Shraddha Kapoor Joins Mahesh Babu in SSMB29 | Rajamouli's Epic ?

Shraddha Kapoor to play a pivotal role in SSMB29 alongside Mahesh Babu. Directed by SS Rajamouli, this jungle adventure is set for a 2027 release

Shraddha Kapoor Joins Mahesh Babu in SSMB29 | Rajamouli's Epic ?

తెలుగు మూవీ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కిస్తున్న లేటెస్ట్ బిగ్గెస్ట్ గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ మూవీ SSMB29. ఈ మూవీలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక పవర్ఫుల్ పాత్ర చేస్తుండగా ప్రియాంక చోప్రా (Priyanka Chopra), పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ఇతర కీలక పాత్రలు చేస్తున్నారు. 

మొదటి నుండి అందరిలో ఈ మూవీ పై ఆకాశమే హద్దుగా అంచనాలు ఉన్నాయి. ఇటీవల ఆర్ఆర్ఆర్ (RRR) మూవీ లోని నాటు నాటు సాంగ్ ద్వారా ఆస్కార్ అవార్డు సొంతం చేసుకున్న ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీకి వి విజయేంద్ర ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. 

శ్రద్ధా కపూర్ – మహేష్ బాబు SSMB29 లో జతకట్టనున్నారా ?

కొన్నాళ్ల క్రితమే ప్రారంభమైన ఈ మూవీ యొక్క షూటింగ్ ఇప్పటివరకు 15 శాతం పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు జరిగిన షూటింగ్ లో రెండు కీలక యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు ఒక పాటని కూడా చిత్రీకరించారట. 

అతి త్వరలో SSMB 29 మూవీ యొక్క నెక్స్ట్ షెడ్యూల్ ప్రారంభం కానుండగా తదుపరి టీమ్ మొత్తం కూడా కెన్యా, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, స్విజర్లాండ్, బల్గెరియా దేశాలు వెళ్లనుందట. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ సీనియర్ నిర్మాత కేఎల్ నారాయణ ఈ మూవీ కోసం ఎంతో భారీ స్థాయిలో ఖర్చు చేసుకున్నట్లు తెలుస్తోంది. 

గతంలో తాను తీసిన బాహుబలి సిరీస్ సినిమాలు, ఆర్ఆర్ఆర్ ని మించేలా ఈ మూవీని మరింత భారీ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నట్లు చెప్తోంది టీమ్. 

రాజమౌళి దర్శకత్వంలో అడ్వెంచర్ డ్రామా

అలానే ఈ మూవీలో కొందరు హాలీవుడ్ (Hollywood) నటులు కూడా నటించనున్నారని, కీలకమైన మెయిన్ విలన్ పాత్ర కోసం ఇప్పటికే ఒక ప్రముఖ నల్లజాతీయుడైన హాలీవుడ్ నటుడిని జక్కన్న అండ్ టీమ్ ఎంపిక చేసిందని చెప్తున్నారు. మరోవైపు సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఆగష్టు 9న ఈ ప్రతిష్టాత్మక మూవీ యొక్క అఫీషియల్ టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 

అయితే అసలు విషయం ఏమిటంటే, ఈ మూవీలో మరొక హీరోయిన్ కూడా నటించనున్నారు అనేది లేటెస్ట్ టాలీవుడ్ బజ్. అందుతున్న సమాచారం ప్రకారం ఈ గ్లోబ్ ట్రోటింగ్ మూవీలో సూపర్ స్టార్ మహేష్ కి జోడీగా సాహో (Saaho) మూవీ భామ శ్రద్ధ కపూర్ (Shraddha Kapoor) కనిపించనున్నారని అంటున్నారు. 

శ్రద్ధా పాత్ర విశేషాలు మరియు విడుదల వివరాలు

వాస్తవానికి ఇందులో ప్రియాంక చోప్రా నటిస్తున్నప్పటికీ ఆమెది మూవీలో ఒక కీలమైన పాత్ర మాత్రమే అని, అసలు హీరోయిన్ శ్రద్ధ  కపూర్ అని టాక్. అలానే తన సినిమాల్లో హీరోతో పాటు హీరోయిన్ పాత్రలకు కూడా అందంతో ఆకట్టుకునే అభినయానికి కూడా ఎంతో చక్కటి ప్రాధాన్యత ఇస్తుంటారు మన జక్కన్న రాజమౌళి. 

ఆ విధంగానే ఈ మూవీలో కూడా శ్రద్ధ కపూర్ పాత్ర ఎంతో అబ్భుతంగా సిద్ధం చేశారట. ఇప్పటికే మూవీ టీమ్ ఆమెను సంప్రదించినట్లు చెప్తున్నారు. మరోవైపు బాలీవుడ్ లో కూడా శ్రద్ధ కపూర్ ఈ మూవీలో నటిస్తుండడం పై వార్తలు విరివిగా ప్రచారం అవుతున్నాయి. అయితే ఈ న్యూస్ కి సంబంధించి SSMB 29 టీమ్ నుండి అఫీషియల్ గా అనౌన్క్స్ మెంట్ మాత్రం రావాల్సి ఉంది. 

Mahesh Babu Shraddha Kapoor Movie

ఎందుకంటే ఈ భారీ మూవీకి సంబంధించి ఎప్పటికప్పుడు ఏదో ఒక న్యూస్ వైరల్ అవుతూ ట్రెండింగ్ లో నిలుస్తోంది. దానిని బట్టి పక్కాగా శ్రద్దా కపూర్ ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబుకి జోడీగా నటిస్తున్నారా లేదా అనే దానిపై క్లారిటీ రావాలి అంటే మరికొన్నాళ్లు వరకు వెయిట్ చేయకతప్పదని తెలుస్తోంది. 

ఇక ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కూడా గ్రాండియర్ గా హాలీవుడ్ రేంజ్ లో ఉండనున్నట్లు తెలుస్తోంది. అందుకోసం ఇప్పటికే రాజమౌళి పలు హాలీవుడ్ దిగ్గజ సంస్థల్ని సంప్రదించారట. మొత్తంగా ఈ భారీ మూవీని 2027 సమ్మర్ కానుకగా ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చేందుకుగా టీమ్ గట్టిగా ప్రయత్నాలు చేస్తోందట. 

కాగా మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా రానున్న గ్లింప్స్ లో మూవీ యొక్క రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేసే ఛాన్స్ ఉన్నట్లు మా Telugu Movie Media టీమ్ కి సమాచారం ఉంది. మరి ఇటువంటి లేటెస్ట్ తెలుగు మూవీ అప్ డేట్స్, న్యూస్, గేలరీ, రివ్యూస్, బాక్సాఫీస్ కలెక్షన్స్ కోసం మా సైట్ ని ఫాలో అవుతూ ఉండండి.   

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow