శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తోంది. 

వాస్తవానికి ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కావాల్సిన విశ్వంభర మూవీ ఏప్రిల్ లో రిలీజ్ అవుతుందని అందరూ భావించారు. కాగా ఇప్పటికీ కూడా ఈ మూవీ యొక్క రిలీజ్ డేట్ అనౌన్స్ కాలేదు. అందుకే రిలీజ్ డేట్ ఆలస్యం అవుతోందని తెలుస్తోంది. కాగా అందుతున్న టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ మూవీ ఈ ఏడాదే ఆడియన్స్ ముందుకి రానున్నట్లు టాక్. 

అయితే విషయం ఏమిటంటే, ప్రస్తుతం ఇదే బాటలో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) భారీ పాన్ ఇండియన్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ అఖండ 2 (Akhanda 2) కూడా వాయిదా పడుతుందనేది లేటెస్ట్ టాలీవుడ్ బజ్. తాజాగా బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన అఖండ 2 టీజర్ అందరినీ ఎంతో ఆకట్టుకుని సూపర్ గా రెస్పాన్స్ అందుకుంది. 

అందులో బాలకృష్ణ అఘోరా లుక్స్, డైలాగ్స్, మాస్ సీన్స్ బాగున్నాయి. అయితే థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి మిశ్రమ స్పందన రాగా విజువల్ ఎఫెక్ట్స్ పై కూడా కొంత మిశ్రమ స్పందన వచ్చింది. అందుకే సెప్టెంబర్ 25న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ మరికొన్నాళ్లు వాయిదా పడుతుందని కొందరు మీడియా మాధ్యమాల్లో కథనాలు ప్రచారం చేస్తున్నారు. 

చిరంజీవి, ప్రభాస్ సినిమాల బాటలో బాలకృష్ణ అఖండ

ఇక అదే డేట్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ తీస్తున్న ఓజి (OG) (They Call Him OG) మూవీ కూడా సెప్టెంబర్ 25న రిలీజ్ కానుంది. కాగా రెండు సినిమాలు పక్కాగా అదే రోజున వస్తాయి అని కొందరు అంటుంటే మరికొందరేమో ఫైనల్ గా ఒకటి ఆ టైం కి రిలీజ్ నుండి తప్పుకోవడం ఖాయం అంటున్నారు. 

అయితే అఖండ 2 టీమ్ తమ రిలీజ్ డేట్ ని ఎప్పుడో అనౌన్స్ చేసినప్పటికీ మూవీకి సంబంధించి టీమ్ విజువల్ ఎఫెక్ట్స్ పై మరింతగా దృష్టి పెట్టనున్నారని, అందుకే అది వాయిదా పడుతుందనేది ఇంకొందరి వాదన. మొత్తంగా అయితే సెప్టెంబర్ 25న రిలీజ్ కి రెడీ అవుతున్న అఖండ 2, ఓజి తో పాటు డిసెంబర్ 5న రిలీజ్ కానున్న ప్రభాస్ ది రాజాసాబ్ మూవీ మూడు కూడా పెద్ద విజయం అందుకోవాలని, ఇటువంటి మరిన్ని లేటెస్ట్ తెలుగు మూవీ న్యూస్ అప్ డేట్స్ కోసం మా తెలుగు మూవీ మీడియా వెబ్ సైట్ చూస్తూ ఉండండని కోరుకుంటున్నాము. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow