Babil Khan Deletes Instagram After Emotional Video Criticizing Bollywood

Actor Babil Khan removes his Instagram account following a heartfelt video discussing challenges in Bollywood. Fans express concern over his emotional state.

Babil Khan Deletes Instagram After Emotional Video Criticizing Bollywood

దివంగత బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ (Irfan Khan) భారత దేశ ప్రేక్షకులు అందరికీ సుపరిచితం. హిందీలో పలు సక్సెస్ఫుల్ సినిమాల్లో నటించిన ఆయన ఆడియన్స్ నుండి మంచి పేరు సొంతం చేసుకున్నారు. 

తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రిష హీరోయిన్ గా గుణశేఖర్ తీసిన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ సైనికుడు మూవీలో ఇర్ఫాన్ ఖాన్ విలన్ గా కనిపించారు. 

బాబిల్ ఖాన్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా తొలగింపు: బాలీవుడ్‌పై భావోద్వేగ వీడియో తర్వాత

ఆ విధంగా తెలుగు ఆడియన్స్ నుండి కూడా మంచి పేరు అందుకున్నారు ఇర్ఫాన్. అయితే ఆయన తనయుడు బాబిల్ ఖాన్ (Babil Khan) అక్కడక్కడా పలు సినిమాల్లో ప్రస్తుతం నటిస్తూ నటుడిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఫ్రైడే నైట్ ప్లాన్, లాగౌట్ వంటి సినిమాల్లో నటించి ఆకట్టుకున్నాడు బాబిల్ ఖాన్. 

అయితే విషయం ఏమిటంటే, తాజాగా అతడు తన సోషల్ మీడియా మాధ్యమం ఇన్స్టాగ్రామ్ (Instagram) లో పోస్ట్ చేసిన ఒక వీడియో బాలీవుడ్ మీడియా మరియు ఆడియన్స్ అందరినీ పెద్ద షాక్ కి గురి చేసింది. 

తన తండ్రి చనిపోయి ఐదేళ్లయిన సందర్భంగా ఆయనకు బాధాతప్త హృదయంతో నివాళులు ఆరోపించిన తరువాత బాబిల్ ఈ వీడియోని పోస్ట్ చేసాడు. 

బాబిల్ భావోద్వేగ వీడియోలో బాలీవుడ్ సెలబ్రిటీల ప్రవర్తనపై విమర్శలు

అక్కడి నటీనటుల అయిన అనన్య పాండే (Ananya Panday) , అర్జున్ కపూర్ (Arjun Kapoor), షనాయా కపూర్ (shanaya kapoor) , సిద్దాంత్ చతుర్వేది (siddhant chaturvedi), ఆదర్శ్ గౌరవ్ (adarsh gourav), అర్జిత్ సింగ్ (arijit singh), రాఘవ్ జుయల్ (Raghav Juyal) వంటి వారు ఉన్నారని మీకు తెలుసుకదా. నిజానికి ఇంకా చాలా మంది పేర్లు  ఉన్నాయి. 

బాలీవుడ్ అంతా ఫేక్, ఈ ఇండస్ట్రీ బాగుండాలని ఎవరూ కోరుకోవడం లేదు. నేను నటించిన సినిమా పరిశ్రమల్లో బాలీవుడ్ అత్యంత ఫేక్ ఫేక్ అంటూ అతడు తన ఇన్స్టాగ్రామ్ లో వీడియోలో ఆవేదన చెందుతూ ఏడుస్తూ అరుస్తూ చెప్పుకొచ్చాడు. 

బాబిల్ ఖాన్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా తొలగింపు

అయితే అనంతరం కొద్దిసేపటికే ఆ వీడియో రెడిట్ మాధ్యమంలో వైరల్ కావడం, అనేక మంది దానిని పంచుకోవడంతో బాగా వైరల్ అయిపోయింది. అయితే ఆ వీడియో చూసిన పలువురు ప్రేక్షకాభిమానులు బాబిల్ ఖాన్ మానసిక స్థితి బాగోలేదని, అందుకే అతడు అలా మాట్లాడుతున్నాడని అభిప్రాయపడుతున్నారు. 

అయితే ఆ వీడియో వైరల్ అయి విపరీతంగా ప్రచారం అవుతుండడంతో తాజాగా బాబిల్ ఖాన్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని పూర్తిగా డిలీట్ చేసాడు. అయితే పలువురు బాలీవుడ్ నటీనటులు, ప్రముఖుల నుండి వత్తిడి రావడంతోనే అతడు అకౌంట్ డీ యాక్టివేట్ చేసాడని అంటున్నారు. 

మొత్తంగా అయితే ప్రస్తుతం బాబిల్ ఖాన్ యొక్క ఇన్స్టాగ్రామ్ వీడియో విషయం ప్రస్తుతం బాలీవుడ్ అంతటా పెద్ద చర్చనీయాంశంగా మారింది. మరి దీని పై రాబోయే రోజుల్లో ఎవరైనా స్పందిస్తారో లేదో చూడాలి.  

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow