Sreeleela Adopts 3 Orphan Kids: Fans Hail Her Big Heart
Sreeleela surprises fans by adopting 2 orphan kids at a young age. Her real-life act of kindness is winning hearts across the internet.

తెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుతం యువ నటిగా మంచి పేరు, క్రేజ్ తో కొనసాగుతున్న యువ కథానాయికల్లో శ్రీలీల (Sreeleela) కూడా ఒకరు. కెరీర్ బిగినింగ్ నుండి ఒక్కో సినిమాతో నటిగా తన ఆకట్టుకునే అందం, అభినయంతో సినీ పరిశ్రమలో కొనసాగుతున్నారు శ్రీలీల. తొలిసారిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పెళ్లి సందడి సినిమా ద్వారా ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు.
గౌరీ రోణంకి తెరకెక్కించిన ఈ మూవీని రాఘవేంద్ర రావు పర్యవేక్షించారు. ఇటీవల మంచి అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకి వచ్చిన పెళ్లిసందడి మూవీ పెద్ద విజయం అందుకుంది. శ్రీకాంత్ కుమారుడు రోషన్ కథానాయకుడిగా ఈ మూవీలో కనిపించారు.
సినీ రంగంలో శ్రీలీల యొక్క ప్రయాణం
అయితే ఫస్ట్ మూవీతోనే హీరోయిన్ గా అందరినీ ఆకట్టుకున్న శ్రీలీల, ఆ తరువాత మాస్ మహారాజా రవితేజ (Raviteja) హీరోగా త్రినాధరావు నక్కిన తెరకెక్కించిన ధమాకా మూవీలో హీరోయిన్ గా నటించారు. ఆ మూవీ పెద్ద సక్సెస్ హీరోయిన్ గా ఆమెకు మరింత క్రేజ్ తీసుకువచ్చింది.
ఆపైన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో తెరకెక్కిన గుంటూరు కారం (Guntur Kaaram) మూవీలో మెయిన్ హీరోయిన్ గా నటించి మరొక విజయం తన ఖాతాలో వేసుకున్నారు శ్రీలీల.
అలానే యువ మెగా నటుడు పంజా వైష్ణవ్ తేజ్ తో ఆదికేశవ, ఎనర్జిటిక్ హీరో రామ్ తో స్కంద, ఇటీవల నితిన్ హీరోగా ఇటీవల వెంకీ కుడుముల తెరకెక్కించిన రాబిన్ హుడ్ మూవీస్ లో కోడోత్ ఆమె నటించారు. మొత్తంగా ఒక్కో సినిమాతో నటిగా మరింత మంచి క్రేజ్ సొంతం చేసుకుంటూ కెరీర్ పరంగా దూసుకెళ్తున్నారు శ్రీలీల.
అభిమానుల నుండి ప్రశంసలు మరియు స్పందనలు
అలానే తాజాగా శివకార్తికేయన్ హీరోగా సుధా కొంగర తీస్తున్న పరాశక్తి మూవీ ద్వారా ఆమె కోలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్నారు. అలానే మరోవైపు బాలీవుడ్ యువ నటుడు కార్తీక్ ఆర్యన్ హీరోగా రూపొందుతున్న ఆషికి 3 ద్వారా అటు హిందీ చిత్ర పరిశ్రమలోకి కూడా అడుగుపెడుతున్నారు. ఆ రెండు సినిమాలు ఆమెకి నటిగా మరింత మంచి పేరు లభించాలని కోరుకుందాం.
ఇక తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మాస్ యాక్షన్ సినిమాల దర్శకుడు హరీష్ శంకర్ తీస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సహా మరికొన్ని సినిమాలు శ్రీలీల చేస్తున్నారు. త్వరలో అవి ఒక్కొక్కటిగా ఆడియన్స్ ముందుకి రానున్నాయి. ఇకపై ఆడియన్స్ తన నుండి ఆశించ అన్ని అంశాలతో మరిన్ని మంచి సినిమాలు చేయాలనేది తన ఆలోచన అని ఇటీవల ఒక కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ శ్రీలీల.
ఇక తనకు వస్తున్న ఆదాయంలో కొంత భాగాన్ని సామజిక సేవా కార్యక్రమాలకు వినియోసిస్తున్న శ్రీలీల ఓవైపు ఎంబిబిఎస్ విద్యని కూడా అభ్యసిస్తున్నారు. అలానే ఇటీవల శ్రీలీల చేసిన ఒక మంచి మనసున్న పని అందరి మదిని కదిలించింది. ఫిబ్రవరి 2022 లో ఒక అనాధాశ్రమానికి వెళ్లిన శ్రీలీల అక్కడి పిల్లల పరిస్థితి చూసి ఎంతో చలించిపోయారు.
అనాథ పిల్లల దత్తత – శ్రీలీల
అనంతరం శోభిత, గురు అనే ఇద్దరు దివ్యాంగ చిన్నారులను దత్తత తీసుకుని ప్రస్తుతం వారిని అన్ని విధాలుగా తల్లిగా దగ్గరుండి చూసుకుంటున్నారు. ఆ విధంగా తన 21 ఏళ్ళ వయసులో శ్రీలీల చేసిన ఈ బృహత్ కార్యానికి అందరి నుండి ప్రసంశలు దక్కాయి. అలానే తాజాగా ఆమె మరొక చిన్నారిని కూడా దత్తత తీసుకున్నారు.
మొత్తంగా ఆ ముగ్గురు చిన్నారులని కంటికి రెప్పలా చూసుకుంటున్న శ్రీలీల, మనిషిగా పుట్టినందుకు మనకు వీలైనంతలో తోటి వారికి చేతనైన సహాయం అందించడం కంటే మానవత్వం వేరొకటి ఏముంటుందని అంటారు.
ముఖ్యంగా ఇటువంటి మంచి పనులు చేయడానికి తన తల్లి అన్నివిధాలుగా తనకు ప్రోత్సాహంగా నిలుస్తారని, అందుకే తాను ఓవైపు చదువుతో పాటు మరోవైపు సినిమాలు కూడా చేస్తూ కొనసాగుతున్నట్లు తల్లి స్వర్ణలత (Sreeleela Mother) గురించి ఎంతో గొప్పగా చెప్పారు శ్రీలీల. కావున నటిగా శ్రీలీల మరిన్ని విజయాలతో కెరీర్ & ఫిల్మోగ్రఫీ (Sreeleela Filmography) పరంగా కొనసాగాలని మా Telugu Movie Media టీమ్ మనస్ఫూర్తిగా కోరుకుంటోంది.
What's Your Reaction?






