Tourist Family Movie Review: A Heartwarming Tale of Love and Laughter

Tourist Family (2025) is a Tamil-language family drama directed by Abishan Jeevinth, featuring Sasikumar and Simran. Discover the film's emotional depth, performances, and audience reception.

Tourist Family Movie Review: A Heartwarming Tale of Love and Laughter

సినిమా పేరు : టూరిస్ట్ ఫ్యామిలీ (Tourist Family Review) - ఆకట్టుకునే ఫ్యామిలీ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్

నటీనటులు : శశి కుమార్, సిమ్రాన్, మిథున్ జై శంకర్, యోగి బాబు, కమలేష్, ఎం ఎస్ భాస్కర్ తదితరులు

దర్శకత్వం : అభిశన్ జీవింత్ 

నిర్మాతలు : నజరాత్ పాసిలియన్, మగేష్ రాజ్ పాసిలియన్, యువరాజ్ గణేశన్ 

సంగీతం : సీన్ రోల్డన్ 

ఫోటోగ్రఫి : అరవింద్ విశ్వనాథన్

Telugu Movie Media రేటింగ్ : 4 / 5    

టూరిస్ట్ ఫ్యామిలీ మూవీ సమీక్ష: ప్రేమ, హాస్యం, కుటుంబ విలువల మేళవింపు

ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం సినిమా ఆడియన్స్ యొక్క అభిరుచి ఒకింత మెల్లగా మారుతోంది. ఎప్పుడో కొన్నేళ్ల క్రితం ఎక్కువగా ఫ్యామిలి ఎంటర్టైన్మెంట్ తో పాటు మంచి కథాబలం సినిమాలు చూసేవారు. 

అయితే రాను రాను ట్రెండ్ ని బట్టి ఫ్యాక్షన్, యాక్షన్, కామెడీ, రొమాంటిక్ ఇలా మరిన్ని రకాల జనర్స్ సినిమాలు కూడా మంచి విజయవంతం అయ్యాయి. ఇక ఇటీవల థ్రిల్లెర్స్, మైథలాజి, సస్పెన్స్ మూవీస్ తో పాటు ఆకట్టుకునే మంచి కథ, కథనాలు, హృద్యమైన ఎమోషన్స్ ఉన్న సినిమాలకు ఆడియన్సు యొక్క ఆదరణ ఎక్కువగా కనపడుతోంది. 

ఆ విధంగా పలువురు యువ దర్శక నిర్మాతలు, కథకులు ఆ విధమైన కథలని తీసి అందరినీ ఆకట్టుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఆ విధంగా ఇటీవల మంచి హృద్యమైన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన మూవీ టూరిస్ట్ ఫ్యామిలీ (Tourist Family). ఈ మూవీ తాజాగా తమిళ్ ఆడియన్స్ ముందుకి వచ్చి ప్రస్తుతం థియేటర్స్ లో బాగా కలెక్షన్ తో కొనసాగుతోంది. అయితే ఈ మూవీ యొక్క పూర్తి రివ్యూ ఇప్పుడు చూద్దాం. 

కథ : 

ధర్మదాస్ (M. Sasikumar) అనే మధ్యతరగతి వ్యక్తి తన కుటుంబం, భార్య వాసంతి (Simran) సహా అతడి కుమారులు కలిసి అక్రమంగా శ్రీలంక నుండి ఇండియాకి వలస వస్తాడు. అయితే చెన్నై లో తన బావమరిది ప్రకాష్ (Yogi Babu) వారికి ఒక చిన్న ఇల్లు అద్దెకి ఇప్పిస్తాడు. 

ఈ కాలనీలో వారు ప్రక్కన ఎవరు ఏమి చేస్తుంటారో కూడా పట్టించుకోరు, కాబట్టి మీరు ఇక్కడ హాయిగా ఉండొచ్చు అని చెప్తాడు. ఒకవేళ చుట్టుప్రక్కల వారు పలకరించా ఏమాత్రం బదులివ్వొద్దు, ఎందుకంటే మాటల్లో పది మీరు అసలు విషయాలు వారికి చెప్తే ఇబ్బంది అవుతుందని హెచ్చరిస్తాడు. 

అయితే ప్రకాష్ మాటలను ఏమాత్రం పట్టించుకోని ధర్మదాస్ ఫ్యామిలీ చుట్టుప్రక్కల వారందరితో మంచి సాన్నిహిత్యం పెట్టుకుంటుంది. అయితే అదే సమయంలో జరిగిన ఒక బాంబ్ బ్లాస్ట్ కి కారణం ధర్మదాస్ ఫ్యామిలీ అని వారిని పోలీసులు అరెస్ట్ చేసేందుకు వెతుకుతుంటారు. మరి అనంతరం ఏమి జరిగింది, ధర్మదాస్ ఫ్యామిలీ పోలీసులకు చిక్కిందా, లేక తప్పించుకున్నారా, అసలు బాంబు బ్లాస్ట్ సడన్ గా ఎందుకు జరిగింది, దానికి కారకులు ఎవరు అనేది మొత్తం కూడా మనం మూవీలో చూడాల్సిందే. 

ప్లస్ పాయింట్స్ : 

ముఖ్యంగా ఈమూవీ యొక్క పాయింట్ ని తీసుకున్న కొత్త దర్శకుడు అభిశాన్ జీవింత్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది. ఆకట్టుకునే రీతిన కథనాన్ని ముందుకు నడిపి ఆడియన్స్ యొక్క పల్స్ పట్టుకున్నాడు. ఒక యూట్యూబర్ అయినా అతడు, నేడు మనుషుల్లోని మానవతా విలువలని తట్టి లేపే ఒక మంచి హృద్యమైన అంశాన్ని తీసుకుని దానిని చక్కగా అందరి మదిని తాకే విధంగా తెరకెక్కించి ఆకట్టుకున్నాడు. 

నిజానికి మనుషుల అంటేనే మంచివారు, అయితే వారిలో దాగి ఉన్న మంచి విలువలు, నడవడికని బయటకి తీసే ఈ మూవీలో ప్రతి పాత్ర ఆడియన్సు ని ఆకట్టుకుంటుంది అని చెప్పాలి. ధర్మదాస్ గా కీలక పాత్ర చేసిన శశి కుమార్ నటన ఎంతో బాగుంది, ఎమోషనల్ సీన్స్ లో అద్భుతంగా చేసారు. 

ఇక సిమ్రాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, ఇప్పటివరకు ఆమె కూడా అదరగొట్టారు. యోగిబాబు తన పాత్ర యొక్క పరిధి మేరకు అలరించే నటన కనబరిచారు. అటు హ్యూమర్ తో పాటు ఇటు ఎమోషన్స్ కూడా ఆకట్టుకుంటాయి. 

ఒక సాధారణ కుటుంబంలో ఒక హఠాత్ పరిణామం చోటుచేసుకోవడం, ఆపై ఆ కుటుంబం పడ్డ వేదన, దానికి నేటి మనుషుల యొక్క తోడు, వారి సహకారం ఏవిధంగా లభించింది, వాటితో పాటు ఆ కుటుంబం ఎటువంటి సవాళ్లు ఎదుర్కొంది అనేది కూడా బాగా చూపించారు. 

నేటి జీవితంలో అందరం సోషల్ మీడియా, ఫోన్స్ వచేసాక ప్రక్కన ఇంట్లో ఏమి జరుగుతుందో కూడా పట్టించుకోలేనంత బిజీ అయిపోయాం, అయినప్పటికీ కూడా మనలో ఇంకా మానవత్వం మాత్రం మిగిలే ఉందని, దానిని తట్టిలేపే ఒక రకమైన ప్రయోగం ఈ సినిమా. మొత్తంగా మ్యూజిక్, ఎమోషన్స్, కామెడీ, యాక్షన్, విజువల్స్, నటీనటుల పెర్ఫార్మన్స్, ఆకట్టుకునే టేకింగ్, ఇలా ప్రతి అంశం ఎంతో బాగుంది. 

శశికుమార్, సిమ్రన్ నటనతో మెప్పించిన కుటుంబ కథా చిత్రం

మైనస్ పాయింట్స్ : 

ఇక ఈ మూవీలో దాదాపుగా మైనస్ పాయింట్స్ గా చెప్పుకోవాల్సిన ప్రత్యేకమైన అంశాలు పెద్దగా లేవు. ఇటువంటి హృద్యమైన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీస్ చూసేటప్పుడు కథ రీత్యా అక్కడక్కడా కథనం నెమ్మదిస్తుంది, అది పెద్దగా లక్ష్యపెట్టాల్సిన పనిలేదు. అన్ని పాత్రలు, కథ కథనాలు, టేకింగ్ సహా అన్ని బాగున్నాయి. 

విశ్లేషణ : 

వాస్తవానికి ఒకింత ప్రయోగాత్మక రీతిన సాగిన టూరిస్ట్ ఫ్యామిలీ మూవీ దాదాపుగా ఎక్కడా కూడా పెద్దగా బోర్ అనిపించదు సరికదా, కథానుసారం మనల్ని కూడా వారితో కలిసి నడిపిస్తుంది. చాలా వరకు సన్నివేశాలు వాస్తవికతకు దగ్గరగా అనిపిస్తాయి. 

ప్రధాన పాత్రలు పోషించిన శశి కుమార్, సిమ్రాన్ ల గురించి ఎంతచెప్పుకున్నా తక్కువే. ఆ పాత్రలని దర్శకుడు జీవింత్ ఎంత చక్కగా రాసుకున్నారో అంతకు మించేలా స్క్రీన్ పై వారిద్దరూ మరింతగా పెర్ఫార్మ్ చేసారు. 

ఇక సందర్భానుసారం వచ్చే కామెడీతో పాటు పలు కీలక సీన్స్ లో ఎమోషన్స్, డైలాగ్స్, ఫోటోగ్రఫి ఎంతో బాగున్నాయి. ప్రతి సీన్ ని ఎంతో చక్కగా విస్లేషాత్మకంగా కథ యొక్క ప్రధాన అంశాన్ని ప్రక్కదారి పట్టించుకుందా దర్శకుడు బాగా రాసి తెరకెక్కించారు. సంగీతం కూడా బాగుంది. ఓవరాల్ గా ఒక హృద్యమైన ఫ్యామిలీ యాక్షన్ మూవీ చూసిన ఫీల్ మనకు కలుగుతుంది.  

సాంకేతిక వర్గం :

ఇక ఈ మూవీలో సాంగ్స్ తో పాటు అక్కడక్కడా పలు సీన్స్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హృద్యంగా బాగుంది. ముఖ్యంగా ఫోటోగ్రఫి గురించి చెప్పుకోవాలి అంటే విజువల్స్ అయితే కథకి తగ్గట్లుగా చక్కగా చూపించారు. ఎడిటింగ్ విభాగం కూడా బాగా పని చేసింది. 

పలు డైలాగ్స్ మనల్ని ఎంతో ఆకట్టుకుంటాయి. ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్ వంటివి మరింతగా ఆకట్టుకుంటాయి. ప్రధాన పాత్రధారుల యొక్క పెర్ఫార్మన్స్ తో పాటు నిర్మాతల ఆకట్టుకునే నిర్మాణ వలువలు కూడా టూరిస్ట్ ఫ్యామిలీ మూవీకి మరొక బలం.   

అభిషన్ జీవింత్ దర్శకత్వంలో భావోద్వేగాల మేళవింపు

తీర్పు : 

మొత్తంగా తమిళ్ లో మంచి అంచనాలతో రిలీజ్ అయిన టూరిస్ట్ ఫ్యామిలీ మూవీ అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం అవసరం లేదు. ముఖ్యంగా నేటి సమాజంలో ఇంకా మంచి మానవత్వం మిగిలి ఉందని, మనుషులు నిజంగా మంచి వాళ్ళు అని వెలుగెత్తి చెప్పేలా దర్శకుడు ఈమూవీని చక్కగా తెరకెక్కించారు. 

ప్రస్తుతం ఈ మూవీ తమిళ్ లో మాత్రమే అందుబాటులో ఉంది. వీలైతే సబ్ టైటిల్స్ తో చూడదగిన తెలుగు వారు కూడా ఈమూవీ తమిళ్ లో థియేటర్స్ లో అస్సలు మిస్ అవ్వద్దు. మీకు ఒక చక్కటి ఫీల్ గుడ్ మూవీ చూసిన అనుభూతిని టూరిస్ట్ ఫ్యామిలీ అందిస్తుంది.  

కాగా ఇటువంటి మరిన్ని లేటెస్ట్ మూవీ రివ్యూస్, లేటెస్ట్ టాలీవుడ్ అప్ డేట్స్, బాక్సాఫీస్ కలెక్షన్స్ కోసం మా Telugu Movie Media వెబ్ సైట్ తరచు ఫాలో అవ్వండి, చూస్తూ ఉండండి.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow