Kamal Haasan’s Indian 3: Latest Movie Updates
Get the latest news and updates on Kamal Haasan’s much-awaited film ‘Indian 3’.

కోలీవుడ్ స్టార్ యాక్టర్ లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా ఇటీవల దిగ్గజ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన భారీ యాక్షన్ సీక్వెల్ మూవీ ఇండియన్ 2. ఎన్నో ఏళ్ళ క్రితం ఆడియన్స్ ముందుకి వచ్చి అప్పట్లో దేశవ్యాప్తంగా పలు భాషల్లో పెద్ద విజయం సొంతం చేసుకున్న ఇండియన్ మూవీకి ఆడియన్స్, కమల్ ఫ్యాన్స్ బ్రహ్మరథం పట్టారు.
ఇండియన్ 3 తాజా సమాచారం
కాగా ఎంతో గ్యాప్ అనంతరం దాని నుండి వస్తున్న సీక్వెల్ కావడంతో ఇండియన్ 2 పై అందరిలో తారా స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.ముఖ్యంగా ఈ మూవీలో వృద్ధుడైన సేనాపతి పాత్రలో తమ అభిమాన నటుడు కమల్ ని చూడాలని ఎన్నో ఏళ్ళ నుండి ఆయన ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహంగా ఎదురు చూడసాగారు.
ఇక సిద్దార్ధ, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్ జె సూర్య, బ్రహ్మానందం వంటి వారు కీలక పాత్రల్లో రూపొందిన ఇండియన్ 2 మూవీ షూటింగ్ ప్రారంభం నుండి ఎన్నో సమస్యల నడుమ కొట్టుమిట్టాడింది. అప్పట్లో ఒక భారీ అగ్ని ప్రమాదం జరిగి ఒకరు టీమ్ సభ్యుడు చనిపోవడంతో టీమ్ మొత్తం కూడా తీవ్ర దిగ్బ్రాంతికి లోనైంది. ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్ తో పాటు కొన్ని సమస్యల అనంతరం రెడ్ జెయింట్ ఫిలిమ్స్ సంస్థ కూడా టేకోవర్ చేసింది.
ఇండియన్ 3 కమల్ హాసన్ పాత్ర విశేషాలు
కాగా ఎట్టకేలకు ఇటీవల ఎన్నో అంచనాల నడుమ దేశవ్యాప్తంగా పలు భాషల్లో రిలీజ్ అయిన ఇండియన్ 2 మూవీ ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయం పాలయింది. కమల్ హసన్ యాక్టింగ్ అదిరిపోయినప్పటికీ కథ, కథనాల్లో ఏమాత్రం కొత్తదనం లేకపోవడంతో పాటు చాలా సీన్స్ ఆడియన్స్ లో ఆసక్తిని ఏర్పరచలేకపోయాయి.
దానితో అనేక ఏరియాల్లో ఇండియన్ 2 మూవీ డిజాస్టర్ గా మిగిలి బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు తీసుకొచ్చింది. దానితో ఒకింత ఆలోచనలో పడ్డ హీరో కమల్, దర్శకుడు శంకర్ పార్ట్ తో ఆడియన్స్ నుండి సక్సెస్ సొంతం చేసుకోవాలని ఎంతో జాగ్రత్తగా దానిని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.
పార్ట్ 2 కి సీక్వెల్ వస్తుందని ఇప్పటికే ఆ మూవీ యొక్క క్లైమాక్స్ అనంతరం పార్ట్ 3 యొక్క చిన్న గ్లింప్స్ ని రిలీజ్ చేసారు. అయితే ఆ గ్లింప్స్ కి బాగానే రెస్పాన్స్ లభించింది. కాగా ఈ మూవీని థియేటర్స్ లో కాకుండా డైరెక్ట్ గా ఓటిటిలో రిలీజ్ చేసే ఆలోచనలో ఇండియన్ 3 మూవీ టీమ్ ఉందని ఇటీవల వార్తలు వచ్చాయి.
ఇండియన్ 3 విడుదల తేదీ అంచనాలు
అయితే దర్శకుడు శంకర్ మాత్రం ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా మూవీని ఆకట్టుకునే రీతిన తీసిన మంచి విజయం అందుకునేలా ప్రణాళికలు రచిస్తున్నారట. కాగా ఇటీవల రామ్ చరణ్ తో శంకర్ తీసిన గేమ్ చేంజర్ మూవీ ఫ్లాప్ కావడంతో ఇండియన్ 3 ని ఆయన ఎంతమేర సక్సెస్ఫుల్ గా తెరకెక్కించగలరు అనే ఆలోచన అందరిలో ఉంది.
అయితే గతంలో భారతీయ సినిమా చరిత్రలో ఎన్నో బ్లాక్ బస్టర్స్ కొట్టిన శంకర్ ఈ మూవీతో విజయం అందుకుని ట్రక్ లోకి రావడం ఖాయం అంటోంది టీమ్. కొంత మేర షూటింగ్ జరుపుకున్న ఇండియన్ 3 తదుపరి బ్యాలెన్స్ షూట్ త్వరలో ప్రారంభం కానుంది. ఆపైన మూవీ నుండి ఒక్కొక్కటిగా అఫీషియల్ అప్ డేట్ రానుంది. కాగా స్టార్ నటి కాజల్ అగర్వాల్ ఇందులో కీలక పాత్ర చేయనున్నారు.
What's Your Reaction?






