Lesser-known Facts About Jr NTR's Physical Transformation Journey

Discover rare and inspiring facts about Jr NTR’s body transformation for his blockbuster roles. His dedication and hard work will amaze you

Lesser-known Facts About Jr NTR's Physical Transformation Journey

టాలీవుడ్ స్టార్ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ (NT Ramarao JR) మొదటిసారిగా బాలనటుడిగా 1991లో వచ్చిన బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా ద్వారా సినిమా రంగ ప్రవేశం చేసారు. అనంతరం గుణశేఖర్ తీసిన బలరామాయణం సినిమాలో బాల రాముడిగా అందరినీ ఆకట్టుకున్నారు. అనంతరం 2002లో వచ్చిన నిన్ను చూడాలని మూవీ ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చారు. 

ఆపైన ఎస్ ఎస్ రాజమౌళి (SS Rajamouli) తీసిన స్టూడెంట్ నెంబర్ 1 మూవీ ద్వారా మంచి విజయం అందుకున్నారు. అనంతరం నాలుగవ సినిమా ఆదితో పెద్ద మాస్ యాక్షన్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఆ విధంగా తెలుగు ఆడియన్స్, ఫ్యాన్స్ నుండి తన ఆకట్టుకునే అభినయంతో యంగ్ టైగర్ గా గొప్ప పేరు సొంతం చేసుకున్నారు. 

ఆ తరువాత అయన కెరీర్ ఏడవ సినిమాగా వచ్చిన సింహాద్రి (Simhadri) అతి పెద్ద విజయం సొంతం చేసుకుని హీరోగా ఎన్టీఆర్ క్రేజ్ ని అమాంతం పెంచేసింది. అక్కడి నుండి టాలీవుడ్ స్టార్ హీరోగా వరుసగా అనేక సినిమా అవకాశాలు సొంతం చేసుకుని దూసుకెళ్లారు ఎన్టీఆర్. తాతయ్య నటరత్న ఎన్టీఆర్ మనవడిగా టైగర్ హరికృష్ణ తనయుడిగా మంచి పేరు సొంతం చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ నటన పరంగా అందరిలో ప్రత్యేక క్రేజ్ అందుకున్నారు. 

జూనియర్ ఎన్టీఆర్ ట్రాన్స్ఫర్మేషన్ వెనుక రహస్యాలు

ముఖ్యంగా ఎటువంటి పాత్రని అయినా ఎంతో అద్భుతంగా పెర్ఫార్మ్ చేయగల ఎన్టీఆర్, అటు డ్యాన్స్ పరంగా కూడా అదరగొడతారు. ఇక ఆ తరువాత సాంబ, దమ్ము, అదుర్స్, బృందావనం సినిమాల సక్సెస్ లు ఆయనకు కెరీర్ పరంగా మరింత పేరు పేరు అందించాయి. అయితే 2015లో పూరి జగన్నాథ్ (Puri Jagannath) తీసిన టెంపర్ (Temper) మూవీతో కెరీర్ పరంగా విభిన్న సినిమాలు చేస్తూ కొనసాగిన ఎన్టీఆర్ అక్కడి నుండి వరుసగా విజయాలు కూడా సొంతం చేసుకున్నారు. 

అనంతరం సుకుమార్ తీసిన నాన్నకు ప్రేమతో, కొరటాల శివ తీసిన జనతా గ్యారేజ్, బాబీ తీసిన జై లవకుశ సినిమాల విజయాలు అలానే అందులోని పాత్రల్లో ఆయన కనబరిచిన నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఆపైన త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) తో ఎన్టీఆర్ చేసిన మూవీ అరవింద సమేత (Aravinda Sametha)

Tollywood Actor jr ntr transformation

పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్ గా రూపొందిన ఈ మాస్ ఎంటర్టైనర్ మూవీ భారీ విజయం అందుకుంది. కాగా దీని అనంతరం తొలిసారిగా తన స్నేహితుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి జూనియర్ ఎన్టీఆర్ చేసిన భారీ పాన్ ఇండియన్ మూవీ ఆర్ఆర్ఆర్. ఈ మూవీని దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించగా డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. 

ఆ మూవీలో ఎన్టీఆర్ కొమురం బీమ్ గా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా తమ అత్యద్భుత నటన తో ఫ్యాన్స్ ని ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ని ఎంతో అలరించి భారీ విజయం అందుకున్నారు. ఇక అందులో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి అద్భుతంగా డ్యాన్స్ చేసిన నాటు నాటు సాంగ్ ఏకంగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆస్కార్ అవార్డు సొంతం చేసుకోవడ విశేషం. 

ఆ మూవీతో ఏకంగా నేషనల్, ఇంటర్నేషనల్ వైడ్ ఎంతో క్రేజ్ అందుకున్న ఎన్టీఆర్, ఇటీవల కొరటాల శివ (Koratala Siva) తీసిన దేవర పార్ట్ 1 (Devara Part 1) మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి మరొక విజయం తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ప్రస్తుతం కెజిఎఫ్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తీస్తున్న భారీ మూవీ డ్రాగన్ తో పాటు బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ తో కలిసి మరొక భారీ మూవీ వార్ 2 లో కూడా నటిస్తున్నారు. 

ఇవి రెండు త్వరలో ఆడియన్స్ ముందుకి వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోతోంది జూనియర్ ఎన్టీఆర్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ గురించి. ముఖ్యంగా కెరీర్ బిగినింగ్ లో కొంత బొద్దుగా ఉండే ఎన్టీఆర్, ఆ తరువాత కొన్నాళ్ల వరకు సినిమాల పరంగా ఆ విధంగానే నటిస్తూ కొనసాగారు. 

శారీరక మార్పులో ఎన్టీఆర్ కృషి

అయినప్పటికీ నటుడిగా డ్యాన్సర్ గా ఫ్యాన్స్ ని అలరిస్తూ కొనసాగిన ఎన్టీఆర్ రాఖీ మూవీ సమయానికి మరింత బొద్దుగా మారారు. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తీసిన ఈ మూవీతో మరొక భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. తన సోదరికి పెళ్లి చేసిన ఒక మధ్యతరగతి యువకుడు, అనంతరం వరకట్న పిశాచికి బలైన ఆమెను తల్చుకుని ఎంతో వేదన చెంది కట్నం కారణంగా ఎందరో ఆడపిల్లలు ఏవిధంగా బలవుతున్నారు అనే అంశంతో తెరకెక్కిన ఈ మూవీలో రాఖీగా ఎన్టీఆర్ నటన నభూతో నభవిష్యతి. 

అయితే ఆ మూవీ తరువాత ఎన్టీఆర్ తో ఎస్ ఎస్ రాజమౌళి మూడవసారి యమదొంగ మూవీ కోసం పని చేయడానికి సిద్ధమయ్యారు. అయితే తన కెరీర్ ని తొలిసారిగా ఎన్టీఆర్ తో తీసిన స్టూడెంట్ నెంబర్ వన్ ద్వారా ప్రారంభించిన జక్కన్న రాజమౌళి, ఆపైన ఆయనతోనే సింహాద్రితో మరొక హిట్ కొట్టారు. 

shocking facts about jr ntr transformation

కాగా యమదొంగ మూవీ చేసే ముందు ఎన్టీఆర్ ఫిసికల్ గా బాగా తగ్గాలని కండీషన్ పెట్టారు జక్కన్న. దానితో తన ఫుడ్ తో పాటు వ్యాయామం విషయమై బాగా శ్రద్ధ పెట్టిన ఎన్టీఆర్, కొన్ని నెలల పాటు ఎంతో ప్రత్యేకంగా నిపుణుల యొక్క అద్వర్యంలో అన్నివిధాలుగా ప్రయత్నం చేసి ఫైనల్ గా బరువు బాగా తగ్గారు. 

అయితే యమదొంగ మూవీ మనం గమనిస్తే ఆయన కొన్ని సీన్స్ లో బొద్దుగా అలానే కొన్ని సీన్స్ లో సన్నగా కనిపిస్తారు. అయితే యమదొంగ లో పూర్తిగా సన్నబడ్డ ఎన్టీఆర్ ని చూస్తే మనకు చాలా కొత్తగా అనిపిస్తుంది. ఓవైపు బొద్దుగా ఉన్నప్పటికీ కూడా డ్యాన్స్ బాగా చేసిన ఎన్టీఆర్, పూర్తిగా సన్నబడ్డ అనంతరం యమదొంగ మూవీలోని రబ్బరు గాజులు, నువ్వు ముట్టుకుంటేనే సాంగ్స్ తో పాటు మరింత జోష్ తో నాచోరే సాంగ్స్ లో తన మార్క్ పవర్ఫుల్ డ్యాన్స్ తో ఫ్యాన్స్ ని ఆడియన్స్ ని ఎంతో థ్రిల్ చేసి అదరగొట్టారు. 

jr ntr weight loss journey

కాగా యమదొంగ మూవీ రిలీజ్ అనంతరం పెద్ద విజయం అందుకుని ఎన్టీఆర్, రాజమౌళి ల కాంబినేషన్ కి హ్యాట్రిక్ అందించింది. అయితే దాని తరువాత కంత్రి, శక్తి సినిమాలు చేసారు ఎన్టీఆర్. వాటిలో ఆయన ఇంకా చాలా సన్నబడ్డారు. ఇక అక్కడి నుండి తన బాడీని జాగ్రత్తగా సమంగా మెయింటెయిన్ చేస్తూ కొనసాగుతున్న ఎన్టీఆర్, ఆపైన కెరీర్ పరంగా మరిన్ని విజయాలతో దూసుకెళ్లారు. 

అయితే ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోవలసిన విషయం ఏమిటంటే, బొద్దుగా ఉన్న శరీరాన్ని తగ్గించుకోవడంలో ఎన్టీఆర్ ఎంతో కఠోర శ్రమపడ్డారని, మొత్తంగా తగ్గి యమదొంగలో నటించి విజయం అందుకోవడం ఆనందంగా ఉందని, ఏదైనా పని చేయాలనుకుంటే ఆయన పెట్టె శ్రద్ధ, నిబద్దత అద్భుతం అని అప్పట్లో ఆయన సన్నిహితులు పలువురు అభిప్రాయపడ్డారు. 

అభిమానులపై ప్రభావం, ఇండస్ట్రీలో హైప్

ముఖ్యంగా తన కెరీర్, లైఫ్, మూవీస్ గురించి ఎన్టీఆర్ పలు సందర్భాల్లో మాట్లాడుతూ తాతయ్య నందమూరి తారకరామారావు గారి మనవడిగా హరికృష్ణ గారి తనయుడిగా తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని అంటారు. అలానే బాలకృష్ణ బాబాయితో పాటు అన్నయ్య నందమూరి కళ్యాణ్ రామ్ కూడా కెరీర్ పరంగా తనకు ఎన్నో విధాలుగా ప్రోత్సాహం అందించారని చెప్తారు. 

ముఖ్యంగా తన సినిమాల విషయంలో ఎక్కువగా అన్నయ్యతో చర్చిస్తానని, అమ్మ షాలిని కూడా ఎంతో ప్రోత్సహిస్తాని చెప్తారు. అయితే నటుడిగా కెరీర్ ప్రారంభించిన తరువాత ప్రతి సినిమాని తన మొదటి సినిమాగానే భావించి ముందుకు సాగుతున్నానని, ఇక ముఖ్యంగా తాను ఎప్పటికీ కృతజ్ఞతలు చెప్పుకోవలసింది అభిమానులకు అని చెప్తారు ఎన్టీఆర్. 

వారు లేనిదే తాను లేనని, మొదటి సినిమా నుండి వారు తన మీద చూపిస్తున్న ఆదరణ, అభిమానం వెలకట్టలేదని, అందుకే ప్రతి ఒక్క అభిమానికి పేరు పేరునా కృతజ్ఞత చెప్పుకుంటున్నాను అంటూ తన ప్రతి ఈవెంట్ లోను చెప్తుంటారు ఎన్టీఆర్. అయితే కెరీర్ లో మధ్యలో కొన్ని ఒడిదుడుకులని ఎదుర్కొన్నప్పటికీ ఫెయిల్యూర్స్ నుండి తాను ఎంతో నేర్చుకుంటానని, అలానే విజయం లభిస్తే ఎప్పటికీ గర్వపడనని చెప్తారు. 

jr ntr transformation story

నటన పరంగా ఎప్పుడూ ప్రతి సినిమాతో ఎంతో నేర్చుకుంటానని, తనతో కలిసి పని చేసిన అనేకమంది నటీనటులు, సాంకేతిక నిపుణులకు ప్రత్యేక ధన్యవాదాలు అని చెప్తారు ఎన్టీఆర్. లైఫ్ అనేది ఎప్పుడు ఎవరికి ఏమి ఇస్తుందో, ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదని, అందుకే ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుని మంచి మనసు ఆలోచనలతో ముందుకు సాగితే విజయం తథ్యం అని ఆయన అంటారు. 

అయితే కెరీర్ పరంగా రాఖీ అనంతరం తాను బరువు తగ్గి సన్నబడాల్సి వచ్చినప్పుడు ఫ్యాన్స్ కోసం ఎంతటి కష్టం అయినా భరిస్తానని, అందుకే జక్కన్న యమదొంగ మూవీ కథ చెప్పినప్పుడే సన్నబడ్డానికి సిద్దమైనట్లు అప్పట్లో చెప్పారు. తన కెరీర్ లో జక్కన్న రాజమౌళి ఎంతో ప్రత్యేకం అని, మొత్తంగా ఇకపై ఆయనతో మరిన్ని సినిమాలు చేసేందుకు తాను సిద్ధం అంటారు ఎన్టీఆర్. 

నటుడిగా తాను నేడు ఇంతటి ఉన్నత స్థాయిలో ఉన్నాను అంటే దానికి కారణం కుటంబ ప్రోత్సాహంతో పాటు ఫ్యాన్స్, ఆడియన్స్ యొక్క ఆదరణ అని, ముఖ్యంగా వివాహానంతరం తన భార్య లక్ష్మి ప్రణతి తనకు అన్ని విధాలుగా తోడు నీడగా నిలుస్తారని, బిడ్డలు భార్గవ్ రామ్, అభయ్ రామ్ ఇష్టాలకు తాను, ప్రణతి ఎప్పుడూ అడ్డు చెప్పం అని ఆయన చెప్తారు. అయితే వారు పెరిగి పెద్దయ్యాక నటులు అవుతారా అనే ప్రశ్నకు అది వారి ఇష్టం, అలానే దానికి చాలానే సమయం ఉంది కదా అని ఆయన నవ్వుతూ చెప్పారు. 

ఇక తనకి సినిమా షూటింగ్స్ లేని సమయంలో ఎక్కువగా ఫామిలీ తో గడిపేందుకు ఇష్టపడే ఎన్టీఆర్, అప్పుడపుడు హ్యాపీగా వారితో కలిసి వెకేషన్స్ కి వెళ్తుంటారు. అదే తనకు కొంత మానసిక ఒత్తిడి నుండి విముక్తి అందిస్తుందని చెప్తారు. మొత్తంగా అటు కుటుంబంతో ఇటు కెరీర్ పరంగా హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేస్తున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. కాగా నటుడిగా జూనియర్ ఎన్టీఆర్ రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని మన తెలుగు మూవీ మీడియా టీమ్ మనస్ఫూర్తిగా కోరుతోంది.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow