Gabbar Singh Re-Release Day 1 Collection – Massive Fan Support

Power Star Pawan Kalyan’s Gabbar Singh re-release smashes day 1 records. Full box office report, fan celebrations, and highlights inside

Gabbar Singh Re-Release Day 1 Collection – Massive Fan Support

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా తొలిసారిగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఆయన చేసిన మూవీ గబ్బర్ సింగ్. వాస్తవానికి అంతకముందు కొన్నాళ్లుగా కెరీర్ పరంగా సరైన సక్సెస్ కోసం చూస్తున్న పవర్ స్టార్ కు ఆయన ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ తో కూడిన మూవీగా గబ్బర్ సింగ్ రూపొందింది. 

ఈ మూవీలో శృతి హాసన్ (Shruti Haasan) హీరోయిన్ గా నటించగా బండ్ల గణేష్ (Bandla Ganesh) దీనిని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీలో అభిమన్యు సింగ్ విలన్ గా చేయగా ఇతర కీలక పాత్రల్లో నాగినీడు, సుహాసిని, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, అజయ్ తదితరులు నటించారు. 

గబ్బర్ సింగ్ రీ రిలీజ్ – డే 1 కలెక్షన్ల రికార్డ్

అంతకముందు బాలీవుడ్ లో కండలవీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందిన దబాంగ్ మూవీకి అఫీషియల్ తెలుగు రీమేక్ గా ఇది రూపొందింది. అయితే ఆ మూవీ యొక్క స్టోరీ లైన్ తీసుకుని దానిని తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా అందరినీ ఆకట్టుకునేలా తెరకెక్కించారు దర్శకుడు హరీష్ శంకర్. 

Gabbar Singh re-release response

ఇక గబ్బర్ సింగ్ మూవీ రిలీజ్ అనంతరం అతి పెద్ద బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుని భారీ కలెక్షన్ తో హీరోగా పవర్ స్టార్ స్టామినాని మరొక్కసారి రుజువు చేసింది. ఆయన పెర్ఫార్మన్స్ తో పాటు డైలాగ్స్, సాంగ్స్, ఫైట్స్, యాక్షన్ సీన్స్, హీరోయిన్ శృతి హాసన్ ఆకట్టుకునే అందం, అభినయం దర్శకడు హరీష్ శంకర్ టేకింగ్ వంటివి ఈ మూవీని ఎంతో పెద్ద విజయవంతం చేసాయి. 

పవన్ కళ్యాణ్ అభిమానుల సందడి, థియేటర్ వద్ద ఫెస్ట్

ఆ విధంగా అందరినీ ఎంతో ఆకట్టుకుని భారీ సక్సెస్ సాధించిన గబ్బర్ సింగ్ మూవీని ఇటీవల థియేటర్స్ లో గ్రాండ్ గా రీ రిలీజ్ చేసారు మేకర్స్. కాగా ఈమూవీ రీ రిలీజ్ లో కూడా బాగానే రెస్పాన్స్ సొంతం చేసుకుని మంచి కలెక్షన్ కూడా అందుకుంది. 

ఇక ఈ మూవీ డే 1 అన్ని ఏరియాస్ కలిపి రూ. 7.53 కోట్ల గ్రాస్ ని సొంతం చేసుకుని ఓవరాల్ గా వరల్డ్ వైడ్ క్లోజింగ్ మొత్తం కలిపి రూ. 8. 02 కోట్లు కొల్లగొట్టి ఇటీవల రికార్డు నెలకొల్పింది. అయితే దీని అనంతరం రీ రిలీజ్ అయిన సూపర్ స్టార్ మహేష్ బాబు ఖలేజా మూవీ గబ్బర్ సింగ్ రికార్డ్స్ ని బద్దలుకొట్టి ఓవరాల్ గా రూ . 8. 52 కోట్లు రాబట్టి టాప్ ప్లేస్ లో నిలిచింది. 


గబ్బర్ సింగ్ డే 1 రీ రిలీజ్ కలెక్షన్ డీటెయిల్స్ ఏరియా వైజ్

నైజాం : రూ. 2.82 కోట్లు (ప్రీమియర్స్ రూ. 30 లక్షలు)

సీడెడ్ : రూ. 81 లక్షలు

ఉత్తరాంధ్ర : రూ. 52 లక్షలు

ఈస్ట్ : రూ. 46 లక్షలు

వెస్ట్ : రూ. 39 లక్షలు

గుంటూరు : రూ. 45 లక్షలు

కృష్ణా : రూ. 39 లక్షలు

నెల్లూరు : రూ. 11 లక్షలు

ఏపీ, తెలంగాణ టోటల్ కలెక్షన్స్ : రూ. 5. 95 కోట్ల గ్రాస్

కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా : రూ. 82 లక్షలు

ఓవర్సీస్ : రూ. 76 లక్షలు

టోటల్ వరల్డ్ వైడ్ డే 1 గ్రాస్ కలెక్షన్ : రూ. 7. 53 కోట్లు 

మొదటి రోజు వసూళ్లు – అన్ని ప్రాంతాల్లో డేటా

మొత్తంగా తమ అభిమాన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ మూవీ గబ్బర్ సింగ్ మరొక్కసారి రీ రిలీజ్ లో కూడా ఈ రేంజ్ సూపర్ కలెక్షన్ అందుకోవడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక త్వరలో పవన్ కళ్యాణ్ నటించిన గత సినిమాలైన తొలిప్రేమ, బద్రి రీ రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. మరి అవి ఎంతమేర ఆడియన్స్ ని ఆకట్టుకుని ఏ స్థాయి కలెక్షన్ కొల్లగొడతాయో చూడాలి.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow