Samantha Ruth Prabhu Net Worth in 2025 – Income, Assets & Luxurious Lifestyle
Samantha Ruth Prabhu Net Worth in 2025 తెలుగు సినిమా పరిశ్రమలో ఎంతో గొప్ప పేరెన్నికగన్న హీరోయిన్స్ లో ఒకరు సమంత రూత్ ప్రభు. ముందుగా మలయాళ పరిశ్రమలో కొన్నేళ్ల క్రితం టెలివిజన్ యాడ్స్ లో నటించిన సమంత, ఆ తరువాత తొలిసారిగా

తెలుగు సినిమా పరిశ్రమలో ఎంతో గొప్ప పేరెన్నికగన్న హీరోయిన్స్ లో ఒకరు సమంత రూత్ ప్రభు. ముందుగా మలయాళ పరిశ్రమలో కొన్నేళ్ల క్రితం టెలివిజన్ యాడ్స్ లో నటించిన సమంత, ఆ తరువాత తొలిసారిగా తెలుగులో గౌతమ్ వాసుదేవ్ మీనన్ రూపొందించిన ఏ మాయ చేసావే మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు.
Samantha Ruth Prabhu Net Worth in 2025 – Total Earnings & Wealth
అక్కినేని ఫ్యామిలీ నుండి మూడవతరం వారసుడైన అక్కినేని నాగచైతన్య హీరోగా రూపొందిన ఈ మూవీలో జెస్సి పాత్రలో కనిపించిన సమంత, తొలి చిత్రం తోనే తన ఆకట్టుకునే అందం, అభినయంతో ఆడియన్స్ ని ఫ్యాన్స్ ని మెప్పించారు. అప్పట్లో ఆ మూవీ భారీ విజయం అందుకోవడంతో పాటు నటిగా ఆమెకు విపరీతమైన క్రేజ్ ని పేరుని తీసుకువచ్చింది.
ముఖ్యంగా అప్పటి యువత అనేకమంది సమంత కోసమే ఆ సినిమాకి వెళ్లారనేది అతిశయోక్తి కాదు. నాగచైతన్య ఆకట్టుకునే పెర్ఫార్మన్స్ తో పాటు ఏ ఆర్ రహమాన్ సాంగ్స్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ టేకింగ్, నిర్మాత మంజుల ఘట్టమనేని భారీ నిర్మాణ విలువలు అప్పట్లో ఏ మాయ చేసావే మూవీకి పెద్ద విజయం అందించారు.
Samantha’s Movie Remuneration & Brand Endorsements in 2025
ఆ తరువాత ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకుంటూ టాలీవుడ్ లో దూసుకెళ్లారు సమంత రూత్ ప్రభు. అనంతరం ఆమెకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన బృందావనం, సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీను వైట్ల తెరకెక్కించిన దూకు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి.
కాగా అవి రిలీజ్ అనంతరం భారీ విజయాలు సొంతం చేసుకోవడంతో సమంతకు మరింత క్రేజ్ లభించింది. అనంతరం రాజమౌళి తెరకెక్కించిన ఈగ మూవీ భారీ విజయంతో సమంత టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా విపరీతమైన పేరు సొంతం చేసుకున్నారు.
ఆపైన తెలుగులో పలువురు ఇతర స్టార్ నటుల సరసన కూడా వరుసగా సినిమాలు చేస్తూ కొనసాగిన సమంత, అటు తమిళ్ లో కూడా స్టార్స్ ప్రక్కన హీరోయిన్ గా నటించే అవకాశం అందిపుచ్చుకున్నారు.
Samantha Ruth Prabhu’s Luxurious Lifestyle – Houses, Cars & Properties
అయితే తనకు వచ్చిన అవకాశాలు వరుసగా అందిపుచ్చుకుంటూ అనేక సక్సెస్ లు అందుకుంటూ టాలీవుడ్ తో పాటు అటు కోలీవుడ్ లో కూడా దూసుకెళ్లిన సమంతకు విశేషమైన క్రేజ్ ఉంది. కొన్నేళ్ల క్రితం తన మొదటి సినిమా హీరో అక్కినేని నాగ చైతన్యని ప్రేమించి డెస్టినేషన్ వివాహం చేసుకున్న సమంత, ఆయనతో నాలుగేళ్ళ కాపురం అనంతరం కొన్ని కారణాల వలన విడిపోయారు.
ఆ తరువాత ఫ్యామిలీ తో కలిసి హైదరాబాద్ లో ఇల్లు తీసుకుని ప్రత్యేకంగా జీవిస్తున్నారు సమంత రూత్ ప్రభు. అయితే ఆ తరువాత సమంత మాయోసైటిస్ అనే వ్యాధిబారిన పడ్డారు. ఆ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఫ్యాన్స్ కి ఆడియన్స్ కి వెల్లడించిన సమంత, డాక్టర్స్ నుండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నానని, త్వరలో ఆ వ్యాధి నుండి కోలుకుంటానని ధైర్యంగా తెలిపారు.
ఆ తరువాత కొద్దిరోజుల అనంతరం మెల్లగా మయోసైటిస్ నుండి కోలుకున్న సమంత, తన మానసిక ప్రశాంతత కోసం పలు ప్రదేశాలకు వెకేషన్స్ కి వెళ్లి వచ్చారు. ఎటువంటి పరిస్థితులని అయినా ఎదుర్కునేలా ఆడవారు ధైర్యంగా ఉండాలని, నిజానికి తన విడాకుల సమయంలో తీవ్ర ఒత్తిడికి లోనయ్యానని తెలిపారు.
అదే సమయంలో తన కుటుంబం, శ్రేయోభిలాషులతో పాటు ఎందరో ఫ్యాన్స్ తనకు ధైర్యం, ఆత్మవిశ్వాసాన్ని అందించారని అన్నారు. అందుకే ఆ తరువాత నుండి తాను ఎప్పటికప్పుడు పరిస్థితులని ధైర్యంతో ఎదుర్కొని ముందుకు సాగుతున్నానని తెలిపారు. ఇక కెరీర్ పరంగా ఒక్కో సినిమాతో రెమ్యునరేషన్ ని పెంచుకుంటూ వెళ్తున్న సమంత ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ. 3 నుండి రూ. 4 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు టాక్.
అలానే ఆమె నెట్ వర్త్ పరంగా చూసుకుంటే ఆమెకు మొత్తంగా రూ. 115 కోట్ల వరకు ఆస్తి ఉంటుందని అంటున్నాయి టాలీవుడ్ సినీ వర్గాలు. మరోవైపు సినిమాలతో పాటు పలు బ్రాండ్స్ యొక్క ఎండర్స్మెంట్స్, బిజినెస్ వెంచర్స్, ప్రమోషనల్ యాక్టివిటీస్ ద్వారా కూడా సంపాదిస్తున్నారు. అలానే సమంత కార్స్ గురించి మాట్లాడుకుంటే ముఖ్యంగా ఆమెకు ఎంతో లగ్జరీ కారైన రూ. 2.26 కోట్లు విలువైన రేంజ్ రోవర్ వోగ్ కార్ ఉంది.
రూ. 1.46 కోట్లు విలువ గల పోర్షే క్యామ్యాన్ జిటిఎస్, రూ. 72 లక్షల విలువగల జాగువార్ ఎక్స్ ఎఫ్, రూ.3 కోట్లు విలువ గల మెర్సిడెస్ బెంజ్ జి 63 ఎఎంజి, రూ. 87 లక్షల విలువ గల ఆడి క్యు 7, చివరిగా రూ. 1.70 కోట్ల విలువున్న బీఎండబ్ల్యూ కార్ ఉన్నాయి.
మరోవైపు తన వస్తున్న ఆదాయంలో కొంత మొత్తాన్ని తీసుకుని తాను స్థాపించిన ప్రత్యూష ఫౌండేషన్ తరపున పలువురు చిన్నారులు, అమ్మాయిలకు గుండె ఆపరేషన్స్ చేయించి ఆదుకోవడంతో పాటు వారికి చదువులు కూడా చెప్పిస్తూ సోషల్ సర్వీస్ ద్వారా తన గొప్ప మనసు చాటుకుంటున్నారు సమంత.
ఇక సమంత కు ఎంతో భారీ ధర విలువ గల ఆభరణాలు కూడా ఉన్నాయి. ఇక ముంబై నగరంలో సముద్రపు ఫిషింగ్ తో రూ. 15 కోట్లు విలువ గల అత్యంత ఖరీదైన 3 బీహెచ్ కె ఫ్లాట్ కూడా ఉంది. 2016 మిస్ ఇండియా రన్నరప్ అయిన సుశ్రుతి కృష్ణతో కలిసి 2020 లో సమంత ప్రముఖ ఫ్యాషనింగ్ సంస్థ సాఖీ ని స్థాపించి బిజినెస్ నిర్వహిస్తున్నారు.
How Samantha Earns Money? Business Ventures & Investments
ఇటీవల ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ వారు నిర్మించిన ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 లో రాజీ అనే పాత్రలో తన ఆకట్టుకునే పెర్ఫార్మన్స్ తో అందరినీ అలరించారు. తాజాగా బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ తో కలిసి దర్శక ద్వయం రాజ్ డీకే గ్రాండ్ లెవెల్లో రూపొందిస్తున్న అమెరికన్ సిరీస్ ఇండియన్ వర్షన్ సిటాడెల్ లో నటిస్తున్నారు.
త్వరలో ఈ సిరీస్ ఆడియన్స్ ముందుకి రానుంది. అలానే త్వరలో ఒక హాలీవుడ్ మూవీలో కూడా నటించేందుకు సిద్ధమవుతున్నారు సమంత. మరోవైపు ఆమె పలువురు దర్శకుల నుండి కథలు వింటున్నారు, తదుపరి ఆమె చేయనున్న సినిమాలు త్వరలో ఒక్కొక్కటిగా వెల్లడి కానున్నాయి.
Samantha Ruth Prabhu’s Net Worth Growth Over the Years
ఆ విధంగా నటిగా ఒక్కో సినిమాతో ఫ్యాన్స్ ని ఆడియన్స్ ని అలరిస్తూ మంచి పేరుతో కొనసాగుతున్న సమంత రూత్ ప్రభు రాబోయే రోజుల్లో మరింత విజయవంతంగా కెరీర్ పరంగా దూసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.
What's Your Reaction?






