Sankranthiki Vasthunam Movie Total Collection Worldwide Report

Check out the complete worldwide box office collection report of Sankranthiki Vasthunam. See how this festive release performed globally.

Sankranthiki Vasthunam Movie Total Collection Worldwide Report

స్టార్ సీనియర్ యాక్టర్ విక్టరీ వెంకటేష్ (Venkatesh) హీరోగా ఇటీవల సంక్రాంతి పండుగ కానుకగా ఆడియన్స్ ముందుకి వచ్చిన ఫ్యామిలీ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam)

ఈ మూవీని యువ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) తెరకెక్కించగా భీమ్స్ సిసిలోరియో సంగీతం సమకూర్చారు. యువ టాలీవుడ్ అందాల కథానాయికలు ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh), మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) హీరోయిన్స్ గా నటించిన ఈమూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ పై దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. 

సంక్రాంతికి వస్తున్నాం బాక్సాఫీస్ కలెక్షన్స్

ఇక ఈ మూవీ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్, సాంగ్స్, ట్రైలర్ అన్ని కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా మూవీలోని రమణ గోగుల (Ramana Gogula) ఆలపించిన గోదారి గట్టు మీద (Godari Gattu Meedha) సాంగ్ అయితే మిలియన్స్ కొద్దీ యూట్యూబ్ వ్యూస్ సొంతం చేసుకుని సంక్రాంతికి వస్తున్నాం మూవీ పై అందరిలో మరింత అంచనాలు ఏర్పరిచింది. 

అయితే అదే సంక్రాంతి సమయానికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా శంకర్ తెరకెక్కించిన గేమ్ ఛేంజర్ (Game Changer), నటసింహం బాలకృష్ణ హీరోగా బాబీ తెరకెక్కించిన డాకు మహారాజ్ (Daaku Maharaaj) సినిమాలు కూడా ఆడియన్స్ ముందుకి వచ్చాయి. కాగా ఆ రెండు సినిమాల పై కూడా ఆయా హీరోల ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్సు లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. 

సంక్రాంతికి వస్తున్నాం వరల్డ్ వైడ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్ 

కాగా ఫైనల్ గా మూడు రోజుల గ్యాప్ లో 2025 సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ మూడు సినిమాల్లో ఊహించని విధంగా రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ఫెయిల్ అయింది. 

అయితే బాలకృష్ణ డాకు మహారాజ్ మూవీ మాత్రం విజయవంతం కాగా వెంకటేష్ అనిల్ ల సంక్రాంతికి వస్తున్నాం మాత్రం అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. విక్టరీ వెంకటేష్ తో గతంలో ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాలు తీసి పెద్ద విజయాలు సొంతం చేసుకున్న అనిల్ రావిపూడి, ఈ మూవీతో మరొక భారీ విజయాన్ని ఆయనకు అందించారు. 

సంక్రాంతికి వస్తున్నాం టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్ డీటెయిల్స్

ఇక సంక్రాంతికి వస్తున్నాం మూవీలో అనిల్ ఎంటర్టైన్మెంట్ స్టైల్ కి వెంకీ మార్క్ కామెడీ, ఫ్యామిలీ యాక్షన్ సన్నివేశాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. భీమ్స్ సిసిలోరియో అందించిన సాంగ్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు విజువల్స్, భారీ నిర్మాణ విలువలు వంటివి ఈ మూవీకి ఎంతో పెద్ద విజయాన్ని అందించాయి. 

ఇక ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాలు సహా ఓవర్సీస్ ఆడియన్స్ ని సైతం విశేషంగా ఆకట్టుకుంది. సంక్రాంతి సీజన్ కావడంతో ఫ్యామిలీస్ అందరూ కూడా మూవీకి విపరీతంగా క్యూలు కట్టారు. ఎన్నో ఏళ్ళ అనంతరం ఫైనల్ గా సంక్రాంతికి వస్తున్నాంతో కెరీర్ పరంగా అతిపెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్నారు వెంకటేష్. 

కాగా ఈ మూవీ ఓవరాల్ గా రూ. 275 కోట్ల గ్రాస్ ని అలానే రూ. 158 కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా సొంతం చేసుకుంది. ఈ మూవీ బిజినెస్ రూ. 41 కోట్లు, అనగా బ్రేకీవెన్ దాటడానికి రూ. 42 కోట్లు సొంతం చేసుకోవాలి. కాగా దానికి ట్రిపుల్ రేంజ్ లో కలెక్షన్ సొంతం చేసుకుని టాలీవుడ్ రీజినల్ సినిమాల్లో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. కాగా సంక్రాంతికి వస్తున్నాం మూవీ యొక్క టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్ డీటెయిల్స్ క్రింద వివరంగా ఏరియా వైజ్ గా ఇవ్వబడ్డాయి. 

Sankranthiki Vasthunam Total Worldwide Collection Report  Inc GST 

నైజాం - రూ. 43. 02 కోట్లు

సీడెడ్ - రూ. 19. 20 కోట్లు 

ఉత్తరాంధ్ర - రూ. 22. 60 కోట్లు 

ఈస్ట్ - రూ. 13. 80 కోట్లు 

వెస్ట్ - రూ. 9. 01 కోట్లు 

గుంటూరు - రూ. 10. 40 కోట్లు 

కృష్ణా - రూ. 9. 70 కోట్లు

నెల్లూరు - రూ. 4. 90 కోట్లు

ఆంధ్ర + తెలంగాణ టోటల్ - రూ. 132. 63 కోట్లు రూ. 217. 50 కోట్ల గ్రాస్ 

కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా - రూ. 9. 05 కోట్లు 

ఓవర్సీస్ - రూ. 17. 05 కోట్లు 

టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - రూ. 158. 73 కోట్లు రూ. 275. 50 కోట్లు గ్రాస్ 

Sankranthiki Vasthunam Worldwide Pre Release Business Details 

నైజం - రూ. 8. 50 కోట్లు 

సీడెడ్ - రూ. 6. 50 కోట్లు 

ఆంధ్ర - రూ. 18 కోట్లు 

ఆంధ్ర + తెలంగాణ టోటల్ - రూ. 33. 00 కోట్లు 

కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా - రూ. 3. 50 కోట్లు 

ఓవర్సీస్ - రూ. 5 కోట్లు 

టోటల్ వరల్డ్ వైడ్ బిజినెస్ - రూ. 41. 50 కోట్ల బ్రేకీవెన్ రూ. 42. 50 కోట్లు 


కాగా ఇటువంటి పలు లేటెస్ట్ సినిమాల యొక్క అప్ డేట్స్, బాక్సాఫీస్ కలెక్షన్స్ డీటెయిల్స్ వంటి వాటి కోసం ఎప్పటికప్పుడు మా Telugu Movie Media వెబ్ సైట్ చూస్తూ ఉండండి, ధన్యవాదములు

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow