Pawan Kalyan’s OG Release Date Locked | Official Update

Pawan Kalyan's action film OG release date is officially confirmed. Directed by Sujeeth, this gangster drama gets a powerful festival release slot

Pawan Kalyan’s OG Release Date Locked | Official Update

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా ప్రస్తుతం తెరకెకెక్కుతున్న హరి హర వీర మల్లు (Hari Hara Veera Mallu) మూవీ ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని జూన్ 12న రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ మూవీలో నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) హీరోయిన్ గా నటిస్తుండగా మెగా సూర్య ప్రొడక్షన్స్ సంస్థ పై ఏ ఎం రత్నం గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. 

క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ కలిసి తెరకెక్కిస్తున్న ఈ మూవీ మొత్తంగా రెండు భాగాలుగా రూపొందుతుండగా మొదటి భాగం రిలీజ్ కి రెడీ అయింది. ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన మూడు గ్లింప్స్ టీజర్, మూడు సాంగ్స్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై బాగానే అంచనాలు ఏర్పరిచాయి. 

పవన్ కళ్యాణ్ OG రిలీజ్ డేట్ ఖరారు

అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన హరి హర వీర మల్లు రిలీజ్ అనంతరం పెద్దది విజయం ఖాయం అని టీమ్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. అయితే దీని అనంతరం మరోవైపు సుజీత్ తో పవన్ కళ్యాణ్ చేస్తున్న మాస్ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా మూవీ ఓజి (OG) (They Call Him OG). ఈ మూవీలో పవన్ కళ్యాణ్ ఒక పవర్ఫుల్ గ్యాంగ్ స్టర్ పాత్ర చేస్తుండగా ఆయనకు జోడీగా ప్రియాంక మోహన్ (Priyanka Mohan) హీరోయిన్ గా నటిస్తున్నారు. 

ఇప్పటికే 80 శాతానికి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ పై పవన్ ఫ్యాన్స్ లో విశేషమైన అంచనాలు నెలకొని ఉన్నాయి. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఓజిలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తుండగా ఇతర ముఖ్య పాత్రల్లో ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, శ్రియ రెడ్డి నటిస్తున్నారు. 

డైరెక్టర్ సుజీత్ నుండి మాస్ యాక్షన్ థ్రిల్లర్

కొన్ని నెలల క్రితం రిలీజ్ అయిన ఓజి ఫస్ట్ లుక్ గ్లింప్స్ టీజర్ అందరినీ ఎంతో ఆకట్టుకుని మూవీ పై విపరీతంగా అంచనాలు ఏర్పరిచిన విషయం తెలిసిందే. ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్న ఓజి మూవీని వాస్తవానికి గత ఏడాది సెప్టెంబర్ 27న రిలీజ్ చేయాల్సి ఉంది. 

అయితే ఓవైపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎంగా రాజకీయ పరంగా పవన్ కళ్యాణ్ బిజీ బిజీగా కొనసాగుతుండడంతో ఓజి సహా ఇతర సినిమాలైన హరి హర వీర మల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్స్ వాయిదా పడ్డాయి. 

ఇక ఎట్టకేలకు హరి హర వీర మల్లు లో తాజాగా తన పార్ట్ షూట్ మొత్తం కంప్లీట్ చేసిన పవన్, మరోవైపు లేటెస్ట్ గా ఓజి షెడ్యూల్ లో కూడా పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. అయితే అసలు విషయం ఏమిటంటే ఓజి మూవీని ఈ ఏడాది సెప్టెంబర్ 25న గ్రాండ్ గా విడుదల చేయనున్నట్లు లేటెస్ట్ గా టీమ్ అధికారికంగా డేట్ ని అనౌన్స్ చేసింది. 

థియేటర్లలో రిలీజ్ డేట్, అభిమానుల స్పందన

అయితే ఈసారిమాత్రం పక్కాగా ఉండే అవకాశం లేదు. ఇక ఈమూవీని తన అభిమాన పవర్ స్టార్ కి భారీ హిట్ ఇవ్వడం కోసం దర్శకుడు సుజీత్ ఎంతో జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సంగీత దర్శకుడు థమన్ కూడా ఓజి మూవీ సాంగ్స్ తో పాటు ప్రత్యేకంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయమై ఎంతో జాగ్రత్త తీసుకుని వాటిని కంపోజ్ చేస్తున్నారట. 

అలానే నిర్మాత దానయ్య కూడా ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా ఈ మూవీని పాన్ ఇండియన్ రేంజ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. తప్పకుండ ఓజి మూవీ రిలీజ్ అనంతరం భారీ విజయం ఖాయం అని టీమ్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. కాగా ఓజి మూవీకి మా Telugu Movie Media టీమ్ తరపున ముందస్తు విజయాభినందనలు

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow