SSMB 29 Release Date Update – Mahesh Babu & Rajamouli’s Mega Project Update

SSMB 29 Release Date సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తాజాగా జక్కన్న ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మక గ్లోబ్ ట్రొటింగ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ SSMB 29 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వాస్తవానికి ఇంకా అధికారికంగా

SSMB 29 Release Date Update – Mahesh Babu & Rajamouli’s Mega Project Update

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తాజాగా జక్కన్న ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మక గ్లోబ్ ట్రొటింగ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ SSMB 29 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వాస్తవానికి ఇంకా అధికారికంగా ప్రకటన రాని ఈ మూవీ యొక్క ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఇప్పటికే పూర్తి అయింది. 

SSMB 29 Release Date Confirmed – Mahesh Babu’s Most Awaited Movie

మరోవైపు మూవీకి సంబంధించి హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీ లో భారీ సెట్టింగ్స్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఎం ఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్న ఈ మూవీని ప్రముఖ సీనియర్ నిర్మాత కేఎల్ నారాయణ తన దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై దాదాపుగా వెయ్యి కోట్ల భారీ వ్యయంతో నిర్మిస్తున్నట్లు టాక్. 

మరోవైపు ఈ మూవీలోని తన పాత్ర కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు బల్క్ గా బాడీని అలానే ఫుల్ గా క్రాఫ్, గడ్డాన్ని పెంచుతున్న సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితం మహేష్ బాబుని సింహంతో పోలుస్తూ దానిని బందించి లాక్ చేసి పాస్ పోర్ట్ కైవశం చేసుకున్న ఫోటోని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు జక్కన్న. 

SSMB 29 Movie Story, Cast & Crew – Everything We Know So Far

కాగా దానికి అందరి నుండి సూపర్ గా రెస్పాన్స్ లభించింది. ముఖ్యంగా ఆ పోస్ట్ కి సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అంటూ పెట్టిన కామెంట్ కూడా విపరీతంగా హైలైట్ అయింది. అలానే ఈ మూవీలో ఒక ముఖ్య పాత్ర చేస్తున్న ప్రియాంక చోప్రా కూడా నవ్వుతూ రాజమౌళి పోస్ట్ కి కామెంట్ చేసారు. 

మొత్తంగా ఆ పోస్ట్ తో ఒక్కసారిగా SSMB29 మూవీ పై అందరిలో మరింత విపరీతంగా అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ మూవీకి సంబంధించి అసలు ఏ ఏ ఏ నటీనటులు నటిస్తున్నారు, టెక్నీషియన్స్ ఎవరు అనేటువంటి అంశాలు అన్ని కూడా ఇంకా ప్రకటించాల్సి ఉంది. కాగా ఈ భారీ పాన్ వరల్డ్ మూవీ యొక్క అనౌన్స్ మెంట్ ఏప్రిల్ నెలలో ఉండేటువంటి అవకాశం ఉందని అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. 

SSMB 29 Shooting Updates – Rajamouli’s Vision for the Film

అలానే మూవీ అనౌన్స్ మెంట్ కోసం ఒక గ్లింప్స్ ని కూడా జక్కన్న అండ్ టీమ్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట. కాగా మ్యాటర్ ఏమిటంటే, ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి 2027 సమ్మర్ లో ఆడియన్స్ ముందుకి తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నారట జక్కన్న. 

పలువురు హాలీవుడ్ నటులు కూడా ఇందులో కీలక పాత్రలు చేయనుండేనా మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఒక కీలక నెగటివ్ రోల్ చేయనున్నారట. ఒక ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ కూడా ఈ మూవీలో భాగస్వామి కానుందనే న్యూస్ కూడా వినపడుతోంది. 

When & Where to Watch SSMB 29 After Theatrical Release?

మొత్తంగా అందరిలో ఎన్నో భారీ అంచనాలు ఏర్పరిచిన ఈమూవీలో విజువల్ ఎఫెక్ట్స్ కూడా గ్రాండ్ గా ఉంటాయని, ఇండియన్ ఫిలిం హిస్టరీలో ఎప్పటికీ నిలిచిపోయేలా రాజమౌళి తో పాటు ఆయన టీమ్ కూడా ఎంతో కసరత్తు చేస్తున్నట్లు చెప్తున్నారు. 

అయితే పక్కాగా మాత్రం ఈ మూవీ ఎపుడు అనౌన్స్ అవుతుంది, ఎప్పుడు షూట్ పూర్తి అవుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విషయాలు అన్నింటిపై ఫైనల్ గా జక్కన్న మాత్రమే క్లారిటీ ఇవ్వగలరని అంటున్నాయి సినీ వర్గాలు. మరి అతి త్వరలో ఈ జంగిల్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ యొక్క అనౌన్స్ మెంట్ రావాలని కోరుకుందాం.     

SSMB 29 vs Other Upcoming Big Releases – Box Office Clash?

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow