Sarkaru Vaari Paata Collection Worldwide Box Office Report

Sarkaru Vaari Paata collection worldwide box office report, day-wise gross, Andhra Telangana shares, and Mahesh Babu’s blockbuster earnings.

Sarkaru Vaari Paata Collection Worldwide Box Office Report

టాలీవుడ్ నటుడు సూపర్ స్టార్ మహేష్ బాబు Mahesh Babu సినిమా వస్తుంది అంటే చాలు టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతో పెద్ద సందడి వాతావరణం నెలకొని ఉంటుంది. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ఫ్యాన్స్ కలిగిన ఆయనకు అంతే స్థాయిలో నార్మల్ ఆడియన్స్ లో కూడా క్రేజ్ ఉంది. ఇక ఆయన మూవీ థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ చేసే హడావుడి ఒక పెద్ద పండుగని తలపిస్తుంది. 

తొలిసారిగా 1999లో కె రాఘవేంద్రరావు తీసిన రాజకుమారుడు Rajakumarudu మూవీ ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ మూవీతోనే హీరోగా తన ఆకట్టుకునే అందం, అద్భుత అభినయంతో నటుడిగా తండ్రకి తగ్గ తనయుడిగా సూపర్ స్టార్ మహేష్ బాబు నిరూపించుకున్నారు. 

అంతకముందు బాలనటుడిగా అనేక సినిమాల్లో నటించారు సూపర్ స్టార్ మహేష్ బాబు Superstar Mahesh Babu. ఇక హీరోగా ఫస్ట్ మూవీ అనంతరం నటుడిగా ఎన్నో రకాల ప్రయోగాత్మక సినిమాలు చేసారు మహేష్. ముఖ్యంగా మహేష్ సినిమాలు ఎక్కువగా వినూత్న, విభిన్నమైన కథ, కథనాలు కలిగి ఉంటాయి. ఆ పాత్రల్లో మహేష్ తన సహజ నటనతో ఎప్పటికప్పడు ఫ్యాన్స్ ని ఆడియన్సు ని అలరిస్తూ ఆకాశమంతటి క్రేజ్ తో కొనసాగుతున్నారు.

ఆయన పాత్రల యొక్క ఔచిత్యంతో పాటు ఎప్పటికప్పుడు నూతన కథాంశాలతో చిత్రాలు చేయడానికి ఆయన సుముఖత చూపుతుంటారు. ఇక మహేష్ బాబు కెరీర్ లో ఎన్నో అద్భుతమైన బ్లాక్ బస్టర్, ఇండస్ట్రీ హిట్ సినిమాలు చేసినప్పటికీ పూర్తి స్థాయి లవ్ స్టోరీ, మాస్ మూవీ మాత్రం ఆయన కెరీర్ లో రాలేదని చెప్పాలి. 

ఇప్పటికీ కూడా సూపర్ స్టార్ ఫ్యాన్స్ లో అది లోటుగా కనపడుతుంది. ఇక అసలు విషయం ఏమిటంటే, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో 2020లో మహేష్ బాబు చేసిన బ్లాక్ బస్టర్ మూవీ సరిలేరు నీకెవ్వరు Sarileru Neekevvaru. ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న Rashmika Mandanna హీరోయిన్ గా నటించగా ఈమూవీ ఓవరాల్ గా రిలీజ్ అనంతరం పెద్ద సంచలన విజయం సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద వరల్డ్ వైడ్ రూ. 265 కోట్ల గ్రాస్ ని సొంతం చేసుకుంది. 

అయితే అదే సమయంలో కరోనా మహమ్మారి రావడంతో సినిమా పరిశ్రమ కూడా కొన్నాళ్ళు నిలిచిపోయింది. అనంతరం సూపర్ స్టార్ మహేష్ బాబు స్టార్ట్ చేసిన మూవీ సర్కారు వారి పాట. ఈమూవీలో ఆయన మహేష్ అనే ఫైనాన్స్ సంస్థ నెలకొల్పి ఫైనాన్స్ వ్యాపారిగా నటించారు. వెన్నెల కిషోర్ మరొక ముఖ్య పాత్ర చేసిన ఈ మూవీలో అందాల నటి Keerthy Suresh హీరోయిన్ గా నటించారు. 

ఎస్ థమన్ సంగీతం అందించిన ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు గ్రాండ్ గా నిర్మించాయి. నవీన్ ఎర్నేని, వై రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట తో కలిసి మహేష్ బాబు కూడా ఈ మూవీకి ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. Geetha Govindam దర్శకుడు పరశురామ్ పెట్ల ఈ మూవీని తెరకెక్కించారు. 

మొదట్లో సర్కారు వారి పాట ఫస్ట్ లుక్ పోస్టర్స్ లో మహేష్ బాబు మీద పై రూపాయి నాణెం టాటూతో అపాటు చెవికి పోగు పెట్టుకున్న లేటెస్ట్ ట్రెండీ స్టైల్ లుక్ ని రిలీజ్ చేసారు మేకర్స్. కాగా ఆ లుక్ కి సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల నుండి కూడా విపరీతమైన క్రేజ్ లభించింది. అనంతరం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈమూవీ నుండి విడుదలైన Kalavathi సాంగ్ విశేషమైన ఆదరణ సొంతం చేసుకోవడంతో పాటు యువతని ఎంతో ఊపేసింది. 

ఇక అక్కడి నుండి మూవీ యొక్క ఫస్ట్ లుక్ టీజర్, ఆ తరువాత Sarkaru Vaari Paata Trailer రిలీజ్ చేసారు మేకర్స్. వాటన్నిటికీ కూడా విపరీతమైన రెస్పాన్స్ రావడంతో ఫైనల్ గా మూవీ 12 మే 2022 న గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ అయింది. అయితే రిలీజ్ డే నుండే సర్కారు వారి పాట నెగటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమాల్లో ఒకటైన ట్విట్టర్ లో అర్ధరాత్రి నుండే డిజాస్టర్ సర్కారు వారి పాట ట్యాగ్స్ తో పాటు కొందరు స్పేస్ కూడా అదే ట్యాగ్ తో నడిపారు. 

మరోవైపు ఆల్మోస్ట్ సోషల్ మీడియా తోపాటు సైట్స్, యూట్యూబ్ సహా అన్ని మీడియా మాధ్యమాల్లో Sarkaru Vaari Paata Movie ఫ్లాప్ అని తేల్చేసారు. అయినప్పటికీ మూవీలో సూపర్ స్టార్ మహేష్ బాబు స్టైల్, యాక్టింగ్ కి ఆడియన్సు నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ముఖ్యంగా దర్శకుడు పరశురామ్ ఫస్ట్ హాఫ్ బాగానే తీసినప్పటికీ కూడా సెకండ్ హాఫ్ లో బ్యాంక్ అనే టెంపుల్ అంటూ కొంత మెసేజ్ అయితే ఇచ్చారు. 

అంతకముందు కొన్నేళ్లుగా మహేష్ బాబు నుండి మెసేజ్ సినిమాలు చూసిన వారు మళ్ళీ మెసేజ్ రిపీట్ చేసారని భావించారు. అయితే ఓవరాల్ గా కథలో ఉన్న మెసేజ్ తో పాటు మహేష్ యాక్టింగ్, కీర్తి ఆకట్టుకునే అందం, సాంగ్స్ బాగానే రెస్పాన్స్ అందుకున్నాయి. కానీ ఫస్ట్ డే నుండే టాక్ నెగటివ్ రావడంతో మూవీ మెల్లగా బాక్సాఫీస్ వద్ద చతికలపడడం ఖాయం అని అందరూ భావించిన తరుణంలో కోట్లాది ఫ్యాన్స్ ఆడియన్సులో తనకున్న మాస్ కల్ట్ క్రేజ్ స్టార్డంతో సూపర్ స్టార్ మహేష్ బాబు మేనియా ఈ మూవీని దాదాపుగా ఫైనల్ గా ఓవరాల్ వరల్డ్ వైడ్ రూ. 125 కోట్ల షేర్ మార్క్ కు నడిపింది. 

అనగా మొత్తంగా ఈ మూవీ వరల్డ్ వైడ్ రూ. 235 కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టి మహేష్ బాబు కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే ఇది ప్యూర్ మహేష్ బాబు మేనియా మాత్రమేనని, మూవీ కథ, కథనాల్లో పెద్దగా బలం లేనప్పటికీ ఈ రేంజ్ బాక్సాఫీస్ రన్ కి చాలా వరకు మహేష్ స్టార్డం కారణం అని పలువురు సినీ విశ్లేషకులు, బాక్సాఫీస్ అనలిస్టులు అభిప్రాయపడ్డారు. ఆ విధంగా అందరిలో ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన సర్కారు వారి పాట మూవీ ఫస్ట్ డే నుండే నెగటివ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ రూ. 60 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ Box Office వద్ద రూ. 235 కోట్ల కలెక్షన్ రాబట్టడం విశేషం. మరి మనం ఇప్పుడు బ్లాక్ బస్టర్ సర్కారు వారి పాట మూవీ యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ తో పాటు టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్ డీటెయిల్స్ ని ఏరియా వైజ్ గా చూద్దాం.


Sarkaru Vaari Paata Pre Release Business

Nizam - 36 Crores 

Ceeded - 13 Crores

UA - 12.50 Crores

East - 8.50 Crores

West - 7 Crores

Guntur - 9 Crores

Krishna - 7.50 Crores

Nellore - 4 Crores

Ap-TG Total - 97.50 Crores

KA - 8.50 Crores

ROI - 3 Crores

OS - 11 Crores

SVP Total Worldwide Pre Release Business - 120 Crores

Sarkaru Vaari Paata Collection Worldwide  

Nizam - 40.14 Crores 

Ceeded - 14.75 Crores

UA - 17.09 Crores

East - 11.57 Crores

West - 8.64 Crores

Guntur - 11.47 Crores

Krishna - 7.97 Crores

Nellore - 4.76 Crores

AP-TG Total - 104.63 Crores

KA+ROI - 9.50 Crores

OS - 18.00 Crores

SVP Total Worldwide Collection - 125.85 Crores

ఇక టోటల్ గా చూస్తే సూపర్ స్టార్ మహేష్ బాబు Sarkaru Vaari Paata Total Collection ప్రకారం రికవరీ 110%, అంటే మూవీ బ్లాక్ బస్టర్ స్టేటస్ అని చెప్పవచ్చు. ఆ విధంగా ఈ మూవీతో మరొక బ్లాక్ బస్టర్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నారు మహేష్ బాబు. ఇటువంటి లేటెస్ట్ టాలీవుడ్ మూవీ అప్ డేట్స్, బాక్సాఫీస్ కలెక్షన్స్, గాసిప్స్, న్యూస్ కోసం ఎప్పటికప్పుడు మన తెలుగు మూవీ మీడియా సైట్ ని ఫాలో అవ్వండి

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow