Pawan Kalyan OG Trailer Review l OG Trailer Review l OG Trailer Reaction
Pawan Kalyan OG Trailer Review & Reaction – Powerstar Pawan Kalyan’s much-awaited OG trailer complete analysis, highlights, and audience reaction in Telugu

టాలీవుడ్ స్టార్ యాక్టర్ పవర్ స్టార్ Pawan Kalyan హీరోగా ఇటీవల క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ కలిసి తెరకెక్కించిన పాన్ ఇండియన్ హిస్టారికల్ యాక్షన్ పాన్ ఇండైన మూవీ Hari Hara Veera Mallu. ఈ మూవీలో Nidhhi Agerwal హీరోయిన్ గా నటించగా మెగాసూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం నిర్మించగా ఎం ఎం కీరవాణి సంగీతం సమకూర్చారు. అయితే ఇటీవల మంచి అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ గా నిలిచింది.
పవన్ కళ్యాణ్ యాక్టింగ్, సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వంటివి బాగున్నప్పటికీ కథ, కథనాల్లో బలం లేకపోవడంతో పాటు నాశిరకమైన విజువల్ ఎఫెక్ట్స్ వంటివి ఈ మూవీ ఎంతో పెద్ద ఫ్లాప్ కావడానికి కారణంగా చెప్పవచ్చు. అయితే ఆ మూవీ అనంతరం సెప్టెంబర్ 25న భారీ మాస్ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా మూవీ OG ద్వారా ఆడియన్సు ముందుకి రానున్నారు పవర్ స్టార్.
దీనితో పాటు మరోవైపు Gabbar Singh దర్శకుడు హరీష్ శంకర్ తో కలిసి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ Ustaad Bhagat Singh మూవీ కూడా చేస్తున్నారు పవన్ కళ్యాణ్. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ లో ఇటీవల తన పార్ట్ షూటింగ్ పూర్తి చేసారు పవన్. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ గ్రాండ్ గా నిర్మిస్తుండగా యువ అందాల భామలు Raashi Khanna, Sreeleela హీరోయిన్స్ గా నటిస్తుండగా దీనిని వచ్చే ఏడాది ప్రథమార్ధంలో రిలీజ్ చేసే అవకాశం ఉంది.
పవన్ కళ్యాణ్ ఓజి ట్రైలర్ రిలీజ్
ఓజి గురించి మాట్లాడుకుంటే, ఈ మూవీ యొక్క షూటింగ్ రెండేళ్ల క్రితం ప్రారంభం కాగా దీనిని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య అత్యంత భారీ వ్యయంతో నిర్మించారు. పవన్ కళ్యాణ్ కు పెద్ద అభిమాని అయిన సుజీత్ తీసిన ఈ మూవీలో Priyanka Mohan హీరోయిన్ గా నటించగా ఇతర ముఖ్య పాత్రల్లో ప్రకాష్ రాజ్, శ్రియ రెడ్డి, Emraan Hashmi, అర్జున్ దాస్, హరీష్ ఉత్తమన్ నటించారు. రల్ స్టార్ ఎస్ థమన్ ఈ మూవీకి సంగీతం సమకూర్చారు.
ఇక They Call Him OG మూవీ నుండి ఏడాదిన్నర క్రితం మొదటగా రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ Hungry Cheetah Teaser ఎంతో ఆకట్టుకుని మూవీ అందరిలో బాగా అంచనాలు ఏర్పరిచింది. ఆ విధంగా ఫస్ట్ గ్లింప్స్ తోనే అందరిలో బాగా రెస్పాన్స్ సొంతం చేసుకున్న ఈ మూవీ యొక్క ప్రతి అంశం విషయమై దర్శకుడు సుజీత్ ఎంతో శ్రద్ధ పెట్టి ఓజిని తెరకెక్కించినట్లు టీమ్ చెప్తోంది అక్కడి నుండి రిలీజ్ అయిన పోస్టర్స్ తో పాటు ఇటీవల రిలీజ్ అయిన సాంగ్స్ కూడా ఎంతో మంచి స్పందన అందుకున్నాయి.
ముఖ్యంగా మొదట రిలీజ్ అయిన Firestorm OG Song అలరించే ట్యూన్, లిరికల్ విజువల్స్ తో పవన్ ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుంది. ఆ తరువాత వచ్చిన OG Suvvi Suvvi సాంగ్ మెలోడియస్ గా ఆకట్టుకుంది. అలానే మూడవ సాంగ్ అయిన OG Guns and Roses సాంగ్ కూడా అలరించింది. వీటితో పాటు విలన్ అయిన OMI Teaser కూడా ఆకట్టుకోవడంతో ఒక్కసారిగా ఓజి మూవీ పై అందరిలో ఇప్పటివరకు ఉన్న అంచనాలు మరింతగా పెరిగాయి అని చెప్పాలి.
Pawan Kalyan OG Trailer Review
అయితే అసలు విషయం ఏమిటంటే OG Trailer ని సెప్టెంబర్ 21న ఉదయం 10 గం. 08. ని. లకు రిలీజ్ చేయనున్నట్లు ఇటీవల ప్రకటించిన నిర్మాతలు దానిని పోస్ట్ పోన్ చేసారు. ఇక నేడు జరిగిన OG Pre Release Event లో ఓజి రా కట్ ట్రైలర్ ని విడుదల చేసారు. వాస్తవానికి OG Trailer యొక్క DI వర్క్ ఇంకా పూర్తి కాలేదని దర్శకుడు సుజీత్, స్నాగీత దర్శకుడు థమన్ చెప్పారు. అయినప్పటికీ కూడా ఈవెంట్ లో తన ఫ్యాన్స్ యొక్క ఆవేదన గుర్తించిన పవర్ స్టార్ వెంటనే ట్రైలర్ ప్లే చేయించారు.
అయితే సౌండ్ సరిగ్గా లేనప్పటికీ ఓవరాల్ గా ఓజి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్లే చేయబడ్డ ట్రైలర్ అందరినీ ఎంతో ఆకట్టుకుంది. దాని యొక్క హెచ్ డ్ వర్షన్ ని కొందరు కొద్దిసేపటి క్రితం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్ట్ చేయగా అఫీషియల్ ట్రైలర్ కంటే ముందే ఈవెంట్ లో ప్రదర్శించిన ట్రైలర్ బయటకు వచ్చింది. సౌండ్ లేనప్పటికీ ట్రైలర్ లో ఒక్కో సీన్ ఒక్కో అద్భుతంగా ఉంది.
ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ ఫుల్ లుక్స్, స్టైల్ స్వాగ్, కాటానా పట్టుకుని శత్రువులని నరికే సీన్స్ పవర్ఫుల్ గా ఉన్నాయి. ఇక ట్రైలర్ లో శ్రియ రెడ్డి, ప్రకాష్ రాజ్ తో పాటు ముఖ్యంగా ఇమ్రాన్ హష్మీ లుక్స్ కూడా అదిరిపోయాయి. అలానే యాక్షన్ సీన్స్ తో పాటు ముఖ్యంగా ఓజి ట్రైలర్ లో విజువల్స్ అయితే మరింత అదిరిపోయాయి.
పవన్ కళ్యాణ్ ఓజి ట్రైలర్ రివ్యూ
అయితే ట్రైలర్ ఒరిజినల్ కట్ ని చూసిన టీమ్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ట్రైలర్ కి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సూపర్ గా ఉందని అన్నారు. మొత్తంగా దీనిని బట్టి చూస్తే OG Official Trailer రిలీజ్ కి ముందే ఈవెంట్ లో రిలీజ్ చేసిన ట్రైలర్ అందరినీ విశేషంగా ఆకట్టుకుని మూవీ పై ఒక్కసారిగా ఆకాశమంతటి రేంజ్ హైప్ ని ఏర్పరిచింది.
అందుతున్న లేటెస్ట్ Tollywood బజ్ ప్రకారం ఈ అర్ధరాత్రి లేదా రేపు ఉదయం ఓజి ట్రైలర్ ని టీమ్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. అయితే కొన్ని టెక్నీకల్ సమస్యల వలనే ఇంకా ట్రైలర్ అందించలేకపోయాం అని, తప్పకుండా ట్రైలర్ తో పాటు మరొక మూడు రోజుల్లో రిలీజ్ కానున్న ఓజి మూవీ కూడా బ్లాక్ బస్టర్ పక్కా అని నిర్మాత దానయ్య చెప్పారు. ఇక ఈ OG Movie కోసం పవన్ ఫ్యాన్స్ అయితే మరింత ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.
హరి హర వీర మల్లుతో ఎంతో నిరాశపడ్డ ఫ్యాన్స్ కి ఈ మూవీ ఫుల్ మీల్స్ ని అందించడం ఖాయం అని టీమ్ అభిప్రాయపడుతోంది. ముఖ్యంగా తన అభిమాని అయిన సుజీత్ ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించారని తాజాగా జరిగిన ఓజి ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ చెప్పారు. తన టీమ్ ఎంతో కష్టపడ్డారని, తప్పకుండా అందరి అంచనాలు అందుకుని మూవీ పెద్ద సక్సెస్ అవుతుందనని ఆయన అన్నారు.
తన అభిమాన కథానాయకుడి సినిమాకి వెళ్లి ఎందరో ఫ్యాన్స్ తో కలిసి సెలబ్రేషన్స్ ఎంజాయ్ చేసిన తాను, నేడు ఏకంగా అయనతో వర్క్ చేయడం నిజంగా లైఫ్ లో ఎప్పటికీ మర్చిపోలేని అద్భుతం అని, తామందరం ఎంతో కష్టపడ్డ OG Movie Release అనంతరం అందరినీ ఆకట్టుకుంటుందని ఆశాభవం వ్యక్తం చేసారు. సెట్స్ ఎప్పుడూ అందరితో ఎంతో సరదాగా ఉండే పవన్ కళ్యాణ్ గారితో వర్క్ చేయడం ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకం అని, హీరోగా ఆయన రేంజ్ క్రేజ్ తనకు తెలుసునని, తప్పకుండా ఓజి అందరి అంచనాలు అందుకుంటుందని అన్నారు.
ఇక మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అయితే OG Review గురించి మాటలు చెప్పను అంటూ మీసం మెలేసారు. అయితే ఈ మూవీ యొక్క సాంగ్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం సంగీత దర్శకుడు థమన్ ప్రాణం పెట్టారని, రేపు మూవీ రిలీజ్ అయి పెద్ద విజయం అందుకుందంటే దానిలో కొంతశాతం థమన్ కి కూడా చెందుతుందనని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఇక నిర్మాత దానయ్య ఈ మూవీ కోసం ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ డేట్స్ అడ్జస్ట్ చేసి షూటింగ్ చేసారని, ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా రేపు థియేటర్స్ లో ఓజి అందరికీ విజువల్ ట్రీట్ అందించడం ఖాయం అని కూడా చెప్తున్నారు.
OG Trailer లో మనం క్వాలిటీ చూస్తే అది అర్ధం అవుతుందని, థియేటర్ లో ఫ్యాన్స్ ఎన్నో సీన్స్ ని ఎంజాయ్ చేయడం ఖాయమని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా సినిమాలో పవన్ కళ్యాణ్ ఎంట్రీ సీన్ తోపాటు ఇంటర్వెల్ ఎపిసోడ్ ని ఎంతో పవర్ఫుల్ గా ప్లాన్ చేసిన సుజీత్ సెకండ్ హాఫ్ ని మరింత బాగా తీసారని అంటున్నారు.
ఓజి ట్రైలర్ రివ్యూ & రియాక్షన్
ఇక హీరోయిన్ ప్రియాంక మోహన్ పాత్ర నిడివి పరంగా చిన్నదే అయినప్పటికీ పాత్ర యొక్క పరిధిమేరకు ఆమె తన ఆకట్టుకునే అందంతో పాటు అభినయంతో అలరించరట. ముఖ్యంగా Bollywood నటుడు ఇమ్రాన్ హష్మీ ఇందులో మెయిన్ విలన్ గా ఓమి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసారని, హీరో పవన్ కళ్యాణ్ ని ఢీ కొట్టేలా సమఉజ్జీగా దర్శకుడు సుజీత్ ఆయన పాత్రని రూపొందించారని చెప్తున్నారు.
అలానే ముఖ్యమైన కీలక పాత్రల్లో నటించిన శ్రియ రెడ్డి, ప్రకాష్, అర్జున్ దాస్ ల పాత్రలు కూడా అలరిస్తాయట. సాహు తరువాత దానిని మించేలా విజువల్స్ విషయంలో దర్శకుడు సుజీత్ మరింత శ్రద్ధ పెట్టారట. ఓజి మూవీకి కెమెరా మ్యాన్స్ గా పని చేసిన రవి కె చంద్రన్, మనోజ్ పరమహంస ఇద్దరూ కూడా తమ మార్క్ ఫోటోగ్రఫితో మూవీని అద్భుతంగా చిత్రీకరించినట్లు టాక్.
అలానే పవర్ఫుల్ యాక్షన్ సీన్స్ తో పాటు పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ యాక్టింగ్, పలికే డైలాగ్స్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ కూడా అదిరిపోనున్నట్లు టాక్. మొత్తంగా అందరిలో ఎన్నో భారీ స్థాయి అంచనాలు ఏర్పరిచిన ఓజి మూవీ మరొక మూడు రోజుల్లో ప్రేక్షకాభిమానుల ముందుకి రానుండడంతో ఇప్పటికే వరుస విజయాలతో కళకళలాడుతున్న టాలీవుడ్ కి ఇది మరొక భారీ విజయాన్ని అందించాలని మన Telugu Movie Media టీం తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అడ్వాన్స్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కంగ్రాట్యులేషన్స్ టూ టీం ఓజి
What's Your Reaction?






