Spirit Movie Story Line in Telugu – Prabhas Latest Film Plot & Updates

Spirit Movie Story Line in Telugu టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో 2015 లో తెరకెక్కిన భారీ పాన్ ఇండియన్ మూవీ బాహుబలి 1 మూవీ రిలీజ్ అనంతరం

Spirit Movie Story Line in Telugu – Prabhas Latest Film Plot & Updates
టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో 2015 లో తెరకెక్కిన భారీ పాన్ ఇండియన్ మూవీ బాహుబలి 1 మూవీ రిలీజ్ అనంతరం ఎంతో పెద్ద సంచలన విజయం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీ అనంతరం దానికి సీక్వెల్ గా రూపొందిన బాహుబలి 2 రిలీజ్ అనంతరం మొదటి భాగం కంటే మరింత భారీ విజయం సొంతం చేసుకుని హీరోగా ప్రభాస్ రేంజ్ ని క్రేజ్ ని అలానే మార్కెట్ వేల్యూ ని విపాటితంగా పెంచేసింది.

Spirit Movie Story Line in Telugu – Full Plot & Highlights

ఇక బాహుబలి 1 మూవీ వరల్డ్ వైడ్ గా రూ. 650 కోట్ల గ్రాస్ ని అలానే బాహుబలి 2 మూవీ రూ. 1850 కోట్లని సొంతం చేసుకోవడం విశేషం. దాని అనంతరం ఇకపై వరుసగా పాన్ ఇండియన్ మూవీస్ చేస్తూ కొనసాగుతున్నారు ప్రభాస్. ఆపై సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ చేసిన మూవీ సాహో. ఈ మూవీలో శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటించగా బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ కీలక పాత్రలో కనిపించారు.

అయితే వాటి అనంతరం తన సినీ కెరీర్ ని వేగంగా ముందుకు తీసుకెళ్తున్న ప్రభాస్ గత ఏడాది ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ పాన్ ఇండియన్ మూవీ సలార్ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి పెద్ద విజయం సొంతం చేసుకున్నారు. దానితో మరింత క్రేజ్ అందుకున్న ప్రభాస్ ఈ ఏడాది జూన్ లో భారీ పాన్ ఇండియన్ మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ ఎంటర్టైనర్ జానర్ మూవీ కల్కి 2898 ఏడి మూవీ చేసారు ప్రభాస్.

Spirit Movie Cast & Crew – Prabhas in a Power-Packed Role

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రల్లో కనిపించిన ఈ మూవీలో అందాల భామ దీపికా పదుకొనె కీలక పాత్రలో నటించారు. ఈ మూవీ రిలీజ్ అనంతరం భారీ విజయం అందుకుని రూ. 1200 కోట్ల మేర కలెక్షన్ సొంతం చేసుకోవడం విశేషం. అయితే దాని తరువాత ప్రస్తుతం ప్రభాస్ వరుసగా మరింతగా సినిమాలు లైన్లో పెట్టారు.

Spirit Movie Story Line

తాజాగా మారుతీ తో ది రాజా సాబ్ మూవీతో పాటు హను రాఘవపూడితో ఒక మూవీ అలానే సలార్ 2, కల్కి 2898 ఏడి పార్ట్ 2 మూవీస్ చేయనున్నారు ప్రభాస్. అలానే వీటితో పాటు మోస్ట్ క్రేజీ ఎంటర్టైనర్ మూవీ స్పిరిట్ లో కూడా నటించనున్నారు ప్రభాస్. ఇటీవల బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ తో తీసిన యానిమల్ మూవీతో అత్యద్భుత విజయం సొంతం చేసుకున్న సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ ని తీయనున్నారు. ఇప్పటికే కథ తో పాటు స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.

Spirit Movie Director, Budget & Production Details

ముఖ్యంగా సందీప్ రెడ్డి వంగా తీసిన యానిమల్ మూవీ కొందరి నుండి విమర్శలు అందుకున్నప్పటికీ ఓవరాల్ గా బాక్సాఫీస్ వద్ద వరల్డ్ వైడ్ రూ. 950 కోట్ల మేర గ్రాస్ ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా యానిమల్ మూవీలో సందీప్ రెడ్డి వంగా ఎంచుకున్న కథ, కథనాలతో పాటు టేకింగ్ యువత, మాస్ ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకుంది.

ఫస్ట్ డే ఫస్ట్ షో మొదలుకుని యానిమల్ మూవీ అన్ని ఏరియాలు, చాలా భాషల్లో సంచలన విజయం సొంతం చేసుకుంది. రణబీర్ కపూర్ అద్భుత నటనతో పాటు ఆయనకు జోడిగా నటించిన నేషనల్ క్రష్ రష్మిక మందన్న అందం, అభినయం కూడా ఆ మూవీకి పెద్ద ప్లస్ అయ్యాయి. ముఖ్యంగా విజువల్స్ యాక్షన్, ఫైట్స్, డైలాగ్స్ తో పాటు లవ్, ఎమోషనల్ అంశాలు సాంగ్స్, అలానే ప్రత్యేకంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందరి నుండి ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్నాయి.

దానితో ఆడియన్స్ తో పాటు ప్రభాస్ ఫ్యాన్స్ లో స్పిరిట్ మూవీపై అంచనాలు ఒక్కసారిగా తారా స్థాయికి చేరాయి. భద్రకాళి ప్రొడక్షన్స్, టి సిరీస్ సినిమాస్ వారు గ్రాండ్ లెవెల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న స్పిరిట్ మూవీ కథ విషయానికి వస్తే ఇది ఒక సిన్సియర్ పోలీస్ అధికారి కథ అని అన్నారు సందీప్.

Spirit Movie Story Line

ముఖ్యంగా ప్రభాస్ పాత్ర ఎంతో పవర్ఫుల్ గా ఉండడంతో పాటు ఆయన ఫ్యాన్స్ ని ఆడియన్స్ ని కూడా ఎంతో ఆకట్టుకుంటుందని, అలానే సంగీతం తో పాటు వయొలెన్స్ కూడా ఎక్కువే ఉండే అవకాశం ఉందని ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో భాగంగా మాట్లాడుతూ తెలిపారు సందీప్. ఇక విశేషం ఏమిటంటే, ఈ మూవీలో పూర్తిగా కొత్త లుక్ లో ప్రభాస్ కనిపించనుండగా దీనికి కూడా సంగీతాన్ని హర్షవర్ధన్ రామేశ్వర్ అందించనున్నారు.

Spirit Movie vs Other Prabhas Films – What’s Unique?

ఇటీవల స్పిరిటి మూవీ యొక్క మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభం అయినట్లు దర్శకుడు సందీప్ తో కలిసి దిగిన ఒక చిన్న వీడియో బైట్ ని తన సోషల్ మీడియా ప్రొఫైల్స్ లో పోస్ట్ చేసారు హర్ష వర్ధన్. మొత్తంగా ఆ విధంగా అందరిలో కూడా స్పిరిట్ మూవీ యొక్క అంచనాలు విపరీతంగా ఉన్నాయి. ఇక ఈ ప్రతిష్టాత్మక క్రేజీ మూవీలో కూడా నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించే అవకాశం ఉన్నట్లు ఇటీవల కొన్నాళ్లుగా పలు మీడియా మాధ్యమాల్లో కథనాలు వస్తున్నాయి.

అయితే దీనికి సంబంధించి స్పిరిట్ మేకర్స్ నుండి అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ఇక స్పిరిట్ మూవీని జనవరిలో ప్రారంభించి 2026 ప్రథమార్ధంలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ది రాజా సాబ్ తో పాటు హను రాఘవపూడి మూవీ షూట్స్ లో ఎంతో బిజీగా ఉన్న ప్రభాస్, తాజాగా స్పిరిట్ మూవీలో పోలీస్ అధికారి లుక్ కోసం సిద్ధమవుతున్నారు.

Spirit Movie Release Date & Latest Updates

ప్రస్తుతం అటు క్రేజ్, మార్కెట్ పరంగా ప్రభాస్ తో పాటు సందీప్ రెడ్డి వంగా కూడా బాగా పేరు కలిగి ఉండడంతో పాటు ఈ ఇద్దరు కలిసి చేస్తున్న స్పిరిట్ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా అదరగొట్టే అవకాశాలు గట్టిగా కనపడుతున్నాయి. మరి ఈ క్రేజీ కాంబో మూవీ ఇప్పటి నుండే ఇన్ని భారీ అంచనాలు కలిగి ఉంటే, త్వరలో ప్రారంభమై, ఆపై సెట్స్ మీదకు వెళ్లి, అనంతరం రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద ప్రభంజనం సృష్టిస్తుందో తెలియాలి అంటే మరికొన్నాళ్లు వరకు ఆగకతప్పదు.

Spirit Movie Story Line

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow