Pushpa 3 Release Date and Latest Updates
Pushpa 3 movie release date, cast, and story updates. Check latest news about Allu Arjun's upcoming pan-India film.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఇటీవల సుకుమార్ తీసిన మాస్ యాక్షన్ పాన్ ఇండియన్ ఎంటర్టైనర్ మూవీ పుష్ప 2. ఈ మూవీలో అల్లు అర్జున్ అదిరిపోయే యాక్టింగ్ కి అందరి నుండి విపరీతమైన ప్రసంశలు కురిసాయి. ఈ మూవీలో అల్లు అర్జున్ కి జోడీగా రష్మిక మందన్న నటించగా ఒక ప్రత్యేక పాటలో శ్రీలీల నటించారు.
మొదటి నుండి అందరిలో భారీ అంచనాలు ఏర్పరిచిన పుష్ప 2 ది రూల్ మూవీ రిలీజ్ అనంతరం బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద సంచలన విజయం సొంతం చేసుకుని దేశవ్యాప్తంగా థియేటర్స్ లో పెద్ద ప్రభంజనం సృష్టించింది.
పుష్ప 3 విడుదల తేదీ ఎప్పుడంటే?
ఈ మూవీలో జగపతి బాబు, రావు రమేష్, అనసూయ భరద్వాజ్, సునీల్, ఫహాద్ ఫాసిల్, బ్రహ్మాజీ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పై వై. రవి శంకర్, నవీన్ ఎర్నేని గ్రాండ్ గా తెరకెక్కించిన ఈ మూవీ దాదాపుగా వరల్డ్ వైడ్ రూ. 1800 కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్ సొంతం చేసుకుంది.
అంతకముందు వచ్చిన పుష్ప 1 మూవీలో తన ఆకట్టుకునే యాక్టింగ్ తో ఏకంగా నేషనల్ వైడ్ గా ఆడియన్స్ ని ఫ్యాన్స్ ని అలరించిన అల్లు అర్జున్ తద్వారా భారత ప్రభుత్వం నుండి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఇక పుష్ప 2 లో మాస్ యాక్షన్ సన్నివేశాలు, భారీ ఫైట్స్, ఛేజింగ్ సీన్స్, ఎమోషనల్ సన్నివేశాలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, గ్రాండియర్ విజువల్స్, దర్శకుడు సుకుమార్ అదిరిపోయే టేకింగ్ వంటివి పెద్ద సక్సెస్ కి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.
పుష్ప 3 షూటింగ్ పూర్తి వివరాలు
అయితే దీని అనంతరం తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక భారీ మైథలాజికల్ మూవీ అలానే అట్లీ తో ఒక భారీ సైన్స్ ఫిక్షన్ జానర్ మూవీ చేయడానికి సిద్దమయ్యారు అల్లు అర్జున్. ఈ రెండు సినిమాల పై దేశవ్యాప్తంగా ఉన్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు అందరిలో కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి.
అయితే వీటిలో ముందుగా అట్లీ తీయనున్న మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది. కాగా ఈమూవీని ప్రముఖ కోలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ భారీ వ్యయంతో నిర్మించనుంది. ఇక త్రివిక్రమ్ మూవీని గీతా ఆర్ట్స్, హారికా హాసిని క్రియేషన్స్ సంస్థలు నిర్మించనున్నారు. కాగా ఈ రెండు సినిమాల అనంతరం సుకుమార్ తో పుష్ప 3 మూవీ చేయనున్నారు అల్లు అర్జున్.
మరోవైపు ప్రస్తుతం పెద్ది మూవీ చేస్తున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, అది పూర్తి అయిన అనంతరం సుకుమార్ మూవీ చేయనున్నారు. అది పూర్తి కావడానికి కొంత సమయం పడుతుంది. దాని తరువాతనే పుష్ప 3 ని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు సుకుమార్. కాగా పుష్ప 2 ని మించేలా మరింత గ్రాండియర్ కథ, కథనాలతో దర్శకుడు సుకుమార్ ఈ కథ ని రాసుకున్నారని, వీలైతే 2027 లోనే దీనిని ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చేలా ఈ లోపు ప్రారంభానికి సంబంధించి ప్రణాళికలు రచిస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు.
పుష్ప 3 పై ఫ్యాన్స్ అంచనాలు మరియు సినిమా హైప్
అలానే మైత్రి మూవీ మేకర్స్ వారు కూడా పలు భారీ ప్రాజక్ట్స్ తో ప్రస్తుతం బిజీ బిజీగా ఉన్నారు. పుష్ప 3 లో హీరో తో పాటు హీరోయిన్ రష్మిక పాత్ర కూడా మరింత ఆకట్టుకుంటుందని టాక్. మొత్తంగా అయితే పుష్ప 3 మూవీ పక్కాగా ఎప్పుడు మొదలవుతుంది, పక్కాగా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేవి మొత్తం తెలియాలి అంటే మరొక ఏడాదికి పైగా వెయిట్ చేయాల్సిందే అని తెలుస్తోంది.
What's Your Reaction?






