Kriti Sanon's Old Video With Mother Goes Viral Online
A heartwarming old video of Kriti Sanon with her mother is now trending on social media, capturing the internet’s attention with its emotional charm.

టాలీవుడ్ తో పాటు అటు బాలీవుడ్ లో కూడా ఎంతో పాపులర్ అయిన యువ నటీమణుల్లో కృతి సనన్ కూడా ఒకరు. ఆమె తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా క్రీటివ్ డైరెక్టర్ సుకుమార్ తీసిన వన్ నేనొక్కడినే మూవీలో హీరోయిన్ గా నటించారు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ పై గ్రాండ్ గా నిర్మితం అయిన ఈ మూవీ 2014 జనవరిలో రిలీజ్ అయి పెద్దగా విజయం అందుకోలేదు.
అయితే ఆ మూవీలో సూపర్ స్టార్ మహేష్ బాబు యాక్టింగ్ తో పాటు కృతి సనన్ తో ఆయన పెయిర్ కి ఎంతో క్రేజ్ లభించింది. అనంతరం తెలుగులో నాగచైతన్య హీరోగా రూపొందిన దోచేయ్ మూవీలో ఆమె హీరోయిన్ గా నటించారు. ఇక ఇటీవల పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తీసిన ప్రతిష్టాత్మక ఇతిహాస గాథ రామాయణంలో ఆమె జానకి పాత్రలో కనిపించి తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు.
కృతీ సనన్ పాత వీడియో: అమ్మతో కలసిన మధుర జ్ఞాపకం
ఈ మూవీ బాగానే విజయం అందుకుంది. ఇక ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఆమె పలు మంచి ఆఫర్స్ తో కొనసాగుతున్నారు. ఆ విధంగా దేశవ్యాప్తంగా ఆడియన్స్ అందరిలో తన ఆకట్టుకునే అందం, అభినయంతో హీరోగా బాగా పేరు సొంతం చేసుకుని కెరీర్ పరంగా దూసుకెళ్తున్నారు కృతి సనన్.
ఇక ఆమె తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా పలు విషయాలు ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటారు. అలానే పలు సినిమా సంగతులు కూడా ఆమె అందరితో పంచుకుంటూ ఉంటారు. విషయం ఏమిటంటే, కొన్నేళ్ల క్రితం తన తల్లితో కలిసి కృతి సనన్ ఉన్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వైరల్ అవుతున్న వీడియో సోషల్ మీడియాలో ఎంత ట్రెండ్ అయిందో చూడండి
ఆ వీడియోలో కృతి సనన్ తల్లి గీత సనన్ తన కుమార్తె యొక్క వివాహం గురించి కొంత ఆవేదన చెందడం చూడవచ్చు. కాగా తన కూతురుకి 23 లేదా 24 ఏళ్లకే పెళ్లి చేయాలనేది తన ఆలోచన అని ఆ వీడియోలో గీత సనన్ తెలిపారు.
నిజానికి మీ కూతురు కృతి పెళ్లి గురించి మీకు ఏమైనా వేదన ఉందా అని అడిగితే, అవును ఎందుకంటే తనని 23 ఏళ్లకే పెళ్లి చేసుకోమని తరచు చెప్తూ ఉంటాను. దానికి ప్రధాన కారణం, నాకు 30 ఏళ్ళ వయసు వచ్చే నాటికి కృతి సనన్ చెల్లెలు నుపుర్ సనన్ నాకు జన్మించింది. అందుకే తనకి 23 ఏళ్లకే పెళ్లి జరిగితే మంచిది అని నాకు అనిపించిందని తెలిపారు గీత సనన్.
వీడియో వెనుక ఉన్న నిజమైన భావోద్వేగ కథ
వాస్తవానికి ఈ వీడియో కృతి సనన్ యొక్క ఫ్యాన్ పేజ్ ద్వారా ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇక కొన్నాళ్లుగా కృతి ఒక యువ బాలీవుడ్ నటుడితో ప్రేమలో ఉన్నారనే వార్తలు కూడా మీడియా మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇప్పటివరకు దానిపై ఆమె నుండి ఎటువంటి స్పందన లేదు.
అలానే కృతి సనన్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ అక్కడక్కడా పలు వార్తలు కూడా హల్చల్ చేస్తున్నాయి. అయితే అందులో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది తెలియాలి అంటే ఆమె కుటుంబం నుండి పెళ్లి విషయమై అధికారికంగా ప్రకటన రావాల్సిందే. మొత్తంగా నటిగా ప్రస్తుతం మంచి క్రేజ్ తో కొనసాగుతున్న కృతి రాబోయే రోజుల్లో మరిన్ని విజయవంతమైన సినిమాల్లో నటించి ఇంకా బాగా క్రేజ్ తెచ్చుకోవాలని కోరుకుందాం.
What's Your Reaction?






