Kannappa Trailer - Mind Blowing Visual Wonder
Watch the much-awaited Kannappa trailer starring Vishnu Manchu, Prabhas, Akshay Kumar & Mohanlal—a spectacular visual wonder

టాలీవుడ్ నటుడు మంచు విష్ణు హీరోగా తాజాగా బాలీవుడ్ దర్శకుడు ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పాన్ ఇండియన్ యాక్షన్ ఫాంటసీ మూవీ కన్నప్ప. ఈ మూవీని మంచు మోహన్ బాబుతో కలిసి విష్ణు ఎంతో భారీ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
ఎప్పటి నుండో ఎంతో గ్రాండ్ లెవెల్లో నిర్మితం అవుతున్న కన్నప్ప మూవీ తప్పకుండా అన్ని భాషల ఆడియన్స్ ని ఆకట్టుకుని నటుడిగా కెరీర్ పరంగా తనకు మంచి పేరు, క్రేజ్ తీసుకువస్తుందనే నమ్మకాన్ని ఇటీవల నటుడు విష్ణు మంచు పలు ఇంటర్వ్యూస్ లో భాగంగా మాట్లాడుతూ చెప్పారు.
Kannappa Trailer Released
ఎన్నో ఏళ్ళ క్రితం లెజెండరీ టాలీవుడ్ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు హీరోగా తెరకెక్కిన భక్త కన్నప్ప మూవీ అప్పట్లో పెద్ద విజయం సొంతం చేసుకుంది. అయితే అదే సినిమాని ఆయన తమ్ముడి కుమారుడు ప్రభాస్ తో కృష్ణంరాజు నిర్మించనున్నట్లు కొన్నేళ్ల క్రితం వార్తలు వచ్చాయి. అయితే అది కార్యరూపం దాల్చలేదు.
‘కన్నప్ప’ టీజర్ రిలీజ్ – అదరగొట్టిన విజువల్స్
ఇక ఫైనల్ గా ఆ మూవీని తాను గ్రాండ్ స్కేల్ లో తెరకెక్కించనున్నట్లు నాలుగేళ్ళ క్రితం మంచు విష్ణు తెలిపారు. ఆ తరువాత అందులోని కీలక పాత్రధారుల యొక్క ఎంపిక పనులు మొదలెట్టి, దర్శకుడిగా ఒకప్పటి మహాభారతం తీసిన అతడిని ఎంపిక చేసారు. ఇక మంచు విష్ణుకి జోడీగా తమిళ నటి ప్రీతి ముకుందన్ ని తీసుకున్నారు.
అనంతరం ప్రధానమైన శివుడి పాత్రకు బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్ కుమార్ ని అలానే పార్వతీదేవి పాత్రకు అందాల నటి కాజల్ అగర్వాల్ ని ఎంపిక చేయడం జరిగింది. కాగా కన్నప్ప మూవీలో కీలకమైన రుద్ర పాత్ర కోసం పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ని తీసుకున్నారు.
విష్ణు మంచు – ప్రభాస్ – అక్షయ్ కుమార్ – మోహన్లాల్ కాంబో
ఇక ఈ మూవీలో ఇతర కీలకమైన పాత్రల్లో మలయాళ స్టార్ నటుడు మోహన్ లాల్, మంచు మోహన్ బాబు, శరత్ కుమార్, కమెడియన్ బ్రహ్మానందం, సప్తగిరి, దేవరాజ్, ముకేశ్ ఋషి, మధుబాల వంటి దిగ్గజ నటీనటుల్ని ఎంపిక చేసారు. అయితే ఎంతో గ్రాండ్ లెవెల్లో మన దేశంతో పాటు న్యూజిలాండ్ వంటి విదేశాల్లో కూడా ఈ మూవీ యొక్క షూటింగ్ చేసారు.
అక్కడ కీలక పాత్రధారుల పై పలు ముఖ్య సీన్స్ తెరక్కెక్కించారు. అనంతరం మూవీ నుండి ఒక్కొక్కటిగా ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసింది కన్నప్ప టీమ్. ముందుగా మూవీ నుండి కీలక పాత్రధారుల యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని రివీల్ చేస్తూ వచ్చారు. కాగా వాటి అందరి నుండి మంచి రెస్పాన్స్ అయితే లభించింది.
ఆ తరువాత మూవీ నుండి ఒక్కొక్కటిగా సాంగ్స్ రిలీజ్ చేయగా అవి కూడా బాగా శ్రోతలను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా కొన్నాళ్ల క్రితం విష్ణు కుమార్తెలు అరియనా, వివియానా కలిసి పాడిన కాళహస్తి ప్రాశస్త్యం తెలిపే సాంగ్ మరింతగా ఆకట్టుకుని సినిమా పై అంచనాలు పెంచేసింది.
Manchu Vishnu Kannappa Trailer Review
అదే సమయంలో రిలీజ్ అయిన కన్నప్ప టీజర్ కూడా అలరించగా తాజాగా నేడు మూవీ నుండి థియేట్రికల్ ట్రైలర్ ని రిలీజ్ చేసారు. ప్రత్యేకంగా జరిగిన ఈవెంట్ లో భాగంగా కన్నప్ప ట్రైలర్ ని ప్రదర్శించనున్నారు. అయితే కన్నప్ప ట్రైలర్ ని మనం పరిశీలిస్తే ప్రతి ఒక్క పాత్రధారిని అందులో చూపించారు.
ఇక ఈ మూవీలో కన్నప్ప గా నటిస్తున్న మంచు విష్ణ ట్రైలర్ లో పలికిన డైలాగ్స్, యాక్టింగ్, యాక్షన్ సీన్స్ బాగున్నాయి. శివుడిగా నటిస్తున్న అక్షయ్ కుమార్, పార్వతీదేవిగా నటిస్తున్న కాజల్ అగర్వాల్ తో పాటు రుద్ర గా చేస్తున్న ప్రభాస్, మహాదేవ శాస్త్రిగా చేస్తున్న మోహన్ బాబు ల పాత్రలు ట్రైలర్ లో మరింతగా ఆకట్టుకున్నాయి.
కన్నప్ప ట్రైలర్ వివరణ & అభిమానుల స్పందన
ఇక విజువల్స్ అయితే ఎంతో రిచ్ గా గ్రాండియర్ రేంజ్ లో ఉన్నాయి. ప్రభాస్ రుద్ర గా వేసిన గెటప్ తో పాటు ఆయన డైలాగ్స్ కూడా ఎంతో అలరించాయి. కాగా ప్రభాస్ వలన ఈ మూవీకి బాక్సాఫీస్ పరంగా మరింత మంచి బజ్ రావడం ఖాయం. అలానే ట్రైలర్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ యాక్షన్ సీన్స్, ఫైట్స్ కూడా అలరించాయి.
మొత్తంగా చెప్పాలి అంటే విజువల్ ఫీస్ట్ మాదిరిగా ఉన్న కన్నప్ప థియేట్రికల్ ట్రైలర్ ఇప్పటివరకు మూవీ పై ఆడియన్స్ లో ఉన్న అంచనాలు అమాంతంగా పెంచేసింది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం అవసరం లేదు. జూన్ 27న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ అత్యధిక థియేటర్స్ లో పలు పాన్ ఇండియన్ భాషల్లో రిలీజ్ కానున్న కన్నప్ప మూవీ మంచి విజయం అందుకోవడం ఖాయంగా కనపడుతోంది.
ముఖ్యంగా నార్త్ లో కూడా ఈ మూవీ పెద్ద విజయం అందుకుంటుందనే ఆశాభావాన్ని కన్నప్ప టీమ్ వ్యక్తం చేస్తోంది. ఇక రిలీజ్ పరంగా ఎక్కడా కూడా కంప్రమైజ్ కాకుండా అన్ని చోట్ల ఎక్కువ థియేటర్స్ లో ప్లాన్ చేస్తోంది టీమ్. అలానే అటు ప్రమోషన్స్ పరంగా హీరో మంచు విష్ణు తో పాటు కన్నప్ప టీమ్ కూడా దూసుకుపోతుండడం మూవీకి అన్ని చోట్ల మంచి బజ్ ఏర్పడేలా చేస్తోంది.
మొత్తంగా కన్నప్ప విషయమై ఇటు ఆడియన్స్ లో అటు సినిమా పరిశ్రమలో కూడా పాజిటివ్ వైబ్స్ కనపడుతుండడంతో పాటు భారీ తారాగణం, అత్యధిక వ్యయం, గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్, గ్రాండియర్ యాక్షన్ సీన్స్ వంటివి దీనికి ప్లస్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
Manchu Vishnu Prabhas Akshay Kumar Kannappa Trailer Reivew
వాస్తవానికి ట్రైలర్ లో చూపించిన విషయం కన్నప్ప కథ అందరికీ తెలిసినదే అయినప్పటికీ దర్శకుడు ముకేశ్ కుమార్ సింగ్ తో పాటు మూవీ కోసం టీమ్ మొత్తం ఎంతో కష్టపడడ్డారని, తప్పకుండా ఆడియన్స్ నుండి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు మంచు విష్ణు.
ఇక బాలీవుడ్ పరంగా అక్షయ్ కుమార్, తమిళ్ పరంగా శరత్ కుమార్, మలయాళం పరంగా మోహన్ లాల్ ఓవరాల్ గా పాన్ ఇండియన్ క్రేజ్ పరంగా రెబల్ స్టార్ ప్రభాస్ వంటి వారు కన్నప్ప మూవీకి మంచి ప్లస్ పాయింట్స్ నిలుస్తారని చెప్పాలి. అటు మంచు మోహన్ బాబు కూడా ఇటీవల కన్నప్ప గురించి మాట్లాడుతూ, మంచి విష్ణుతో పాటు టీమ్ మొత్తం కష్టపడ్డ తమ మూవీకి ఆ కైలాశనాథుని దీవెనలు తప్పకుండా ఉంటాయని భావిస్తున్నట్లు తెలిపారు.
మరి అందరిలో ఈ స్థాయి క్రేజ్ ఏర్పరిచిన కన్నప్ప మూవీ రిలీజ్ తరువాత ఎంతమేర సక్సెస్ అవుతుందో, నటుడిగా నిర్మాతగా మంచు విష్ణుకి ఎంతటి పేరు తీసుకువస్తుందో చూడాలి. కాగా ఇటువంటి లేటెస్ట్ టాలీవుడ్ మూవీ అప్ డేట్స్ కోసం మా Telugu Movie Media సైట్ ఎప్పటికప్పుడు చూస్తూ ఉండండి.
What's Your Reaction?






