Chiranjeevi’s Shocking Comments About His Political Re-Entry – Fans Surprised
Chiranjeevi Shocking Comments about His Political Re Entry టాలీవుడ్ స్టార్ యాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గురించి తెలుగు తో పాటు ప్రత్యేకంగా పలు ఇతర భాషల వారికి కూడా పరిచయం అవసరం లేదు. అంతకముందు రెండు తరాల్లో ఎన్టీఆర్, కృష్ణ తరువాత చిరంజీవి

టాలీవుడ్ స్టార్ యాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గురించి తెలుగు తో పాటు ప్రత్యేకంగా పలు ఇతర భాషల వారికి కూడా పరిచయం అవసరం లేదు. అంతకముందు రెండు తరాల్లో ఎన్టీఆర్, కృష్ణ తరువాత చిరంజీవి ఎన్నో ఏళ్ళ పాటు టాలీవుడ్ తిరుగులేని టాప్ హీరోగా కొనసాగారు. ముఖ్యంగా అప్పట్లో ఆయన నుండి మూవీ వస్తుంది అంటే క్రేజ్ తారా స్థాయిలో ఉండేది.
Chiranjeevi’s Shocking Statement on His Political Comeback
అటువంటి మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో మొత్తంగా 150 కి పైగా సినిమాలు చేసారు. మెగాస్టార్ అద్భుత నటనతో పాటు అంతకు మించి సూపర్ డ్యాన్సర్ అనేది కూడా మనకు అందరికీ తెలిసిందే. ఆయన డ్యాన్స్ లలో గ్రేస్ చాలావరకు ఇప్పటికీ తగ్గలేదు. ఇటీవల తన కుమారుడు రామ్ చరణ్ తో కలిసి కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఆచార్య మూవీలో భలే భలే బంజారా సాంగ్ లో చరణ్ కి పోటా పోటీగా స్టెప్స్ వేసి అలరించారు చిరంజీవి.
ఇక ఇటీవల భోళా శంకర్ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చిన మెగాస్టార్ తాజాగా యువ దర్శకుడు మల్లిడి వశిష్ట దర్శత్వంలో తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభరలో నటిస్తున్నారు. ఈ మూవీ యొక్క ఫస్ట్ గ్లింప్స్ టీజర్ ఇటీవల రిలీజ్ అయి అందరినీ ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచింది. దీని అనంతరం యువ దర్శకులైన అనిల్ రావిపూడి, శ్రీకాంత్ ఓదెల వంటి దర్శకులతో జతకట్టేందుకు సిద్ధమవుతున్నారు మెగాస్టార్.
Will Chiranjeevi Re-Enter Politics? Here’s What He Said
ఇక తరచు పలు సినీ ఈవెంట్స్ కి ముఖ్యంగా పలు చిన్న సినిమాల యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి విచ్చేసి వారికీ తన వంతుగా మద్దతు అందిస్తూ ప్రోత్సహిస్తుంటారు మెగాస్టార్. తాజాగా హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ఆయన తనయుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న బ్రహ్మ ఆనందం సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్రత్యేకంగా విచ్చేసి టీమ్ కి విజయాభినందనలు తెలియచేసారు.
అంతకముందు యువ నటుడు విశ్వక్సేన్ హీరోగా తెరకెక్కుతున్న లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా ప్రత్యేకంగా వెళ్లి టీమ్ కి ప్రోత్సాహం అందించిన మెగాస్టార్ మాట్లాడుతూ, ప్రజారాజ్యం పార్టీ ప్లేస్ లో ఉద్భవించిందే పవన్ కళ్యాణ్ జనసేన అని తెలిపారు. పవన్ తన పార్టీ తరపున న్యాయంగా పోరాడుతున్న విధానం తనకు ఎంతో నచ్చిందని అన్నారు. ఇక బ్రహ్మ ఆనందం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ గతంలో రాజకీయాలకు వెళ్లకుండా ఉండాల్సిందని అన్నారు.
Chiranjeevi’s Political Journey – Success & Challenges
అక్కడ ప్రతి ఒక్కరినీ కొన్ని పరిస్థితుల రీత్యా విమర్శించాలి, అలానె అనేకమందితో విమర్శలు కూడా ఎదుర్కోవాలని అన్నారు. అందువలన ఆ రాజకీయాల్లో ఉన్న సమయంలో ప్రశాంతత అస్సలు ఉండేది కాదని, ఒక్కో సందర్భంలో తన సతీమణి సురేఖ మాట్లాడుతూ, అసలు ఈ మధ్య మీ మోహంలో చిరునవ్వు అనేది చూడలేదని అన్నారని తెలిపారు. ఆ విధంగా తనకు రాజకీయాల పై నిరాసక్తత ఏర్పడిందని అనంతరం ఖైదీ నెంబర్ 150 మూవీతో మళ్ళి సినిమా రంగంలోకి రీ ఎంట్రీ ఇచ్చి పెద్ద విజయం అందుకోవడం అమితానందాన్ని అందించిందని తెలిపారు.
ఇక అక్కడి నుండి వరుసగా జాగ్రత్తగా సినిమాలు చేసుకుంటూ కొనసాగుతున్న తను, ఇకపై పూర్తిగా తన జీవితాన్ని సినిమాలకు మాత్రమే అంకితం చేస్తానని, ఎల్లప్పుడూ ఇక్కడే ఉంటూ ఇక్కడి ఆడియన్స్ ని ప్రత్యేకంగా ఫ్యాన్స్ ని తన ఎంటర్టైన్మెంట్ తో మరింతగా అలరించాలనేది తన కోరిక అని అన్నారు మెగాస్టార్. అయితే రాజకీయాల కోసం తమ్ముడు పవన్ కళ్యాణ్ ఉండనే ఉన్నాడు కదా, తనే ఇకపై పూర్తిగా రాజకీయాల్లో కొనసాగుతాడని అన్నారు.
Fans’ Reactions to Chiranjeevi’s Comments on Politics
ఇటీవల కొన్నాళ్లుగా తాను కొందరు పలువురు రాజకీయ నాయకులని పలు కారణాలతో కలుస్తున్నందువల్ల తాను ఇంకా రాజకీయాల్లోనే ఉన్నానని, ఇకపై మరింత యాక్టివ్ గా అందులో కొనసాగుతానని పలువురు భావిస్తుండడంతో తన రాజకీయ నిర్ణయాన్ని ఇక్క ఈ విధంగా స్పష్టం చేయాల్సి వచ్చిందని అన్నారు చిరంజీవి. మొత్తంగా తమ అభిమాన మెగాస్టార్ చిరంజీవి ఇకపై పూర్తిగా సినిమాల్లోనే ఉంటారనే వార్త విన్న మెగా ఫ్యాన్స్ అమితానందం వ్యక్తం చేస్తున్నారు.
What’s Next for Chiranjeevi? Future Plans & Movie Projects
What's Your Reaction?






