Top Telugu Heroines Names List 2025 – Latest Top Heroines
Check out the updated 2025 list of top Telugu heroines from legendary actresses to trending stars. Includes evergreen and new actresses

ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమ భారత దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎంతో గొప్ప పేరు, గుర్తింపుతో కొనసాగుతోంది. ముఖ్యంగా బాహుబలి సిరీస్ సినిమాలు, ఆర్ఆర్ఆర్, సలార్, పుష్ప సిరీస్ సినిమాలు, కల్కి 2898 వంటి సినిమాలు మన ఖ్యాతిని అందరికీ తెలియచేశాయి. ఓవైపు హీరోలతో పాటు పలువురు హీరోయిన్స్ సైతం ఎప్పటికప్పుడు ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటిస్తూ తమ ఆకట్టుకునే అందం, అభినయంతో మెప్పిస్తూ హీరోలతో పాటు తమకంటూ కూడా ప్రత్యేకమైన క్రేజ్ ని అలానే కోట్లాది ప్రేక్షకాభిమానుల యొక్క ప్రేమని చూరగొంటూ కొనసాగుతున్నారు. అయితే ఇప్పటివరకు తెలుగు చిత్ర పరిశ్రమకు ఎందరో హీరోయిన్స్ వచ్చారు వెళ్లారు. ఇక తాజాగా మంచి పేరు, క్రేజ్ తో కొనసాగుతున్న అందాల నటీమణులు ఎవరనేది ఇప్పుడు లిస్ట్ ప్రకారం చూద్దాం.
అనుష్క శెట్టి (Anushka Shetty)
లేడీ సూపర్ స్టార్ గా పేరుగాంచిన అనుష్క శెట్టికి తెలుగు, తమిళ, కన్నడ భాషల ఆడియన్సు లో ఎంతో మంచి క్రేజ్ ఉంది. సూపర్ సినిమా ద్వారా ఆమె తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ తీసిన హర్రర్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ అరుంధతి (Arundhathi) తో హీరోయిన్ గా విశేషమైన క్రేజ్ సొంతం చేసుకుని దూసుకెళ్లారు అనుష్క శెట్టి. ఆ తరువాత ప్రభాస్ సరసన ఎస్ ఎస్ రాజమౌళి తీసిన బాహుబలి సిరీస్ సినిమాలతో జాతీయ స్థాయిలో పేరు అందుకున్నారు అనుక్ష శెట్టి. ఇక ప్రస్తుతం ఆమె మలయాళంలో క సినిమాతో పాటు తెలుగులో క్రిష్ జాగర్లమూడి తీస్తన్న ఘాటీ (Ghaati) మూవీ చేస్తున్నారు. ఇది జులై లో ఆడియన్సు ముందుకి వచ్చే అవకాశం ఉంది.
2025 లో టాప్ తెలుగు హీరోయిన్ల జాబితా
తమన్నా భాటియా (Tamannah Bhatia)
టాలీవుడ్ అందాల నటీమణుల్లో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కూడా ఒకరు. మంచు మనోజ్ హీరోగా రూపొందిన శ్రీ సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత శేఖర్ కమ్ముల తీసిన హ్యాపీ డేస్ (Happy Days) మూవీ ఆమెకు కెరీర్ పరంగా పెద్ద బ్రేక్ అందించింది. అనంతరం నాగ చైతన్యతో 100% లవ్, సిద్దార్థ తో కొంచెం ఇష్టం కొంచెం కష్టం వంటి సినిమాలు హిట్ అయి హీరోయిన్ గా తమన్నాకు బాగా క్రేజ్ తీసుకువచ్చాయి. ఇక అక్కడి నుండి టాలీవుడ్ తో పాటు అటు తమిళ్ టాప్ స్టార్స్ తో కూడా సినిమాలు చేసి ఆకట్టుకున్నారు తమన్నా. ఇక ఇటీవల హిందీలో కూడా వరుస సినిమాలు చేస్తూ అక్కడక్కడా స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో పలు క్రేజీ ప్రాజక్ట్స్ ఉన్నాయి.
కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal)
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తేజ తీసిన లక్ష్మి కళ్యాణం మూవీ ద్వారా తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన కాజల్ ఆ తర్వాత కృష్ణవంశీ తీసిన చందమామ మూవీ విజయం తో మంచి పేరు సొంతం చేసుకున్నారు. అనంతరం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా రాజమౌళి తీసిన మగధీర (Magadheera) భారీ విజయం హీరోయిన్ గా ఆమెకు పెద్ద బ్రేక్ ని అందించింది. అనంతరం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా అనేకమంది స్టార్స్ సరసన నటించి తన ఆకట్టుకునే అందం, అభినయంతో అందరినీ మెప్పించిన కాజల్, అటు హిందీ తో పాటు తమిళ్ లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ వెళ్తున్నారు. ఇటీవల సల్మాన్ ఖాన్ తో సికందర్ మూవీ చేసిన కాజల్, తాజాగా కమల్ హాసన్ (Kamal Haasan) నటిస్తున్న ఇండియన్ 3 (Indian 3) లో నటిస్తున్నారు.
సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu)
ఏమాయ చేసావే సినిమాతో హీరోయిన్ గా తెలుగు సినిమా పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన సమంత రూత్ ప్రభు, ఫస్ట్ మూవీతోనే బెస్ట్ హిట్ కొట్టారు. అనంతరం సూపర్ స్టార్ మహేష్ తో దూకుడు (Dhookudu), రాజమౌళి (SS Rajamouli) తీసిన ఈగ (Eega), ఎన్టీఆర్ (Jr Ntr) హీరోగా రూపొందిన బృందావనం వంటి సినిమాల భారీ విజయాలు హీరోయిన్ గా సమంత ని స్టార్ నటిని చేసాయి. టాలీవుడ్ గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా పేరుగాంచిన సమంత అనంతరం అనేకమంది ఇతర టాలీవుడ్, కోలీవుడ్ స్టార్స్ సరసన నటించి తన ఆకట్టుకునే అందం, అభినయంతో మెప్పించారు. ఇక ఇటీవల శుభం మూవీతో నిర్మాతగా కూడా మారిన సమంత ప్రస్తుతం తదుపరి సినిమాల కోసం సిద్ధమవుతున్నారు. అలానే త్వరలో ఒక హాలీవుడ్ సినిమాలో కూడా ఆమె నటించనున్నారు.
శృతి హాసన్ (Shruti Haasan)
తెలుగు సినిమా పరిశ్రమలోని స్టార్ నటీమణుల్లో శృతి హాసన్ కూడా ఒకరు. తండ్రి కమల్ హాసన్ ప్రమేయం లేకుండా తొలి చిత్రం నుండి ఎంతో కష్టపడి నటిగా తనని తాను నిరూపించుకుంటూ వరుస విజయాలతో మంచి క్రేజ్ తో ప్రస్తుతం దూసుకెళ్తున్నారు శృతి హాసన్. తొలిసారిగా తెలుగులో సిద్దార్థ హీరోగా తెరకెక్కిన అనగనగా ఒక ధీరుడు మూవీ ద్వారా ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత పవన్ కళ్యాణ్ తో ఆమె చేసినా గబ్బర్ సింగ్ (Gabbar Singh) మూవీ పెద్ద విజయం సొంతం చేసుకుని తెలుగులో బాగా పేరు తీసుకువచ్చింది. ఆపైన సూపర్ స్టార్ మహేష్ బాబుతో శృతి హాసన్ చేసిన శ్రీమంతుడు (Srimanthudu) మూవీ పెద్ద ఇండస్ట్రీ హిట్ గా నిలవడం, అందులో తన ఆకట్టుకునే అందం, అభినయంతో మెప్పించిన శృతి హాసన్ అక్కడి నుండి కెరీర్ పరంగా వెనుతిరిగి చూసుకోలేదు. ఆపైన పలువురు తెలుగుతో తమిళ్ స్టార్స్ సరసన కూడా వరుసగా పలు అవకాశాలు కూడా అందుకుని దూసుకెళ్లారు శృతి. అలానే అటు హిందీలో కూడా అక్కడక్కడా పలు సినిమాలు చేశారు శృతి హాసన్. అలానే 2023 లో ది ఐ (The Eye) అనే ఇంగ్లీష్ మూవీలో కూడా నటించితిన్ శృతి ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ తీస్తున్న కూలీ (Coolie), విజయ్ హీరోగా తెరకెక్కుతోన్న జన నాయాగన్ (Jana Nayagan), విజయ్ సేతుపతి ట్రైన్ (Train) సినిమాలు చేస్తున్నారు.
రష్మిక మందన్న (Rashmika Mandanna)
నేషనల్ క్రష్ రష్మిక మందన్న పేరు ప్రస్తుతం ఎవరికీ పెద్దగా పరిచయం అవసరం లేదు. ఛలో సినిమా ద్వారా నాగశౌర్య సరసన హీరోయిన్ గా తెలుగుకి ఎంట్రీ ఇచ్చిన ఆమె, అనంతరం నానితో దేవదాసు, నితిన్ తో భీష్మ, సూపర్ స్టార్ మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు (Sarileru Neekevvaru) వంటి సక్సెస్ఫుల్ సినిమాల్లో నటించి ప్రేక్షకాభిమానుల నుండి మంచి పేరు సొంతం చేసుకున్నారు. అనంతరం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ తీసిన పుష్ప (Pushpa The Rise) (Pushpa The Rule) సిరీస్ లోని రెండు సినిమాలతో పాటు బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) తీసిన ఆనిమల్ (Animal) సినిమాలతో భారతీయ సినీ చరిత్రలో అత్యద్భుత విజయాలు సొంతం చేసుకున్నారు. ఇక అటు తమిళ్ లో విజయ్ తో వరిసు (Varisu) సినిమా చేసి అక్కడి ఆడియన్స్ ని కూడా అలరించారు. ఇక ప్రస్తుతం రష్మిక మందన్న చేతిలో పలు భాషల భారీ ప్రాజక్ట్స్ ఉన్నాయి.
కీర్తి సురేష్ (Keerthy Suresh)
కిషోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా కొన్నేళ్ల క్రితం తెరకెక్కిన నేను శైలజ (Nenu Sailaja) మూవీ ద్వారా తెలుగు చిత్ర సీమకు ఎంట్రీ ఇచ్చారు కీర్తి సురేష్. ఆ మూవీ మంచి విజయం అందుకుంది. అనంతరం నానితో నేను లోకల్, పవన్ కళ్యాణ్ తో అజ్ఞాతవాసి సినిమాలు చేసి ఆకట్టుకున్నారు కీర్తి. ఆ తరువాత అటు తమిళ్ లో కూడా పలు అవకాశాలు అందుకున్న కీర్తి తెలుగులో సూపర్ స్టార్ మహేష్ తో సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata), చిరంజీవి (Chiranjeevi) చెల్లెలిగా భోళా శంకర్ వంటి సినిమాలు చేసి అలరించారు. ఆపైన తమిళ్ లో విజయ్ (Vijay) తో సర్కార్, విశాల్ తో పందెం కోడి 2, విక్రమ్ తో సామీ 2 సినిమాలు చేసారు. ఇక ఇటీవల వరుణ్ ధావన్ హీరోగా తెరకెక్కిన బేబీ జాన్ (Baby John) సినిమా ద్వారా ఆమె బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చారు. ప్రస్తుతం హిందీ, తెలుగు, తమిళ్ లు పలు ప్రాజక్ట్స్ తో కొనసాగుతున్నారు కీర్తి సురేష్. కొన్నాళ్ల క్రితం తన చిన్నతి స్నేహితుడు ఆంటోనీ తట్టిల్ ని ఆమె వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
పురాతన కాలం నుండి ఆధునిక తారల వరకూ
సాయి పల్లవి (Sai Pallavi)
తొలిసారిగా వరుణ్ తేజ్ హీరోగా శేఖర్ కమ్ముల తీసిన ఫిదా (Fida) సినిమా ద్వారా తెలుగు తెరకు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకున్నారు సాయి పల్లవి. ఆ సినిమాలో తన ఆకట్టుకునే అందం, అభినయం, డ్యాన్స్ తో తెలుగు ఆడియన్సు ని ఫిదా చేసారు సాయి పల్లవి. ఇక ఆ తరువాత నాని తో ఎం సి ఏ, నాగ చైతన్య (Naga Chaitanya) తో లవ్ స్టోరీ (Love Story), అలానే మరొక్కసారి నాని (Nani) తోనే శ్యామ సింగరాయ్ వంటి సినిమాలు చేసి వాటితో మంచి విజయాలు అందుకున్నారు సాయి పల్లవి. మొదటి నుండి సహజ నటనకు డ్యాన్స్ కు పెట్టింది పేరైన సాయి పల్లవి తమిళ్ లో కూడా పలు సినిమాలు చేసారు. ముఖ్యంగా ఆమె ప్రధాన పాత్ర చేసిన గార్గి అక్కడ ఆమెకు మరింత పేరు తీసుకువచ్చింది. అలానే ఇటీవల తమిళ్ లో శివ కార్తికేయన్ తో చేసిన అమరన్ (Amaran), నాగ చైతన్యతో తెలుగులో చేసిన తండేల్ (Thandel) సినిమాల భారీ విజయాలు హీరోయిన్ గా సాయి పల్లవి క్రేజ్ ని విపరీతంగా పెంచేసాయి. ప్రస్తుతం బాలీవుడ్ లో రణబీర్ కపూర్ (Ranbir Kapoor) రాముడిగా ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న రామాయణ (Ramayana) మూవీలో ఆమె సీత పాత్ర చేస్తున్నారు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ మూవీ మొదటి భాగం ఈ ఏడాది రిలీజ్ కానుంది.
శ్రీలీల (Sreeleela)
యువ నటి శ్రీలీల రోజు రోజుకి ప్రస్తుతం ఫ్యాన్స్, ఆడియన్స్ లో మంచి క్రేజ్ తో కొనసాగుతున్నారు. తొలిసారిగా రోషన్ హీరోగా రూపొందిన పెళ్లిసందడి మూవీ ద్వారా తెలుగుకి ఎంట్రీ ఇచ్చిన ఆమె, అనంతరం రవితేజ హీరోగా త్రినాధరావు నక్కిన తీసిన ధమాకా మూవీ విజయంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. వాస్తవానికి పెళ్లిసందడి మూవీలోనే తన ఆకట్టుకునే అందం, డ్యాన్స్ తో ఫ్యాన్స్ ని ఉర్రూతలూగించారు శ్రీలీల. ఇక ఆ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) తీసిన గుంటూరు కారం మూవీలో నటించి మరొక విజయం తన ఖాతాలో వేసుకున్నారు. ఇటీవల నితిన్ తో రాబిన్ హుడ్ సినిమా ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు. ప్రస్తుతం తమిళ్ లో శివ కార్తికేయన్ (Siva Karthikeyan) హీరోగా రూపొందుతున్న పరాశక్తి మూవీతో కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ఆమె, మరోవైపు కార్తీక్ ఆర్యన్ హీరోగా రూపొందుతున్న ఆషికి 3 మూవీ ద్వారా బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. తెలుగులో పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) తో పాటు రవితేజ తో మాస్ జాతర (Mass Jathara) సినిమాలు చేస్తున్నారు శ్రీలీల.
రాశి ఖన్నా : (Raashi Khanna)
తెలుగు సినిమా పరిశ్రమకి తొలిసారిగా అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య కలిసి విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నటించిన మనం (Manam) ద్వారా ఎంట్రీ ఇచ్చారు యువ నటి రాశి ఖన్నా. ఆ తరువాత నాగశౌర్య హీరోగా అవసరాల శ్రీనివాస్ తీసిన ఊహలు గుసగుసలాడే మూవీతో హీరోయిన్ గా మారిన రాశి ఖన్నా, ఆ మూవీతో మంచి విజయం అందుకున్నారు. ఇక అక్కడి నుండి ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకుంటూ కొనసాగారు రాశి. అనంతరం సాయి ధరమ్ తేజ్ తో ప్రతిరోజూ పండగే, సుప్రీం, గోపీచంద్ తో పక్కా కమర్షియల్, జిల్, అలానే వైష్ణవ్ తేజ్ తో తొలిప్రేమ (Tholi Prema) సహా మరికొన్ని సినిమాలు చేసారు. ఇక అటు తమిళ్ లో కూడా పలు సినిమాలు చేసిన రాశి ఖన్నా, హిందీలో కూడా నటిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఆమె చేతిలో తెలుగు, తమిళ్ తో పాటు హిందీ సినిమాలు అలానే సిరీస్ లు కూడా ఉన్నాయి.
మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary)
యువ నటుడు సుశాంత్ హీరోగా తెరకెక్కిన ఇచ్చాట వాహనములు నిలపరాదు సినిమా ద్వారా తెలుగు చిత్ర సీమకు హీరోయిన్ గా పరిచమైన యువ నటి మీనాక్షి చౌదరి. ఆ తరువాత రవితేజ తో ఖిలాడీ, అడివి శేష్ హీరోగా రూపొందిన క్రైమ్ యక్షన్ థ్రిల్లర్ హిట్ 2 మూవీ అవకాశాలు అందుకుని తన ఆకట్టుకునే అందం, అభినయంతో ఆడియన్స్ ని మెప్పించారు. అనంతరం సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh babu) హీరోగా త్రివిక్రమ్ తీసిన గుంటూరు కారం (Guntur Kaaram) మూవీలో చిన్న పాత్ర చేసారు. ఇటీవల దుల్కర్ సల్మాన్ (Dulquer Salman) తో లక్కీ భాస్కర్ (Lucky Bhaskar) వంటి బ్లాక్ బెస్ట్ మూవీలో నటించి ఆకట్టుకున్నారు. అలానే విశ్వక్సేన్ తో మెకానిక్ రాకీ, వరుణ్ తేజ్ తో మట్కా సినిమాలు చేశారు. ముఖ్యంగా ఈ ఏడాది విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam) లో ఆమె ఒక హీరోయిన్ గా నటించారు. ఆ మూవీ సెన్సేషనల్ సక్సెస్, హీరోయిన్ గా మీనాక్షి చౌదరికి వరుస అవకాశాలు తెచ్చిపెడుతోంది. ప్రస్తుతం నవీన్ పోలిశెట్టితో అనగనగా ఒకరాజు, నాగచైతన్య హీరోగా కార్తీక్ దండు తీస్తున్న వృష కర్మ సినిమాలు చేస్తున్నారు.
ఇవిగో మీకు కావాల్సిన హీరోయిన్ పేర్ల లిస్ట్
నిధి అగర్వాల్ (Nidhhi Agerwal)
యువ అందాల కథానాయిక నిధి అగర్వాల్ తొలిసారిగా నాగచైతన్య హీరోగా రూపొందిన సవ్యసాచి సినిమా ద్వారా తెలుగుకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత అఖిల్ అక్కినేనితో ఆమె చేసిన సినిమా మిస్టర్ మజ్ను. ఆ రెండు సినిమాల్లో తన ఆకట్టుకునే అందం, అభినయంతో ఫ్యాన్స్ ని, ఆడియన్స్ ని అలరించారు నిధి అగర్వాల్. తరువాత పూరి జగన్నాథ్ దర్శత్వంలో రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ (Ismart Shankar) లో ఆమె ఒక హీరోయిన్ గా నటించి ఆ మూవీతో పెద్ద విజయం తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తో హరి హర వీర మల్లు (Hari Hara Veera Mallu), పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) తో ది రాజాసాబ్ (The Rajasaab) సినిమాలు చేస్తున్నారు నిది. వాస్తవానికి తెలుగు కంటే ముందు జాకీ ష్రాఫ్ తో మున్నా మైకేల్ (Munna Michael) సినిమా చేసి బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి అక్కడి ఆడియన్స్ ని కూడా ఆకట్టుకున్నారు. అలానే అటు తమిళ్ లో జయం రవితో భూమి, శింబుతో ఈశ్వరన్ సినిమాలు చేసారు. మొత్తంగా తెలుగు, తమిళ్, హిందీ భాషల ఆడియన్స్ అందరినీ ఆకట్టుకుని ప్రస్తుతం మరిన్ని క్రేజీ ప్రాజక్ట్స్ తో నిధి అగర్వాల్ కొనసాగుతున్నారు.
కాగా ఈ అందాల నటీమణులు అందరూ కూడా రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా మరిన్ని విజయాలు సొంతం చేసుకుని మరింతగా దూసుకెళ్లాలని మా Telugu Movie Media మనసారా కోరుకుంటోంది.
What's Your Reaction?






