Pawan Kalyan’s Specs Look Goes Viral Among Fans
Power Star Pawan Kalyan’s new specs look stuns fans! A classy and stylish avatar that's trending across social media. Full update on Telugu Movie Media

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) చిన్న తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ ద్వారా తొలిసారిగా హీరోగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చారు. ఆ విధంగా తొలి సినిమాతో మంచి సక్సెస్ ని అందుకున్న పవన్ కళ్యాణ్, ఆ తరువాత గోకులంలో సీత, సుస్వాగతం సినిమాలతో మరొక రెండు సక్సెస్ లు అందుకుని ఆడియన్స్ నుండి మంచి పేరు దక్కించుకున్నారు.
పవన్ కళ్యాణ్ స్పెక్స్ లుక్ – ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ
ఆ తరువాత యువ దర్శకడు కరుణాకరన్ దర్శకత్వంలో ఆయన నటించిన సినిమా తొలిప్రేమ (Tholi Prema). కీర్తి రెడ్డి (Keerthi Reddy) హీరోయిన్ గా నటించిన ఈ సినిమా అప్పట్లో అతిపెద్ద విజయాన్ని అందుకుని నటుడిగా పవన్ కళ్యాణ్ కి యువత తోపాటు అన్ని వర్గాల ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ని తెచ్చిపెట్టింది.
అనంతరం పవన్ నటించిన సినీమా తమ్ముడు (Thammudu), అది కూడా బాగానే ఆడింది. ఆపైన పూరి జగన్నాథ్ తొలిసారిగా మెగాఫోన్ పట్టిన బద్రి (Badri) మూవీ చేసిన పవన్, దానితో మరొక విజయం తన ఖాతాలో వేసుకున్నారు. ఆపైన పవన్ కళ్యాణ్ కెరీర్ ఏడవ మూవీగా వచ్చిన ఖుషి (Kushi) అతిపెద్ద హిట్ కొట్టి అప్పటివరకు టాలీవుడ్ లో ఉన్న అనేక రికార్డ్స్ అన్నిటినీ తిరగరాసింది.
ఆపై హీరోగా ఎంతో గొప్ప పేరుతో పాటు పవర్ స్టార్ గా కోట్లాదిమంది ఫ్యాన్స్, ఆడియన్సు అందరి మనస్సులో సుస్థిర స్థానం సంపాదించుకున్న పవన్ కళ్యాణ్. అక్కడి నుండి కెరీర్ పరంగా ఎన్నో సినిమాలతో దూసుకెళ్లి మరిన్ని విజయాలు సొంతం చేసుకున్నారు.
సోషియల్ మీడియాలో వైరల్ అవుతున్న పవన్ స్పెక్స్ స్టైల్
అయితే ఖుషి సక్సెస్ అనంతరం కొంత గ్యాప్ తో పవన్ స్వయంగా దర్శకత్వం వహించి నటించిన జానీ మూవీ వచ్చింది. కాగా ఇది బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయింది. అయితే జానీకి ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. ఆపైన గుడుంబా శంకర్, బాలు, అన్నవరం వంటి సినిమాలు చేసినప్పటికీ అవి పెద్దగా సక్సెస్ కాలేదు.
ఇక ఆ తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అత్తారింటికి దారేది (Atharintiki Daaredi) మూవీ సంచలన విజయాన్ని అందుకుని పవన్ కి మరింత బాగా పేరు తెచ్చిపెట్టింది. ఆ మూవీ ఇండస్ట్రీ హిట్ కొట్టి ఆయన క్రేజ్ మరింతగా పెంచింది. ఆ తరువాత కొన్ని సినిమాల అనంతరం జనసేన (Janasena Party) పార్టీ నెలకొల్పి రాజకీయాల్లోకి వెళ్లారు పవన్ కళ్యాణ్.
అనంతరం మళ్ళి ఇటీవల వకీల్ సాబ్ (Vakeel Saab) మూవీ ద్వారా ఆడియన్సు ముందుకి వచ్చారు. ఆ మూవీ ఓపెనింగ్స్ తో పాటు బాగానే కలెక్షన్ సొంతం చేసుకుంది. ఆపైన భీమ్లా నాయక్ (Bheemla Naayak) సినిమా చేసిన పవన్, ప్రస్తుతం కెరీర్ పరంగా సుజీత్ దర్శకత్వంలో ఓజి (OG), హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh), క్రిష్ తో హరి హర వీర మల్లు (Hari Hara Veera Mallu) సినిమాలు చేస్తూ అటు రాజకీయాలు ఇటు సినిమాలు పరంగా బిజీ బిజీగా ఉన్నారు. ఈ మూడు సినిమాల పై పవన్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా విశేషమైన అంచనాలు ఉన్నాయి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ లుక్
వీటిలో ముందుగా హరి హర వీర మల్లు, ఓజి మూవీస్ ఈ ఏడాది రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. అలానే అటు రాజకీయాల పరంగా ఇటీవల జనసేన పార్టీ తరపున పోటీ చేసి పిఠాపురం ఎమ్మెల్యేగా అలానే ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. టాలీవుడ్ లో నటుడిగా తనకంటూ ప్రేక్షకాభిమానుల్లో ప్రత్యేకమైన పేరు సంపాదించుకున్న పవన్ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది అంటే అభిమానులు చేసే సందడే వేరని చెప్పాలి.
అసలు మ్యాటర్ ఏమిటంటే, తన సినిమాలోని కాస్ట్యూమ్స్, లేటెస్ట్ స్టైల్స్, ట్రెండ్స్ ని ఫాలో అవడంతో పాటు సరికొత్త ట్రెండ్స్ ని క్రియేట్ చేయడం విషయమై ఎంతో శ్రద్ధ తీసుకునే పవన్ కళ్యాణ్, ఎప్పటికప్పుడు సరికొత్త స్టైల్ కాస్ట్యూమ్స్ ని అలానే లేటెస్ట్ యాక్సెసరీస్ ని వాడుతూ ఉంటారు.
ముఖ్యంగా చెప్పాలి అంటే పవన్ పలు సినిమాల్లోని తన పాత్రల కోసం వాడే స్పెక్స్ కి కూడా యువతలో ఎంతో మంచి క్రేజ్ ఉంటుంది. వాటిని పవన్ ఎంతో ప్రత్యేకంగా ఎంపిక చేసి కొనుగోలు చేస్తుంటారని, అలానే వాటి ఖరీదు కూడా వేల రూపాయలు ఉంటుందని, ఆ విధంగా పవన్ ఎప్పటికప్పుడు సరికొత్త ట్రెండ్స్ ని టాలీవుడ్ లో సెట్ చేస్తూ ఉంటారని అంటున్నారు విశ్లేషకులు.
ఇక రాబోయే సినిమాల ద్వారా పవన్ ఎటువంటి లేటెస్ట్ ట్రెండ్స్ ని తన పాత్రల ద్వారా ఆడియన్స్ కి పరిచయం చేయబోతున్నారో చూద్దాం. ఆ విధంగా అటు నటుడిగా ఇటు రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇకపై అన్నింటా మరింత దిగ్విజయంగా దూసుకెళ్లాలని మా Telugu Movie Media టీమ్ కోరుకుంటోంది.
What's Your Reaction?






