Govinda's Niece Arti Singh Breaks Silence on His Divorce – Here's What She Said

Arti Singh, Govinda’s niece, reacts to his divorce with an emotional statement. Read how she supports him and the family's response to the situation

Govinda's Niece Arti Singh Breaks Silence on His Divorce – Here's What She Said

బాలీవుడ్ నటుడు గోవింద (Govinda) తెలుగు ఆడియన్స్ కి కూడా ఒకింత సుపరిచితమే అని చెప్పాలి. అప్పట్లో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ వంటి వారి సమాన వయస్కుడైన నటుడు గోవింద తన ఆకట్టుకునే యాక్టింగ్ తో ఎందరో ఫ్యాన్స్ ని సంపాదించారు. ఇక కెరీర్ పరంగా పలు సినిమాలు చేసిన గోవిందా నటుడిగా ఆడియన్స్, ఫ్యాన్స్ మనస్సులో తనకంటూ ప్రత్యేకంగా స్థానం సంపాదించారు గోవిందా. 

Govinda's Niece Arti Singh Reacts to His Divorce – Emotional Statement

ఇక తన భార్య సునీత అహుజా (Sunita Ahuja) ని 37 ఏళ్ళ క్రితం అనగా 1987లో వివాహం చేసుకున్నారు గోవింద. వీరిద్దరికీ టీనా అహుజా, యశోవర్ధన్ అహుజా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే వివాహం అయిన నాటి నుండి గోవింద దంపతులు ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా సాగుతున్నారు. 

పలు సందర్భాల్లో ఇద్దరూ కూడా ఒకరి పై మరొకరు ఎంతో గొప్పగా ప్రసంశలు కురిపించుకున్నారు కూడా, ఆ విధంగా బాలీవుడ్ లో ఆదర్శ జోడీగా నిలిచిన వీరిద్దరూ కూడా త్వరలోనే విడాకులు తీసుకోనున్నారు అనే వార్తలు కొద్దిరోజులుగా మీడియా మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి. నిజానికి ఈ జంట ఇద్దరూ కూడా కొన్నాళ్లుగా విడివిడిగా ఉంటున్నారని, అదే వీరిద్దరి విడాకులకు కారణం అని మరికొన్ని ఆంగ్ల పత్రికలు సైతం రాసుకొచ్చాయి. 

ఈ విషయం విన్న పలువురు ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ అందరూ కూడా ఒక్కసారిగా అవాక్కయ్యారు. కాగా దీనికి ఒక కారణం అది, ఇటీవల ఒక ఇంటర్వ్యూలో భాగంగా సునీత మాట్లాడుతూ, కొన్నాళ్లుగా భర్త గోవిందాతో తాను ఉండడం లేదని, విడిగా పిల్లలతో కలిసి ఉంటున్నట్లు తెలిపారు. ఆయనకు పనే ముఖ్యమని, తమ వైవాహిక జీవితంలో భర్త తో కలిసి ఎన్నో సరదా గడపాలని తాను భావించినప్పటికీ అది సాధ్యపడలేదని అన్నారు. 

Arti Singh’s Support for Govinda Amid Divorce News

ముఖ్యంగా ముంబై వీధుల్లో ఆయనతో కలిసి పానీ పూరి తినాలని ఉండేదని, అది ఎప్పటికీ సాధ్యపడదు సరికదా ఆయనతో కలిసి తాను ఒక్క సినిమా చూసిన సందర్భం కూడా లేదని ఒకింత ఆవేదనతో మాట్లాడారు. ఆయనకు పూర్తిగా వృత్తే జీవితం, అటువంటి భర్త రాబోయే జన్మలో నాకు రాకూడదని భావిస్తానని ఆమె వ్యాఖ్యానించారు. 

అయితే ఆమె వ్యాఖ్యలే వారు విడాకులు తీసుకోనున్నారు అనడానికి ప్రధాన కారణం అని కొందరు అంటున్నారు. కాగా అసలు ఇది ఎంతవరకు నిజం, వారిద్దరూ విడిపోతున్నారా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. కాగా అటు గోవిందా కానీ, లేదా ఆయన భార్య సునీత అహుజా కానీ ఈ కథనాల పై ఇప్పటివరకు ఏ విధంగానూ స్పందించ లేదు. 

దానితో ఈ రూమర్స్ మరింతగా పెరిగి, పలువురు వీటిపై పలు విధాలుగా ప్రచారం చేస్తున్నారు. కాగా విషయం ఏమిటంటే, తాజాగా వీరిద్దరి విడాకుల పై గోవిందా మేనకోడలు ఆర్తి సింగ్ (Arti Singh) స్పందించారు. ప్రస్తుతం తనకు అయితే ముంబైలో లేనని, కానీ తనకు తెలిసినంతలో మావయ్య గోవిందా, వారి భార్య సునీత ఇద్దరూ కూడా ఎల్లప్పుడూ ఎంతో అన్యోన్యంగానే ఉంటారని అన్నారు. 

Govinda’s Divorce – What Led to

వారిద్దరి మధ్య ప్రేమానుబంధం ఎంతో బలమైనది, అస్లు ఇది ఎవరు ఎక్కడి నుండి పుట్టించారో నాకు అర్ధం కావడం లేదని అన్నారు. ముఖ్యంగా వారిద్దరి మనస్సులో ఏముందో, అసలు వారి కుటుంబంలో ఏమి జరుగుతుందో పూర్తిగా నిజా నిజాలు తెలుసుకోకుండా ఈ విధంగా కొందరు మీడియా వారు అవాస్తవాలు ప్రచారం చేయడం తగదని ఆమె అన్నారు. 

దయచేసి ఇటువంటి తప్పుడు కథనాలు ప్రచారం చేయవద్దని ఆర్తి కోరారు. కాగా ఆమె వ్యాఖ్యలతో గోవిందా దంపతుల విడాకుల విషయమై ప్రచారమవుతున్న తప్పుడు కథనాలకు ఫుల్ స్టాప్ పడిందని చెప్పాలి. ఇక మరోవైపు కెరీర్ పరంగా గోవిందా పలు సినిమాలతో బిజీగా కొనసాగుతున్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow