Rashmika Mandanna Height, Age, Boyfriend, Husband, Family, Biography & More

Know all about Rashmika Mandanna – her age, height, relationships, husband (if any), family background, and full biography. Latest updates included

Rashmika Mandanna Height, Age, Boyfriend, Husband, Family, Biography & More

తెలుగు సినిమా పరిశ్రమలోని యువ నటీమణుల్లో రష్మిక మందన్న (Rashmika Mandanna) కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె తల్లి సుమన్ మందన్న, తండ్రి మదన్ మందన్న. ఆమె కర్ణాటకలోని కొడగు జిల్లా, విరాజ్ పెట్ లో జన్మించారు. ఇక తొలిసారిగా కన్నడ చిత్ర పరిశ్రమకు కిరిక్ పార్టీ మూవీ ద్వారా ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. 

ఆ మూవీలో రక్షిత్ శెట్టి హీరోగా నటించారు. అప్పట్లో ఆ మూవీ బాగా విజయవంతం అయింది. ఆ సినిమాని తెలుగులో నిఖిల్ సిద్దార్థ కిరాక్ పార్టీ టైటిల్ తో రీమేక్ చేయగా ఇక్కడ కూడా విజయవంతం అయింది. దాని అనంతరం నాగశౌర్య హీరోగా వెంకీ కుడుముల తీసిన ఛలో (Chalo) మూవీలో హీరోయిన్ గా అవకాశం అందుకున్న రష్మిక ఆ మూవీతో మంచి విజయం సొంతం చేసుకున్నారు. 

రష్మిక మందన్న – పూర్తి జీవిత చరిత్ర

ఆ విధంగా తన ఫస్ట్ మూవీతోనే తెలుగు ఆడియన్స్ లో మంచి పేరు తెచ్చుకున్నారు రష్మిక మందన్న. తన ఆకట్టుకునే అందం అభినయంతో అక్కడి నుండి పలు అవకాశాలు అందుకున్న రష్మిక, అనంతరం నాని, నాగార్జున కలయికలో శ్రీ రామ్ ఆదిత్య తీసిన దేవదాసులో నటించారు. 

అలానే ఆపైన సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా సక్సెసఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తీసిన సరిలేరు నీకెవ్వరు (Sarileru Neekevvaru) లో హీరోయిన్ గా నటించారు. 2020 సంక్రాంతికి భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈమూవీ ఎంతో భారీ విజయం అందుకుని హీరోయిన్ గా రష్మిక మందన్న క్రేజ్ అమాంతంగా పెంచేసింది. 

ఇక ఆ తరువాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) తో రష్మిక చేసిన మూవీ పుష్ప ది రైజ్ (Pushpa The Rise). పాన్ ఇండియన్ రేంజ్ లో రిలీజ్ అయిన ఈమూవీ ఎంతో పెద్ద విజయవంతం అయి ఆమెకు నేషనల్ వైడ్ క్రేజ్ తీసుకువచ్చింది. ఆ తరువాత అటు తమిళ్ లో ఇలయథలపతి విజయ్ సరసన వారసుడు (Varisu) మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ అందుకున్నారు. 

రష్మిక మందన్న కుటుంబం మరియు బాల్యం

వంశీ పైడిపల్లి తీసిన ఆ మూవీ భారీ సక్సెస్ సొంతం చేసుకుని రష్మిక కు తమిళ్ లో కూడా పేరు తెచ్చిపెట్టింది. అలానే హిందీలో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో రూపొందిన గుడ్ బై మూవీలో నటించారు. 

అక్కడి నుండి నేషనల్ క్రష్ గా అబ్బాయిల కలల రాకుమారిగా మారిపోయిన రష్మిక మందన్న ఇటీవల బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తీసిన ఆనిమల్ మూవీలో గీతాంజలి పాత్రలో నటించారు. 

రిలీజ్ అనంతరం ఆనిమల్ (Animal) మూవీ ఎంతో పెద్ద సక్సె సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద రూ. 930 కోట్లు రాబట్టి హీరోయిన్ గా రష్మిక క్రేజ్ విపరీతంగా పెంచేసింది. ఆ తరువాత పుష్ప కు సీక్వెల్ అయిన పుష్ప 2 ది రూల్ (Pushpa The Rule), బాలీవుడ్ లో విక్కీ కౌశల్ నటించిన ఛావా (Chhaava) సినిమాల్లో నటించారు. 

అయితే ఆ రెండు సినిమాలు కూడా రిలీజ్ అనంతరం బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద విజయఢంకా మ్రోగించాయి. వాటిలో ఛావా రూ. 800 కోట్లు కొల్లగొట్టగా, పుష్ప 2 మూవీ అయితే ఇండియా వైడ్ అతి పెద్ద కలెక్షన్ సెన్సేషన్ సృష్టించి రూ. 1800 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఆ విధమా తన సినిమాలతో విపరీతంగా పేరుతో ప్రస్తుతం కొనసాగుతున్నారు రష్మిక మందన్న. 

రష్మిక మందన్న తెలుగు మరియు తమిళ సినిమాల్లో క్రేజ్

ఇక మరోవైపు రష్మిక మందన్న అటు ఇన్స్టాగ్రామ్ (Instagram), ఫేస్ బుక్ (Facebook), ట్విట్టర్ (Twitter) వంటి సోషల్ మీడియా మాధ్యమాల్లో అకౌంట్స్ కలిగి ఉన్నారు, అలానే వాటి ద్వారా ఎప్పటికప్పుడు తన సినిమాలతో పాటు వ్యక్తిగత విషయాలు, ఫోటోషూట్స్ లో దిగిన ఫొటోస్ ని షేర్ చేస్తూ ఉంటారు రష్మిక. ఇక కొన్నేళ్ల క్రితం థన్ తొలి చిత్ర కథానాయకుడు రక్షిత్ శెట్టితో రష్మిక మందన్న కు నిశ్చితార్ధం జరిగింది. 

అయితే అనంతరం కొన్ని కారణాల వలన వారి పెళ్లి ఆగిపోయింది. అయితే అక్కడి నుండి ఎక్కువగా కెరీర్ పై ఫోకస్ చేసిన రష్మిక, ఇకపై ఆడియన్స్, ఫ్యాన్స్ కి నచ్చే మంచి పాత్రలనే చేయాలనీ కోరుకుంటున్నానని, అలానే పెర్ఫార్మన్స్ కి స్కోప్ ఉన్న పాత్రలు వస్తే చేయడానికి ఎప్పుడూ ముందు ఉంటానని చెప్తుంటారు. 

తన కెరీర్ ని ఇంత బాగా ప్లాన్ చేసుకోవడానికి తన కుటుంబం యొక్క ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుందని, అలానే ఫ్యాన్స్ తనకు ఇస్తున్న సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేనని కూడా అంటారు రష్మిక మందన్న. ఇక తనకు వచ్చే పారితోషికంలో ఎంతో కొంత భాగాన్ని వీలైనంతలో సామజిక సేవా కార్యక్రమాలకు కూడ వినియోగించే రష్మిక వాటిని ఎప్పుడూ గోప్యంగానే ఉంచుతారని ఆమె సన్నిహితులు చెప్తుంటారు. 

మొత్తంగా నటిగా మంచి పేరుతో కొనసాగుతున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న రాబోయే రోజుల్లో మరిన్నిఆ మంచి అవకాశాలతో భారీ విజయాలతో కొనసాగాలని కోరుకుందాం. ఇటువంటి మరిన్ని లేటెస్ట్ తెలుగు మూవీ న్యూస్, కలెక్షన్స్, రివ్యూస్, గాసిప్స్ కోసం ఎప్పటికప్పుడు మా Telugu Movie Media సైట్ ఫాలో అవుతూ ఉండండి. థాంక్యూ

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow