Tollywood Actor Ram Pothineni Wife Details: Real Facts You Should Know
Curious about Ram Pothineni's wife? Here's the real truth about Tollywood star Ram's marriage, rumors, and more.

తెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుతం మంచి పేరు క్రేజ్ తో కొనసాగుతున్న నటుల్లో రామ్ పోతినేని కూడా ఒకరు. ప్రముఖ సీనియర్ నిర్మాత, స్రవంతి మూవీస్ అధినేత రవికిశోర్, హీరో రామ్ కు పెద్దనాన్న అవుతారు. ఇక తన కెరీర్ ని తొలిసారిగా వైవిఎస్ చౌదరి తీసిన దేవదాసు మూవీ ద్వారా ప్రారంభించారు రామ్.
ఆ మూవీలో ఇలియానా హీరోయిన్ గా నటించింది. ఆమెకు కూడా అది పరిచయ చిత్రమే కావడం విశేషం. బొమ్మరిల్లు బ్యానర్ పై అత్యంత గ్రాండ్ గా వైవిఎస్ చౌదరి స్వయంగా నిర్మిస్తూ తెరకెక్కించిన దేవదాసు మూవీకి దివంగత సంగీత దర్శకుడు చక్రి సంగీతం అందించారు. అప్పట్లో మంచి విజయం అందుకుని యువతతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆ మూవీ ఎంతో ఆకట్టుకుంది.
రామ్ పోతినేని భార్య గురించి పూర్తి సమాచారం
అనంతరం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తో రామ్ చేసిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ జగడం. ఈ మూవీ భారీ అంచనాలతో రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి సక్సెస్ అయితే అందుకోలేకపోయింది. అయితే ఆ మూవీ నుండి కెరీర్ పరంగా ఒక్కొక్కటిగా తనకు వచ్చిన అవకాశాలు అందుకుంటూ కొనసాగిన హీరో రామ్ వాటిలో కొన్ని విజయాలతో మంచి పేరు సొంతం చేసుకున్నారు.
ముఖ్యంగా శ్రీను వైట్ల దర్శకత్వంలో జెనీలియా హీరోయిన్ గా రామ్ హీరోగా తెరకెక్కిన ఫ్యామిలీ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ రెడీ అప్పట్లో అతి పెద్ద విజయం అందుకుని హీరోగా రామ్ కెరీర్ కి మంచి జోష్ అందించింది. అనంతరం సంతోష్ శ్రీనివాస్ తీసిన కందిరీగ కూడా బాగా విజయవంతం అయింది.
అలానే ఆపై వచ్చిన పండగ చేస్కో, నేను శైలజ, ఉన్నది ఒక్కటే జిందగీ వంటి సినిమాల సక్సెస్ లు హీరోగా రామ్ కెరీర్ కి మంచి బాటలు వేసాయి. అనంతరం టాలీవుడ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ చేసిన మూవీ ఇస్మార్ట్ శంకర్. ఈ మూవీలో నిధి అగర్వాల్, నభ నటేష్ హీరోయిన్స్ గా నటించారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ మూవీ సక్సెస్ కొట్టి హీరోగా రామ్ కు బాగా మాస్ ఇమేజ్ కూడా తెచ్చిపెట్టింది.
ఇక ఇటీవల బోయపాటి శ్రీను తీసిన పాన్ ఇండియన్ మూవీ స్కంద, అలానే పూరి జగన్నాథ్ తీసిన డబుల్ ఇస్మార్ట్ సినిమాల ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు రామ్. ఇక ప్రస్తుతం యువ దర్శకుడు పి. మహేష్ బాబుతో రామ్ ఒక లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ చేస్తున్నారు. ఈ మూవీ పై అందరిలో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.
రామ్ పోతినేనికి నిజంగానే పెళ్లి అయిందా ?
త్వరలో ఈ మూవీ నుండి ఒక్కొక్కటిగా అప్ డేట్స్ రానున్నాయి. అయితే విషయం ఏమిటంటే, హీరో రామ్ ఫలానా హీరోయిన్ తో డేటింగ్ లో ఉన్నారు, ఫలానా హీరోయిన్ తో ఆయన లవ్ లో ఉన్నారు అంటూ గత కొన్నాళ్లుగా పలు మీడియా మాధ్యమాల్లో పుకార్లు విరివిగా ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే.
మరికొన్ని మాధ్యమాల్లో అయితే ఆయనకు పెళ్ళైపోయి పిల్లలు కూడా ఉన్నట్లు రాసుకొచ్చారు. అటు యూట్యూబ్ లో సైతం రామ్ కి వివాహం ఎప్పుడో జరిగిపోయింది అంటూ కొన్ని వీడియోస్ వైరల్ అయ్యాయి. అదుగో ఆమెనే హీరో రామ్ భార్య అంటూ కొన్ని ఫొటోస్ కూడా ప్రచారం చేసారు.
పెళ్లి పుకార్లపై రామ్ ఇచ్చిన అధికారిక ప్రకటన
అయితే వాటి పై గతంలో పలుమార్లు స్పందించిన రామ్ టీమ్, అవన్నీ ఒట్టి పుకార్లు మాత్రమే అంటూ కొట్టిపారేశాయి. అవి తాజాగా మరింత వైరల్ అవుతుండడంతో దయచేసి అటువంటి తప్పుడు కథనాలు నమ్మవద్దని, ప్రస్తుతం రామ్ కెరీర్ మీద ఎంతో ఫోకస్ చేసి ఉన్నారని, ఒకవేళ ఆయనకు వివాహం నిశ్చయం అయితే అందరికీ తెలియపరుస్తారని వారు మరొక్కసారి స్పష్టం చేసారు.
దీనితో రామ్ వివాహం పుకార్లకు గట్టిగా అడ్డుకట్ట పడ్డట్లే అని తెలుస్తోంది. అందుకే మనం అందరం కూడా సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ కి సంబందించిన ఎటువంటి విషయం అయినా వారి నుండి అధికారికంగా వచ్చేవరకు నమ్మకుండా ఉంటే బెటర్.
అలానే దయచేసి మనం అందరం ఇటువంటి తప్పుడు కథనాలు, పుకార్లు ప్రచారం చేయకుండా ఉందాం. వాస్తవానికి రామ్ పోతినేని కి వివాహం కాలేదనేది అందరికి తెలిసిందే. ఎందుకంటే నటుడిగా ఎన్నో ఏళ్ళ నుండి ఆడియన్స్, ఫ్యాన్స్ ని అలరిస్తూ కొనసాగుతున్న రామ్ అటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూనే ఉన్నారు.
అటువంటప్పుడు నిజంగా ఆయనకు వివాహం జరిగితే అందరికీ తెలియపర్చకుండా ఉండరు కదా అనేది అర్ధం చేసుకునిసెలబ్రిటీస్ కి సంబంధించి వచ్చే ఇటువంటి పుకార్లు మనం నమ్మకుండా, ముఖ్యంగా వాటిని ఏమాత్రం ఎంకరేజ్ చేయకుండా ఉంటె బాగుంటుందని మనవి. మరి కెరీర్ పరంగా హీరో రామ్ పోతినేని మరింత మంచి విజయాలు అందుకుని ముందుకు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.
What's Your Reaction?






