Most Absurd Rumours in Tollywood: Fake News and Trending Gossips

Read about the most bizarre and unbelievable rumours in Tollywood. From shocking fake news to hilarious trending gossips, check them all

Most Absurd Rumours in Tollywood: Fake News and Trending Gossips

తెలుగు చలన  ఒకప్పటితో పోలిస్తే నేడు అంతకంతకు దినదినాభివృద్ధి చెందుతూ ఖండాంతరాలు దాటి దూసుకుపోతోంది. ముఖ్యంగా ఇటీవల వచ్చిన బాహుబలి సిరీస్ సినిమాలు మొదలుకుని, అనంతరం వచ్చిన ఆర్ఆర్ఆర్, పుష్ప సిరీస్ సినిమాలు, దేవర, కల్కి 2898, సలార్ ఇటువంటి సినిమాలు అన్ని కూడా అధ్ పెద్ద విజయాలు సొంతం చేసుకున్నాయి. 

ముఖ్యంగా పాన్ ఇండియన్ రేంజ్ లో రూపొందిన ఈ సినిమాలు అన్ని కూడా ఒకదానిని మించేలా మరొకటి మన దేశంతో పాటు పలు విదేశాల ఆడియన్స్ యొక్క ఆదరణ కూడా చూరగొన్నాయి. అయితే రాను రాను సినిమా ఇండస్ట్రీ యొక్క అభివృద్ధితో పాటు టెక్నాలజీ కూడా మరింత వేగంగా అభివృద్ధి చెందుతూ విస్తరిస్తోంది. 

ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం సినిమాల యొక్క ప్రమోషన్స్ మరింత డిజిటల్ గా వేగం పుంజుకున్నాయి ఏదైనా సినిమా వస్తుంది అంటే అన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో దానికి సంబంధించి పలు అప్డేట్స్ తో పాటు యొక్క హడావుడి మనం చూస్తూనే ఉన్నాం. ఆ విధంగా టెక్నాలజీని చిత్ర పరిశ్రమ బాగానే వాడుకుంటోంది. 

టాలీవుడ్‌లో వినిపించిన అత్యంత విచిత్రమైన రూమర్స్

అయితే ఈ టెక్నాలజీ వలన ఒకప్పటితో పోలిస్తే ఇండీస్ట్రీ నటీనటుల పై ఎక్కువగా పలు తప్పుడు పుకార్లు ప్రచారం అవుతూ వైరల్ అవుతున్నాయి. అవి ముఖ్యంగా టాలీవుడ్ టాప్ స్టార్స్ కి సంబంధించి ఉంటున్నాయి. ఎందుకంటే ఈ సోషల్ మీడియా మాధ్యమాల వినియోగం వలన మంచితో పాటు కొంత చెడు కూడా ప్రచారం అవుతోంది. 

పెద్ద నటీనటుల్ని టార్గెట్ చేస్తూ పలువురు వీటిని పుంఖానుపుంఖాలుగా ప్రచారం చేస్తూ లబ్ది పొందుతున్నారు. ఆ విధంగా ఇటీవల టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో పలు అసంబద్ధమైన ప్రచారాలు కూడా ఊపందుకున్నాయి. ముఖ్యంగా సీక్వెల్స్, ప్రేక్యూల్స్ తో పాటు సినిమాటిక్ యూనివర్స్ సినిమాలు కూడా రూపొందుతుండడంతో పలువురు ఎవరికి తోచిన విధంగా వారు వీటిని అనుసంధానం చేసి ఆర్టికల్స్ రాస్తుండడంతో పాటు యూట్యూబ్ వంటి మాధ్యమాల్లో వీడియోస్ కూడా చేస్తున్నారు. 

వాటిలో ఇటీవల వచ్చిన పుకార్లలో సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక భారీ యాక్షన్ ఎంటర్టైనర్ తీయనున్నారనే వార్త విరివిగా ప్రచారం అయింది. ముఖ్యంగా టాలీవుడ్ మూవీస్ అనగానే మనకు నేటి కాలంలో ముందుగా గుర్తకువచ్చే పేర్లు సూపర్ స్టార్ మహేష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. 

నిజానికి మెగాస్టా చిరంజీవి నెంబర్ వన్ గా ఎన్నో ఏళ్లపాటు ఏలిన అనంతరం అటు మహేష్ ఇటు పవన్ ఇద్దరూ కూడా తమ తమ సక్సెస్ఫుల్ సినిమాలతో పాటు భారీ స్థాయిగా క్రేజ్ తో దూసుకెళ్లారు. అయితే అనంతరం వచ్చిన  ఎన్టీఆర్,ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ కూడా ఎవరికి వారు తమ యొక్క ప్రతిభని నిరూపించుకుని ఎన్నో సక్సెస్ లు అందుకున్నారు. 

తెలుగు మూవీ సెలబ్రిటీల గురించి తప్పు వార్తలు

అయినా కూడా ముందుగా మహేష్, పవన్ ల పేర్లు టాలీవుడ్ లో టాప్ హీరో ఎవరు అనే డిస్కషన్ వచ్చినప్పుడల్లా ఎక్కువ వినపడుతుంది. ఆ విధంగా త్రివిక్రమ్ దర్శకత్వం వీరిద్దరి మల్టీస్టారర్ మూవీ రానుందని ఎవరికి తోచిన విధంగా వారు వార్తలు వైరల్ చేసారు. అయితే ఎన్నిమార్లు ప్రచారం అయినప్పటికి అది పూర్తిగా ప్రచారం గానే మిగిలిపోయింది. 

ఎందుకంటే మహేష్, పవన్ ఇద్దరికీ త్రివిక్రమ్ మంచి స్నేహితుడు అయినప్పటికి వారిద్దరినీ కలిపి సినిమా చేయాలి అంటే అది మాములు విషయం కాదు. ఇక ప్రస్తుతం ఓవైపు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా అలానే అటు పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. మరోవైపు సూపర్ స్టార్ మహేష్ కూడా దిగ్గజ దర్శకుడు రాజమౌళితో ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ మూవీ SSMB 29 చేస్తున్నారు. వీటి అనంతరం కూడా దాదాపుగా వీరిద్దరితో త్రివిక్రమ్ సినిమా చేసే ఛాన్స్ చాలా తక్కువ. 

ఇక మరొక పుకారు ఏంటంటే, రణబీర్ కపూర్, సైపల్లవి ల కలయికలో ప్రస్తుతం బాలీవుడ్ లో గ్రాండ్ గా రామాయణ చిత్రం ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న విషయం తెల్సిందే. ఇందులో ఏజెంట్ సాయి శ్రీనివాస, జాతి రత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీస్ ఫేమ్ నవీన్ పోలిశెట్టి ఒక కీలక పాత్ర చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. 

కాగా ఈ మూవీలో ఆయన లక్ష్మణుడిగా కనిపించనున్నారని కొందరు వార్తలు వైరల్ చేసారు. అయితే అది నిజం కాదని తెలిసింది. అలానే టాలీవుడ్ దివంగత సీనియర్ నటుడు ఒకరు, ఒక నటిని వివాహం చేసుకోనున్నారు అనే వార్తలు రాసారు. అనంతరం ఆయన వాటిని పూర్తిగా నిరాధారమైనవి అని ఖండించారు. 

ఇక ఇటీవల తమిళ స్టార్ నటుడు ఇళయదళపతి విజయ్ హీరోగా లోకేష్ కనకరాజ్ తీసిన లియో మూవీ క్లైమాక్స్ సీన్ లో టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఒక ముఖ్య క్యామియో రోల్ లో కనిపిస్తారని కొందరు ప్రచారం చేసారు. తీరా కట్ చేస్తే ఆయన ఆ మూవీలో లేనే లేరు. ఇక మరొక తెలుగు మూవీస్ లోని సీనియర్ నటి ఒకరు త్వరలో మూడవ వివాహం చేసుకొన్నారు అని కూడా కొందరు వార్తలు రాసారు. అనంతరం సదరు నటి అవన్నీ ఒట్టి పుకార్లు మాత్రమే అంటూ కొట్టిపారేశారు. 

అలానే ఒకప్పటి స్టార్ నటి భర్త ఇటీవల అనారోగ్య కారంలతో మృతి చెందారు. అయితే కొన్నాళ్ల అనంతరం ఆమె రెండవ వివాహానికి సిద్ధమయ్యారని ఒక వార్త ఇటీవల వైరల్ అయింది. అనంతరం ఆ నటి కూడా ఆ రూమర్స్ పై స్పందిస్తూ అటువంటిది ఏమి లేదు, దయచేసి తప్పుగా రాయవద్దని కోరారు. 

టాలీవుడ్‌లో వైరల్ అయిన ఫేక్ గాసిప్స్

అంతే కాదు పలువురు సీనియర్ నటులు ఇక లేరు అంటూ పలు కథనాలు సైతం సోషల్ మీడియాలోని పలు మాధ్యమాల్లో అక్కడక్కడా ప్రచారం అవుతున్న నేపథ్యంలో వారు డైరెక్ట్ గా వీడియోస్ లేదా ఫొటోస్ పోస్ట్ చేసి అది నిజం కాదని క్లారిటీ ఇవ్వడం జరుగుతోంది. 

అందుకే ఈ సోషల్ మీడియా మాధ్యమాలు నేడు విరివిగా వినియోగిస్తుండడంతో అసలు ఈ ప్రచారం అవుతున్న వార్తల్లో ఏది నిజమో ఏది అబద్దమో అనేది కూడా కొందరం తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఏమైనా ఎప్పుడైనా ఎక్కడైనా సెలబ్రిటీలకు సంబందించిన ఎటువంటి న్యూస్ వచ్చినా దానిని పూర్తిగా మరికొందరిని అడిగి తెలుసుకుని పలుమార్లు పూర్తిగా పరిశీలించి పోస్ట్ చేస్తే బాగుంటుంది. 

ఎందుకంటే మనం వారికోసం మంచి చేయాల్సిన పనిలేదు కానీ ఖచ్చితంగా ఈ విధంగా తప్పుడు కథనాలు మాత్రం ప్రచారం చేసి వారికి నష్టం చేయకుండా ఉంటె చాలు. తెలుగు మూవీస్ స్టార్స్ కి సంబంధించి ఈ విధమైన అసంబద్ధ ప్రచారాలు ఇకపై మెల్లగా ఆపై పూర్తిగా ఆగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow