Djimon Hounsou to Play Villain in Mahesh Babu’s SSMB29 ?

Hollywood actor Djimon Hounsou joins Mahesh Babu and Rajamouli’s SSMB29 as the villain. A global touch to the epic action film. Full update on Telugu Movie Media

Djimon Hounsou to Play Villain in Mahesh Babu’s SSMB29 ?

తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి (SS Rajamouli) తీస్తున్న ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ మూవీ SSMB29. ఈ మూవీలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా (Priyanka Chopra) తో పాటు మలయాళ నటుడు పృథ్వీరాజ్ (Prithviraj Sukumaran) సుకుమారన్ కూడా కీలక పాత్రలు చేస్తుండగా ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. 

మొదటి నుండి అందరిలో ఎన్నో భారీ అంచనాలు ఏర్పరిచిన ఈమూవీ యొక్క అఫీషియల్ అనౌన్స్ మెంట్ సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదినం సందర్భంగా ఆగష్టు 9న రానున్నట్లు టాక్. ఇక ఈమూవీలో తన పాత్ర కోసం ఇప్పటికే సూపర్ స్టార్ ప్రత్యేకంగా ఫుల్ గా క్రాఫ్, గడ్డం, బల్క్ బాడీని పెంచుతున్నారు. 

SSMB29 లో విలన్ గా హాలీవుడ్ నటుడు డిజిమౌన్ హౌన్సౌ

ముఖ్యంగా ఈ మూవీలో భారీ యాక్షన్ సన్నివేశాలు హాలీవుడ్ (Hollywood) ని తలపిస్తాయని అందుకోసం జక్కన్న అండ్ టీమ్ ఎంతో కష్టపడుతోందని అంటున్నారు. హీరోగా మహేష్ బాబు కెరీర్ పరంగా ఎంతో ఛాలెంజింగ్ గా తీసుకుని ఈ మూవీలో తన పాత్రలో అద్భుతంగా నటిస్తున్నట్లు చెప్తోంది టీమ్. 

ఇటీవల రెండు భారీ షెడ్యూల్స్ జరుపుకున్న SSMB 29 మూవీ యొక్క మూడవ షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. అనంతరం టీమ్ విదేశాలకు వెళ్లనుంది. కాగా ఈ మూవీని ప్రముఖ నిర్మాత కేఎల్ నారాయణ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తుండగా దేవ కట్టా డైలాగ్ రైటర్ గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. 

మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్ కు గ్లోబల్ టచ్

కేవలం భారీ ఖర్చు మాత్రమే కాదు, దీనిని భారతీయ సినీ చరిత్రలో నిలిచిపోయే విధంగా అద్భుతంగా తెరకెక్కించేందుకు జక్కన్న ఎప్పటికప్పుడు నూతన ఆలోచనలతో ముందుకు సాగుతున్నారట. ఇక పలువురు హాలీవుడ్ నటులు కూడా ఇందులో కీలక భాగం కానున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. 

ముఖ్యంగా ఇందులో పృథ్వీ రాజ్ సుకుమారన్ నెగటివ్ పాత్ర చేస్తున్నప్పటికీ, ఇందులో మెయిన్ విలన్ గా ఒక హాలీవుడ్ నటుడు కనిపించనున్నట్లు చెప్తున్నారు. అసలు విషయం ఏమిటంటే, ఈ మూవీలో ప్రముఖ హాలీవుడ్ నటుడు డిజిమౌన్ హౌన్సౌ (Djimon Hounsou) ప్రధాన విలన్ గా కనిపిస్తారట. కాగా ఆయన పాత్ర ఎంతో క్రూరంగా ఉంటుందని టాక్. 

ఒక పవర్ఫుల్ ఆఫ్రికన్ హంటర్ పాత్రలో ఆయన కనిపిస్తారని, అలానే హీరో మహేష్ బాబు కి ఆయన మధ్యన వచ్చే పలు కీలక యాక్షన్ సీన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయని కూడా అంటున్నారు. అయితే ఇప్పటికే ఆయనని తమ సినిమా కోసం ఎంపిక చేసిన జక్కన్న, త్వరలో ఆఫ్రికాలో జరిగే షెడ్యూల్ నుండి ఆయన సీన్స్ తీయనున్నారట. అయితే పక్కాగా ఆయన ఈ మూవీలో మెయిన్ విలన్ గా నటిస్తున్నారా లేదా అనేదానిపై ఆ మూవీ మేకర్స్ నుండి అధికారికంగా న్యూస్ రావాల్సి ఉంది.

డిజిమౌన్ హౌన్సౌ పాత్రపై అధికారిక సమాచారం – ఫ్యాన్స్ లో హైప్

లోకం చుట్టే వీరుడిగా మహేష్ బాబు ఈ మూవీలో కనిపించనున్నారని, కేవలం మహేష్ ఫ్యాన్స్, ఇండియన్ ఆడియన్స్ కి మాత్రమే కాదు యావత్ ప్రపంచ సినిమా లవర్స్ అందరికీ ఈ మూవీ ఒక సరికొత్త విజువల్ వండర్ గా అద్భుత అనుభూతి అందించడం ఖాయమని టాక్. 

ఇక ఈ ప్రతిష్టాత్మక మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి 2027 సమ్మర్ కానుకగా ఆడియన్స్ ముందుకి భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారని అంటున్నారు. మరి ఇంతటి భారీ మూవీ అత్యద్భుత విజయం సొంతం చేసుకుని మన భారతీయ సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తంగా మరింతగా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటోంది మా Telugu Movie Media టీమ్.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow