Chhaava Movie Box Office Collection: Day-Wise Earnings & Worldwide Report
Chhaava Movie Box Office Collection Worldwide బాలీవుడ్ మూవీ ఇండస్ట్రీలో లేటెస్ట్ గా రిలీజ్ అయిన భారీ హిస్టారికల్ యాక్షన్ ఎమోషనల్ డ్రామా మూవీ ఛావా (Chhaava). ఈ మూవీలో ఛత్రపతి శంభాజీ మహారాజ్ గా విక్కీ కౌశల్ (Vicky Kaushal) నటించగా ఆయన

బాలీవుడ్ మూవీ ఇండస్ట్రీలో లేటెస్ట్ గా రిలీజ్ అయిన భారీ హిస్టారికల్ యాక్షన్ ఎమోషనల్ డ్రామా మూవీ ఛావా (Chhaava). ఈ మూవీలో ఛత్రపతి శంభాజీ మహారాజ్ గా విక్కీ కౌశల్ (Vicky Kaushal) నటించగా ఆయన సతీమణి అయిన యేసు భాయ్ భోంస్లేగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) కనిపించారు.
Chhaava Movie Box Office Collection – Day-Wise Earnings & Worldwide Report
ఈ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యున్నత సాంకేతిక విలువలతో అగ్ర నిర్మాణ సంస్థ మ్యాడాక్ ఫిలిమ్స్ పై దినేష్ విజన్ భారీ వ్యయంతో నిర్మించారు. లక్ష్మణ్ ఉటేకర్ దీనిని తెరకెక్కించారు. మొత్తంగా అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ తాజాగా ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు నాడు గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకి వచ్చింది.
Chhaava Movie First Day Collection & Opening Day Records
ఈ మూవీలోని కీలక పాత్రల్లో దివ్య దత్తా, డయానా పేంటీ, అక్షయ్ ఖన్నా, అశుతోష్ రాణా నటించారు. సౌరభ్ గోస్వామి ఫోటోగ్రఫి అందించిన ఈ మూవీకి ఆస్కార్ విజేత ఏ ఆర్ రహమాన్ స్వరాలు సమకూర్చారు. ఇక ఫస్ట్ డే ఫస్ట్ షో నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న ఛావా మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో కలెక్షన్ తో కొనసాగుతోంది.
మరాఠా చక్రవర్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ (Chhatrapati Shivaji Maharaj) మరణం తరువాత ఆయన రాజ్యం పై ఒక్కసారిగా దండెత్తి దానిని ఆక్రమించుకోవాలని చూస్తాడు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు. అయితే అదే సమయంలో శివాజీ మహారాజ్ కుమారుడు అయిన శంభాజీ మహారాజ్ అతడికి అడ్డుపడి రాజ్యము వారికి దక్కకుండా చేసే పోరాటమే ఈ మూవీ యొక్క ముఖ్య కథనం.
Chhaava Total Box Office Collection – India & Overseas Earnings
ఇక ఈ మూవీని ఆద్యంతం ఆకట్టుకునే రీతిన దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తీశారు. హీరోగా ఛత్రపతి శంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ నటన నిజంగా అద్భుతం. ప్రతి సన్నివేశంలో ఆయన ఎంతో ఆకట్టుకున్నారు, ముఖ్యంగా కీలకమైన యాక్షన్ ఎమోషనల్ సీన్స్ లో అయితే నభూతో నభవిష్యతి అనే రీతిన సాగింది ఆయన నటన.
ఇక ఏ ఆరా రహమాన్ అందించిన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, తో పాటు సౌరబ్ గోస్వామి గ్రాండియర్ విజువల్స్, హీరోయిన్ రష్మిక మందన్న అలరించే పెర్ఫార్మన్స్, దినేష్ విజన్ భారీ నిర్మాణ విలువలు వంటివి ఈ మూవీకి ప్రధాన బలాలుగా చెప్పవచ్చు. ఫస్ట్ డే తోనే ఈ మూవీ యొక్క సక్సెస్ బాట మొదలైంది.
ఇక ఫస్ట్ డేనే రూ. 31 కోట్ల నెట్ కలెక్షన్ సొంతం చేసుకున్న ఛావా మూవీ రెండవ రోజు నుండి తన బాక్సాఫీస్ ఆధిపత్యాన్ని మరింతగా చూపిస్తూ ఆడియన్స్ ని అలరిస్తూ థియేటర్స్ లో కొనసాగుతోంది. ఇప్పటికే గడచినా ఐదు రోజుల్లో దాదాపుగా రూ. 200 కోట్ల నెట్ కలెక్షన్ మార్క్ కు ఛావా మూవీ చేరుకుంది.
Chhaava Movie Hit or Flop? Budget, Verdict & Collection Report
అటు ఓవర్సీస్ ఆడియన్స్ నుండి సైతం ఈ మూవీకి మంచి రెస్పాన్స్ లభిస్తుండడం విశేషం. నేడు శివాజీ మహారాజ్ జయంతి కావడం, అలానే మరొక రెండు రోజుల్లో వారాంతం ఉండడంతో ఈమూవీ యొక్క కలెక్షన్ మరింతగ పరుగులు పెట్టె అవకాశం గట్టిగా కనపడుతోందని అంటున్నారు ట్రేడ్ అనలిస్టులు. ప్రస్తుతం ఈ మూవీకి ఇతర సినిమాల నుండి ఎటువంటి పోటీ కూడా లేకపోవడం మరొక కలిసి వచ్చే అంశం అంటున్నారు విశ్లేషకులు.
Chhaava vs Other Recent Movies – Box Office Comparison
ముఖ్యంగా సాధారణ ఆడియన్స్ అందరి నుండి ఛావా మంచి ఆదరణ అందుకుంటుండడంతో దీనిని తెలుగుతో పాటు ఇతర పాన్ ఇండియన్ భాషల్లో కూడా రిలీజ్ చేయాలనీ పలువురు ఆడియన్స్ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తూ కోరుతున్నారు. ఈ విషయమై ఛావా టీమ్ కూడా ఆలోచన చేస్తున్నట్లు టాక్. మన తెలుగు ఆడియన్స్ అయితే ఈ మూవీ యొక్క తెలుగు వర్షన్ కోసం ఎంతో ఆసక్తికరంగా వెయిట్ చేస్తన్నారు. ఇక ఛావా మూవీ యొక్క ఆరు రోజుల కలెక్షన్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం.
What's Your Reaction?






