Pawan Kalyan New Film Updates | Cast, Release Date & News

Stay updated on Pawan Kalyan’s new film – cast, release date, trailer, and all the latest Tollywood news

Pawan Kalyan New Film Updates | Cast, Release Date & News

టాలీవుడ్ స్టార్ యాక్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చివరిగా హరి హర వీర మల్లు మూవీ ద్వారా ఆడియన్సు ముందుకి వచ్చారు. ఈ మూవీలో గజదొంగ వీర  మల్లుగా పవన్ కళ్యాణ్ గా నటించగా ఆయనకు జొద్దీగా యువ అందాల నటి నిధి అగర్వాల్ నటించారు. క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ కలిసి తీసిన ఈ మూవీని ప్రముఖ నిర్మాత ఏ ఎం రత్నం గ్రాండ్ గా తన మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించారు. 

ఎం ఎం కీరవాణి సంగీతం అందించిన మూవీ రిలీజ్ అనంతరం మాత్రం అంచనాలు అందుకోలేక బాక్సాఫీస్ వద్ద చతికలపడింది. పవన్ కళ్యాణ్ ఈ మూవీలో అద్భుతంగా నటించినప్పటికీ కథ కథనాలు ఫ్యాన్స్ ని ఆడియన్స్ ని అలరించలేకపోయాయి. నిర్మాతలు, బయ్యర్లకు భారీ స్థాయి నష్టాలని మిగిల్చిన Hari Hara Veera Mallu అనంతరం ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రెండు సినిమాలు చేస్తున్నారు. 

అవి సుజీత్ తీస్తున్న భారీ పాన్ ఇండియన్ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా మూవీ ఓజి. అలానే గబ్బర్ సింగ్ హరీష్ శంకర్ తీస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh). అయితే వీటిలో ముందుగా ఓజి మూవీ సెప్టెంబర్ 25న దసరా పండుగ కానుకగా రిలీజ్ కానుంది. ఇక ఈ మూవీలో కోలీవుడ్ యువ నటి ప్రియాంక మోహన్ (Priyanka Mohan) నటిస్తుండగా రాక్ స్టార్ యస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. 

పవన్ కళ్యాణ్ కొత్త సినిమా వివరాలు

మొదటి నుండి అందరిలో ఎన్నో అంచనాలు ఏర్పరిచిన ఓజి (OG) మూవీలో ప్రకాష్ రాజ్, శ్రియ రెడ్డి, అర్జున్ దాస్ నటిస్తుండగా కీలకమైన విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ కనిపించనున్నారు. ఇక ఓజి మూవీలో ఓజాస్ గంభీర అనే గ్యాంగ్ స్టార్ పాత్రలో పవన్ కళ్యాణ్, ఒమీ భావుగా ఇమ్రాన్ హష్మీ, కన్మణి పాత్రలో ప్రియాంక నటిస్తున్నారు. మొదటగా They Call Him OG మూవీ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ టీజర్ ఎంతో ఆకట్టుకుని ఒక్కసారిగా అందరిలో మూవీ పై అంచనాలు పెంచేసింది. 

Pawan Kalyan New Film

ఇక తాజాగా రిలీజ్ అయిన OG The Firestorm సాంగ్ రిలీజ్ కాగా దానికి శ్రోతల నుండి విశేషమైన ఆదరణ లభించింది. అలానే సెకండ్ సాంగ్ OG Suvvi Suvvi కూడా ఎంతో మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య ఓజి మూవీని దాదాపుగా రూ. 250 కోట్ల భారీ వ్యయంతో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పాన్ ఇండియన్ రేంజ్ లో నిర్మిస్తున్నారు. 

మరోవైపు ఇటీవల Pawan Kalyan OG మూవీకి సంబంధించి యుఎస్ఏ ప్రీమియర్ టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేయగా ఇప్పటికే అది 1.3 Million వసూళ్లు జరుపుకుంది. దానితో ఈ మూవీ పై అందరిలో ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయి అనేది అర్ధం చేసుకోవచ్చు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే తప్పకుండా ఓజి తో తమ పవర్ స్టార్ భారీ విజయం అందుకోవడంతో పాటు గత రికార్డులు అన్నిటినీ తుడిచి పెట్టడం ఖాయం అని గట్టి నమ్మకంగా ఉన్నారు. 

కథా నేపథ్యం & ముఖ్యాంశాలు

OG మూవీ తెలుగుతో పాటు హిందీ సహా పలు పాన్ ఇండియన్ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు టీమ్ అయితే సన్నాహాలు చేస్తోంది. ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని సెప్టెంబర్ 20న విజయవాడలో నిర్వహించనున్నారని టాక్. త్వరలో దీనికి సంబంధించి టీమ్ నుండి అఫీషియల్ గా న్యూస్ రానుంది. కాగా ఓజి మూవీతో పాటు హరీష్ శంకర్ తో పవన్ కళ్యాణ్ చేస్తున్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. వాస్తవానికి ఈమూవీని Ilayathalapathy Vijay హీరోగా గతంలో రూపొంది పెద్ద సక్సెస్ కొట్టిన తేరికి రీమేక్ గా ప్రారంభించారు. 

అయితే ఇటీవల న్యూస్ ప్రకారం దానిని రీమేక్ గా కాకుండా ఒరిజినల్ స్టోరీతోనే తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీలో పవర్ స్టార్ కి జోడీగా యువ అందాల భామలు రాశి ఖన్నా (Raashi Khanna) శ్రీలీల (Sreeleela) నటిస్తుండగా అశుతోష్ రానా, గౌతమి, నవాబ్ షా తదితరులు ఇతర ముఖ్య పాత్రలు చేస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న Ustaad Bhagat Singh మూవీని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ దాదాపుగా రూ. 150 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్నారు. 

ఇప్పటికే చాలా వరకు షూటింగ్ జరుపుకున్న ఈ మూవీని వీలైతే ఈ ఏడాది డిసెంబర్ లేదా వచ్చే ఏడాది సమ్మర్ లో ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చేందుకు టీమ్ కసరత్తులు చేస్తోంది. తాజాగా ఈ మూవీలోని ఒక మంచి మాస్ సాంగ్ ని ఇద్దరు హీరోయిన్స్ తో కలిసి హీరో పవన్ కళ్యాణ్ తో దర్శకుడు హరీష్ అద్భుతంగా చిత్రీకరిస్తున్నారు. మొత్తంగా ఈ మూవీ కూడా అందరి అంచనాలు అందుకుని తప్పకుండా విజయవంతం అవుతుందని టీమ్ చెప్తోంది. 

విడుదల తేదీ & అభిమానుల అంచనాలు

దాదాపుగా పదమూడేళ్ల అనంతరం తన అభిమాన హీరోతో మూవీ చేస్తుండడంతో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ విషయమై దర్శకుడు హరీష్ శంకర్ కూడా అన్ని అంశాల్లో ఎంతో శ్రద్ధ వహిస్తున్నారట. అయితే ఈ రెండు సినిమాల తరువాత పవన్ కళ్యాణ్ ఎవరితో పని చేస్తారు అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఓవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యలతో ఎంతో బిజీగా కొనసాగుతున్న పవన్ రాబోయే రోజుల్లో ఎన్ని సినిమాలు చేస్తారు అనే దానిపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది. 

Pawan Kalyan OG Movie

ఆయన త్వరలో సినిమాలకు ఫుల్ స్టాప్ పెడతారనే న్యూస్ కూడా ఓవైపు కొన్నాళ్లుగా వైరల్ అవుతున్నప్పటికీ అటు రాజకీయాలతో పాటు తీరిక సమయంలో వీలైనప్పుడు సినిమాలు కూడా చేస్తారని అంటున్న వారు కూడా ఉన్నారు. కాగా దీనిపై Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan స్వయంగా క్లారిటీ ఇవ్వాలి. కాగా ఇప్పుడు పవన్ చేస్తున్న రెండు సినిమాలైనా ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ రెండూ కూడా మంచి సక్సెస్ అయి నటుడిగా ఆయన కెరీర్ కి మరింత ఊపుని అందివ్వాలని మా Telugu Movie Media టీమ్ మనస్ఫూర్తిగా కోరుకుంటోంది.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow