HIT 3 Box Office Collection: Nani's Thriller Crosses ₹82 Crore Worldwide in 3 Days
Nani's HIT: The Third Case grosses ₹82 crore worldwide in just three days, marking a significant milestone in his career

టాలీవుడ్ స్టార్ యాక్టర్ నతురల్ స్టార్ నాని ప్రస్తుతం కెరీర్ పరంగా వరుసగా విజయాలతో దూసుకేళ్తున్నారు. ఇటీవల వివేక్ ఆత్రేయతో ఆయన చేసిన సరిపోదా శనివారం మూవీ పెద్ద విజయం అందుకున్న విషయం తెలిసిందే. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించిన ఏ ఈమూవీలో ఎస్ జె సూర్య విలన్ గా కనిపించారు.
ఇక దాని అనంతరం తాజగా యువ దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో నాని చేసిన మూవీ హిట్ 3 (Hit 3 The Third Case). ఈ మూవీ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందగా ఇందులో బాలీవుడ్ నటుడు ప్రతీక్ బబ్బర్ విలన్ గా కనిపించారు.
హిట్ 3 బాక్సాఫీస్ కలెక్షన్: మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ₹82 కోట్లు
మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీలో యువ కన్నడ అందాల నటి శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) హీరోయిన్ గా నటించగా కీలక పాత్రల్లో రావు రమేష్, సూర్య శ్రీనివాస్, సముద్రఖని, కోమలీ ప్రసాద్ నటించారు.
మిక్కీ జె మేయర్ సంగీతమా అందించిన ఈ మూవీని యూనానిమస్ ప్రొడక్షన్స్, వాల్ పోస్టర్ సినిమా సంస్థలు గ్రాండ్ గా నిర్మించాయి. కాగా హాయ్ 3 మూవీలో పవర్ఫుల్ పోలీస్ అధికారి అర్జున్ సర్కార్ పాత్రలో నాచురల్ స్టార్ నాని అదిరిపోయే పెర్ఫార్మన్స్ కియా అందరి నుండి మంచి పేరు లభిస్తోంది.
మూడు రోజుల క్రితం ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద అనేక ప్రాంతాల్లో బాగా కలెక్షన్ తో కొనసాగుతోంది. హీరోయిన్ శ్రీనిధి శెట్టి తో పాటు ప్రతి ఒక్క పాత్రధారి యొక్క నటన కూడా ఎంతో బాగుంది. దర్శకుడు శైలేష్ కొలను రాసుకున్న కథనాన్ని, ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే తో ఆసక్తికరంగా ముందుకు నడపడంలో సఫలం అయ్యారు.
నాని కెరీర్‌లో మరో మైలురాయి సాధించిన హిట్ 3
ముఖ్యంగా ఈ మూవీలో వయొలెన్స్ ఎక్కువ ఉండడంతో మూవీకి సెన్సార్ బోర్డ్ వారు ఏ సర్టిఫికెట్ కేటాయించారు. మొదటి రోజు ఓవరాల్ గా రూ. 47 కోట్ల గ్రాస్ రాబట్టిన హిట్ 3 మూవీ, మొత్తం మూడు రోజుల్లో రూ. 82 కోట్ల గ్రాస్ కలెక్షన్ ని సొంతం చేసుకుంది.
మూవీ యొక్క ప్రస్తుత కలెక్షన్ స్టేటస్ ని బట్టి చూస్తుంటే త్వరలోనే రూ. 100 కోట్ల నుండి రూ. 150 కోట్లకు చేరుకునే అవకాశం ఉందని అంటున్నాయి సినీ వర్గాలు. మరోవైపు ఈ సినిమా ఓవరాల్ గా క్లోసింగ్ లో హీరో నాని కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచే అవకాశం కూడా లేకపోలేదని వారు చెప్తున్నారు.
ఉత్తర అమెరికాలో ₹15 కోట్లు వసూలు చేసిన హిట్ 3
మరోవైపు నానికి యుఎస్ఏ లో బాగా క్రేజ్ ఉంది. అక్కడి ఉత్తర అమెరికాలో ప్రస్తుతం ఈ మూవీ బాగా దూసుకెళ్తోంది. గడచిన మూడు రోజుల్లో హిట్ 3 మూవీ రూ. 15 కోట్లు కొల్లగొట్టడం విశేషంగా చెప్పుకోవాలి.
ఇక హిట్ 3 మూవీకి మిక్కీ జె మేయర్ అందించిన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు సాను జాన్ వర్గేసే అందించిన గ్రాండియర్ విజువల్స్, భారీ నిర్మాణ విలువలు కూడా ప్లస్ పాయింట్స్ గా చెప్పవచ్చు.
హిట్ 3 తరువాత ఇప్పటికే తన నెక్స్ట్ మూవీ అనౌన్స్ చేసారు నాని. గతంలో తనతో దసరా వంటి మాస్ యాక్షన్ మూవీ తీసిన శ్రీకాంత్ ఓదెలతో ది పారడైజ్ అనే మూవీ చేయనున్నారు నాని. ఈ మూవీ యొక్క అఫీషియల్ అనౌన్స్ మెంట్ గ్లింప్స్ టీజర్ ఇటీవల రిలీజ్ అయి అందరినీ ఆకట్టుకుంది.
What's Your Reaction?






