Allu Arjun Trivikram Movie Update – Fans Super Excited
Allu Arjun and Trivikram Srinivas are teaming up again! Check out the latest movie update that’s creating buzz among fans. Full details inside!

టాలీవుడ్ స్టార్ యాక్టర్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గత ఏడాది డిసెంబర్ లో పాన్ ఇండియన్ మాస్ యాక్షన్ మూవీ పుష్ప 2 ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి ఇండియా వైడ్ గా బ్లాక్ బస్టర్ సక్సెస్ సొంతం చేసుకున్నారు. ఈ మూవీ తెలుగు తో పాటు నార్త్ లో కూడా అత్యధిక కలెక్షన్స్ సొంతం చేసుకుని హీరోగా అల్లు అర్జున్ రేంజ్ మరియు మార్కెట్ ని అమాంతంగా పెంచేసింది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి సుకుమార్ దర్శకత్వం వహించగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ దేనిని గ్రాండ్ గా నిర్మించింది.
Allu Arjun Trivikram Movie Update – Full Details
ఇక ఈ మూవీ అనంతరం కెరీర్ పరంగా కొద్దిపాటి గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్ ఇటీవల త్రివిక్రమ్ శ్రీనివాస్ తో తన నెక్స్ట్ మూవీ అనౌన్స్ చేసారు. ఎస్ థమన్ సంగీతం అందించనున్న ఈ మూవీని హారికా హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంస్థలు గ్రాండ్ గా నిర్మించనున్నాయి. అయితే ఈ మూవీ మైథలాజిల్ ఎంటర్టైనర్ కావడంతో దాని యొక్క ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయ్యేలోపు కోలీవుడ్ యువ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అట్లీ తో కూడా మూవీ చేసేందుకు సిద్ధమయ్యారు ఐకాన్ స్టార్.
ఈ మూవీని తమిళ అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ వారు గ్రాండ్ గా నిర్మించనుండగా యువ మ్యూజికల్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ దీనికి సంగీతం సమకూర్చనున్నారు. కాగా ఈ మూవీ పక్క మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందనుందని అలానే ఇందులో అల్లు అర్జున్ తొలిసారిగా డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారని కొద్దిరోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో కథనాలు వైరల్ అవుతున్నాయి.
అయితే మరోవైపు త్రివిక్రమ్ తో అల్లు అర్జున్ చేయనున్న మూవీ యొక్క స్క్రిప్ట్ సిద్ధమవుతుండగా ఇది శ్రీమహావిష్ణువుకి సంబందించిన కథ అని టాక్. అలానే ఇది కుమారస్వామి, అనగా షణ్ముఖుడికి సంబందించిన కథ అని కూడా కొంత వార్తలు వస్తున్నాయి. మొత్తంగా అయితే ఈ క్రేజీ కాంబినేషన్ మూవీ మాత్రం ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్ పై ఎవరూ టచ్ చేయని ఒక సరికొత్త మైథలాజికల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోందని ఇటీవల నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఒక ఇంటర్వ్యూ లో భాగంగా మాట్లాడుతూ చెప్పుకొచ్చారు.
Big Buzz Around Allu Arjun and Trivikram’s Next Movie
ఇక ఈ మూవీ అల్లు అర్జున్ పాత్ర నెవర్ బిఫోర్ నెవర్ ఎగైన్ అనేలా ఉంటుందని టాక్. అయితే ఓవైపు త్వరలో అట్లీ మూవీని అనౌన్స్ చేయనున్న అల్లు అర్జున్, అది కొంత పూర్తి అయిన అనంతరం అనగా ఈ ఏడాది అక్టోబర్ లో త్రివిక్రమ్ మూవీ చేస్తారని కూడా వంశీ తెలిపారు. ఇక ఈ మూవీ యొక్క బడ్జెట్ కూడా ఎంతో ఎక్కువ అని, ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా నిర్మాణ నాగ వంశీ, అల్లు అరవింద్ దీనికి వ్యయం కేటాయించనున్నారని అంటున్నారు.
ఇక తొలిసారిగా త్రివిక్రమ్ ఈ మూవీతో పాన్ ఇండియన్ రేంజ్ కి వెళ్తుండడంతో కథ, కథనాలు, టేకింగ్ విషయమై ఆయన పూర్తిగా శ్రద్ధ తీసుకుంటున్నారట. అలానే సంగీత దర్శకుడు థమన్ కూడా ఈ ప్రతిష్టాత్మక మూవీ కోసం ఎంతో ఆకట్టుకునేలా ట్యూన్స్ ఇచ్చేందుకు సిద్దమవుతున్నారట. గతంలో త్రివిక్రమ్, అల్లు అర్జున్ కలిసి చేసిన జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలవైకుంఠపురములో సినిమాలు మూడు కూడా ఒకదానిని మించేలా మరొకటి అద్భుత విజయాలు సొంతం చేసుకున్నాయి.
Latest News on Allu Arjun Trivikram Movie Collaboration
ఇక అలవైకుంఠపురములో మూవీతో హీరోగా నేషనల్ వైడ్ గా గుర్తింపు అందుకున్నారు అల్లు అర్జున్. దానితో వీరిద్దరి రానున్న ఈ క్రేజీ ప్రాజక్ట్ పై అందరిలో ఆకాశమే హద్దుగా అంచనాలు ఏర్పడ్డాయి. మొత్తంగా అయితే త్వరలో గ్రాండ్ గా ప్రారంభం కానున్న అల్లు అర్జున్ - త్రివిక్రమ్ ల కాంబినేషన్ మూవీ ఇప్పటి నుండే అందరిలో ఈ స్థాయి అంచనాలు ఏర్పరిస్తే, త్వరలో షూటింగ్ ప్రారంభించి, ఆపైన రిలీజ్ అనంతరం బాక్సాఫీస్ వద్ద ఇంకెంతమేర సంచలనాలు క్రియేట్ చేస్తాయో చూడాలి. కాగా త్వరలో ఈ మూవీలో నటించే ఇతర నటీనటులు, హీరోయిన్ సహా సాంకేతిక నిపుణుల యొక్క పూర్తి వివరాలు కూడా వెల్లడి కానున్నాయి.
What's Your Reaction?






